విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాను స్వైన్ ఫ్లూ ఫ్రీ సిటీగా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యనించారు. ఆయన ఇక్కడ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. స్టైడ్స్, కరపత్రాలు ఇతర సాధనాల ద్వారా స్వైన్ ఫ్లూపై విస్తృత ప్రచారం కల్పిస్తామని చెప్పారు.
విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్) లో త్వరలోనే వైరాలజీ విభాగాన్ని అప్గ్రేడ్ చేసి తగిన సిబ్బందిని నియమిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో ఐసోలేషన్ వార్డులు, వెంటిలేటర్లు, స్వైన్ ఫ్లూ మందులు ఉన్నాయని మంత్రి తెలిపారు. విశాఖ ఉత్సవ్లో స్వైన్ ఫ్లూ అవగాహన కోసం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు.