Capital Amaravathi
-
అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు
సాక్షి, గుంటూరు: అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు ఎదుర్యయాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఐఐటీ హైదరాబాద్, మద్రాస్ బృందాలు.. నిర్మాణాల నాణ్యతను పరిశీలించాయి. రాజధానిలో వరద చేరడంతో బృందాలు.. పడవలో వెళ్లి పనులు పరిశీలించాయి.ఎస్డీఆర్ఎఫ్ సహాయంతో వరద నీటిలో బృందాలు పర్యటించాయి. జీఏడీ టవర్లు, హైకోర్టు పునాదులు, ర్యాప్ట్ ఫౌండేషన్ పనులను బృంద సభ్యులు పరిశీలించారు. వరద నీటిలో ఉన్న జీఏడీ టవర్లు, హైకోర్టు పునాదులను కూడా ఐఐటీ బృందం పడవలో వెళ్లి పరిశీలించింది. వరద నీటిని చూసి షాక్ తిన్న ఐఐటీ బృందం.. చిన్నపాటి వర్షాలకే ఇలా వరద చేరడంపై ఆశ్చర్యపోయింది. -
అమరావతి కోసం అప్పుల చిప్ప.. ఎదురు ప్రశ్నే సమాధానమా?!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టైలే వేరు అన్నట్లుగా ఉంటారు. తన వద్ద సమాధానం లేని ప్రశ్నను ఎవరైనా వేస్తే, ఎదురు ప్రశ్నించడంతో వారి నోరు మూయించే యత్నం చేస్తుంటారు. అమరావతి ప్రాంతంలో ఆయన పర్యటించి మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఒక విలేకరి అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుంది? ఎంత వ్యయం చేస్తారు? అని ప్రశ్నించారు. ఆయన వద్ద దానికి సరైన జవాబు లేదు. అంతే! వ్యూహాత్మకంగా ఆయన మీరే చెప్పండి.. మీరు అయితే ఎంత కాలంలో నిర్మిస్తారు? అంటూ ఏదేదో మాట్లాడారు. అది విన్నవారు విస్తుపోవడం తప్ప చేయగలిగింది లేదు.ప్రభుత్వ గల్లా పెట్టె ఖాళీగా ఉంది.. గత ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో అర్ధం కావడం లేదు. ఆ వివరాలన్ని సిద్దం చేస్తున్నారు.. అని కూడా చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించి, అది పూర్తి కావడానికి నాలుగేళ్లు పడుతుందో, ఇంకా ఎక్కువ అవుతుందో అని వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో అలా కూడా చెప్పలేదు. పైగా ప్రశ్నించివనారే ఎంత కాలం పడుతుందో చెప్పాలని అంటున్నారు. అమరావతిలో రకరకాల రూపాలలో సెంటిమెంట్ పండించడానికి, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిను విమర్శించడానికి ఆయన ఈ సందర్శనను వాడుకున్న సంగతి అర్ధం అవుతూనే ఉంది.రాజకీయాలలో ఇలాంటివి సహజమే అయినా చంద్రబాబు నాయుడు అసలు విషయాలను పక్కదోవన పట్టిస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది? ఒకవైపు అమరావతిని పూర్తి చేస్తామని అంటారు. అమరావతిలో ప్రభుత్వానికి మిగిలే భూముల అమ్మకంతో వచ్చే డబ్బుతో రాజధాని నిర్మాణంతో పాటు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అంటారు. అమరావతి రాజధానిలో మౌలిక వసతులకే లక్ష కోట్లకు పైగా వ్యయం అవుతుందని ఐదేళ్ల క్రితమే అంచనా వేశారు. అది ఇంకా పెరుగుతుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తొలిదశకు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంచనా అవుతుందని అప్పట్లో లెక్కించామని, తాజాగా ఎంత అవుతుందన్నది గణించాలని కొద్ది రోజుల క్రితం చెప్పారు.ఇక్కడ అందరికి వచ్చే సందేహం ఏమిటంటే? ముందుగా ప్రభుత్వం సమీకరించిన భూమికి సంబంధించి రైతులకు ప్లాట్లు కేటాయించి, అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. అంటే రోడ్లు, డ్రైన్లు, మంచినీరు తదితర సదుపాయాలు కల్పించాలన్నమాట. ఇక ప్రభుత్వ పరంగా నిర్మించదలచిన భవనాలకు కూడా వేల కోట్ల వ్యయం అవసరం. వీటన్నిటికి డబ్బు సమకూర్చుకోవాలంటే భూములు అమ్మాలి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఏదైనా చేయడానికి భూములను విక్రయించడానికి ప్రయత్నిస్తే టీడీపీ అడ్డుకునేది. ఇప్పుడు తాను భూములను అమ్మి సంపద సృష్టించి దానిని అటు అమరావతికి, ఇటు సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేస్తానని చెబుతున్నారు. ముందుగా అన్నీ వసతులు ఏర్పడితే కదా వాటిని కొనుగోలు చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చేది అనే ప్రశ్న వస్తుంది.రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చిన రాజధానిలో హైప్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు పర్యటన ఉపయోగపడవచ్చు. కానీ సకాలంలో చంద్రబాబు ప్రభుత్వం తాము చెప్పిన విధంగా సదుపాయాలు కల్పించి, ఆయా సంస్థలను రాజధానికి తీసుకురాలేకపోతే ఈ హైప్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. దాని వల్ల అక్కడ భూములు కొన్నవారికి నష్టం జరుగుతుంది. గత ఏడాది కాలంలో హైదరాబాద్ నగరంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించిందని నిపుణులు చెబుతున్నారు. అవసరమైన భవనాల స్పేస్ కన్నా బాగా అధికంగా అందుబాటులో ఉండడం, అమెరికాలో మాంద్య పరిస్థితులు, ఇతర అంశాలు ఇందుకు కారణమని వారు అంటున్నారు. అమరావతిలో ప్రస్తుతం కొంతమేర రేట్లు పెరిగాయని సమాచారం. అది కొనసాగాలంటే ముందుగా ప్లాట్ల కేటాయింపు, అభివృద్ది పనులు పూర్తి కావాలి. అందుబాటులోకి వచ్చే ప్లాట్లు అమ్ముడుపోవడానికి తగిన డిమాండ్ ఉండాలి. ఒక ఏడాదిలోనో, రెండేళ్లలోనో జరిగేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఉంటుంది. నిజానికి చంద్రబాబు నాయుడు 2014 టరమ్ లో రాజధానికి అవసరమైన రెండువేల నుంచి ఐదువేల ఎకరాల వరకు భూములు తీసుకుంటే సరిపోయేది. మిగిలిన భూమిని ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు అభివృద్ది చేసుకునేవారు. ప్రభుత్వపరంగా తీసుకోవల్సిన చర్యలు చేపడితే సరిపోయేది. అలా చేయకుండా ఏభైఐదువేల ఎకరాలభూమిని సమీకరించడంతో ఆ బాధ్యత అంతా ప్రభుత్వంపై పడింది.రైతుల నుంచి సమీకరించిన ముప్పైమూడు వేల ఎకరాలతో పాటు ప్రభుత్వ భూములు కలిపి ఏభైఐదువేల ఎకరాలు అభివృద్ది చేయాలంటే లక్షన్నర కోట్ల వరకు వ్యయం కావచ్చు. ఒకసారి చంద్రబాబు నాయుడు కేంద్రం ఆర్థిక సాయం చేయాలని అంటారు. ఇంకోసారి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని అంటారు. మరోసారి ఎప్పటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామో చెప్పలేమని అంటారు.. గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తారు. ఇక్కడ ఒక ఆసక్తికర సంగతి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల మొదటి తేదీన ఉద్యోగుల జీతాలు పెన్షన్లు, వృద్దాప్య పెన్షన్లు తదితర ఖర్చుల నిమిత్తం పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనావేశారు. ఇందుకోసం వనరుల సమీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయని, రుణ సమీకరణ చేస్తున్నారని టీడీపీ మీడియా ఈనాడు పత్రికలోనే రాశారు.గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేనికైనా రుణాలు తీసుకుంటే.. అప్పుల చిప్ప అని రాసిన ఈ పత్రిక ఇప్పుడు రుణ సమీకరణ అని చాలా గౌరవంగా చెబుతోంది. విశేషం ఏమిటంటే ఒక్క సామాజిక పెన్షన్లు నాలుగువేల రూపాయలు, బకాయిలతో సహా చెల్లించడానికి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ లు చెల్లించడానికే పదివేల కోట్లు అవసరం అయితే, మరి మిగిలిన హామీలకు ఎన్నివేల కోట్లు అవసరం అవవుతాయన్న ప్రశ్న వస్తుంది. ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల చొప్పున నెలకు చెల్లిస్తామని, మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, నిరుద్యోగులకు మూడువేల రూపాయల భృతి, తల్లికి వందనం స్కీమ్ లో ప్రతి విద్యార్ధికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని ఇలా అనేక హామీలను టీడీపీ, జనసేనల కూటమి మానిఫెస్టోలో ప్రకటించింది. వాటన్నిటికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్న వస్తుంది.ప్రస్తుతానికి ఏవైనా కొన్ని భవనాలను నిర్మించి సరిపెట్టుకుంటారా? లేక గతంలో మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పన్నులన్నిటిని ఇక్కడే ఖర్చు చేస్తారా? అనేదానిపై క్లారిటీ రావల్సి ఉంటుంది. దీనివల్ల ఇతర ప్రాంతాలలో అసంతృప్తి వస్తుంది. అన్నిటికి జిందా తిలస్మాత్ మాదిరి అమరావతి రాజధానిలో మిగులు భూముల అమ్మకం ద్వారా సంపద సృష్టించి కార్యక్రమాలు అమలు చేస్తామని చెబుతున్నారు. ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి కోసం పదిహేనువేల కోట్ల సాయం అడిగారట. కేంద్రం ఆ డబ్బు ఇస్తే ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఊరట అభిస్తుంది. కానీ అది సాధ్యమా అన్నది సంశయం.ఈ నేపథ్యంలో అమరావతి ఎప్పటికి అభివృద్ది కావాలి? ఎప్పటికి కొత్త సంస్థలు రావాలి? అక్కడ ఉద్యోగులు, సిబ్బంది ఎన్నివేల మంది రావాలి? ఇదంతా జరగడానికి ఎన్ని ఏళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేరు. అంతవరకు తమ హామీలను అమలు చేయలేమని చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చెబుతుందా? ప్రభుత్వంలో గల్లా పెట్టె ఖాళీగా ఉందని చంద్రబాబు అంటున్నారు. అలాగే అప్పుల గురించి కూడా ఏమీ తెలియదన్నట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం పదమూడు లక్షల కోట్ల అప్పు చేసిందని ఇదే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు చెప్పారు కదా! ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు ఇలా మాట్లాడుతారేమిటి? అని ఎవరికైనా సందేహం వస్తే ఏమి చెబుతాం.ఇక్కడ ఇంకో సంగతి ప్రస్తావించాలి. గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అనేక స్కాములు జరిగాయని కేసులు పెట్టింది. అందులో చంద్రబాబుతో సహా పలువురు నిందితులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ కేసులన్నీ ఏమి అవుతాయో తెలియదు. వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందా? లేక ఇంకేమైనా చేస్తారా అనేది చూడాలి. ఆ కేసులు పెట్టిన అధికారులపై ఇప్పటికే కక్షసాధింపు చర్యలు ఆరంభించారు. ఈ పరిణామాలన్నీ ఎటువైపు దారి తీస్తాయో కాలమే తేల్చుతుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
భూ బకాసురుడు!
తమ సొమ్ము సోమవారం.. ఒంటి పొద్దులుంటారు.. మంది సొమ్ము మంగళవారం... ముప్పొద్దుల తింటారు..అనే నానుడి చంద్రబాబు నాయుడికి అక్షరాలా సరిపోతుంది. శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లు విశాఖపట్నం, దొనకొండ, తిరుపతి, శ్రీకాళహస్తిల్లో ఎక్కడో ఒక చోట రాజధానిని ఏర్పాటు చేస్తే తనకు మిగిలేదేముండదనే దురాలోచన బాబు మెదడులో మొలకెత్తింది. ఇంకేముంది.. ఆ 29 గ్రామాల ప్రాంతంలో మూడు పంటలు పండే జరీ భూములపై కన్నేశారు. ఈ క్రమంలో తన సహచరుడు పొంగూరు నారాయణను ముందు పెట్టి సరికొత్త డ్రామాకు తెరలేపారు. తన పరివారం చెవిలో అసలు రాజధాని ఎక్కడొస్తుందో చెప్పేశారు. వారి ద్వారా ఆ ప్రాంతంలో భూములు కొనిపించి, ఆ భూములకు కోట్ల విలువ వచ్చేలా కుట్ర పన్నారు. బాబు అమరావతి నాటకంలో అసైన్డ్ భూముల్ని కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు సమిధలయ్యారు. బాబు అండ్ కో మాత్రం లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణానికి పాల్పడింది. సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి... భూముల లభ్యత, వ్యవసాయ అవసరాలు, భవిష్యత్తు ప్రయోజనాలను శాస్త్రీయంగా విశ్లేషించి సహేతుకమైన సిఫార్సులు చేసింది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలోని దొనకొండ, రాయలసీమలోని తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేయవచ్చని సూచించింది. 2014లో అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను బుట్టదాఖలు చేశారు. తన బినామీ, సన్నిహితుడైన మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలో మరో కమిటీని నియమించి.. పలు నాటకీయ పరిణామాల మధ్య రాజధానిగా అమరావతిని ఖరారు చేశారు. సామాన్య రియల్టర్లను ముంచిన బాబు... అమరావతిలో భూ దోపిడీకి పాల్పడటానికి ముందు రాజధాని లీక్స్ పేరిట చంద్రబాబు రాష్ట్రంలోని సామాన్య రియల్టర్లు, సాధారణ ప్రజలను బురిడీ కొట్టించారు. రాజధానిగా ఏలూరు అని ఓసారి... నూజివీడు అని మరోసారి... కాదు కాదు... నాగార్జున యూనివర్సిటీ సమీపంలో అని ఇంకోసారి ప్రచారంలోకి తీసుకువచ్చారు. తన ఎల్లో మీడియా ద్వారా ఉద్దేశ పూర్వకంగా లీకులు ఇప్పించి వార్తలు రాయించారు. ఆ పచ్చమాటలు నమ్మి సాధారణ రియల్టర్లు అప్పులు చేసి మరీ ఆ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. మధ్య, ఎగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు కొద్దికొద్దిగా పొదుపు చేసిన మొత్తాలతో అక్కడ స్థలాలు కొన్నారు. చివరికి చంద్రబాబు ఆ మూడు ప్రాంతాల్లో కాకుండా గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసి అమరావతి అని నామకరణం చేశారు. చంద్రబాబు కుట్రను గ్రహించలేక ఏలూరు, నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ సమీప ప్రాంతాల్లో వేలాది ఎకరాలను కొనుగోలు చేసిన రియల్టర్లు వందల కోట్ల రూపాయలు నష్టపోయి నిండా మునిగారు. వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం అందరినీ కలచివేసింది. ముందస్తు పన్నాగంతోనే... ► చంద్రబాబు పక్కా పన్నాగంతోనే గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల చుట్టుపక్కల ఆయన, తన సన్నిహితులు, బినామీలు అతి తక్కువ ధరలకు వేలాది ఎకరాలను కొనుగోలు చేశారు. అనంతరం ఆ ప్రాంతాన్ని రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించే సరికి ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. తద్వారా కేవలం రాజధాని ప్రకటనతోనే చంద్రబాబు రూ.లక్ష కోట్ల భూ దోపిడీకి పాల్పడ్డారు. ► రాజధాని కోసం భూ సమీకరణ పేరిట చంద్రబాబు బరితెగించి రైతుల భూములపై దండయాత్రకు పాల్పడ్డారు. రైతులను మభ్య పెట్టి వారి భూములు కొల్లగొట్టడం... అసైన్డ్ భూముల దోపిడీ... ప్రభుత్వ భూముల కబ్జా... లంక భూముల ఆక్రమణ... ఇలా యథేచ్ఛగా దోపిడీకి బరితెగించారు. తద్వారా మరో రూ.లక్ష కోట్ల భూకుంభకోణానికి పాల్పడిన చంద్రబాబు తానొక భూబకాసురుడినని నిరూపించుకున్నారు. ► అమరావతి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయభ్రాంతులకు గురి చేసి, వారి అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా కొల్లగొట్టింది. భూ సమీకరణ కింద అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వబోమని బెదిరించి.. వాటినీ చెరబట్టింది. తర్వాత ఆ భూములకు భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వ అధినేత హోదాలోనే దాదాపు 1,500 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ, లంక భూముల దోపిడీకి పాల్పడ్డారు. సింగపూర్ ముసుగులో స్విస్ చాలెంజ్ ► రాజధాని ప్రాంతంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి పేరిట చంద్రబాబు అంతర్జాతీయ భూ కుంభకోణానికి తెరతీశారు. సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపిన స్విస్ చాలెంజ్ విధానం ద్వారా భారీ కుంభకోణానికి తెగబడ్డారు. ► సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అని చెబుతూ... తన సన్నిహితుడైన సింగపూర్ మంత్రికి చెందిన ప్రైవేటు కంపెనీతో వ్యవహారం నడిపారు. రైతుల నుంచి సేకరించిన భూమిని సింగపూర్ కంపెనీకి అప్పగించి ప్రభుత్వమే రూ.5 వేల కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తే.. సింగపూర్ కంపెనీ స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేస్తుందనే ఓ మాయామోహ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు. ► భూములు, నిధులు కలి్పస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి 48 శాతం వాటా... సింగపూర్ కంపెనీకి 52 శాతం వాటా కల్పించేలా ఒప్పందాన్ని ఖరారు చేశారు. సింగపూర్ కంపెనీ ముసుగులో తమ కుటుంబం గుప్పిట్లోనే స్టార్టప్ ఏరియా ఉండేలా చంద్రబాబు కుతంత్రం రచించి రూ.66 వేల కోట్ల దోపిడీకి పన్నాగం పన్నారు. ► కట్టని రాజధాని... అమరావతిలో నిరి్మంచని ఇన్నర్ రింగ్ (ఐఆర్ఆర్) రోడ్డు పేరిట చంద్రబాబు, నారాయణ ద్వయం తమ భూముల ధరలను అమాంతం పెంచేలా కుట్ర పన్నింది. ఇందుకు లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్ ప్రో కోకు పాల్పడింది. ► లింగమనేని, చంద్రబాబు, నారాయణ కుటుంబాలకు చెందిన భూములను ఆనుకుని నిరి్మంచేలా ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను అష్ట వంకర్లు తిప్పింది. తద్వారా కృష్ణా నదికి అటు వైపు, ఇటువైపు ఉన్న తమ భూముల విలువ రూ.2 వేల కోట్లకుపైగా పెరిగేలా స్కెచ్ వేసింది. లింగమనేని కుటుంబానికి అడ్డగోలుగా ప్రయోజనం కలి్పంచినందుకు ప్రతిఫలంగా ఆ కుటుంబం నుంచి చంద్రబాబుకు కరకట్ట నివాసం, హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములను పొంది క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారు. నిర్మాణాలు తాత్కాలికం.. దోపిడీ శాశ్వతం ► మిడతల దండు దాడి చేసి పచ్చని పంటలను నాశనం చేసినట్టు చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై దాడికి తెగబడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు టీడీపీ నేతలు, నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగంటి మురళీమోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావులతో కూడిన పచ్చ దండు భూములను కొల్లగొట్టింది. ► అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాల ముసుగులో టీడీపీ ప్రభుత్వ పెద్దలు అడ్డూ అదుపూ లేకుండా అవినీతికి పాల్పడ్డారు. శాసన మండలి, సచివాలయం, విభాగాధిపతుల భవనాలు, ఇతర నిర్మాణాల పేరిట అస్మదీయులకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టారు. అంచనా వ్యయం కంటే భారీగా అధిక శాతానికి టెండర్లు ఖరారు చేసి భారీగా కమిషన్లు దండుకున్నారు. కాంట్రాక్టు సంస్థలు అత్యంత నాసిరకంగా తాత్కాలిక రాజధాని భవనాలను నిర్మించి చేతులు దులుపుకున్నాయి. చిన్నపాటి చినుకులకే కారిపోయేలా.. ఎక్కడికక్కడ పెచ్చులు, ఫ్లోరింగ్ ఊడిపోతూ ఉన్న ఆ భవనాలు చంద్రబాబు ప్రభుత్వ అవినీతికి అద్దం పడుతున్నాయి. ► రైతులను మభ్యపెట్టి తీసుకున్న అమరావతిలోని భూములను చంద్రబాబు తన అస్మదీయులకు అడ్డగోలుగా కేటాయించేశారు. ప్రభుత్వ రంగ సంస్థల భవనాలకు అధిక ధరలకు భూములు కేటాయించిన టీడీపీ ప్రభుత్వం.. ఆ పారీ్టకి సన్నిహితులైన ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు మాత్రం కారుచౌకగా భూములు కేటాయించడం చంద్రబాబు వంటి కుంభకోణాల సామ్రాట్‌కే సాధ్యమైంది. -
గ్రాఫిక్స్ భ్రమలు తొలగడం మంచిదే
జాతీయ రహదారికి ముప్పై కిలోమీటర్ల దూరాన తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనం నిర్మించి ప్రజలెవరికీ వాటిని అందుబాటులో లేకుండా చేశారు చంద్రబాబు. అక్కడ అనూహ్యమైన ధరలు పెరగడానికి మాత్రం ఉపయోగపడ్డారు. దానివల్ల సామాన్యులు ఎవరూ రాజధాని ప్రాంతంలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. లక్ష కోట్లు ఒకే చోట వ్యయం చేయడం సబబుకాదని భావించిన వైఎస్ జగన్ ప్రభుత్వం విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది. అమరావతిలో డెబ్బై ఐదు శాతం పనులు జరిగిన నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఆచరణలో ఎంతవరకు చేయగలుగుతుందో అదంతా చేయడం ద్వారా ఆ గ్రామాల ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం ఇప్పుడు అవసరం. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మూడువేల కోట్ల రూపాయలతో పెండింగులో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచి విషయంగా చెప్పాలి. దీనివల్ల ఆ ప్రాంత గ్రామాలవారిలో ఏర్పడిన అనుమానాలు కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం అక్కడ ఒక్కచోటే లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని ప్రతిపాదించడంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయానికి అది కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. ఆ ప్రభుత్వం తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాలు కొన్నిటివల్ల అక్కడి గ్రామాల ప్రజలు, ముఖ్యంగా రైతులతో పాటు వివిధ వర్గాలవారు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. ఏకంగా 33 వేల ఎకరాల భూమిని సమీకరించడమే పెద్ద తప్పు అని చెప్పాలి. రాజధాని నిర్మాణానికి అంటే సచివాలయం, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు వంటి వాటి నిర్మాణానికి ఇంత భారీ ఎత్తున భూమి అవసరం లేదు. అయినా తానేదో ఆధునిక నగర నిర్మాతను అనిపించుకోవాలనో, తన వాళ్లకు రియల్ ఎస్టేట్ రూపంలో బాగా లాభాలు ఆర్జింప చేయాలనో, ఏ కారణం వల్ల అయితేనేం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు వ్యవహరించారు. అన్ని నిర్మాణాలూ జరిగిపోతున్నట్లు భ్రమ కల్పించారు. ఎవరైనా మీరు చేస్తున్నది తప్పు.. ఇన్ని వేల ఎకరాలు తీసుకోవడం, వాటికి ప్రాథమిక మౌలిక వసతులు కల్పించడానికే వేల కోట్ల వ్యయం చేయడం.. ఇదంతా భారం అవుతుందని చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు. పోనీ కీలకమైన వాటినైనా పూర్తి చేశారా అంటే అదీ లేదు. ప్రతిదీ నాటకీయంగా మలిచి ప్రజలలో సెంటిమెంట్ రేకెత్తించడానికి యత్నించారు. రాష్ట్రంలోని అన్నిగ్రామాల నుంచి మట్టి తెప్పించడం, ఆయా నదుల నుంచి నీరు తెప్పించడం ఇలా రకరకాల జిమ్మిక్కులకు ఆయన పాల్పడ్డారు. జాతీయ రహదారికి ముప్పై కిలోమీటర్ల దూరాన తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనం నిర్మించి ప్రజలెవరికీ వాటిని అందుబాటులో లేకుండా చేశారు. తదుపరి శాశ్వత భవనాల నిర్మాణాల పేరుతో పెద్ద తంతు నిర్వహించే యత్నం చేశారు. శంకుస్థాపనలకే కోట్ల రూపాయల వ్యయం చేశారు. అక్కడ అనూహ్యమైన ధరలు పెరగడానికి మాత్రం ఉపయోగపడ్డారు. దానివల్ల సామాన్యులు ఎవరూ రాజధాని ప్రాంతంలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో అటు విజయవాడ, ఇటు గుంటూరు నగరాలతో పాటు ఆ రెండు జిల్లాల్లోని ఇతర ప్రాంతాలలో భూముల విలువలు బాగా పడిపోయాయి. చంద్రబాబు దృష్టి అంతా కేవలం ఆ 29 గ్రామాల భూములు, వాటి పరిసరాలలో విలువలు పెంచడంపైనే ఉండేది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ గజం 1,200 గానే ఉంచి, మొత్తం కోట్ల నల్లధనం లావాదేవీలకు ఆస్కారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలు అక్కడ కూడా టీడీపీకి దూరం అయి ఆ పార్టీని ఓడిం చారు. ఈ పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పలు సమస్యలు ఎదురయ్యాయి. లక్ష కోట్లు ఒకే చోట వ్యయం చేయడమా? లేక అన్ని ప్రాంతాల అభివృద్ధికి వీలుగా మూడు రాజధానులను ఏర్పాటు చేయడమా అన్న మీమాంసపై తర్జనభర్జన పడింది. ఒక నగరాన్ని లక్షల కోట్ల వ్యయంతో నిర్మించడం కన్నా, ఉన్న పెద్ద నగరాన్ని వాడుకోవడం బెటర్ అని భావించి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది. కర్నూలును న్యాయపరమైన రాజధాని అని, అమరావతి ప్రాంతాన్ని శాసన రాజధాని అని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. ఆ ప్రాంత రైతుల పేరుతో కానీ, ఇతరత్రా కానీ పలువురితో హైకోర్టులో కేసులు వేయించింది. ఆ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. దానికితోడు ఇన్సైడ్ ట్రేడింగ్, భూ కుంభకోణాల ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే, హైకోర్టు స్టే ఇచ్చింది. మొత్తం వ్యవహారం అంతా కోర్టు పరిధిలోకి వెళ్లడం, కొంతమందితో టీడీపీ నాయకత్వం నిరసనలు చెప్పించడం, ఆందోళనలు కొనసాగించడం వంటివి చేయసాగింది. అదంతా ఇంకా కొలిక్కి రాలేదు. బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా తమ భూములకు రియల్ ఎస్టేట్ విలువలు అధికంగా ఉండడం కోసం ఆందోళనలు చేస్తున్నారు. అన్ని ఆఫీస్‌లు ఒకే చోట ఉండాలన్న డిమాండ్‌తో వారు దీక్షలు చేస్తున్నారు. దీనికి కొన్ని ప్రతిపక్షాలు మద్దతు ఇస్తుండడంతో ప్రభుత్వం అక్కడ ఏ కార్యక్రమం చేపట్టడానికీ ముందుకు వెళ్లలేకపోయింది. అక్కడి రైతులు అనండి, భూ యజమానులు అనండి.. వారంతా తెలుగుదేశం పార్టీ ట్రాప్‌లో పడకుండా ప్రభుత్వంతో చర్చలు జరిపి వారి కోరికలేమిటో వెల్లడించి ఉంటే ఈ సమస్య ఇంత క్లిష్టమయ్యేది కాదనిపిస్తోంది. తాజాగా కృష్ణా కరకట్టను 150 కోట్లతో విస్తరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే జాతీయ రహదారికి ఆయా రోడ్లను అనుసంధానం చేయాలని తలపెట్టారు. డెబ్బై ఐదు శాతం పనులు జరిగిన నిర్మాణాలను పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనివల్ల ఆ ప్రాంత ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడడానికి ఆస్కారం కలుగుతుంది. గతంలో ఇక్కడ అగ్రికల్చరల్ హబ్ లేదా, ఐటీ హబ్ వంటివాటిని ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స చెప్పారు. అలాంటివాటి ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అలాగే గత ప్రభుత్వం కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భూమి కేటాయించింది. వాటిలో ఆ కార్యాలయాలు కొన్ని అయినా వచ్చేలా చర్యలు తీసుకుంటే ఆ ప్రాంతంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న భావన ఏర్పడుతుంది. ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాలను ఏ రకంగా ఉపయోగించాలన్న దానిపై ఒక స్పష్టత తెచ్చుకోవాలి. కృష్ణానదిపై గొల్లపూడి ప్రాంతంలో వంతెన నిర్మించడం, కాజ నుంచి ఇటు కృష్ణా జిల్లాలోని అవుటపల్లి వరకు బైపాస్ రోడ్డును వేగంగా నిర్మించడం వంటి పనులు చేయడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అప్పుడు శాసన రాజధాని అని ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్రాంతంలో మళ్లీ విలువలు బాగా పుంజుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం విశాఖతో పాటు అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉందన్న విషయం ప్రజలకు అర్థం అవుతుంది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నవ నగరాలు అంటూ ఏవేవో ప్రచారం చేశారు కానీ అవేవీ ఒక రూపానికే రాలేదు. పైగా అవసరం లేని భారీ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఆర్థిక భారం మోపే యత్నం చేశారు. ఏ దేశం వెళితే ఆ దేశ రాజధానులను పోలిన విధంగా నగరాన్ని నిర్మిస్తున్నామని చెబుతూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేశారు. అన్నిటిపై ప్రజలను ఊహలలో ఉంచాలని చూశారు. కాని ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకుని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక నిర్దిష్ట కార్యాచరణకు దిగితే బాగుంటుంది. భూములు ఇచ్చిన రైతులకు కౌలు ఇస్తున్న మాట నిజమే కావచ్చు. కానీ వారికి ప్లాట్లు కూడా ఇవ్వవలసి ఉంటుంది. గత ప్రభుత్వం వాటిని కాగితాలకే పరిమితం చేసింది. ఈ ప్రభుత్వం ఆచరణలో ఎంతవరకు చేయగలుగుతుందో అదంతా చేయడం ద్వారా ఆ గ్రామాల వారిలో విశ్వాసం పెంపొందించాలి. ఇదంతా కష్టమైన విషయమే కావచ్చు. గత ప్రభుత్వం దీనినంతటినీ ఒక పెద్ద ఊబిలా మార్చిన మాట నిజమే. కానీ ఆ ఊబిలో చిక్కుకోకుండా జగన్ ప్రభుత్వం జాగ్రత్తపడింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఊబి ఉంది కదా అని వదలివేయడం కాకుండా, అక్కడి ప్రజలు ఎంతో కొంత సంతోషపడేలా ప్లాన్ తయారు చేసుకుని ముందుకు వెళ్లడం ఉభయత్రా ప్రయోజనకరం అని చెప్పాలి. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
కృష్ణాజిల్లా వాసిగా సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా..!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలను పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్వాగతించారు. వైఎస్ జగన్ అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రి అని, ఏ ఒక్క ప్రాంతానికో, వర్గానికో కాదని ఆయన అన్నారు. కొడాలి నాని గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి ఒకేచోట జరిగితే ప్రాంతీయ విద్వేషాలు వచ్చే అవకాశం ఉందని, ఇదే విషయాన్ని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై అనేక ఏళ్లుగా డిమాండ్ ఉందని, అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకే సీఎం జగన్ మూడు ప్రాంతాల అభివృద్ధిపై మాట్లాడరని మంత్రి కొడాలి నాని తెలిపారు. రాజధానిపై నిపుణుల కమిటీ అధ్యయం చేసి నివేదిక ఇస్తుందని, దానికి అనుగుణంగా సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇంతలోనే కొంపలు మునిగిపోయినట్లు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ రాద్ధాంతం చేస్తున్నారని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి నిర్ణయం ప్రజలంతా ఆమోదించే విధంగా ఉంటుందని, ఈ నిర్ణయాన్ని ఉత్తరాంద్ర, రాయలసీమ టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా వాసిగా సీఎం జగన్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. చదవండి: ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు! చంద్రబాబు ఏం చెబితే...పవన్ కల్యాణ్ అదే చెబుతారని ఎద్దేవా చేశారు. రైతులను నిండా ముంచిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ వారిని రెచ్చగొట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. రైతులు ఆందోళన చెంది వీరి ఉచ్చులో పడాల్సిన పనిలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పే గ్రాఫిక్స్ వాస్తవంగా సాధ్యం కాదని, నగరాలు నిర్మించడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, చెన్నై, ముంబైని ప్రభుత్వాలు నిర్మించాయా అని ఆయన సూటిగా ప్రశ్నలు సంధించారు. దేశ రాజధాని ఢిల్లీని తీసుకువచ్చి దేశం మధ్యలో పెట్టమంటారా అని ఎదురు ప్రశ్న వేశారు. ఇక సుజనా చౌదరి మాటలకు బీజేపీలో విలువలేదని, జైలుకు పోకుండా తప్పించుకోవడానికి ఆయన బీజేపీలో చేరారని మంత్రి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా ఆలోచించి అడుగులు వేయాలని, ఇందులో భాగంగా మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని రాజధానిపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో హైకోర్టు (జ్యుడిషియల్ క్యాపిటల్), అమరావతిలో చట్ట సభలు (లెజిస్లేటివ్ క్యాపిటల్) ఏర్పాటు చేసేందుకు వీలుందన్నారు. -
కృష్ణాజిల్లా వాసిగా సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా..
-
కొండకి నాగలంటే ఇదే!
అక్షర తూణీరం బాబు తెరపై చూపిస్తున్న ప్రపంచ ప్రసిద్ధ మహానగరం ఎప్పటికి చూస్తామోనని ప్రజలు తహతహలాడుతున్నారు. కొందరికి అసలు చూడమేమోనని దిగులు. రైతులు ఇచ్చారో కాపిటలిస్టులు తీసుకున్నారోగానీ ముప్పై వేల ఎకరాల సుక్షేత్రాన్ని బీడు పెట్టేశారు. కాపిటలిస్టులంటే మహానగర నిర్మాతలని నా ఉద్దేశం. రాష్ట్రంలో కూరగాయలకు కరువొచ్చిపడింది. టమేటాలు సలక్షణమైనవి కిలో వందరూపాయలు, పచ్చిమిర్చి దానికి సరితూగుతోంది. మిగతా పచ్చికూరలన్నీ మన సొంత హెరిటేజ్‌లో సైతం మండిపోతున్నాయి. రెండు ఏరువాకలు గడిచిపోయాయి. జరిగిందేమిటంటే తాత్కాలిక సచివాలయం మరియు శాసనసభా భవనం, అవి కూడా మన రాష్ట్రప్రభుత్వ ఆంతరంగిక సమాచారంలాగే అడపా దడపా లీకులకు గురి అవుతున్నాయి. అది నిర్మాణ లోపం కాదనీ, వాన కురుస్తున్న తీరే కారణమని అప్పటికప్పుడు నొక్కి వక్కాణిస్తున్నారు. లీకుల వల్ల తడిసేది వారే గానీ సామాన్య ప్రజ కానేకాదు. పోనీ, ఈ తాత్కాలికాలకు ఓ వెయ్యి ఎకరాలు పక్కన పెట్టినా, మిగతా సుక్షేత్రాలలో కూరగాయలు పండించవచ్చు. మిగతా మెట్టపంటలు వెయ్యొచ్చు. ఒకవేళ సింగపూర్ వాళ్లు, జాపనీయులు వస్తే పంటతో నేలను చూపించవచ్చు. వాళ్లు వచ్చేసరికి బీడు భూముల్లా కనిపించాలని ఖాళీగా పెట్టారు. ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ, బాబు తెరమీద చూపిస్తున్న ప్రపంచ ప్రసిద్ధ మహానగరం ఎప్పటికి చూస్తామోనని ప్రజలు తహతహలాడుతున్నారు. కొంచెం వయసు మీరినవారు అసలు చూడమేమోనని దిగులు పడుతున్నారు. కొందరు మాత్రం, ‘కొండకి నాగలి పట్టించాడు. కొంచెం కష్టమే’నని నిట్టూరుస్తున్నారు. కృష్ణమ్మ మీద నయన మనోహరమైన వంతెనలు, ఆబాల గోపాలాన్ని ఆడించే నందనవనాలు, కోరిన చోటల్లా ఫ్లైఓవర్లు బాబు చూపిస్తున్న బొమ్మల్లో తెగ ఊరిస్తున్నాయి. నా చిన్నప్పుడు హనుమంతుడు గారని ఒకాయన ఏటా నాలుగుసార్లు మా ఊళ్లకి వచ్చేవాడు. ఒక ఎడ్లబండిలో రెండు రాతి విగ్రహాలు, వెనకాల మరో బండిలో ఊరూరు తిరిగేవారు. ఏటవతల ఆలయనిర్మాణం జరుగుతోందని, అక్కడ ప్రతిష్ట చేసే విగ్రహాలు ఇవేనని భక్తిపూర్వకమైన భాషలో మైకులో ప్రకటించేవాడు హనుమంతుడుగారు. ‘ఇదే ఆఖరి అవకాశం.. దేవుడు మీ ఇంటిముందుకొచ్చాడు. తర్వాత మనమే గుడికి వెళ్లాలి దర్శనానికి’ అంటూంటే, ఇహ జనం టెంకాయలే కాదు, హారతులే కాదు, కానుకలే కాదు.. హనుమంతుడుగారి పంటపండేది. రెండు బజార్లు కవర్ చేసేటప్పటికి బియ్యంతో, అపరాలతో వెనకాల బండి నిండిపోయేది. రొఖ్ఖం సరే సరి. ప్రతిష్ట తర్వాత గోత్రనామాలతో పూజకి ముందస్తు బుకింగ్‌లు కూడా జరిగేవి. హనుమంతుడు మైకులో కట్టబోయే ఆలయాన్ని గోపురాలతో, ప్రాకారాలతో, ధ్వజస్తంభాలతో, జే గంట లతో, మహామంటపాలతో, కొలనులతో బొమ్మ కట్టించి భక్తుల్ని తన్మయుల్ని చేసేవాడు. మీరొక మారేడుకి ఆశ్రయం ఇవ్వొచ్చు. మీరొక పున్నాగను పూయించవచ్చు. పొగడ, పొన్న, పారిజాతం ఏదైనా సరే మీ పేరు మీద పూస్తూ, దేవుళ్లను సేవిస్తూ ఉంటుంది– ఒక్క నూట పదహారు రూపాయలు చాలు. మళ్ళీసారి హనుమంతుడు కొత్త బొమ్మలు తెచ్చేవాడు. దశావతారాలు, నవగ్రహాలు.. ఇలా రకరకాల విగ్రహాలు. ఆలయం ఎక్కడో తెలియదు. ఎప్పటికి ప్రతిష్టలవుతాయో చెప్పలేం. మొత్తానికి ముప్పైఏళ్లపాటు హనుమంతుడిగారి జీవితం సుఖంగా సాగిపోయింది. మనదేశంలో దేవుడి బొమ్మలతో ఎంత కాలమైనా వ్యాపారం నడిచిపోతుంది. కానీ ఇతరత్రా బొమ్మలతో మాత్రం కథ నడవదు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
కూలీలుగా.. రాజధాని రైతులు!
-
రాజధాని కూలీలు!
సమీకరణలో భూములు కోల్పోయి కూలీలుగా రైతులు 40 వేల ఎకరాలకు పైగా బీడు పడ్డ రాజధాని భూములు ధాన్యం, కూరగాయల ఉత్పత్తీ లేదు.. రాజధాని నిర్మాణమూ లేదు ఇప్పటికే ఉపాధి కోల్పోయిన రైతులు, కూలీలు సాక్షి ప్రతినిధి/సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కర్షకుడు కన్నీరు పెడుతున్నాడు. ఏడాది పొడవునా పచ్చని పంటలతో కళకళలాడే భూములు నేడు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. పదిమందికి ఉపాధినిచ్చే రైతన్న నేడు కూలీగా మారాడు. రైతు కూలీలకు పనులు దొరక్క పస్తులతో అల్లాడుతున్నారు. రాజధాని గ్రామాల్లో సంపన్న రైతులు కొందరు మినహా.. మిగిలిన వారెవరిని పలుకరించినా బతుకుపై భయం వారి కళ్లల్లో కనిపిస్తోంది. రాజధాని నిర్మాణం పేరుతో 54 వేల ఎకరాలను ల్యాండ్‌పూలింగ్ కింద సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో 27వేల ఎకరాలను సమీకరించింది. సమీకరించిన భూమిలో ఇప్పటివరకు ఒక్క ‘తాత్కాలిక సచివాలయ భవనం’ మినహా మరే నిర్మాణం చేపట్టలేదు. సమీకరించిన భూమిని వినియోగించే ప్రయత్నమే చేయకుండా, సమీకరణకు ఇవ్వని భూములను బలవంతంగా లాక్కోవడానికి ‘భూ సేకరణ’ అస్త్రాన్ని ప్రభుత్వం ప్రయోగిస్తోంది. అటు సమీకరణలో భూములు కోల్పోయిన రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రైతులు, కూలీలు ఉపాధి కోసం అర్ధరాత్రి నుంచే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్లీ కొత్తగా సేకరణ అస్త్రం ప్రయోగిస్తే.. రైతులు, సమీకరణ చేయని పొలాల్లో కొంతమేర అయినా కూలీ పనులు చేసుకొని బతుకీడిస్తున్న కూలీల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందనే ఆందోళనను అధికార వర్గాలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సమీకరణలో భూములు కోల్పోయి అల్లాడుతున్న రైతులు, కూలీల స్థితిగతులను తెలుసుకోవడానికి ‘సాక్షి’ ప్రతినిధుల బృందం రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించింది. వారి కన్నీటి గాథలివీ. పంటలు లేక వెలవెల... రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణానికి 54 వేల ఎకరాలు ల్యాండ్‌పూలింగ్ కింద సమీకరించాలని ప్రభుత్వం భావించింది. దీంతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఉన్న మరో 33 వేల ఎకరాల అటవీ భూములను డీ నోటిఫై చెయ్యమని కేంద్రప్రభుత్వానికి ఇప్పటికి రెండు పర్యాయాలు లేఖ రాసింది. కేంద్రప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించలేదు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 54వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమి 21వేల ఎకరాలు పోను రైతుల నుంచి సుమారు 33వేల ఎకరాలను సమీకరించాలని భావించింది. అయితే రైతులు ఎదురు తిరగటంతో 27వేల ఎకరాలతో సమీకరణకు బ్రేక్ పడింది. ► ‘భూ సమీకరణ’ పేరిట తీసుకున్న భూములు, ప్రభుత్వ భూములు కలిపి.. మొత్తం 40 వేల ఎకరాల్లో పంట లేకుండా బీళ్లుపడ్డాయి. ఇక్కడ 12,820 ఎకరాల్లో ధాన్యం, 11,675 ఎకరాల్లో పత్తి సాగుచేసేవారు. మిగతా భూముల్లో పూలు, కూరగాయలు, పండ్లు పండించేవారు. ఉపాధి లేదు... పింఛన్లు రావు... రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో మొత్తం 22వేల మంది రైతులు ఉన్నారు. ఇందులో రెండెకరాల లోపు ఉన్న రైతులు 15వేల మంది ఉన్నారు. అదే విధంగా 22వేల కుటుంబాలకుపైగా రైతు కూలీలు జీవిస్తున్నారు. రైతు కూలీలకు ప్రతినెలా ఒక్కో కుటుంబానికి రూ.2,500 పింఛను చెల్లిస్తామని ప్రకటించారు. ఈ పించన్లు 3, 4 నెలలకొకసారి చెల్లిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక కూడా జన్మభూమి కమిటీల ద్వారా జరిగింది. ఎంపికలో రాజకీయాలు చోటుచేసుకోవడంతో అనేకమంది లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరిగింది. ► ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు రూ.20 లక్షలు బ్యాంకు షూరిటీ లేని రుణాలు, నిరుద్యోగ భృతి, ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ల్యాండ్‌పూలింగ్ ద్వారా భూములు తీసుకునే రోజున ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఏ ఒక్కటీ అమలు కాలేదు. ► ప్రతి గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగం గా ప్రతి పంచాయితీకి రూ.30 లక్షలు నిధులు మంజూరు చేస్తామని భూములు తీసుకునే సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పటికి ఏ ఒక్క గ్రామానికి రూ.30 లక్షల నిధులు మంజూరు చేయలేదు. 3.8 కోట్ల కేజీల బియ్యం దిగుబడి కోల్పోయాం రాజధాని ప్రాంతంలో 12,820 ఎకరాల్లో వరి సాగు చేసేవారు. సరాసరిన ఖరీఫ్‌లో ఎకరాలకు 40 బస్తాలు, రబీలో 35 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుంది. ఒక్కో బస్తాలో 58 కేజీల ధాన్యం నింపుతారు. భూమి సారవంతమైనది కావడం, సాగునీటి సమస్య లేకపోవడం వల్ల దిగుబడికి గ్యారంటీ ఉండేది. 100 కేజీల ధాన్యాన్ని మర పట్టిస్తే 68 కేజీల బియ్యం వస్తాయి. నూక, తౌడు.. ఉప ఉత్పత్తులు. ఈ లెక్కన చూస్తే.. రాజధాని ప్రాంతంలో ఏటా 3.8 కోట్ల కేజీల బియ్యం ఉత్పత్తిని కోల్పోయాం. అంటే దాదాపు 19 కోట్ల మందికి ఒక పూట భోజనానికి సరిపోయే బియ్యాన్ని ఉత్పత్తి కాకుండా.. దాదాపు అంతేమందికి ఒక పూట కూరగాయలు ఇచ్చే భూమిని రాజధాని కోసం తీసుకొని నిరుపయోగంగా వదిలిపెట్టేశారు. 19 కోట్ల మందికి ఒక పూట భోజనం పెట్టడానికి సరిపోయే బియ్యం, కూరగాయలు ఉత్పత్తి కాకుండా ఆగిపోయిన సంగతి అటుంచితే... రాజధాని నిర్మాణమైనా అడుగు ముందుకు పడిందా అంటే అదీ లేదు. అమరావతి ఇప్పుడు రెండింటికీ చెడిపోయిందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. ► రాజధానిలో గ్రామాలు: 29 ► రైతుకుటుంబాలు: 22 వేలు ► 2 ఎకరాల్లోపున్న కుటుంబాలు: 15 వేలు ► రైతు కూలీల కుటుంబాలు: 22 వేలు ► సమీకరించనున్న∙విస్తీర్ణం: 54 వేల ఎకరాలు ► ప్రభుత్వ భూమి: 21 వేల ఎకరాలు ► రైతుల నుంచి సమీకరించాలనుకున్న భూమి: 33 వేల ఎకరాలు ► సమీకరించిన భూమి: 27 వేల ఎకరాలు ► బలవంతంగా సేకరించాలనుకుంటున్న భూమి: 6 వేల ఎకరాలు కూలికీ దూరాభారమే రాజధాని గ్రామాల నుంచి 20–30 కిలోమీటర్లు ట్రాక్టర్ మీద తెల్లవారుజామునే బయలుదేరి వెళ్లి సాయంత్రానికి ఇళ్లు చేరుతున్న కూలీలు ఎంతోమంది ఉన్నారు. శాఖమూరు గ్రామానికి చెందిన రైతులు, కూలీలు 30 కి.మీ దూరంలో ఉన్న రావెలకు కూలీ పనికి వెళ్లి ట్రాక్టర్ ట్రక్కులో వస్తున్న దృశ్యం సాక్షి కంట పడింది. ట్రాక్టర్లో ఉన్న ఎవరిని కదిలించినా.. ఆవేదన పెల్లుబికి వచ్చింది. అందులో ఒకరు అశోక్. ఆయన ఏమన్నారంటే.. ‘‘రోజూ వేకువ జామునే లేచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావెల చుట్టుపక్కల గ్రామాల్లో పత్తి కోత పనికి వెళ్తున్నాం. కిలో పత్తి కోస్తే రూ.8 చొప్పున చెల్లిస్తారు. వచ్చిన కూలీ డబ్బులతో రానుపోను ఆటో, భోజనం ఖర్చుపోను మిగిలింది ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదు. రాజధానికి భూములు తీసుకోకమునుపు శాఖమూరు గ్రామం చుట్టుపక్కలే కూలి పనులకు భార్యతో కలిసి వెళితే రోజుకు రూ. 1,300 సంపాదించేవాళ్లం. ఇప్పుడు ఇద్దరు కలిసి కూలీ పనికి వెళ్లినా రూ.500 రావటం లేదు’’. – అశోక్, శాఖమూరు కూలీలుగా మారిన రైతన్నలు.. తుళ్లూరు మండలం మోదుగు లింగాయపాలెంలో 25 మంది రైతులు, 250 మంది కూలీలు ఉన్నారు. నూతన రాజధాని నిర్మాణం కోసం భూములు సమీకరించడంతో రైతులు జీవనాధారాన్ని కోల్పోయారు. భూములన్నీ ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికిచ్చేయడంతో సాగు నిల్చిపోయింది. చిన్న, సన్నకారు రైతులకు, కూలీలకు ఉపాధి కరువైంది. రైతులంతా కూలీలుగా మారిపోయారు. సాక్షి బృందం రాజధాని గ్రామాల్లో పర్యటించినప్పుడు మోదుగులింగాయపాలెం రైతులు లంక పొలాల్లో కూలి చేసుకుంటూ కనిపించారు. అందులో మదిరపల్లి కన్నారావు ఒకరు. సాక్షి బృందం ఆయనను పలకరిస్తే కన్నీరుమున్నీరయ్యారు. ‘‘మా కుటుంబానికి మూడెకరాల పొలం ఉండేది. ముగ్గురు అన్నదమ్ములు ఎకరం చొప్పున పంచుకున్నాం. ముగ్గురు అన్నదమ్ములు కలసి 10 ఎకరాలు కౌలుకు తీసుకొని దొండ సాగుచేసేవాళ్లం. ప్రతిరోజూ 15 మంది కూలీలకు ఉపాధి కల్పించేవాళ్లం. ల్యాండ్ పూలింగ్‌కు భూమి ఇవ్వకూడదని తొలుత అనుకున్నా... పొలంలో బొంగులు, ఇతరత్రా వాటిని తగులబెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. చేసేదిలేక ల్యాండ్‌పూలింగ్‌కు మా భూమి ఇచ్చేశాం. చేతిలో ఉన్న డబ్బుతో కొన్నాళ్లు కుటుంబాన్ని నడుపుకున్నాం. ప్రభుత్వం ఇస్తున్న కౌలు డబ్బులు ఖర్చులకు సరిపోవడం లేదు. అది కూడా ప్రతినెలా కాకుండా, మూడు నాలుగు నెలలకు ఒకసారి ఇస్తుండటం కూడా ఇబ్బందిగా మారింది. కుటుంబ జీవనం కష్టమైంది’’ అని చెప్పారు. గత్యంతరం లేక ప్రస్తుతం లంక భూముల్లో రోజు కూలీలుగా పనిచేస్తున్నామని వాపోయారు. రోజుకు 15 మందికి ఉపాధి కల్పించే తమ కుటుంబం మొత్తం ఈ ప్రభుత్వం వల్ల కూలీలుగా మారిపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జనవరి నుంచి ‘ రాజధాని’ పనులు
డిసెంబర్ ఆఖరుకు డిజైన్లు పూర్తి: నారాయణ సాక్షి, అమరావతి బ్యూరో: వచ్చే జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు మున్సిపల్ మంత్రి పి.నారాయణ చెప్పారు. డిసెంబర్ చివరినాటికి డిజైన్లు పూర్తవుతాయన్నారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే వారం నుంచి తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన ప్రారంభం అవుతుందని తెలిపారు. సచివాలయం పరిధిలోని 49 ఎకరాల విస్తీర్ణంలో గ్రీనరీ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఆ పనులను మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. వచ్చే శుక్రవారం నుంచి ఎనిమిది గ్రామాల రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. -
అమరావతిలో తెలుగు శిలాఫలకాలు ప్రతిష్టించాలి
విజయవాడ (గాంధీనగర్): తెలుగులో రూపొందించిన భూమిపూజ, రాజధాని, తాత్కాలిక సచివాలయ శంకుస్థాపన శిలాఫలకాలను ఉగాదిలోగా రాజధాని అమరావతిలో ప్రతిష్టించాలని, లేకపోతే గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతామని మాజీ ఎంపీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి పలు అంశాలపై వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు భాష, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడతామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ, తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు వాగ్దానాలు చేసినట్లు గుర్తుచేశారు. ఆ రెండింటిలో ఏ ఒక్కటి అమలు కాలేదని ముఖ్యమంత్రికి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్న తెలుగు విశ్వవిద్యాలయం పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను తెలుగులో ప్రవేశపెడితే మన ప్రభుత్వం సిగ్గుతో తలదించుకునేలా ఆంగ్లభాషలో ప్రవేశపెట్టిందని ఎద్దేవా చేశారు. చెన్నైలోని పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ ఆధీనంలోని బిల్డింగ్ నిర్వహణకు రూ.10 లక్షల బకాయిలు చెల్లించే విషయమై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారుల్లో కదలిక రాలేదన్నారు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించేలా చర్యలు చేపడతామని చెప్పిన చంద్రబాబు నేటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం, పాఠ్య ప్రణాళిక రూపొందించకపోవడం బాధాకరమని యార్లగడ్డ పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. -
'ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు'
న్యూఢిల్లీ: అటవీ భూములను పరిరక్షించేలా నవ్యాంధ్ర నూతన రాజధానిని డిజైన్ చేయాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సూచించారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధ్యయనం లేకుండా అమరావతికి పర్యావరణ అనుమతులు ఇచ్చారన్న ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. అమరావతి కోసం కొత్త పాలసీ తీసుకొచ్చామని కేంద్ర మంత్రి తెలిపారు. అటవీ భూముల్లో నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించేందుకు అనుమితించామని, రాజధాని నిర్మాణ ప్రతిపాదనలపై ఇంకా తనిఖీ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రాజధాని అంశంలో అనుమతుల విషయంలో జాప్యం జరగలేదని చెప్పారు. రాజధాని నిర్మాణానికి తక్కువ అటవీ భూములు ఉపయోగించాలన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వివరించారు. -
రాజధాని ప్రాంతంలో రైతుపై అరాచకం
-
రాజధాని శంకుస్థాపన అతిథులకు ప్రత్యేక వంటకాలు
-
'రాజధాని శంకుస్థాపనకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం'
విజయవాడ: ఈ నెల 22న విజయ దశమి పర్వదినాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శంకుస్థాపన పనులు తుదిదశకు చేరుకున్నాయని అన్నారు. ట్రాఫిక్ సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. దుష్ర్పచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనేక ప్రాంతాల నుంచి మట్టి, పవిత్ర జలాలు తీసుకొచ్చినట్టు తెలిపారు. దేశంలోని అన్ని నదుల పవిత్ర జలాలు తీసుకొచ్చామని చెప్పారు. సీఆర్డీఏ ప్రాంతాన్ని పవిత్ర జలాలు, మట్టితో కలిపి చల్లుతామని బాబు వెల్లడించారు. రాజధాని శంకుస్థాపనకు ప్రజల స్పందన బాగుందన్నారు. శంకుస్థాపనకు తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. -
అక్టోబర్ 22న రాజధాని శంకుస్ధాపన
-
హరిత అమరావతి.. ఆంధ్రుల రాజధాని
రాజధాని నగర మహా ప్రణాళికను అందించిన సింగపూర్ ప్రభుత్వం సువిశాలమైన రహదారులు.. ఆ రోడ్ల వెంటే హరితవనాలు.. అంతర్గత జలమార్గాలు.. సైకిల్‌పై వెళ్లడానికి, నడిచి వెళ్లడానికి ప్రత్యేక మార్గాలు.. జనావాసాలకు అతి సమీపంలోనే వాణిజ్య సముదాయాలు, విద్యాలయాలు.. 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయడానికి ప్రత్యేకమైన గ్రిడ్.. నీటి సరఫరా.. మచిలీపట్నం, నిజాంపట్నం నౌకాశ్రయాల సమీపంలో పరిశ్రమలను ఏర్పాటుచేసేలా రాజధాని మహా ప్రణాళిక (కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్)ను సింగపూర్ ప్రభుత్వం రూపొంచింది. ఇప్పటికే రాజధాని ప్రాంత మహా ప్రణాళిక (కేపిటల్ రీజియన్ మాస్టర్ ప్లాన్)ను సింగపూర్ ప్రభుత్వం రాష్ట్ర సర్కారుకు అందించిన విషయం విదితమే. కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ దేశ రక్షణ, వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్ సోమవారం హైదరాబాద్‌లో సచివాలయంలో కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందించారు. కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్‌కు చెందిన సుర్బానా ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ సంస్థ రూపొందించింది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్‌ను పెద్దపీట వేసింది. ఈ ప్లాన్‌లో రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) పరిధిలోని ప్రాంతాన్ని ఎనిమిది ప్రణాళిక ప్రాంతాలుగా విభజించింది. ఇందులో రాజధాని నగరం కలిసి ఉండే ప్రాంతాన్ని కేంద్ర ప్రణాళిక ప్రాంతంగా ప్రతిపాదించింది. కేంద్ర ప్రణాళిక ప్రాంతం 854 చకిమీల్లో అంటే.. 2,11,028 ఎకరాల్లో విస్తరించి ఉండాలని సూచించింది. ఇందులో రాజధాని నగరం 217 చకిమీల్లో అంటే 53,621 ఎకరాల్లో నిర్మించాలని పేర్కొంది. కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ వివరాలను సుర్బానా ఇంటర్నేషనల్ కన్సెల్టెన్సీ సీఈవో పాంగ్ యీ యాన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వాస్తుకు పెద్దపీట కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్‌లో వాస్తుకు పెద్దపీట వేశారు. రాజధాని నగరంలో కృష్ణా నదికి అభిముఖంగా.. ఈశాన్యం వైపున త్రిభుజకారంలో కొంత ప్రాంతాన్ని ఖాళీగా ఉంచాలని ప్రతిపాదించింది. దీన్నే ‘బ్రహ్మస్థానం’గా పేర్కొంది. వాస్తు ప్రకారం బ్రహ్మస్థానం ఏర్పాటు చేయడం వల్ల నగరం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేసింది. సు‘జలాం' కొండవీటి వాగు, కృష్ణా నదులపై చిన్న చిన్న రిజర్వాయర్లను నిర్మించి.. నిత్యం ఐదు టీఎంసీల జలాలను నిల్వ ఉంచాలని సూచించింది. రాజధాని నగర తాగునీటి, పారిశ్రామిక అవసరాలకు ఈ జలాలు సరిపోతాయని పేర్కొంది. ట్రా‘ఫికర్’కు చెక్ రాజధాని నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రహదారులను నిర్మించాలని ప్రతిపాదించింది. ఇందుకు ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్, వైజాగ్ నుంచి చెన్నై వెళ్లే మార్గాలను ఎక్స్‌ప్రెస్ మార్గాలుగా అభివృద్ధి చేయాలని పేర్కొంది. రాజధాని చుట్టూ మంగళగిరి, తాడేపల్లి, విజయవాడలను కలుపుతూ.. అలానే మధ్యలోనూ 155 కిమీల మేర ప్రధాన రహదారులను నిర్మించాలని సూచించింది. ఎక్స్‌ప్రెస్ వేలు, జాతీయ రహదారులు, ప్రధాన రహదారులను అనుసంధానం చేస్తూ 332 కిమీల మేర ఉప ప్రధాన రహదారులను నిర్మించాలని ప్రతిపాదించింది. రాజధాని నగరంలో 324 కిమీల పొడవును అంతర్గత రహదారులను నిర్మించాల్సి ఉంటుందని అంచనా వేసింది. నడక, సైకిల్ మార్గాలు నడక, సైకిల్ మార్గాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తే కాలుష్యానికి అడ్టుకట్ట వేయవచ్చునని సూచించింది. జనావాసాలకు సమీపంలోనే అంటే.. ప్రజలు నడిచి వెళ్లడానికిగానీ సైకిల్‌పై వెళ్లడానికిగానీ సౌకర్యంగా ఉండేలా విద్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు నిర్మించడం వల్ల కాలుష్యంతోపాటూ ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చునని అభిప్రాయపడింది. ఆ మేరకు 150 కిమీల మేర సైకిల్ మార్గం, 170 కిమీల పొడవున నడక మార్గంను ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. మెట్రో రైలు వ్యవస్థ విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, ఇబ్రహీంపట్నం, ఉండవల్లి, నీరుకొండ, అనంతవరంలను రాజధాని అమరావతితో కలుపుతూ మెట్రో రైలు మార్గాన్ని 135 కిమీల పొడవున ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. మంగళగిరికి సమీపంలో ట్రాన్స్పోర్ట్ హబ్‌ను ఏర్పాటుచేయాలని సూచించింది. జలమార్గం: కొండవీటివాగు, కృష్ణా నదుల్లో నిత్యం నీళ్లు ఉండేలా రిజర్వాయర్లు నిర్మించి.. జల మార్గాలను అభివృద్ధి చేయవచ్చునని ప్రతిపాదించింది. సుమారు 80 కిమీల పొడవున అంతర్గత జలమార్గం ఏర్పాటుచేయడం ద్వారా కాలుష్యానికి అడ్డుకట్ట వేయడంతోపాటూ పర్యాటకులను ఆకట్టుకోవచ్చునని సూచించింది. అంతర్జాతీయ విమానాశ్రయం రాజధాని నగరంలో.. మంగళగిరికి సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటుచేయాలని సూచించింది. ఇందుకు కనీసం ఐదు వేల ఎకరాల భూమిని కేటాయించాలని పేర్కొంది. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాజధాని నగరం అమరావతి, విజయవాడ, ప్రధాన రహదారులను అనుసంధానం చేస్తూ ప్రత్యేక మార్గాలను నిర్మించాలని ప్రతిపాదించింది. హరితవనం అమరావతిని హరితవనంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించింది. రోడ్ల వెంట హరితవనాలు ఏర్పాటుచేయడం ద్వారా కాలుష్యానికి అడ్డుకట్ట వేయడంతోపాటూ పర్యావరణ సమతౌల్యాన్ని సాధించవచ్చునని అభిప్రాయపడింది. ప్రధాన రహదారులు వెంట 200 కిమీల మేర హరితవనాలను ఏర్పాటుచేయాలని పేర్కొంది. హరితవనాలకు అనుసంధానంగా పౌర ఉద్యానవనం(సివిక్ పార్క్), కేంద్ర ఉద్యానవనం(సెంట్రల్ పార్క్), నిడుముక్కల ప్రాంతంలో కెనాల్ పార్క్, గోల్ఫ్ కోర్సు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయం(ఇంటర్నేషనల్ యూనివర్శిటీ) క్రికెట్ స్టేడియంను నిర్మించాలని సూచించింది. జలమార్గం రాజధాని నగరానికి అభిముఖంగా అమరావతి నుంచి విజయవాడ వరకూ 35 కిమీల పొడవున కృష్ణా నది ప్రవహిస్తుంది. కృష్ణా నది జలవిస్తరణ ప్రాంతం మూడు వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో 2,800 హెక్టార్లలో ద్వీపాలు విస్తరించి ఉన్నాయి. వాటిలో వెయ్యి హెక్టార్లలో విస్తరించిన ద్వీపాలను పర్యాటకులను ఆకట్టుకునేలా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. ద్వీపాలను అభివృద్ధి చేసి రిసార్ట్స్ ఏర్పాటుచేయాలని సూచించింది. పారిశ్రామికం మచిలీపట్నం, నిజాంపట్నం(వాన్‌పీక్)లో నౌకాశ్రయాలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. ఈ నౌకాశ్రయాలకు సమీపంలోనే పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని పేర్కొంది. నౌకాశ్రయాలు, పారిశ్రామిక నగరాలను జాతీయ ప్రధాన రహదారులు, అమరావతిని అనుసంధానం చేస్తూ ప్రత్యేక రహదారులు నిర్మించాలని సూచించింది. పర్యాటకం రాజధాని చుట్టూ చరిత్ర ప్రసిద్ధికెక్కిన ప్రాంతాలు, అధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేస్తే పర్యాటకులను భారీ ఎత్తున ఆకట్టుకోవచ్చునని ప్రతిపాదించింది. విజయవాడ కనకదుర్గ ఆలయం, భవానీ ద్వీపం, ఉండవల్లి గుహలు, మంగళగిరి ఆలయం, నీరుకొండ, అనంతవరం ఆలయాలు.. అమరావతి భౌద్దారామాలను అనుసంధానం చేస్తూ 145 కిమీల పొడవున మెట్రో రైలు, 45 కిమీల పొడవున జలమార్గాలు, 61 కిమీల మేర రహదారులను నిర్మించాలని ప్రతిపాదించింది. ఇది పర్యాటకులను ఆకట్టుకోవడానికి దోహదం చేస్తుందని అంచనా వేసింది. -
అమరావతి కారాదు సంక్షోభ నగరి!!
రాశిలోగాక వాసిలో, స్థాయిలో గాక సారంలో గొప్ప నగరాన్ని నిర్మించడం అత్యుత్తమం. గృహ వసతి, రవాణా సదుపాయాల అవస రాల కంటే సరఫరా ముందుండేటట్టు చేయగలిగితే అది సాధ్యమే. తద్విరుద్ధంగా అవసరాలను అనుస రించి సరఫరా సాగుతుండటమే మన పట్టణీకరణలోని సంక్షోభం. అందుకు తావే లేని గొప్ప నగరాన్ని నిర్మించే అవకాశాన్ని చంద్రబాబు వదులుకోరాదు. మన దేశం ఏమంత ఎక్కువగా కొత్త నగరాలను నిర్మించింది లేదు. స్వాతంత్య్రోదయ కాలంలో నిర్మిం చిన చండీగఢ్ రూపకర్త ఫ్రెంచివా డైన లి కొర్బూజె కాగా, జర్మన్ వాస్తు శిల్పి ఆటొ కొనిగ్స్ బెర్గర్ భువనేశ్వ ర్కు రూపకల్పన చేశారు. ఆపై నిర్మించిన గాంధీనగర్‌పై కోర్బూసి యర్ ప్రభావం ఉంది. ఆ అర్థంలో నవీ ముంైబె , రాయ్‌పూర్‌లు మాత్రమే బహుశా పూర్తి స్వదేశీ నమూనాలుగా లెక్క. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి.. సింగపూర్ నమూనాలతో నిర్మాణం కానుంది. సింగపూర్ ఒక నగర రాజ్యమే తప్ప వలసలతో పట్టణీకరణ దిశగా సాగుతూ అభివృద్ధి చెందుతున్న ఒక రాష్ట్ర రాజధాని కాదు. ప్రత్యేకించి ఆ అంశం కారణంగా మనకున్న పరిమిత అనుభవం నేపథ్యం నుంచే అమరావతి ఎలా ఉం డాలో ఊహించుకోవాల్సి ఉంది. మన దేశంలోని ఇతర నగ రాలన్నీ దశాబ్దాలు, శతాబ్దాల తరబడి పరిణామం చెంది నవే. ప్రామాణిక భారత నగరంగా చూపగలిగేదేదీ లేదు. అమరావతి ‘స్మార్ట్’ నగరం కావాల్సిందే. కాకపోతే ఎంత సూక్ష్మబుద్ధితో అందుకు ప్రణాళికను రూపొందిస్తాం, అమ లుచేస్తాం అనే దానిపైనే అది ఆధారపడి ఉంటుంది. నూతన నగరం శాసనసభ, సచివాలయం, తత్సంబంధిత వివిధ భవనాల సముదాయం ప్రధాన భాగంగా ఉండే ఒక రాష్ట్ర రాజధాని. ప్రత్యేకించి ఆ కారణంగా నిర్మాణానికి ముందే కొన్ని గుణపాఠాలను నేర్చుకోవాలి. అమరావతి భవనాల ముందరి భాగాలు ధగధగలాడే గాజుతో కూడినవి కాకూడదు. అలాంటి భవనాలు లోపలి భాగాలను సౌఖ్యవంతం చేయడం కోసం ఖరీదైన, కొరతగా ఉన్న విద్యుత్తును తెగ కబళించేస్తాయి. ఇక రవాణా కార్లపై ఆధారపడినది కాకూడదు. గృహ వసతి, రవాణా వ్యవస్థలే ఒక నగరం నాణ్యత, సమర్థతలకు కొలబద్ధలు. చండీగఢ్ నగర ప్రణాళిక వృద్ధి చెందుతున్న సేవలనందించే వర్గానికి, అల్పాదాయ వర్గాలకు చౌకగా గృహవసతి ఏర్పాట్లను విస్మ రించి తప్పు చేసింది. నగరం చుట్టూ మురికివాడల వలయా న్ని సృష్టించుకుంది. అక్కడ నివసించేవారు ఎంతో వ్యయప్ర యాసలతో, నానా బాధలూ పడి పని కోసం నగరంలోకి వెళ్లి రావాలి. ప్రధానంగా ఉద్యోగుల గృహవసతి సహా ప్రభుత్వ అవసరాల కోసమే తయారైన గాంధీనగర్ కూడా వలసవచ్చే పేద గ్రామీణ ప్రజలను విస్మరించింది. ముంబై నగర విస్తీ ర్ణానికి సమానంగా ఉండే నవీ ముంబై ఆవిర్భావం సుదీ ర్ఘంగా సాగింది. పేరుకు ప్రపంచంలోనే అతి పెద్ద నగరమైనా నేటికీ అది నత్తనడక నడుస్తోంది. అందులో మూడోవంతు భాగం మాత్రమే మునిసిపాలిటీల కిందికి వచ్చింది. మరో మూడో వంతు మురికివాడలే. గ్రామా లను మురికివాడలుగా మారేంతవ రకు నిర్లక్ష్యం చేశారు. వాటిలో సదు పాయాలు శూన్యం, జనసమ్మర్థం ముమ్మరం. త్వరలో వివరాలను వెల్లడించ నున్న అమరావతి భారీ ఎత్తున గృహ వసతి కల్పనకు హామీనిచ్చే బాధ్య తను స్వీకరించాలి. నివాసానికి సిద్ధం గా ఉన్న గృహాలు కనీసం లక్షయినా ఉంటేనే తక్షణమే అది జనావాస నగరంగా మారుతుంది. కొద్దికొద్దిగా పెంచుకుం టూపోయే పద్ధ్దతి ధరలు పెరగడానికి మాత్రమే దారితీస్తుం ది. అలాగాక ప్రభుత్వం మాత్రమే అక్కడుండేట్టయితే... సాయంత్రానికి అది భూత నగరిగా మారుతుంది. రోడ్ల మీద కార్లను నివారించడం, చౌకగా సమర్థవంతమైన రవాణాను సాధ్యం చేయడం అనే రెండు కారణాల రీత్యా ముందు నుం చే ప్రజార వాణా వ్యవస్థను ఎంచుకోవాలి. స్మార్ట్ సిటీ అంటే ఐటీ రంగ ఉద్యోగులకు పార్కింగ్ స్థలాల లభ్యతే కానవస రంలేదు. నగర ప్రజలకు ఎంత చౌకగా గృహవసతిని, రవా ణాను అందిస్తామనేది గీటురాయి కావాలి. హాంకాంగ్ వాసులకు కారు అవసరం లేదు. మెరుగైన ప్రభుత్వ రవాణా వ్యవస్థ వల్ల ఫ్రాన్స్‌లోని లీయోన్ నగరంలో కార్ల వాడకం 20 శాతం పడిపోయింది. మ్యూనిచ్ కార్ల అవసరమే ఉండన ట్టుగా గృహసముదాయాల ప్రణాళికలను రచిస్తోంది. ప్రభు త్వ రవాణా వ్యవస్థ ఔచిత్యాన్ని లండన్ సైతం గుర్తించింది. హెల్సింకి కార్ల కంటే సైకిళ్లకు ఎక్కువ స్థలాన్ని కేటాయి స్తోంది. ఈ జాబితా చాలానే ఉంది. ప్రపంచం ఎక్కువ జనసమ్మర్థత, ఎత్తై భవనాలు, తక్కువ కార్లపై ఆధారపడే నమూనా దిశగా పయనిస్తోంది. అదే నేటి పట్టణ ప్రణాళికా వివేకంగా పెంపొందుతోంది. కానీ మనం మాత్రం కార్ల వాడకం ఇంకా ఇంకా పెరగాల్సిం దే, రోడ్లు మరింతగా కిక్కిరిసిపోవాల్సిందేనన్న భావనలోనే చిక్కుకుపోయాం. ప్రజా రవాణా వ్యవస్థ పట్ల మన్నన కొరవ డింది. నగర జీవితాలను భయంకరమైన రోజువారీ ఒత్తిడిమ యంగా మార్చుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు విజ్ఞ తతో రాసిలోగాక వాసిలో, స్థాయిలోగాక సారంలో గొప్ప నగరాన్ని రూపొందించడం అత్యుత్తమం. గృహవసతి, రవా ణా సదుపాయాల అవసరాల కంటే సరఫరా ముందుం డేట్టుగా చేయగలిగితే అది సాధ్యమే. కానీ అవసరాలననుస రించి సరఫరా సాగుతుండటమే మన పట్టణీకరణలోని సం క్షోభం. అందుకు తావేలేని గొప్ప నగరాన్ని నిర్మించే అవకా శం బాబు ముందుంది. దాన్ని ఆయన వదులుకోకూడదు. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేశ్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com)