
సమదూరంలో విజయవాడ
విజయవాడ: భౌగోళికంగా రాయలసీమకు, ఉత్తరకోస్తాకు సమదూరంలో ఉండే నగరం విజయవాడ అని, రాజధానికి కావాల్సిన అన్ని వసతులూ ఆ నగరంలో ఉన్నాయని మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి చెప్పారు. తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు కూడా విజయవాడలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
విజయవాడ చుట్టుపక్కల ప్రభుత్వ స్థలం 20 వేల ఎకరాలు ఉన్నాయని చెప్పారు. అటవీ భూమి 7 వేల ఎకరాలు ఉన్నాయని తెలిపారు. విజయవాడను రాజధానిగా అభివృద్ధి చేస్తే గుంటూరు, ఏలూరు నగరాలు కూడా అభివృద్ధి చెందుతాయనన్నారు. విజయవాడను రాజధానిగా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పార్థసారధి తెలిపారు.