విశాఖ: విశాఖ కేజీహెచ్ లోని పిల్లల వార్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని పిల్లల వార్డులో సోమవారం షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో చంటిబిడ్డలను తీసుకొని తల్లులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్నఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.
దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. సర్వీస్ వైర్‌లో మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.