సాక్షి, తాడేపల్లి: అసైన్డ్ భూముల విషయంలో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. ఎప్పుడూ చంద్రబాబు భజనే తప్ప పేదల బాగోగులు ఎల్లో మీడియాకు పట్టదా? అని ప్రశ్నించారు. అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలు చేసిందే చంద్రబాబు అని అన్నారు.
కాగా, అనిల్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అసైన్డ్ భూముల విషయంలో పేదల కోసం తెచ్చిన చట్టాన్ని కూడా తప్పు దారి పట్టించేలా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. ప్రభుత్వ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా ఎల్లో రాతలు రాస్తున్నారు. చంద్రబాబు భజనే తప్ప పేదల బాగోగులు ఎల్లోమీడియాకు పట్టదా?.
ఎసైన్డ్ భూముల విషయంలో అక్రమాలు చేసిందే చంద్రబాబు. రాజధానిలో 1,336 మంది పేదల నుండి అసైన్డ్ భుములను లాక్కున్నదే చంద్రబాబు. అలాంటి వారు నేడు అసైన్డ్ భూముల గురించి మాట్లాడటమేంటి?. గతంలో పేదోడికి కష్డం వస్తే ఆ అసైన్డ్ భూములను అమ్ముకునే పరిస్థితి కూడా లేదు. అలాంటి కష్టాల నుండి పేదలను కాపాడటానికే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక చట్టం తెచ్చారు. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేశాకే చట్టం తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో 2.88 లక్షల ఎకరాలపై గిరిజనులకు హక్కులు కల్పించారు. లక్షలాది ఎకరాల అసైన్డు భూములను పేదలకు పట్టాలుగా ఇచ్చారు.
డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో చంద్రబాబు దిట్ట. ఏదో చేసేస్తున్నట్టు మీడియాలో హడావుడి చేస్తున్నారు. తల్లికి వందనం పేరుతో పిల్లలు అందరికీ ఇవ్వాల్సిన రూ.15 వేల నగదు ఇవ్వలేదు. ఇతర హామీలనూ గాలికి వదిలేశారు. వాటి గురించి ప్రశ్నిస్తారనే ఎల్లోమీడియాతో కలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. 45ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందనే చంద్రబాబుకు ఏనాడూ ఎస్సీ, ఎస్టీలు గుర్తుకు రాలేదు.
అమరావతిలో పేదల భూములను పెద్దోళ్లకు కట్టబెట్టినట్టే మరో కుట్ర జరుగుతోంది. అందుకే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్ భూములపై తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. చంద్రబాబు ఎన్నిసార్లు సీఎం అయినా ఏనాడైనా ఒక్క పేదోడికైనా సెంటు భూమి ఇచ్చారా?. ఏ ప్రభుత్వ ఆఫీసు చుట్టూ తిరగకుండానే పేదులకు పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. బాధ్యత కలిగిన పత్రికలు వాస్తవాలు రాయాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment