అసైన్డ్ భూములు పట్టాభూములుగా.. రికార్డుల్లో మార్పులు
ధరణి పోర్టల్‌లో దగా.. పట్టాదారు పాస్‌బుక్‌లు సైతం జారీ
తర్వాత ఆ భూములన్నీ బడాబాబుల చేతుల్లోకి..
వాటి విలువ సుమారు రూ.రెండున్నర వేల కోట్లపైమాటే
ప్రభుత్వ భూముల వెరిఫికేషన్‌లో వెలుగులోకి అక్రమాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అవి పంటలు పండించుకుని జీవనాధారం పొందేందుకు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు.. క్రయ విక్రయాలు, వ్యవసాయేతర పనులు చేయడానికి వీల్లేని భూములు.. కానీ ధరణి పోర్టల్‌లో రికార్డులను తారుమారు చేశారు. అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చేశారు. దీనితో ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా 518 ఎకరాల అసైన్డ్ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపో యాయి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చోటుచేసుకున్న ఈ భూదందా.. తాజాగా ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం, రెండు జాతీయ రహదారులు, ఐఐటీ ఉండటంతో కంది మండలంలో భూముల ధర ఎకరా రూ.ఐదు కోట్ల వరకు పలుకుతోంది. అంటే అక్రమాలు జరి గిన 518 ఎకరాల భూముల విలువ రెండున్నర వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా.
11 గ్రామాల పరిధిలో..
సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూముల వెరిఫి కేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయి, ఎక్కడైనా అన్యా క్రాంతం అయ్యాయా? వాటి రికార్డుల పరిస్థితే మిటనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ స్థాయి అధికారులకు ఒక్కో మండలం చొప్పు న బాధ్యతను అప్పగించారు. ఈ క్రమంలోనే కంది మండలం పరిధిలోని 11 గ్రామాల్లో 518 ఎకరాల అసైన్డ్ భూములను పట్టా భూము లుగా రికార్డులను మార్చేసినట్టు తేలింది.
అత్య ధికంగా బ్యాతోల్‌లో 181 ఎకరాలు, చిద్రుప్ప లో 154 ఎకరాలు, జుల్‌కల్‌లో 57 కాశీపూర్‌లో 41 ఎకరాలు, ఉత్తర్‌పల్లిలో 17 ఎకరాలు మిగ తాచోట్ల కలిపి 68 ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను మార్చేసినట్టు గుర్తించారు. ఈ మండలంలో మొత్తం 17 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. మరో ఆరు గ్రామాల రికార్డులను వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. వాటిలోనూ తని ఖీ పూర్తయితే.. మరిన్ని అక్రమాలు వెలుగు లోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు.
ధరణి పోర్టల్‌లో మార్చేసి..
అధికారులు, దళారులు కుమ్మక్కై ధరణి పోర్ట ల్‌ను ఆసరాగా చేసుకుని ఈ భూదందాకు తెరలేపారు. అసైన్డ్‌భూములను ధరణి పోర్టల్‌లో పట్టా భూము లుగా మార్చేశారు. ఈ మేరకు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీ చేశారు. తర్వాత ఆ పాసు పుస్తకాల ఆధారంగా.. చాలావరకు భూముల క్రయవిక్రయాలు చేతులు మారాయి. బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రాజకీయ నేతలు, బడాబాబులకు భూములు దక్కేలా చేసిన కొందరు రెవెన్యూ అధికారులు భారీగా దండుకున్నారని.. కోట్లకు పడగలెత్తారని ఆరోపణలు ఉన్నాయి.
వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది
కలెక్టర్ ఆదేశాల మేరకు కంది మండలంలో ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టాం. భూములకు సంబంధించిన రికా ర్డులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. అసైన్డ్ భూములను పట్టాభూములుగా మార్చి నట్టు గుర్తించాం. అన్ని గ్రామాల్లో వెరిఫి కేషన్ పూర్తిచేసి నివేదిక ఇస్తాం. – విజయలక్ష్మి, కంది మండల తహసీల్దార్.
Comments
Please login to add a commentAdd a comment