'రాజధాని శంకుస్థాపనకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం' | we to take care of the capital of amaravathi foundation, says Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

'రాజధాని శంకుస్థాపనకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం'

Published Tue, Oct 20 2015 10:25 PM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM

'రాజధాని శంకుస్థాపనకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం'

'రాజధాని శంకుస్థాపనకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం'

విజయవాడ: ఈ నెల 22న విజయ దశమి పర్వదినాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శంకుస్థాపన పనులు తుదిదశకు చేరుకున్నాయని అన్నారు. ట్రాఫిక్ సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. దుష్ర్పచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనేక ప్రాంతాల నుంచి మట్టి, పవిత్ర జలాలు తీసుకొచ్చినట్టు తెలిపారు.

దేశంలోని అన్ని నదుల పవిత్ర జలాలు తీసుకొచ్చామని చెప్పారు. సీఆర్డీఏ ప్రాంతాన్ని పవిత్ర జలాలు, మట్టితో కలిపి చల్లుతామని బాబు వెల్లడించారు. రాజధాని శంకుస్థాపనకు ప్రజల స్పందన బాగుందన్నారు. శంకుస్థాపనకు తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement