ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టు | CENTRAL BUDGET ISSUE | Sakshi
Sakshi News home page

ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టు

Published Thu, Feb 2 2017 11:49 PM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM

CENTRAL BUDGET ISSUE

బడ్జెట్‌లో కానరాని ‘తూర్పు’ ఎంపీల ప్రాధాన్యం
ఏ ఒక్క హామీ విషయం ప్రస్తావనే లేదు
‘తోట’  మాటలన్నీ ఏ తోటలోకి పోయాయో...!
‘పండుల’ మాట పండలేదెందుకో..!
  • వినిపించని మోహనరాగం
  • అయినా ఏదో సాధించినట్టు ఆర్భాట ప్రకటనలు
  • బాబు నుంచి గల్లీ నేతల వరకూ ఇదేమి ధోరణంటూ విస్తుపోతున్న ఓటర్లు
 
‘అంతన్నారింతన్నారు’ చందంగా తయారైంది జిల్లాలోని ముగ్గురు ఎంపీల తీరు. ఎన్నికల ముందు ఓట్ల కోసం హామీలు ఇవ్వడం రివాజు. అందులో అధికార పార్టీ నేతలు సిద్ధహస్తులు. ఈ విషయం ఆయా నియోజకవర్గ ఓటర్లకు తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా భారీ ప్రాజెక్టులు తీసుకువస్తామని, రైల్వే ట్రాక్‌లు వేయించేస్తామని, కొత్త మార్గాలు తమకే సాధ్యమని, పలు కేంద్రాల స్థాపనకు ప్రతిపాదనలు చేశామని ఎన్నో మాటలు చెప్పారు. అవన్నీ కేంద్ర బడ్జెట్లో రానున్నాయని...నిధుల వర్షం కురుస్తుందని .. ఇక ప్రగతి పరుగులు తీస్తుందంటూ ఊరించిని ఎంపీల మాటల్లోని డొల్లతనం బయటపడడంతో జిల్లా ప్రజలు ముక్కున వేలేసు
కుంటున్నారు. 
 
మురళీమోహన రాగమేదీ..?
∙ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్న రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహ¯ŒSదీ అదే బాట. ∙ రాజమహేంద్రవరంలో సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్, గోదావరిపై హేవలాక్‌ బ్రిడ్జిని, టూరిజం ప్రాజెక్టులో మంజూరు చేస్తామంటూ  హామీలు ఇచ్చారు. ∙ భారతీయ విదేశీ వ్యాపార శిక్షణా సంస్థను రాజమహేంద్రవరంలో ఏర్పాటు చే స్తామని ప్రభుత్వం ప్రకటించగా ఎంపీగా ఉండి కూడా సాధించలేకపోయారు.
 
‘పండ’లేదెందుకో
∙ ఇక అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు కూడా ఏ ఒక్క హామీనీ నిలుపుకోలేకపోయారు. 
∙ కోటిపల్లి–నర్సాపురం రైల్వే లై¯ŒSకు పెద్ద ఎత్తున నిధులు వస్తాయని ఎంతగానో ఆశించిన రైల్వే సాధన సమితికి, కోనసీమ ప్రాంతవాసులకు నిరాశే మిగిలింది.
∙ గత రైల్వే బడ్జెట్‌లో సుమారు రూ. 300 కోట్లు విడుదలైనా పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేకపోయాయి. ప్రస్తుత బడ్జెట్‌లో మరికొన్ని నిధులు వస్తాయని ఆశపడ్డారు.
∙ అంతర్వేదిలో రూ.1450 కోట్లతో ప్రతిపాదించిన డ్రెడ్జింగ్‌ కార్పొరేష¯ŒS సంస్థ కార్యకలాపాల ఊసుకూడా బడ్జెట్‌లో లేకపోయింది. 
 
‘తోట’ మాట ‘నీటి’ మూట
 
లోక్‌సభలో టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌గా కేంద్ర రైల్వే బోర్డు, పెట్రోలియం, సహజ వాయువుల సంప్రదింపుల కమిటీ, కోకోనట్‌ బోర్డు, జిల్లా విద్యుత్‌ కమిటీ చైర్మ¯ŒSగా పదవులు అనుభవిస్తున్న ఎంపీ ‘తోట’ ఇచ్చిన హామీలివీ...
డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారి¯ŒS ట్రేడింగ్, ఇండియ¯ŒS ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ 
కింగ్స్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాష¯ŒS టెక్నాలజీ కేంద్రాలు ప్రస్తుత బడ్జెట్‌లో కాకినాడకు వస్తాయని ఊరించారు.
ప్రజల చిరకాల వాంఛగా ఉన్న కాకినాడ మెయి¯ŒS లై¯ŒS గురించి కూడా రైల్వే బడ్జెట్‌లో
ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
 
∙కాకినాడ–పిఠాపురం లై¯ŒSకు గత బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించినా ఈ బడ్జెట్‌లో చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు.
∙ 21 కిలోమీటర్ల ఈ లై¯ŒS అంచనా విలువ 2000లో రూ.126 కోట్లయితే అది ఇప్పుడు రూ.250 కోట్లకు చేరుకుంది.
 
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
కేంద్రంలో పలుకుబడి...‘బాబు’తో సాన్నిహిత్యం... ప్రొటోకాల్‌ దర్పంతో కూడిన పదవులు... ఇలా ఎన్ని ఉన్నా అవన్నీ అలంకారప్రాయమేనని నిరూపించారు మన ఎంపీలు. ప్రస్తు త కేంద్ర సాధారణ, రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు అనేక ప్రాజెక్టులు తెచ్చేస్తామంటూ గడచిన నెల రోజులుగా ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చిన మన పార్లమెంట్‌ సభ్యులు తీరా బడ్జెట్‌ బయటకు వచ్చాక ఏ ఒక్క హామీ ప్రస్తావన అందులో లేకపోవడంతో ఓటేసిన జనం వీరి పనితీరుపై మండిపడుతున్నారు. వీరికి ఉన్న పదవులు, పలుకుబడి ఎందుకూ పనికిరాకుండా పోయాయంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. పెండింగ్‌ రైల్వే  ప్రాజెక్టులకు నిధులతోపాటు మరెన్నో ప్రయోజనాలు ఈ ప్రాంతానికి లభిస్తాయన్న ఈ ప్రాంతవాసుల ఆశలు ఆవిరైపోయాయి. 
‘తోట’ మాట ‘నీటి’ మూట
ప్రస్తుత బడ్జెట్‌లో జిల్లాకు కొత్తగా మూడు ప్రాజెక్టులు వచ్చేస్తాయంటూ కాకినాడ ఎంపీ తోట నరసింహం గడచిన కొద్దిరోజులుగా ఆర్భాటంగా ప్రచారం చేసి తుస్సుమనిపించారు. లోక్‌సభలో టీడీపీ ఫ్లోర్‌లీడర్‌గా కేంద్ర రైల్వే బోర్డు, పెట్రోలియం, సహజవాయువుల సంప్రదింపుల కమిటీ, కోకోనట్‌ బోర్డు, జాతీయ ఆరోగ్యమిష¯ŒS జిలా్లౖ ఛైర్మన్, జిల్లా విద్యుత్‌ కమిటీ చైర్మ¯ŒSగా పదవులు అనుభవిస్తున్న ఎంపీ ‘తోట’ మాటలన్నీ నీటి మూటలయ్యాయి.  డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారి¯ŒS ట్రేడింగ్, ఇండియ¯ŒS ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకింగ్స్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాష¯ŒS టెక్నాలజీ కేంద్రాలు ప్రస్తుత బడ్జెట్‌లో కాకినాడకు వస్తాయని ఆయన కొద్దిరోజులుగా ప్రతి కార్యక్రమంలోనూ ప్రజల ముంగిట పదేపదే చెప్పారు. ఇవేమీ బడ్జెట్‌లో ప్రస్తావనే లేకపోవడంతో చూసిన ప్రజలు నివ్వెర పోయారు. ప్రజల చిరకాల వాంఛగా ఉన్న కాకినాడ మెయి¯ŒSలై¯ŒSకు కూడా రైల్వే బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడంపై  ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాకినాడ–పిఠాపురం లై¯ŒSకు గత బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించినా ఈ బడ్జెట్‌లో చిల్లిగవ్వ కూడా కేటాయించ లేదు. 21 కిలోమీటర్ల ఈ లై¯ŒS అంచనా విలువ 2000లో రూ.126 కోట్లయితే అది ఇప్పుడు రూ.250 కోట్లకు చేరుకుంది. కేంద్రంలో అనేక కీలక పదవులు అనుభవిస్తూ ఒక్క ప్రాజెక్టును కూడా సాధించలేకపోయారంటూ ఎంపీ తోటపై ప్రజలు మండిపడుతున్నారు. ఇక ఆయనకు ఉన్న పదవులు, పలుకుబడి ఎవరికోసమంటూ ప్రశ్నిస్తున్నారు. 
‘పండ’లేదెందుకో
ఇక అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు కూడా ఏ ఒక్క హామీని నిలుపుకోలేకపోయారు. ఐఆర్‌ఎస్‌ అధికారిగా, కేంద్రస్థాయిలోను కాస్తంత పట్టున్న ఆయన ఇచ్చిన హామీలపై ప్రజలు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ప్రధానంగా కోటిపల్లి–నర్సాపురం రైల్వే లై¯ŒSకు పెద్ద ఎత్తున నిధులు వస్తాయని ఎంతగానో ఆశించిన రైల్వే సాధన సమితికి, కోనసీమ ప్రాంతవాసులకు నిరాశే మిగిల్చింది. గత రైల్వే బడ్జెట్‌లో సుమారు 300 కోట్లు విడుదలైనా పనులు ప్రారంభానికి మాత్రం నోచుకోలేకపోయాయి. ప్రస్తుత బడ్జెట్‌లో మరికొన్ని నిధులు వచ్చి ఉంటే పనులు వేగవంతమయ్యేందుకు ఉపయోగపడేవన్న భావన ప్రజల్లో వ్యక్తమైంది. చమురు, సహజ వాయువుల స్టాండింగ్‌ కమిటీ సభ్యునిగా ఉన్న ఎంపీ రవీంద్రబాబు కొద్దిరోజులుగా కోటిపల్లి–నర్సాపురం రైల్వే లై¯ŒSకు ఈ బడ్జెట్‌లో అదనపు నిధులు మంజూరవుతాయంటూ ప్రజలను ఎంతగానో నమ్మించారు. అవన్నీ ఉత్తుత్తి మాటలేనని బడ్జెట్‌ తేల్చేసింది. అంతర్వేదిలో రూ.1450 కోట్లతో ప్రతిపాదించిన డ్రెడ్జింగ్‌ కార్పొరేష¯ŒS సంస్థ కార్యకలాపాల ఊసుకూడా బడ్జెట్‌లో లేకపోయింది. ఇక ఈ ఎంపీ సాధించినదేమిటంటూ ప్రజలు నిలదీస్తున్నారు. 
మురళీమోహన రాగమేదీ..?
ఎంతో పలుకుబడి...ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాన్నిహిత్యం కలిగిన రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహ¯ŒS కూడా మిగిలిన ఇద్దరు ఎంపీలతో బాగా పోటీపడ్డారు. ఆ ఎంపీల్లాగే ఈయన కూడా ఏ ఒక్క ప్రాజెక్టును సాధించలేకపోయారు. రాజమ హేంద్రవరంలో సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్, గోదావరిపై హేవలాక్‌ బ్రిడ్జిను, టూరిజం ప్రాజెక్టులో మంజూరు చేస్తామంటూ ఆయన ఎన్నో హామీలు ఇచ్చారు. భారతీయ విదేశీ వ్యాపార శిక్షణా సంస్థను రాజ మహేంద్రవరంలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా ఎంపీగా ఉండి దీన్ని కూడా ఎంపీ సాధించలేకపోయారు. అందులో ఏ ఒక్కటీ ప్రస్తావనకు రాని పరిస్థితి నెలకొంది. ఇలా ముగ్గురు ఎంపీల పనితీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్రంలో అధికార పక్షంగా ఉంటూ కేంద్రంలో భాగస్వామ్య పక్షంగా కొనసాగుతూ మరెన్నో ప్రొటోకాల్‌ పదవులు అనుభవిస్తూ ఈ ముగ్గురు ఎంపీలు ఈ ప్రాంత ప్రజలకు ఒరగబెట్టిందేమిటని పెదవి విరుస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement