సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టు ల నిర్మాణం, సాగునీరు అం దుబాటులోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రాధాన్యం మరింత పెరిగిందని ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్‌లో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమష్టిగా పనిచేసి వ్యవసాయశాఖ గౌరవం మరింత పెంచుకుందామని మంత్రి చెప్పారు. వ్యవసాయశాఖ ఉద్యోగులతో ప్రేమతో వ్యవహరించి పని చేయించుకోవాలని అధికారులకు సూచించారు.
పండ్ల తోటలు, కూరగాయల సాగుపై దృష్టి పెట్టాలని, ఉద్యానశాఖ వ్యవసాయ శాఖతో పోటీ పడి ఉద్యాన పంటలను మరింత విస్తరించాలన్నారు. రాష్ట్రంలోని కొన్ని మార్కెట్ యార్డుల్లో రైతులు, కూలీలకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. త్వరలోనే సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ మీద లోతుగా సమీక్ష నిర్వహించి మార్గనిర్దేశం చేస్తారని తెలిపారు. కాగా, తెలంగాణలో మద్దతు ధర కింద మరో 30 వేల మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసేందుకు అవకాశమివ్వాలని కోరుతూ కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌కు నిరంజన్‌రెడ్డి సోమవారం లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment