నిషేధిత జాబితా నుంచి 35 లక్షల ఎకరాల తొలగింపు
సీఎం జగన్ సంస్కరణలతో ‘రెవెన్యూ’లో సులభమైన పాలన
వందల ఏళ్ల నాటి చిక్కుముళ్లకు పరిష్కారం
చుక్కల భూములు, సర్విస్ ఈనాం, షరతుల గల పట్టా భూములకు విముక్తి
27.41 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు
లంక భూములకు అసైన్‌మెంట్ పట్టాలు
కుప్పలు తెప్పలుగా ఉన్న రెవెన్యూ సమస్యలన్నింటికీ పరిష్కారం
నిరుపేదలకు 46 వేల ఎకరాల భూముల పంపిణీ
శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం 951 ఎకరాలు
కొత్త రిజిస్ట్రేషన్ల విధానం.. ఆటో మ్యుటేషన్
రిత్ర సృష్టించిన 30.61 లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్
రెవెన్యూ శాఖ స్వరూపాన్ని మార్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం
అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు
ఒక్క ఎకరం భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి ఏళ్ల తరబడి తిరిగినా పని జరగని రాష్ట్రంలో ఏకంగా 35 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిది. ఏళ్ల తరబడి ఆంక్షల చట్రంలో ఇరుక్కు పోయిన చుక్కల భూములు, ఈనాం భూములు, షరతుల గల పట్టా భూములు వంటి లక్షల ఎకరాలపై ఆంక్షలు తొలగించారు. చుక్కల భూములు, షరతుగల పట్టా భూముల్ని చంద్రబాబు ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టి లక్షలాది మంది రైతులను రోడ్డున పడేసింది. వాటికి విముక్తి కల్పించి వాటిపై సర్వ హక్కులు కల్పించింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.
కేటాయించి 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ విప్లవాత్మక రీతిలో అమలు చేశారు. భూములున్నా వాటికి విలువ లేకుండా పోవడంతో హక్కులు కల్పించాలని దీర్ఘ కాలికంగా ఉన్న దళిత, పేద రైతుల కోరికను వైఎస్ జగన్ నెరవేర్చారు. 27.41 లక్షల ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించారు. ఇందుకోసం వాటిని 22ఏ జాబితా నుంచి తొలగించారు. అన్ని లక్షల భూములపై ఆంక్షలు తొలగి వాటి లావాదేవీలు ప్రారంభమవడంతో ఆరి్థక వ్యవస్థకు ఊతం లభించింది.
దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై హక్కులు కల్పించింది. ఇందుకోసం ఆ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడంతోపాటు కన్వేయన్స్ డీడ్స్ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) చేసి ఇచ్చి చరిత్ర సృష్టించింది. స్థిరాస్థి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మళ్లీ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరక్కుండానే ఆటోమేటిక్‌గా యాజమాన్య హక్కు మారి్పడి జరిగే ఆటో మ్యుటేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో సాహసోపేతంగా వేసిన అడుగులు రెవెన్యూ శాఖ చరిత్రలోనే సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారి రాష్ట్రంలో అమలైన రెవెన్యూ సంస్కరణలు దేశానికే దిక్సూచిగా మారాయి. పేదల జీవితాల్లో మార్పు తెచ్చే దిశగా చేపట్టిన ఈ సంస్కరణల్ని ఒక విప్లవంలా మేధావులు చెబుతున్నారు.
సంస్కరణ: పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములపై 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత యాజమాన్య హక్కుల కల్పన. ఇళ్ల స్థలాలకు పదేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు.
హక్కులు కల్పిస్తున్న భూములు: 27,41,698 ఎకరాలు
హక్కులు పొందుతున్న రైతుల సంఖ్య : 15,21,160 (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు)
ప్రయోజనం: ఆ భూములను నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఏ) నుంచి తొలగింపు. లక్షలాది కుటుంబాల జీవన ప్రమాణాలు పెరిగాయి. తద్వారా రాష్ట్ర ఆరి్థక వృద్ధికి బాటలు. అసైన్డ్ రైతులు తమ అవసరాల కోసం ఆ భూములను వినియోగించుకునే వీలు ఏర్పడింది.
సర్విస్ ఈనాం భూములపై ఆంక్షల తొలగింపు
గతం : గతంలో ఈనాం చట్టం ప్రకారం దేవదాయ భూములతోపాటు కుల వృత్తులకు ఇచ్చిన సర్వీస్ ఈనాం భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. దీనివల్ల లక్షలాది మంది భూములు స్తంభించిపోయాయి.
సంస్కరణ:నిషేధిత జాబితా నుంచి ఆ భూముల తొలగింపు
ఆంక్షలు తొలగిన భూములు: 1,61,584 ఎకరాలు
లబ్ధి పొందిన రైతుల సంఖ్య : 1,58,113
ప్రయోజనం: ఆంక్షలు తొలగడంతో కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి వంటి పలు వృత్తుల వారికి కేటాయించిన సర్విస్ ఈనాం భూముల రైతుల కుటుంబాల్లో వెలుగులు.
షరతులు గల పట్టా భూములపై ఆంక్షలు తొలగింపు
గతం: పూర్వం నుంచి అనుభవిస్తున్న షరతులు గల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చిన చంద్రబాబు ప్రభుత్వం
సంస్కరణ: ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగింపు
తొలగించిన భూములు: 33 వేల ఎకరాలు
లబ్ధి పొందిన రైతులు: 30 వేల మంది
ప్రయోజనం: నిలిచిపోయిన ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వాటిపై రుణాలు వస్తున్నాయి. అమ్మకాలు జరుగుతున్నాయి.
అనాదీనం, ఖాళీకాలమ్ భూముల సమస్య పరిష్కారం
గతం : చుక్కల భూములు మాదిరిగానే ఆర్‌ఎస్‌ఆర్‌లో అనాధీనం, ఏమీ రాయకుండా ఖాళీగా వదిలేసిన భూముల సమస్య.
సంస్కరణ: అలాంటి భూములను గుర్తించి నిషేధిత జాబితా నుంచి తొలగింపు
తొలగించిన భూములు: సుమారు 50 వేల ఎకరాలు
లబ్ధి పొందిన రైతులు: సుమారు 30 వేల మంది
ప్రయోజనం: భూములపై వారికి సర్వ హక్కులు ఏర్పడ్డాయి. రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
సుదీర్ఘకాలం తర్వాత భూ పంపిణీకి శ్రీకారం
పంపిణీ చేసిన భూమి: 46,463 ఎకరాలు
లబి్ధదారులు: 42,307
ప్రయోజనం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆరి్థకంగా పైకి తీసుకువచ్చే కార్యక్రమం
లంక భూములకు డీకేటీ పట్టాలు
కృష్ణా, గోదావరి లంక గ్రామాల్లో రైతుల సాగులో ఉన్న లంక భూములకు పట్టాలు జారీ. దశాబ్దాల లంక భూముల సమస్యకు పరిష్కారం
పట్టాలిచ్చిన భూమి: 9,064 ఎకరాలు
లబ్ధి పొందిన రైతులు: 17,768
ప్రయోజనం: ఆ భూములపై రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమాలాంటివి పొందవచ్చు.
దళిత వాడలకు శ్మశాన వాటికలు
శ్మశాన వాటికలు లేని దళిత వాడలు ఉండకూడదనే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం
దళిత వాడల కోసం కేటాయించిన శ్మశాన వాటికలు: 1,563
ఇందుకోసం ప్రభుత్వం కేటాయించిన భూమి: 951 ఎకరాలు
ప్రయోజనం: స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా అంత్యక్రియలు చేసుకోవడానికి స్థలాలు లేని గ్రామాల సమస్యకు పరిష్కారం
కొత్త రిజిస్ట్రేషన్ల విధానం
రిజిస్ట్రేషన్ల విధానాన్ని ఆధునీకరించి మరింత సులభంగా ప్రజలకు రిజిస్ట్రేషన్ల సేవలు. కార్డ్ ప్రైమ్ 2.0 ద్వారా ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్లు. అందులోనే డాక్యుమెంట్లు తయారు చేసుకునే అవకాశం. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్. ఆధార్ సైన్ ద్వారా అవకతవకలకు ఆస్కారం లేని విధానం.
ఆటో మ్యుటేషన్
పాత రిజిస్ట్రేషన్ల విధానంలో వ్యవసాయ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మళ్లీ వ్యక్తిగతంగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ పూర్తవగానే ఆటో మ్యుటేషన్ జరిగిపోతోంది. అంటే రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆన్‌లైన్‌లో పేరు మారుతుంది.
ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు
ఒకేసారి 30.61 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వం వాటిని లబ్ధిదారుల పేరు మీద రిజిస్టర్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కన్వేయన్స్ డీడ్లు పంపిణీ చేసింది. దీనివల్ల ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలపై లబ్ధిదారులకు హక్కులు లభించాయి.
వాటిని బ్యాంకు ల్లో పెట్టి రుణాలు తీసుకోవచ్చు. పదేళ్ల తర్వాత ఎన్‌ఓసీ అవసరం లేకుండానే కన్వేయన్స్ డీడ్లు సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ఆ పట్టాలు ప్రైవేటు పట్టాల మాదిరిగా వినియోగించుకోవచ్చు.
కుల ధ్రువీకరణ పత్రం శాశ్వతం
గతం : సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులను ప్రతిసారీ కుల ధ్రువీకరణ పత్రాలను అడగడం వల్ల ఇబ్బందులు ఏర్పడేవి.
సంస్కరణ: ఒకసారి కుల ధ్రువీకరణ పత్రం తీసుకుంటే దాన్ని శాశ్వతంగా ప్రకటించింది ప్రభుత్వం. మీ సేవ ద్వారా గతంలో కుల ధ్రువీకరణ పత్రాలు పొందితే ఆ డేటా ఆధారంగానే మళ్లీ పత్రాలు జారీకి అవకాశం.
ఆదాయ ధ్రువీకరణ సులభతరం
గతం : స్కాలర్íÙప్‌లు, ప్రభుత్వ పథకాలు, ఫీజు మినహాయింపుల కోసం కుటుంబాల ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ప్రతిసారి విచారణ చేయాల్సివచ్చేది.
సంస్కరణ: ప్రతిసారి విచారణ చేయకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహించే ఆరు దశల నిర్ధారణ ప్రక్రియనే ఉపయోగించుకునేలా మార్పులు.
గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు
అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు వ్యవసాయం చేసుకునేందుకు అటవీ ప్రాంతంలో ఇచ్చిన పట్టాలు. గత ప్రభుత్వాల కంటే ఎక్కువ పట్టాలు ఇచ్చారు.
పట్టాలిచ్చిన భూమి విస్తీర్ణం: 2,87,710 ఎకరాలు
లబ్ధిదారులు: 1,30,368
చుక్కల భూములకు విముక్తి
గతం: చంద్రబాబు హయాంలో జరిగిన తప్పిదంతో 22(ఏ) జాబితాలో చేరిన 22.06 లక్షల ఎకరాల చుక్కల భూముల సమస్య.
సంస్కరణ: 22ఏ జాబితా నుంచి వాటిని తొలగించి విముక్తి కల్పించిన ప్రభుత్వం
ప్రయోజనం: చాలా సంవత్సరాల నుంచి నిలిచి పోయిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు జరుగుతున్నాయి. పంట రుణాలు కూడా వస్తున్నాయి. ఆ భూములను రైతులు స్వేచ్ఛగా అమ్ముకునే హక్కు ఏర్పడింది.
భూమి కొనుగోలు పథకం భూములకు హక్కులు
గతం : భూమి లేని నిరుపేద దళితులకు భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములు ఎస్సీ కార్పొరేషన్ తనఖాలో ఉండడంతో వాటిపై కొనసాగుతున్న ఆంక్షలు.
సంస్కరణ: ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగింపు
నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములు : 22,837 ఎకరాలు
విముక్తి పొందిన రైతులు : 22,346
ప్రయోజనం: ఆ భూములపై హక్కులు పొందిన దళిత రైతులు. ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న రైతుల సమస్యకు పరిష్కారం.
గిరిజనులకు డీకేటీ పట్టాలు
గిరిజనులు అటవీ ప్రాంతంలోని భూములపై ఫల సాయాన్ని పొందేందుకు వీలుగా వారికి డీకేటీ పట్టాల పంపిణీ. పట్టాలిచ్చిన భూముల విస్తీర్ణం: 39,272;లబ్ధిదారులు: 26,287 – బి ఫణికుమార్, సాక్షి అమరావతి
Comments
Please login to add a commentAdd a comment