![Newborn, thought to be dead, suddenly showed signs of life at Vizag GGH](/styles/webp/s3/article_images/2024/11/10/baby1.jpg.webp?itok=0DkBtp-d)
విశాఖ: కేజీహెచ్‌లో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ప్రాణం లేకుండా పుట్టిన శిశువుకు అంత్యక్రియలు జరిపించేందుకు తరలిస్తుండగా ఒక్కసారిగా చలనం వచ్చింది. దీంతో అప్పటివరకు విషాదం కమ్ముకున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి.
కేజీహెచ్‌లో శుక్రవారం రాత్రి 9 గంటలకి దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ ప్రాణం లేకుండా శిశువు జన్మించింది. వైద్యులు రాత్రంతా శ్రమించిన..శిశువులో ఎలాంటి చలనం కనిపించలేదు. శిశువు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి సిబ్బంది సైతం అదే అంశాన్ని ఆస్పత్రి రికార్డ్స్‌లో ఎంట్రీ చేశారు. అనంతరం శిశువును తండ్రికి అప్పగించారు.
శిశువు మృతి చెందినట్లు కేజీహెచ్ వైద్యులు నిర్ధారించడంతో అంత్యక్రియలు జరిపించేందుకు తండ్రి బరువెక్కిన హృదయంతో అంబులెన్స్‌లో ఇంటికి బయలు దేరాడు. అప్పుడే ఆశ్చర్య ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ ఎక్కిన ఆ తండ్రి ఒడిలో ఉన్నశిశువులో ఒక్కసారిగా కదలికలు మొదలయ్యాయి. అప్రమత్తమైన తండ్రి కేజీహెచ్ వైద్యులకు సమాచారం అందించారు. చికిత్స చేసిన వైద్యులు శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అప్పటి వరకు విగతజీవిగా ఉన్న పసికందులో చలనం రావడంతో కుటుంబ సభ్యులు పసికందును చేతుల్లోకి తీసుకొని ఆనందంలో మునిగిపోయారు. అప్పటివరకు విషాదం కమ్ముకున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి.
Comments
Please login to add a commentAdd a comment