
జనవరి నుంచి ‘ రాజధాని’ పనులు
డిసెంబర్ ఆఖరుకు డిజైన్లు పూర్తి: నారాయణ
సాక్షి, అమరావతి బ్యూరో: వచ్చే జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు మున్సిపల్ మంత్రి పి.నారాయణ చెప్పారు. డిసెంబర్ చివరినాటికి డిజైన్లు పూర్తవుతాయన్నారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే వారం నుంచి తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన ప్రారంభం అవుతుందని తెలిపారు.
సచివాలయం పరిధిలోని 49 ఎకరాల విస్తీర్ణంలో గ్రీనరీ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఆ పనులను మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. వచ్చే శుక్రవారం నుంచి ఎనిమిది గ్రామాల రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.