రాజధాని పేరుతో బాబు సరికొత్త డ్రామా
ఏలూరు.. నూజివీడు.. నాగార్జున వర్సిటీ అంటూ తొలుత లీకులు
ఆయా ప్రాంతాల్లో పెరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు
రూ.వందల కోట్లతో సామాన్య రియల్టర్లు, ప్రజలు..భూములు, స్థలాల కొనుగోలు
అంతకు ముందే అసలు రాజధానిఎక్కడో తన వాళ్ల చెవిలో ఊదిన వైనం
బాబు అండ్ గ్యాంగ్ మాత్రం ఆ 29 గ్రామాల పరిధిలో కారుచౌకగా భూముల కొనుగోలు
ఆనక ఆ ప్రాంతానికి అమరావతి అని పేరుపెట్టి.. రాజధానిగా ప్రకటన
ఈ కుట్రతో మోసపోయిన రియల్టర్లు, ప్రజలు
సమిధలుగా మారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులు.. 1500 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ, లంక భూముల దోపిడీ
ఆరి్థకంగా దివాలా తీసిన పలువురు వ్యాపారులు
లింగమనేని, నారాయణలకు మేలు చేసేలా రింగ్ రోడ్డు అలైన్‌మెంట్
మేలు చేసిన బాబుకు లింగమనేని కరకట్ట నివాసం కానుక హెరిటేజ్ ఫుడ్స్‌కూ భూ బహుమానం..
స్విస్ చాలెంజ్ పేరిట మాయలమరాఠీ ఒప్పందం
నిర్మాణాల పేరిట అస్మదీయులకు కాంట్రాక్టులు
నాసిరకం నిర్మాణాలతోనూ కమీషన్లు దండుకున్న బాబు
తమ సొమ్ము సోమవారం.. ఒంటి పొద్దులుంటారు.. మంది సొమ్ము మంగళవారం... ముప్పొద్దుల తింటారు..అనే నానుడి చంద్రబాబు నాయుడికి అక్షరాలా సరిపోతుంది. శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లు విశాఖపట్నం, దొనకొండ, తిరుపతి, శ్రీకాళహస్తిల్లో ఎక్కడో ఒక చోట రాజధానిని ఏర్పాటు చేస్తే తనకు మిగిలేదేముండదనే దురాలోచన బాబు మెదడులో మొలకెత్తింది. ఇంకేముంది.. ఆ 29 గ్రామాల ప్రాంతంలో మూడు పంటలు పండే జరీ భూములపై కన్నేశారు. ఈ క్రమంలో తన సహచరుడు పొంగూరు నారాయణను ముందు పెట్టి సరికొత్త డ్రామాకు తెరలేపారు.
తన పరివారం చెవిలో అసలు రాజధాని ఎక్కడొస్తుందో చెప్పేశారు. వారి ద్వారా ఆ ప్రాంతంలో భూములు కొనిపించి, ఆ భూములకు కోట్ల విలువ వచ్చేలా కుట్ర పన్నారు. బాబు అమరావతి నాటకంలో అసైన్డ్ భూముల్ని కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు సమిధలయ్యారు. బాబు అండ్ కో మాత్రం లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణానికి పాల్పడింది.
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి... భూముల లభ్యత, వ్యవసాయ అవసరాలు, భవిష్యత్తు ప్రయోజనాలను శాస్త్రీయంగా విశ్లేషించి సహేతుకమైన సిఫార్సులు చేసింది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలోని దొనకొండ, రాయలసీమలోని తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేయవచ్చని సూచించింది. 2014లో అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను బుట్టదాఖలు చేశారు. తన బినామీ, సన్నిహితుడైన మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలో మరో కమిటీని నియమించి.. పలు నాటకీయ పరిణామాల మధ్య రాజధానిగా అమరావతిని ఖరారు చేశారు.
సామాన్య రియల్టర్లను ముంచిన బాబు...
అమరావతిలో భూ దోపిడీకి పాల్పడటానికి ముందు రాజధాని లీక్స్ పేరిట చంద్రబాబు రాష్ట్రంలోని సామాన్య రియల్టర్లు, సాధారణ ప్రజలను బురిడీ కొట్టించారు. రాజధానిగా ఏలూరు అని ఓసారి... నూజివీడు అని మరోసారి... కాదు కాదు... నాగార్జున యూనివర్సిటీ సమీపంలో అని ఇంకోసారి ప్రచారంలోకి తీసుకువచ్చారు. తన ఎల్లో మీడియా ద్వారా ఉద్దేశ పూర్వకంగా లీకులు ఇప్పించి వార్తలు రాయించారు. ఆ పచ్చమాటలు నమ్మి సాధారణ రియల్టర్లు అప్పులు చేసి మరీ ఆ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. మధ్య, ఎగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు కొద్దికొద్దిగా పొదుపు చేసిన మొత్తాలతో అక్కడ స్థలాలు కొన్నారు.
చివరికి చంద్రబాబు ఆ మూడు ప్రాంతాల్లో కాకుండా గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసి అమరావతి అని నామకరణం చేశారు. చంద్రబాబు కుట్రను గ్రహించలేక ఏలూరు, నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ సమీప ప్రాంతాల్లో వేలాది ఎకరాలను కొనుగోలు చేసిన రియల్టర్లు వందల కోట్ల రూపాయలు నష్టపోయి నిండా మునిగారు. వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం అందరినీ కలచివేసింది.
ముందస్తు పన్నాగంతోనే...
► చంద్రబాబు పక్కా పన్నాగంతోనే గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల చుట్టుపక్కల ఆయన, తన సన్నిహితులు, బినామీలు అతి తక్కువ ధరలకు వేలాది ఎకరాలను కొనుగోలు చేశారు. అనంతరం ఆ ప్రాంతాన్ని రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించే సరికి ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. తద్వారా కేవలం రాజధాని ప్రకటనతోనే చంద్రబాబు రూ.లక్ష కోట్ల భూ దోపిడీకి పాల్పడ్డారు.
► రాజధాని కోసం భూ సమీకరణ పేరిట చంద్రబాబు బరితెగించి రైతుల భూములపై దండయాత్రకు పాల్పడ్డారు. రైతులను మభ్య పెట్టి వారి భూములు కొల్లగొట్టడం... అసైన్డ్ భూముల దోపిడీ... ప్రభుత్వ భూముల కబ్జా... లంక భూముల ఆక్రమణ... ఇలా యథేచ్ఛగా దోపిడీకి బరితెగించారు. తద్వారా మరో రూ.లక్ష కోట్ల భూకుంభకోణానికి పాల్పడిన చంద్రబాబు తానొక భూబకాసురుడినని నిరూపించుకున్నారు.
► అమరావతి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయభ్రాంతులకు గురి చేసి, వారి అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా కొల్లగొట్టింది. భూ సమీకరణ కింద అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వబోమని బెదిరించి.. వాటినీ చెరబట్టింది. తర్వాత ఆ భూములకు భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వ అధినేత హోదాలోనే దాదాపు 1,500 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ, లంక భూముల దోపిడీకి పాల్పడ్డారు.
సింగపూర్ ముసుగులో స్విస్ చాలెంజ్
► రాజధాని ప్రాంతంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి పేరిట చంద్రబాబు అంతర్జాతీయ భూ కుంభకోణానికి తెరతీశారు. సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపిన స్విస్ చాలెంజ్ విధానం ద్వారా భారీ కుంభకోణానికి తెగబడ్డారు.
► సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అని చెబుతూ... తన సన్నిహితుడైన సింగపూర్ మంత్రికి చెందిన ప్రైవేటు కంపెనీతో వ్యవహారం నడిపారు. రైతుల నుంచి సేకరించిన భూమిని సింగపూర్ కంపెనీకి అప్పగించి ప్రభుత్వమే రూ.5 వేల కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తే.. సింగపూర్ కంపెనీ స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేస్తుందనే ఓ మాయామోహ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు.
► భూములు, నిధులు కలి్పస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి 48 శాతం వాటా... సింగపూర్ కంపెనీకి 52 శాతం వాటా కల్పించేలా ఒప్పందాన్ని ఖరారు చేశారు. సింగపూర్ కంపెనీ ముసుగులో తమ కుటుంబం గుప్పిట్లోనే స్టార్టప్ ఏరియా ఉండేలా చంద్రబాబు కుతంత్రం రచించి రూ.66 వేల కోట్ల దోపిడీకి పన్నాగం పన్నారు.
► కట్టని రాజధాని... అమరావతిలో నిరి్మంచని ఇన్నర్ రింగ్ (ఐఆర్‌ఆర్) రోడ్డు పేరిట చంద్రబాబు, నారాయణ ద్వయం తమ భూముల ధరలను అమాంతం పెంచేలా కుట్ర పన్నింది. ఇందుకు లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్ ప్రో కోకు పాల్పడింది.
► లింగమనేని, చంద్రబాబు, నారాయణ కుటుంబాలకు చెందిన భూములను ఆనుకుని నిరి్మంచేలా ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను అష్ట వంకర్లు తిప్పింది. తద్వారా కృష్ణా నదికి అటు వైపు, ఇటువైపు ఉన్న తమ భూముల విలువ రూ.2 వేల కోట్లకుపైగా పెరిగేలా స్కెచ్ వేసింది. లింగమనేని కుటుంబానికి అడ్డగోలుగా ప్రయోజనం కలి్పంచినందుకు ప్రతిఫలంగా ఆ కుటుంబం నుంచి చంద్రబాబుకు కరకట్ట నివాసం, హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములను పొంది క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారు.
నిర్మాణాలు తాత్కాలికం.. దోపిడీ శాశ్వతం
► మిడతల దండు దాడి చేసి పచ్చని పంటలను నాశనం చేసినట్టు చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై దాడికి తెగబడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు టీడీపీ నేతలు, నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగంటి మురళీమోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్‌పీ రామారావులతో కూడిన పచ్చ దండు భూములను కొల్లగొట్టింది.
► అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాల ముసుగులో టీడీపీ ప్రభుత్వ పెద్దలు అడ్డూ అదుపూ లేకుండా అవినీతికి పాల్పడ్డారు. శాసన మండలి, సచివాలయం, విభాగాధిపతుల భవనాలు, ఇతర నిర్మాణాల పేరిట అస్మదీయులకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టారు. అంచనా వ్యయం కంటే భారీగా అధిక శాతానికి టెండర్లు ఖరారు చేసి భారీగా కమిషన్లు దండుకున్నారు. కాంట్రాక్టు సంస్థలు అత్యంత నాసిరకంగా తాత్కాలిక రాజధాని భవనాలను నిర్మించి చేతులు దులుపుకున్నాయి. చిన్నపాటి చినుకులకే కారిపోయేలా.. ఎక్కడికక్కడ పెచ్చులు, ఫ్లోరింగ్ ఊడిపోతూ ఉన్న ఆ భవనాలు చంద్రబాబు ప్రభుత్వ అవినీతికి అద్దం పడుతున్నాయి.
► రైతులను మభ్యపెట్టి తీసుకున్న అమరావతిలోని భూములను చంద్రబాబు తన అస్మదీయులకు అడ్డగోలుగా కేటాయించేశారు. ప్రభుత్వ రంగ సంస్థల భవనాలకు అధిక ధరలకు భూములు కేటాయించిన టీడీపీ ప్రభుత్వం.. ఆ పారీ్టకి సన్నిహితులైన ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు మాత్రం కారుచౌకగా భూములు కేటాయించడం చంద్రబాబు వంటి కుంభకోణాల సామ్రాట్‌కే సాధ్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment