విశాఖ : ఏసీబీ అధికారులు ఆంధ్రప్రదేశ్ లో పలు ఆస్పత్రుల్లో ఆకస్మిత తనిఖీలు చేసింది. విశాఖ కేజీహెచ్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ నరసింహరావు పర్యవేక్షణలో ఆరు బృందాలు ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టాయి. రికార్డుల పరిశీలనలో ఆరోగ్యశ్రీ పథకం అమలులో పలు అక్రమాలు బయటపడ్డాయి. అలాగే బయోమెట్రిక్ మిషన్లు కూడా కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉపయోగించలేదని ఏసీబీ అధికారులు గుర్తించారు.
కాగా డాక్టర్లు, నర్సులు కలిసి తమ వాటాను కూడా స్వాహా చేస్తున్నారని ఏసీబీ ఎదుట నాలుగో తరగతి ఉద్యోగులు ఆరోపించారు. అలాగే ఇంధన నిర్వహణలోనూ టోకెన్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే తిరుపతి స్విమ్స్, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.