సాక్షి, అమరావతి : రాజధానిలో నిరుపేదల నుంచి కారుచౌకగా అసైన్డ్ భూములను కొల్లగొట్టిన వ్యవహారంలో సీఐడీ కేసు నమోదు చే సిన వెంటనే చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టు నుంచి స్టే తె చ్చుకున్నారని సీఐడీ గురువారం హైకోర్టుకు నివేదించింది. వారి అక్రమాలు బ యటకు వస్తాయన్న ఉద్దేశంతోనే దర్యాప్తును ఎఫ్‌ఐఆర్ దశలోనే అడ్డుకున్నారని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు వివరించారు.
వారు అక్రమాలకు పాల్పడకపోతే స్టే పొందాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సచ్చీలురని భావిస్తే స్టే ఎత్తివేయాలని కోరి దర్యాప్తునకు సహకరించాలన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా రాజధాని అసైన్డ్ భూముల బదలాయింపులో భారీ అక్ర మాలపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు, నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలపై స్టే విధించింది. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ తుది విచారణ జరుపుతున్నారు.
దర్యాప్తు జరపకపోతే ఆధారాలెలా వస్తాయి?
అసైన్డ్ భూముల కొనుగోళ్లపై ఫిర్యాదు అందిన తర్వాత సీఐడీ ప్రాథమిక విచా రణ జరిపి, అందులో లభించిన ఆధారాలకు అనుగుణంగా బాబు, నారా యణ పై కేసు నమోదు చేసిందని ఏఏజీ చెప్పారు. ఆ విచారణ గురించి వారికి తెలి యదని, లేదంటే దానిపైనా స్టే తెచ్చుకునే వారని అన్నారు. అత్యంత శక్తివంతు లు, పలుకుబడి కలిగిన వారైనందునే ఆఘమేఘాలపై హైకోర్టుకొచ్చి స్టే తెచ్చు కోగలిగారన్నారు.
ఒకవైపు దర్యాప్తు జరగకుండా స్టే తెచ్చుకుని, మరోవైపు అక్ర మాలకు ఎలాంటి ఆధారాల్లేవని చెబుతున్నారన్నారు. దర్యాప్తు జరగకపోతే ఆ ధారాలెలా వస్తాయని ప్రశ్నించారు. స్టే ఎత్తేసి దర్యాప్తునకు అనుమతివ్వా లన్నారు. అప్పుడు ఎలాంటి ఆధారాలు సమర్పిస్తామో వారు చూడవచ్చన్నారు.
ఆరేళ్ల తరువాత కేసు నమోదు చేశారు..
నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు స్టే ఇచ్చినా సీఐడీ దర్యాప్తు కొనసాగించిందన్నారు. రాజ కీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జీవో 41 జారీ చేసిన ఆరేళ్ల తరువాత కేసు నమోదు చేశారన్నారు.
ఆ తరువాత జీవో 41ని సవరించారని చెప్పారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, సవరణ సమయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయా అని ప్రశ్నించగా పోసాని సమాధానం చెప్పలేదు. అనంతరం విచారణను న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment