breaking news
Kaile Anil Kumar
-
ఎన్సీఆర్బీ డేటా.. ఎల్లో మీడియా వక్రీకరణ: కైలే అనిల్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఎన్సీఆర్బీ నివేదికలోని వాస్తవాలను కూడా చంద్రబాబు కోసం వక్రీకరించే దుస్థితికి ఎల్లో మీడియా దిగజారిందని, ఆ నివేదికను ఉటంకిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై పచ్చి అబద్దాలను అచ్చేసిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనీల్‌కుమార్ మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని పండుగలా జరిపించి, విత్తనం నుంచి విక్రయం వరకు వారికి అండగా నిలబడటం వల్ల గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని అన్నారు.వ్యవసాయం దండగ అని నమ్మే చంద్రబాబు సుదీర్ఘ పాలనలో రైతులకు కష్టాలు, కడగండ్లు, ఆత్మహత్యలు తప్ప మరేమీ దక్కలేదని మండిపడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులను తక్షణం ఆదుకున్న మానవత్వం వైఎస్ జగన్‌ది అయితే, వారి కుటుంబాలను గాలికి వదిలేసిన రాక్షసత్వం చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే..చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం జరుగుతోంది. వ్యవసాయాన్నిలాభసాటిగా మార్చడానికి, రైతులను డిస్ట్రస్ నుంచి తప్పించడానికి వైఎస్ జగన్ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. వాటన్నింటినీ రద్దు చేసి, మళ్లీ వ్యవసాయంలో సంక్షోభాన్ని తీసుకువచ్చిన చంద్రబాబుని కాపాడేందుకు ఎల్లోమీడియా ఇవాళ ఆయన తరఫున వకాల్తా పుచ్చుకుంది. 2023లో ఎన్సీఆర్బీ డేటాను తీసుకుని, చిలువలు పలవలు చేసి, వక్రీకరించి తప్పడు ప్రచారం చేయడం మొదలు పెట్టింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ హయాంలో రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారనే అభిప్రాయాన్ని కలిగించడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది.ఆత్మహత్య చేసుకున్న రైతులు.. మద్యం తాగి చనిపోయారన్న చంద్రబాబువైఎస్సార్‌సీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి. 2021లో రాష్ట్రంలో 481 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో భూయజమానులైన రైతులు 359 మంది ఉండగా, కౌలు రైతులు 122 మంది ఉన్నారు. కాగా 2022లో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 369 కు తగ్గాయి. వారిలో భూ యజమానులైన రైతులు 309 మంది ఉండగా, కౌలు రైతులు 60 మంది ఉన్నారు. 2021లో 584 మంది వ్యవసాయ కూలీలు ఇతరత్రా కారణాలతో ఆత్మహత్య చేసుకోగా.. 2022లో వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 548కు తగ్గాయి. మొత్తం మీద వ్యవసాయంపై ప్రత్యక్షంగా ఆధారపడేవారు 2021లో 1,065 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2022లో అవి 917కు తగ్గాయి.2023లో ఏడాదిలో రైతుల ఆత్మహత్యల సంఖ్య 925. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. దీనిపై పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు. పోనీ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల గురించి చంద్రబాబు ఏరోజైనా పట్టించుకున్నాడా అంటే అదీ లేదు? రైతుల ఆత్మహత్యలను గుర్తించడానికి, వారి కుటుంబాలను కాపాడ్డానికి ఏ రోజు కూడా చంద్రబాబు తన 14 ఏళ్ల పరిపాలనా కాలంలో కాని, ఇవాళ కాని ముందుకు రావడం లేదన్నసంగతి తెలిసిందే. 2014-19 మధ్య రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే, వారంతా వ్యక్తిగత సమస్యలతోనూ, మద్యం తాగి చనిపోయినట్టుగానే చిత్రీకరించే ప్రయత్నం చేశారు.సాక్షాత్తూ రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రైతుల పట్ల, వారి కష్టాల పట్ల చంద్రబాబుకు మానవత్వం లేదనే విషయం ప్రతిసారి రుజువు అవుతూనే ఉంది. ఈ సారి కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఒక్క పైసా కూడా సహాయం చేయలేదు. ఆయా కుటుంబాల పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు.చంద్రబాబు పాలనలో సంక్షోభంలో వ్యవసాయంధాన్యం దగ్గర నుంచి మిర్చి, పొగాకు, మామిడి సహా ప్రస్తుతం ఉల్లి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక అప్పులు ఊబిలో కూరుకు పోయారు. రాష్ట్రంలో ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధరలు లభించడం లేదు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దీనికి తోడు ఎరువుల కొరత కూడా రైతులను తీవ్రంగా వేధిస్తోంది. గతేడాది పెట్టుబడి సహాయాన్ని ఎగ్గొట్టారు, ఉచిత పంటల బీమా ఎగ్గొట్టారు, ఇ-క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు. ఆర్బీకేలను నీరుగార్చారు. సీఎం యాప్‌ను తీసేశారు. ఈ పరిస్థితులన్నీ రైతులను తీవ్ర నిరాశాజనక వాతావరణం లోకి నెట్టేశాయి. పరిస్థితులను తట్టుకోలేక వారు బలవ్మనరణాలకు పాల్పడుతుంటే.. కనీసం ఆ కుటుంబాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం జాలి కూడా చూపడంలేదు.కానీ వైఎస్ జగన్ రైతులకు ప్రతి చోటా చేదోడు వాదోడుగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని గొప్ప విదానాలు తీసుకువచ్చి రైతుల్ని ఆదుకునే ప్రయత్నాలు చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఉంచడానికి ముఖ్యమంత్రిగా ఆయన అహర్నిశలు పని చేశారు. వైయస్సార్సీపీ పరిపాలనాకాలంలో 1794 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే వారందరికీ కూడా పరిహారం చెల్లించారు.ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సహాయం చేశారు. రైతు ఆత్మహత్య చేసుకున్నారన్న సమాచారం తెలియగానే.. వెంటనే జిల్లా కలెక్టర్‌ను పంపి, ఆ కుటుంబాలకు బాసటగా నిలిచి, 48 గంటల్లోపే ఆ కుటుంబాలకు సహాయం అందించిన ఘటనలు కోకొల్లలు. మరి ఇప్పుడు ఎందుకు ఆ విధానాన్ని తీసేశారు? ఎందుకు రైతులకు తోడుగా నిలబడ్డం లేదు? ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఎందుకు సహాయం చేయడం లేదు? అంతేకాదు 2014-19 మధ్య పునర్విచారణ జరిపి, 474 మందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు అందేలా చేశారు. చంద్రబాబు చేసిన అన్యాయాన్ని కూడా సరిదిద్దే ప్రయత్నం వైయస్ జగన్మోహన్రెడ్డి హయాంలో జరిగింది. ఇలా దాదాపుగా రూ.117 కోట్లు ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారంగా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబాలను ఆదుకోవడం జరిగింది.ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల పట్ల 'బాబు' నిర్లక్ష్యం2014-19 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతులను కాపాడేందుకు చంద్రబాబు ముందుకు రాకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. అరకొరగా ఆయా కుటుంబాలను గుర్తించి ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారంఅనేవారు. దాంట్లో రూ.1.5 లక్షల్నిఅప్పులకు జమ చేసుకుని, మిగిలిన 3.5 లక్షలు కూడా విత్‌డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునే పరిస్థితి కల్పించేవారు. ఎప్పుడో ఐదేళ్లకో.. పదేళ్లకో ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇది ఏరకంగా బాధిత కుటుంబాలను ఆదుకున్నట్టు అవుతుంది? రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిహారాన్ని రూ.5 లక్షలనుంచి రూ.7 లక్షలకు పెంచింది. ఆ మొత్తాన్ని నేరుగా ఆత్మహత్యలకు పాల్బడే రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేస్తోంది.వ్యవసాయాధారిత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకునే కౌలు దారులకు రూ.7 లక్షలు పరిహారాన్ని కూడా ఈ ప్రభుత్వం అందించింది. జగన్మోహన్రెడ్డిగారు అత్యంత మానవతావాదిగా వారికి సహాయం చేశారు? ఇప్పుడు చంద్రబాబు రైతుల పట్ల, వారి కుటుంబాల పట్ల అత్యంత అన్యాయంగా వ్యవహరిస్తూ.. వారి ఉసురు పోసుకుంటున్నాడు. ఇప్పుడు జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు పరిపాలనా విధానం ప్రధాన కారణం. వ్యవసాయ రంగంలో ఆయన సృష్టించిన సంక్షోభమే దీనికి కారణం. ధరల స్థిరీకరణ నిధిని ఎత్తివేసి రైతుల ఉసురు పోసుకున్నారు.వైఎస్ జగన్ ఇదే నిధితో దాదాపు రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్నారు. మరి రైతు ద్రోహి ఎవరు? ఉచిత పంటల బీమాను జగన్ పెడితే, చంద్రబాబు దాన్ని రద్దు చేశారు. గత ఏడాది అందాల్సిన పంటల బీమా ఇప్పటి వరకూ అందలేదు. ఇన్పుట్ సబ్సిడీ కూడా పూర్తిగా ఇవ్వని పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా.. నష్టాల గణనే లేకుండా పోయింది. వందల మంది రైతులు చంద్రబాబు వచ్చిన తర్వాత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వ్యవసాయ రంగంలో సంక్షోభం మీద వార్తలు ఇవ్వకుండా కేవలం చంద్రబాబును జాకీలు పెట్టి లేపే పనిని ఎల్లో మీడియా మానుకుంటే మంచిది.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తగ్గిన నేరాలుఇక ఎన్సీఆర్బీ డేటా విషయాని కొస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చిన విషయం చాలా స్పష్టంగా డేటాలో కనిపించింది. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో అన్నిరకాల నేరాలు తగ్గాయని ఎన్ఆర్బీ నివేదిక స్పష్టం చేసింది. నేరాలకు పాల్పడితే నమోదు చేసే ఐపీసీ సెక్షన్ల కేసులు, పౌరులు చట్టబద్ధంగా వ్యవహరించేలా చేసేందుకు నమోదు చేసే నాన్ కాగ్నిజబుల్ కేసులు కూడా తగ్గడం శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వ సమర్థతకు నిరద్శనం. 2020లో ఐపీసీ కేసుల 1,88,997 కాగా, 2021లో 1,79,611, 2022లో 1,58,547 మాత్రమే నమోదయ్యాయి, 2023లో 1,53,867 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రతి ఏటా తగ్గుదల చాలా స్పష్టంగా కనిపిస్తోంది.ఇక స్పెషల్ లోకల్ లా కేసులను చూస్తే 2020, 21, 22 సంవత్సరాల్లో క్రమంగా తగ్గుకుంటా వచ్చాయి. 2020లో 49,108, 2021లో 42,588, 2022లో 36,737గా ఉన్నాయి. 2023లో 30,436కు పరిమితం అయ్యాయి. నేరాలకు పాల్పడే వారిని న్యాయస్థానం ద్వారా విచారించి వారికి శిక్షలు పడేలా చేయడంలో వైయస్సార్సీపీ హయాంలో గట్టిగా కృషి జరిగింది. కేంద్ర హోంశాఖ నిర్దేశిచిన ఛార్జిషీటు దాఖలకు పెట్టిన గడువు 60 రోజులు అయితే, నమోదైన కేసుల్లో 91.6 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేసి రాష్ట్రం, దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది.శాంతిభద్రతల నిర్వహణ, కేసులు దర్యాప్తు, విచారణ, తర్వాత న్యాయ ప్రక్రియలో వైఎస్ జగన్ ప్రభుత్వం సమర్థతకు నిదర్శనం ఇది. మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో హత్యలు కూడా గణనీయంగా తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 956 మంది హత్యకు గురికాగా... 2022లో హత్యల సంఖ్య 925కు తగ్గింది. 2023లో హత్యలు 922. అంటే హత్యలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దిశ యాప్, దిశ వ్యవస్థ వంటి విప్లవాత్మక విధానాలతో మహిళల భద్రత కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. మహిళల పై వేధింపులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.ప్రధానంగా అత్యాచారాలు, వరకట్న వేధింపుల కేసులు తగ్గడం వైఎస్ జగన్ ప్రభుత్వ సమర్థతకు అద్దం పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిపించకుండా పోయారంటూ మహిళలు, అమ్మాయిలు, బాలికల విషయంలో నమోదైన కేసుల్లో 85.7 శాతం రికవరీ 2023లో ఉంది. దేశంలో 54 శాతం మాత్రమే. దేశంలోనే రాష్ట్రం పనితీరు బాగున్నట్టుగా నివేదిక పేర్కొంది.ఎన్నికలకు ముందు 39 వేల మంది అమ్మాయిలు మాయం అయిపోయినట్టుగా ఇష్టానుసారం ఆరోపణలు చేశారు. ఇవన్నీ అవాస్తవాలని ఎన్సీఆర్బీ రిపోర్టు కొట్టి పారేసింది. పైగా వైఎస్సార్సీపీ హయాంలో ఫిర్యాదు చేయడానికీ, వాటిపై కేసుల నమోదుకూ, విచారణకూ పగడ్బందీ వ్యవస్థలు ఉండేవి. వీటి నమోదు ద్వారా నంబర్లు పెరుగుతాయని, తద్వారా కేసులు ఎక్కువగా ఉన్నాయనే భావన ఉన్నప్పటికీ, వివిధ సంస్కరణలతో రిపోర్టింగ్ విధానాన్ని బలోపేతం చేశారు. ఇన్ని రకాలుగా ప్రభుత్వం మెరుగ్గా పనిచేసినప్పటికీ వక్రీకరణలతో ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది. -
‘రైతులు వెళ్ళి అడిగితే బెదిరిస్తున్నారు’
తాడేపల్లి : యూరియా గురించి రైతులను బెదిరిస్తారా? అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్సీ కైలే అనిల్‌కుమార్. కృష్ణాజిల్లాలో తీవ్రమైన యూరియా కొరత ఉందిని, పీఏసీఎస్‌ల దగ్గర రైతులు బారులు తీరుతున్నారన్నారు. యూరియాని కేవలం టీడీపీ వాళ్లకు మాత్రమే ఇస్తున్నారని, చైతులు వెళ్లి అడిగితే బెదిరిస్తున్నారని అనిల్ కుమార్ మండిపడ్డారు.ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని విమర్శించారు. ఆర్బీకేలను రైతు సేవా కేంద్రాలుగా పేర్లు మార్చారే తప్ప రైతులను పట్టించుకోవడం లేదన్నారు. పామర్రు నియోజకవర్గంలో బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న యూరియాని రైతులు అడ్డుకున్నారన్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించిన తర్వాత లోపల ఉన్న యూరియా రంగు కూడా మారిపోయిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులు పట్టుకున్న యూరియా లారీ వ్యవహారం తేల్చాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. -
పేర్ని నాని, అనిల్ కుమార్ పై కేసులు వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్
-
వంశీ ఇప్పటికే జైల్లో బుక్ పై పేర్లు రాసేసుంటాడు.. బయటకు వచ్చిన వెంటనే...
-
‘కూటమి అలసత్వం.. నాడు బుడమేరు.. నేడు రైతులు’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిసినా కూటమి ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. అప్పులు తెచ్చుకుని రైతులు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఘాటు విమర్శలు చేశారు. చివరికి టీడీపీ కార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వం వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చెప్పారు.మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రైతుల గురించి ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులు ధాన్యం రాశుల వద్ద గగ్గోలు పెడుతున్నారు. బుడమేరుకు వరదలు వస్తాయని తెలిసినా విజయవాడని ముంచేసినట్టుగానే ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారు. తుపాను వస్తుందని తెలిసినా రైతులను అప్రమత్తం చేయలేదు. రైతుసేవా కేంద్రాల వద్దకు వెళ్తే మిల్లర్ల దగ్గరకు వెళ్లమని ఉచిత సలహాలు ఇస్తున్నారు.విజయవాడ నుండి మచిలీపట్నం వరకు ఎక్కడ చూసినా రోడ్డు పక్కన ధాన్యం రాసులే కనిపిస్తున్నాయి. అప్పులు తెచ్చుకుని రైతులు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదు. రైతులను ఈ ప్రభుత్వం వెంటిలేటర్ల మీదకు నెట్టేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి మాటలు కోటలు దాటుతున్నాయేగానీ చేతల్లో ఏమీ కనపడటం లేదు. కనీసం టార్బలిన్ పట్టాలు, గోనె సంచులు కూడా ఇవ్వటం లేదు. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వం గుర్తించాలిరాష్ట్రంలో ఒక్క బస్తా ఐనా మద్దతు ధరతో రైతుల నుండి కొనుగోలు చేశారా?. మాతో వస్తే రైతుల గోడు మంత్రులకు చూపిస్తాం. చివరికి టీడీపీ కార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వం వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేల కోట్ల రూపాయలు స్కామ్ చేయటానికి ప్రభుత్వ పెద్దలు రెడీగా ఉన్నారు. గ్రామాల్లో తేమ శాతం 15% ఉంటే మిల్లర్ల దగ్గరకు వెళ్తే 20% ఉన్నట్టు చూపిస్తున్నారు. మధ్యవర్తులు, దళారుల ద్వారా వేల కోట్ల రూపాయలు రైతుల నుండి దోచుకుంటున్నారుఒక్కో బస్తా మీద రూ.425ల చొప్పున ఈ మాఫియా కొట్టేస్తోంది. వైఎస్ జగన్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడు. మద్యం, ఇసుక మీద ఉన్న ప్రేమ.. రైతుల మీద ప్రభుత్వానికి లేదు. రైతు సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. హాయ్ అని మెసేజ్ పెడితే ధాన్యం మొత్తం కొనిపిస్తానని మంత్రి నాదెండ్ల మనోహర్ మాటలు చెప్తున్నారు. ఎంతమంది మెసేజ్‌లు పెట్టినా ఆ మంత్రికి చలనం లేదు. మెసేజ్ కాదు ఇకమీదట గిల్లితేనైనా రైతుల అవస్థలు గుర్తొస్తాయేమో? అంటూ చురకలంటించారు. -
మాయచేయడానికి ఆయన ఏమైనా మాంత్రికుడా...! నాదెండ్లకు అనిల్ కుమార్ కౌంటర్
-
ఇప్పటికైనా నోరు విప్పండి.. ఇదేనా చంద్రబాబు పాలన..
-
అంబేద్కర్ విగ్రహంపై దాడి రాజకీయ కుట్రే: కైలే అనిల్ కుమార్
సాక్షి, తాడేపల్లి: విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగితే కూటమి ప్రభుత్వం కనీసం స్పందించ లేదన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. అలాగే, విగ్రహం వద్ద దాడిపై టీడీపీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.కాగా, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగే అవకాశం ఉందని ప్రభుత్వానికి తెలియదా?. విగ్రహం దాడిపై టీడీపీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారు. ఒకసారి దుండగులు దాడి చేశారన్నారు. ఇంకో సారి ఏపీ ఐఐసి వాళ్ళు వచ్చారు అన్నారు. మరోసారి వైఎస్ జగన్ అంటే గిట్టని దళితులు ఎవరో చేశారని అంటున్నారు. అసలు దాడి చేసింది ఎవరైనా తేల్చాల్సిందే ప్రభుత్వ మే కదా?. అంత మంది వచ్చి దాడి చేస్తుంటే పోలీసులకు తెలియలేదా?. విగ్రహం వద్ద రాత్రి సమయంలో లైట్లు ఆర్పేస్తే ఎందుకు సిబ్బందిని విచారించలేదు. పోలీసులు కూడా అక్కడే ఉన్నారని అంటున్నారు. ఒకవేళ పోలీసులు లేకపోతే ఎందుకు ఇప్పటివరకు ఎవ్వరినీ విచారించలేదు. పోలీస్ కమిషనర్ ఆఫీస్ పక్కనే ఉన్న అంబేద్కర్ స్మృతివనంపై జరుగుతున్న దాడి కనిపించలేదా?. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేద్కర్పైనా, ఆయన భావజాలంపైనా చంద్రబాబుకు గౌరవం లేదు. అందుకే ఈ దాడి జరిగినా కనీసం స్పందించలేదు.స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడం సీఎం చంద్రబాబుకి ఇష్టం లేదు. ఆయన అమరావతిలో పెడతాను అన్నారు తప్ప అక్కడ పెట్టలేదు. స్వరాజ్య మైదానాన్ని గతంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి చంద్రబాబు లబ్ది పొందాలని చూశారు. గతంలోనే అక్కడ ప్రజలు ఆందోళన చేస్తే చంద్రబాబు వెనక్కి తగ్గారు. అంబేద్కర్ స్మృతి వనానికి రక్షణ లేకపోవడం దారుణం. అంబేద్కర్‌ను గుర్తు చేసుకునేలా చంద్రబాబు ఏనాడైనా ఒక్క పని చేశారా?. చంద్రబాబు ఏనాడైనా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లారా?. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర. టీడీపీ నేతలే అరాచక మూకలని పంపారు. అంబేద్కర్ స్మృతి వనం తీసేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టే కుట్ర ఉంది. అందులో భాగంగానే ఈ దాడికి పాల్పడ్డారని భావిస్తున్నాం. వాళ్లే ప్రభుత్వంలో ఉండి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. -
వాళ్ళు వేసిన సెటైర్లకు నవ్వుల పాలయ్యారు.. మంత్రి వంగలపూడి అనితకు దిమ్మతిరిగే కౌంటర్
-
డైవర్షన్ పాలిటిక్స్‌లో చంద్రబాబు దిట్ట: కైలే అనిల్ కుమార్
సాక్షి, తాడేపల్లి: అసైన్డ్ భూముల విషయంలో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. ఎప్పుడూ చంద్రబాబు భజనే తప్ప పేదల బాగోగులు ఎల్లో మీడియాకు పట్టదా? అని ప్రశ్నించారు. అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలు చేసిందే చంద్రబాబు అని అన్నారు.కాగా, అనిల్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అసైన్డ్ భూముల విషయంలో పేదల కోసం తెచ్చిన చట్టాన్ని కూడా తప్పు దారి పట్టించేలా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. ప్రభుత్వ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా ఎల్లో రాతలు రాస్తున్నారు. చంద్రబాబు భజనే తప్ప పేదల బాగోగులు ఎల్లోమీడియాకు పట్టదా?. ఎసైన్డ్ భూముల విషయంలో అక్రమాలు చేసిందే చంద్రబాబు. రాజధానిలో 1,336 మంది పేదల నుండి అసైన్డ్ భుములను లాక్కున్నదే చంద్రబాబు. అలాంటి వారు నేడు అసైన్డ్ భూముల గురించి మాట్లాడటమేంటి?. గతంలో పేదోడికి కష్డం వస్తే ఆ అసైన్డ్ భూములను అమ్ముకునే పరిస్థితి కూడా లేదు. అలాంటి కష్టాల నుండి పేదలను కాపాడటానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చట్టం తెచ్చారు. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేశాకే చట్టం తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో 2.88 లక్షల ఎకరాలపై గిరిజనులకు హక్కులు కల్పించారు. లక్షలాది ఎకరాల అసైన్డు భూములను పేదలకు పట్టాలుగా ఇచ్చారు.డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో చంద్రబాబు దిట్ట. ఏదో చేసేస్తున్నట్టు మీడియాలో హడావుడి చేస్తున్నారు. తల్లికి వందనం పేరుతో పిల్లలు అందరికీ ఇవ్వాల్సిన రూ.15 వేల నగదు ఇవ్వలేదు. ఇతర హామీలనూ గాలికి వదిలేశారు. వాటి గురించి ప్రశ్నిస్తారనే ఎల్లోమీడియాతో కలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. 45ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందనే చంద్రబాబుకు ఏనాడూ ఎస్సీ, ఎస్టీలు గుర్తుకు రాలేదు.అమరావతిలో పేదల భూములను పెద్దోళ్లకు కట్టబెట్టినట్టే మరో కుట్ర జరుగుతోంది. అందుకే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్ భూములపై తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. చంద్రబాబు ఎన్నిసార్లు సీఎం అయినా ఏనాడైనా ఒక్క పేదోడికైనా సెంటు భూమి ఇచ్చారా?. ఏ ప్రభుత్వ ఆఫీసు చుట్టూ తిరగకుండానే పేదులకు పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. బాధ్యత కలిగిన పత్రికలు వాస్తవాలు రాయాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు. -
జగన్ పై తప్పుడు రాతలు అనిల్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్
-
దాడులు చేస్తే సహించేది లేదు.. ఎమ్మెల్యే కొలికపూడికి వార్నింగ్
-
కొలికపూడి ఒక అరాచక శక్తి.. తిరువూరు ఘటనపై కైలే అనిల్ కుమార్ ఫైర్
-
ఏపీలో బుల్డోజర్ల సర్కార్ నడుస్తోంది: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో బుల్డోజర్ల ప్రభుత్వం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. ఇచ్చిన హామీల అమలుపై లేని శ్రద్ధ.. ఏ ఇల్లు కూల్చాలి? ఏ కార్యాలయం కూల్చాలనే దానిపై మాత్రమే పెట్టారంటూ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే కొలికపూడి స్థాయికి దిగజారి వ్యవహరించారు. బుల్డోజర్తో ఎమ్మెల్యే వెళ్లి ప్రత్యర్థుల ఇంటిని కూల్చడం ఏంటి? అని ప్రశ్నించారు.‘‘తిరువూరులో కొలికపూడి చెలరేగిపోయారు. చంద్రబాబు తిరువూరు ఎమ్మెల్యే వ్యవహార శైలిపై సమాధానం చెప్పాలి. అధికార మదంతోనే కొలకపూడి వెళ్లి ఎంపీపీ ఇంటిని కూల్చారు. ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రంలో లేకుండా చేస్తున్నారు. కొలికపూడి శ్రీనివాస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారు. మంచి పాలన అందిస్తారని కూటమికి ప్రజలు ఓటేశారు. పెన్షన్ల పంపిణీలో కూడా ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఇచ్చారు. సర్పంచ్‌లు, ఎంపీపీలను కూడా పిలవకుండా పెన్షన్లు ఇచ్చారు’’ అంటూ కైలే అనిల్ కుమార్ నిప్పులు చెరిగారు.టీడీపీ డైరెక్షన్లో అరాచకాలు: నందిగం సురేష్మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చాక దారుణాలు జరుగుతున్నాయని.. టీడీపీ డైరెక్షన్లో అరాచకాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనన్ని దారుణాలు ఏపీలో జరుగుతున్నాయి. ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవటానికే తాము అధికారంలోకి వచ్చినట్టుగా పరిస్థితి ఉంది.. వైఎస్సార్సీపీ కంటే మంచి పాలన ఇస్తామని అందరినీ నమ్మించారు. నిజమేనేమో అని ఓట్లేస్తే జరుగుతున్నది దారుణంగా ఉంది. కళ్లకు గంతలు కట్టుకున్నట్టుగా ప్రభుత్వం ఉంది’’ అంటూ మండిపడ్డారు.‘‘తిరువూరులో ఎమ్మెల్యే చేసిన అరాచకాన్ని ఏం అనాలి?. వైఎస్సార్సీపీ నేత అక్రమంగా బిల్డింగ్ కడితే అధికారులు చర్యలు తీసుకుంటారు.. కానీ ఎమ్మెల్యే కొలకపూడి బుల్డోజర్ తీసుకుని బిల్డింగ్‌లను పడేయటం ఏంటి?. పెన్షన్ల పంపిణీలో కూడా లంచాలు తీసుకున్నారు. ఇవన్నీ జనం చూస్తూనే ఉన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు ఎప్పుడూ జరగలేదు. వైఎస్సార్సీపీ వారి అంతు చూస్తామంటూ టీడీపీ నేతలు మాట్లాడుతున్న తీరు దారుణంగా ఉంది’’ అని సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఒక మంత్రి భార్య సైతం పోలీసులను బెదిరించారు. వైఎస్ జగన్ పాలనలో ఇలాంటివి ఎప్పుడైనా జరిగిందా?. తిరువూరులో పోలీసులు అడ్డుకుంటున్నా వారిని పక్కకు నెట్టేశారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమైనా చేయొచ్చనుకుంటున్నారు. అధికారంలోకి వచ్చి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. ఈలోపే జనానికి కూటమి ప్రభుత్వం మీద చిరాకు వచ్చింది. రౌడీరాజ్యంలాగ కాకుండా ప్రజా పాలన చేయాలని కోరుకుంటున్నాం. లేకపోతే ప్రజలే తగిన బుద్ది చెప్తారు’’ అంటూ నందిగం సురేష్ హెచ్చరించారు. -
పేదల మీద చంద్రబాబు శాడిజం..
-
అనిల్ లా ప్రతి ఎమ్మెల్యే ఉంటే... సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
కూచిపూడి నాట్యాన్ని.. విశ్వవ్యాప్తం చేసిన మహనీయులు - 'పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం'
సాక్షి, పత్రికా ప్రకటన: మచిలీపట్నం అక్టోబర్ 15: పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం కూచిపూడి నాట్య సాంప్రదాయ పరిరక్షణకి, పునరుద్ధరణకి, ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారని మంత్రి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభ్యుదయ శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ఆర్కే రోజా కొనియాడారు. ఆదివారం కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా యంత్రాంగం, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్, కూచిపూడి అకాడమీ చెన్నై, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, జయహో భారతీయం సంయుక్త ఆధ్వర్యంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వెంపటి చిన సత్యం గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆలరించాయి. ముఖ్యంగా అక్షర, ఇమాంసి, అన్షికలు టెంపుల్ నృత్యం, కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ వెంపటి చినసత్యం మనవరాలు కామేశ్వరి బృందం చెన్నై వారి ఆధ్వర్యంలో మహిషాసుర మర్దిని నృత్యం ఎంతో అద్భుతంగా కమనీయంగా ప్రదర్శించారు. అలాగే నాలుగవ ప్రపంచ కూచిపూడి దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యి మంది విద్యార్థులు డాక్టర్ వెంపటి చిన సత్యం రూపొందించిన బ్రహ్మాంజలి మహా బృంద నృత్యం ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేసింది. తొలుత ఇంచార్జి మంత్రివర్యులు వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలిపే చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం జ్యోతి ప్రకాశనం చేసి డాక్టర్ వెంపటి చినసత్యం వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సీఈవో ఆర్ మల్లికార్జున రావు రూపొందించిన డాక్టర్ వెంపటి చినసత్యం చిత్రపటాన్ని మంత్రులు ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఆర్కే రోజా మాట్లాడుతూ మన సంస్కృతి, కళలను సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయులని అన్నారు. ఈ వేడుకలతో కూచిపూడి ప్రాంతమంతా అంగరంగ వైభవంతో పండుగ వాతావరణం నెలకొంది అన్నారు. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి ఆ గ్రామానికి పరిమితం కాకుండా కూచిపూడి నృత్యాన్ని ప్రపంచంలో మారుమోగేలా కృషి చేశారన్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లిన, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏ కార్యక్రమంలోనైనా మొదట తెలుగు నేలను తెలుగు ఖ్యాతిని ప్రతిబింబించే విధంగా కూచిపూడి నృత్యంతో ప్రారంభిస్తారన్నారు. డాక్టర్ వెంపటి చిన సత్యం మరణించి 13 సంవత్సరాల అయినప్పటికీ వారి శిష్యులు ప్రదర్శించే హావభావాలు,, నృత్యంలో సజీవమై కనిపిస్తున్నారన్నారు. సినిమా పరిశ్రమలో కూడా వైజయంతి మాల, హేమమాలిని, జయలలిత, ప్రభ ,చంద్రకళ, మంజు భార్గవి వంటి ఎందరో నటీమణులు వారి వద్ద శిష్యరికం చేశారన్నారు. 2011లో 1800 మంది చిన్నారులతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయిందన్నారు.. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు ప్రోత్సహించాలని తద్వారా వారికి వ్యాయామంతో పాటు ఆరోగ్యం కూడా పొందవచ్చు అన్నారు మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి కూచిపూడి నాట్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయులని ప్రశంసించారు. గతంలో విజయవాడ చెన్నై లో జరిగే వారి జయంతి వేడుకలను మంత్రి ఆర్కే రోజా చొరవతో ఈరోజు వారు జన్మించిన కూచిపూడి గ్రామంలోనే జరుపుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. కూచిపూడి నృత్యం వంటి కళారూపాలను మరిచిపోతున్న తరుణంలో డాక్టర్ వెంపటి చినసత్యం వారి శిష్య బృందం ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి ప్రాచుర్యం కల్పిస్తూ ఆరాధిస్తుండడం వారిని వారి తల్లిదండ్రులు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక కళారూపం ముఖ్యంగా చెప్పుకుంటున్నామని, ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూచిపూడి నృత్యం, ఒరిస్సాకు ఒడిస్సి, ఉత్తరప్రదేశ్ కు కథాకళి, కేరళ కు మోహిని అట్టం వంటి కళారూపాలు ఎంతగానో ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. మరుగున పడిపోతున్న కూచిపూడి నృత్యానికి డాక్టర్ వెంపటి చిన సత్యం జీవం పోసి విశ్వవ్యాప్త ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారన్నారు. వివిధ ప్రాంతాల్లోని నాట్యాచారులను, విద్యార్థులను ఒక చోట చేర్చి ఇలాంటి పెద్దయెత్తున వేడుకలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం పరిధిలో మహానుభావులు డాక్టర్ వెంపటి చినసత్యం జన్మించిన కూచిపూడి గ్రామం ఉండటం వారి ద్వారా కూచిపూడి నృత్యం ప్రపంచానికి పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అలాగే మన జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య గారు జన్మించిన ప్రాంతం బాట్ల పెనుమర్రు కూడా తన పరిధిలోనే ఉండటం సంతోషకర విషయం అన్నారు. శ్రీ సిద్ధేంద్ర యోగి కళాశాలను అన్ని విధాల అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని, మంత్రిని కోరుతున్నానన్నారు. రాష్ట్రంలో రెండు కళాశాలలు ఉన్నాయని తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని కూచిపూడి లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రముఖ నర్తకి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత మంజు భార్గవికి డాక్టర్ వెంపటి చినసత్యం జయంతి పురస్కారాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని మంత్రులు అతిథులు అందజేసి ఘనంగా సత్కరించారు. డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలియజేసే పుస్తకాన్ని ఈ సందర్భంగా మంత్రులు అతిథులు ఆవిష్కరించారు. అలాగే శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం కూచిపూడి ప్రధానాచార్యులు కేంద్ర సంగీత నృత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారికి సిద్ధేంద్ర యోగి పురస్కారం, నాట్యాచార్యులు మాధవ పెద్ది మూర్తికి వెంపటి చినసత్యం జీవిత సాఫల్య పురస్కారం, వేదాంతం రాదే శ్యామ్‌కు డాక్టర్ పద్మశ్రీ శోభా నాయుడు జీవిత సాఫల్య పురస్కారం, పార్వతీ రామచంద్రన్ కుమారి లంక అన్నపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం, పటాన్ మొహిద్దిన్ ఖాన్ కు వెంపటి వెంకట్ సేవా పురస్కారాలను మంత్రులు అతిధులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు డాక్టర్ ఎస్పీ భారతి, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ వంగపండు ఉష, అధికార బాషా సంఘం సభ్యులు డాక్టర్ డి.మస్తానమ్మ, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఆర్ మల్లికార్జున రావు, డిఆర్ఓ పి. వెంకటరమణ, ఉయ్యూరు ఆర్డిఓ విజయ్ కుమార్, డిఆర్డిఎడ్ డ్వామా పీడీలు పిఎస్ఆర్ ప్రసాదు, సూర్యనారాయణ, విద్యుత్ అధికారి భాస్కరరావు, తహసిల్దార్ ఆంజనేయ ప్రసాద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు కళాకారులు, వారి తల్లిదండ్రులు, కళాభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. - జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణాజిల్లా, మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది. -
రెండు రకాలుగానూ శిక్ష తప్పదు!
స్కిల్ డెవలెప్మెంట్ కోర్సుల్లో విద్యార్థులు, ఉద్యోగార్థులకు నాణ్య మైన శిక్షణ ఇచ్చి ఉంటే కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేవి. ఆ అవకాశాన్ని లేకుండా ‘స్కిల్ కుంభకోణాని’కి చంద్రబాబు పాల్పడటంతో లక్షల కుటుంబాలు శాశ్వతంగా నష్టపోయాయి. యువతకు చంద్రబాబు చేసిన అన్యాయం క్షమించరానిది. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను చీకటిమయం చేసిన పాపం ఊరికే పోదు. పక్కా ఆధారాలతో ‘స్కిల్ కుంభకోణం’లో దొరికిపోవడంతో చంద్రబాబును ప్రభుత్వం చట్టం ముందు నిలబెట్టింది. 2014–19 మధ్య ఐదు సంవత్సరాల్లో కేవలం విద్యార్థుల జీవితాలనే కాకుండా రాష్ట్ర భవిష్యత్‌నూ సర్వనాశనం చేశారాయన. రాజధాని నుంచి ఫైబర్ గ్రిడ్ వరకు... ఆయన ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలూ, పథకాల్లో అవినీతి, ఆశ్రిత పక్ష పాతం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రజల సొమ్మును అడ్డంగా దోచేసి దాచేసుకోవాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం పథకాలూ, కార్యక్రమాలూ చేపట్టి నట్లు తేటతెల్లం అవుతోంది. స్కిల్ కుంభకోణం కేవలం తీగ మాత్రమే. ఈ తీగను పట్టుకొని లాగితే చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం కదులుతుంది. బాబు నిర్మించిన అవినీతి సామ్రాజ్యం కూలిపోయే రోజు ఎంతో దూరంలో లేదని ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. న్యాయస్థానాల్లో శిక్ష పడకుండా బాబు తప్పించుకోలేరు. విద్యార్థుల భవిష్యత్‌ను ఫణంగా పెట్టి స్కిల్ కుంభకోణానికి పాల్పడిన కేసులో న్యాయస్థానం తప్పకుండా శిక్ష విధిస్తుందని విశ్వాసం ఇప్పుడు అందరిలోనూ ఉంది. ప్రజా కోర్టులోనూ శిక్ష తప్పదనే విషయాన్ని బాబు గుర్తించాలి. ఇప్పటి వరకు వ్యవస్థలను మేనేజ్ చేసే టక్కు టమార విద్య బాబును ఆదుకొంది. ప్రతి దానికీ ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉన్నట్లే చంద్రబాబు గజకర్ణ గోకర్ణ విద్యకూ ఎక్స్పైరీ డేట్ ముగి సింది. అందుకే రూ. కోట్లు పుచ్చుకొనే బడా అడ్వొకేట్లను ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాల్లో దించినా, కొమ్ములు తిరిగిన లాయర్లు తమ వాదనా పటిమను న్యాయస్థానాల్లో జడ్డి ముందు ప్రదర్శించినా చంద్రబాబును చట్టం ముందు నిలబెట్టకుండా అడ్డుకోవడం సాధ్యం కాలేదు. అద్భుత వాదనా పటిమ కనపరిచే సామర్థ్యం ఉన్న బడా లాయర్లు కూడా కేసు లోతుపాతుల్లోకి వెళ్లకుండా కేవలం సాంకేతిక పరమైన అంశాలకే పరిమితం కావడం చూస్తుంటే.. అవినీతి చేసి దొరికిపోయామనీ, లోతు పాతుల్లోకి వెళ్లకుండా సాంకేతిక అంశాల మీద బయట పడాలనేది చంద్రబాబు బృందం ఆలోచన అనీ చిన్న పిల్లలకూ తెలిసిపోతోంది. ఐదేళ్లు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేసినందుకు ప్రజా న్యాయస్థానంలో టీడీపీకి శిక్ష విధించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా తన 14 సంవత్సరాల పాలనలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా భారీ రిక్రూట్మెంట్ చేపట్టలేదు. ప్రాథమిక, సెకండరీ, ఇంటర్ విద్యను పూర్తిగా ప్రయివేటుకు కట్టబెట్టారు. విద్యా రంగంలో ‘చై–నా’ వేళ్లూనుకోవడానికి చంద్రబాబు అనుసరించిన విధానాలు కారణమయ్యాయి. ఫలితంగా విద్య వ్యాపార వస్తువుగా మారిపోవడం, పేద–మధ్య తరగతి ప్రజల రక్తాన్ని పీల్చేయడం మన కళ్లముందు కనిపించిన వాస్తవం. విశ్వ విద్యాలయాలనూ నాశనం చేసి నాణ్యత లేని చదువులతో పేదలకు తీరని అన్యాయం చేసిన బాబుకు ప్రజా కోర్టులో 2019లో ప్రజలు విధించిన శిక్షనే 2024 ఎన్నికల్లోనూ మరోసారి విధించనున్నారు. స్కిల్ కుంభకోణంలోనే కాదు మిగతా కుంభ కోణాల్లోనూ కోర్టులు విధించే శిక్షలు అనుభవించడమే చంద్రబాబు ముందున్న ఏకైక మార్గం. కైలే అనిల్‌కుమార్ వ్యాసకర్త పామర్రు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు -
‘చంద్రబాబుకు దమ్ముంటే ఈ ఛాలెంజ్‌కు ఒప్పుకోవాలి’
సాక్షి, తాడేపల్లి: దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన చంద్రబాబు.. దళిత బాంధవుడు ఎలా అయ్యారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబును దళితులు నమ్మే పరిస్థితి లేదన్నారు. ‘‘దళితుల సంక్షేమం కోసం రూ.53 వేల కోట్లు ఖర్చు చేశాం.. గతంలో చంద్రబాబు దళితుల కోసం ఏం చేశారు. అంబ్కేదర్ స్ఫూర్తితో సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారు. దళితులు ఏం పీక్కారన్న లోకేష్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు. ఎస్సీ నియోజకవర్గాలలో అధిక భాగం ఎందుకు ఓడిపోయారో అర్థం చేసుకో చంద్రబాబు. 28 పథకాలు దళితుల కోసం తన హయాంలో పెట్టినట్లు చంద్రబాబు అబద్దాలు చెప్తున్నారు. జగన్ హయాంలో దళితులకు ఎంతో మేలు జరిగింది’’ అని అనిల్‌కుమార్ అన్నారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు కొత్త అవతారం ఎత్తారు. దళితులకు ఎవరేం చేశారో అసెంబ్లీలో చర్చిద్దాం. దమ్ముంటే చంద్రబాబు అసెంబ్లీకి వస్తే చర్చిద్దాం. మా సవాల్‌ని స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా?. దీనిపై రెండు రోజులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయించటానికి మేము రెడీ. ఆలయ బోర్డులలో దళితులను నియమించాలని చంద్రబాబు కనీసంగా కూడా ఆలోచించలేదు. మా పేదపిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవకూడదా?. అలా చదివించాలని ఏనాడైనా ఆలోచించావా చంద్రబాబూ?’’ అంటూ ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ దుయ్యబట్టారు. చదవండి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు ‘‘సీబీఎస్ఈ సిలబస్ పెట్టాలనీ, ట్యాబులు ఇవ్వాలనీ, స్కూల్స్ బాగు చేయించాలని ఏనాడైనా ఆలోచించారా?. 2 లక్షల కోట్లు పేదల ఖాతాలో వేస్తే అందులో అధిక భాగం లబ్ది పొందింది దళితులే. చంద్రబాబు, జగన్‌లలో ఎవరు మేలు చేశారో చర్చకు మేము సిద్దం. 28 పథకాలు తీసేశామని చంద్రబాబు చెప్తున్నారు. ఆ పథకాలు, వాటి ద్వారా లబ్ది పొందినవారి లిస్టు బయట పెట్టాలి. ఎక్కడకు వెళ్లినా ఓట్ల గురించే తప్ప.. పేదల అభివృద్ధి గురించి చంద్రబాబు ఏనాడూ మాట్లాడరు. రాజధానిలో అంబేద్కర్ విగ్రహం పెట్టలేక పారిపోయిన వ్యక్తి చంద్రబాబు. జగన్ 125 అడుగుల ఎత్తుతో విజయవాడ నడిబొడ్డున పెడుతున్నారు. అదీ చంద్రబాబు, సీఎం జగన్‌లకు వున్న తేడా. చంద్రబాబు హయాంలో ఒక్క ముస్లింకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు ఎందుకని?. ఇదేనా ముస్లింల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ?’’ అని అరుణ్‌కుమార్ మండిపడ్డారు. చదవండి: ‘అవినాష్‌ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ దగ్గర లేవు’ -
తలరాత మార్చే చైతన్యదీప్తి.. గడప గడపలో నూతన శోభ!
అద్దె చెల్లించాల్సిన బాధ తప్పి సొంత ఇంట్లో ఉన్నామనే సంతోషం ఉందని నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతున్నప్పుడు చాలామంది మహిళలు చెబుతున్నారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. నూతన సంవత్సర శోభ పల్లె గడప తొక్కిందని చెప్పడానికి ఇది కేవలం ఒక ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్రంలో కోకొల్లలుగా మనకు కనిపిస్తున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగు పడటమే నిజమైన అభివృద్ధి అని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం... పాలనను ప్రజల గడప వద్దకు తీసుకెళ్లింది. సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కరోనా విపత్తు సృష్టించిన ఆర్థిక అల్లకల్లోలం నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తూనే... పేదల జీవితాలకు ఆసరాగా నిలబడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వం అందుకుంటున్న ప్రతి పథకం లోనూ ప్రజలకు ప్రస్పుటంగా కనిపిస్తోంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ప్రజల గుమ్మం ముందుకు వెళుతున్న క్రమంలో.. పేదల జీవితాల్లో వస్తున్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సొంతింటి కల నెరవేరిన అక్కాచెల్లెమ్మల కళ్లల్లో, ఎవరి మీదా ఆధార పడకుండా ఒకటో తేదీ వేకువనే అందుతున్న పెన్షన్‌తో గౌరవంగా బతుకుతున్న అవ్వాతాతల ముఖాల్లో, ఆసరా–చేయూతతో తన కాళ్ల మీద నిలబడి ఆత్మగౌరవంతో జీవిస్తున్న అక్కల ఆత్మీయ పలకరింపుల్లో, పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికి అండగా నిలిచిన ‘అమ్మఒడి’ అందుకుంటున్న చెల్లెమ్మల సంతోషంలో, అన్నం పెడుతున్న అమ్మను గౌరవించడాన్ని బాధ్యతగా తీసుకొని ఇంటి ముందుకు ప్రభుత్వం పంపించిన వాహనం నుంచి బియ్యం తీసు కుంటున్న మహిళల మోముల్లో, వ్యవసాయాన్ని పండగ చేయడానికి అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాల సేవలు అందుకుంటున్న రైతన్నల ఆనందంలో... ఒకరేమిటి... ఊరిలో అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతున్న సంతృప్తిలో కొత్త సంవత్సరం శోభ కనిపిస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో పడుతోంది. మిల్లర్లు, దళారుల బెడద లేకుండా మద్దతు ధరకు రైతులు ధాన్యం విక్రయిస్తున్నారు. ఊరికే కొత్త రూపుతెచ్చిన గ్రామ సచివాలయాలు... ప్రజల ముంగిటకు పాలనను తీసుకొచ్చి ప్రజల అవసరాలు తీర్చి వారి ముఖాల్లో సంతోషానికి కారణంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందుబాటులోకి రావడంతో నూతన సంవత్సరం శోభ ఇనుమ డిస్తోంది. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో లక్ష మందికి ఒకేసారి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగులు తమ ఇళ్లతో పాటు వారు పనిచేస్తున్న సచివాలయం పరిధిలోని ఇళ్లకూ నూతన సంవత్సరం శోభను తీసుకురావడానికి, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన సందేశాన్ని మోసుకెళ్లడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్ ఈ జనవరి 1 నుంచి రూ. 2,750 పెంచారు. పెన్షన్ పెంపుతో 64 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. రైతు భరోసాను అర కోటి మందికి పైగా రైతులకు అందిస్తున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద దాదాపు 4 లక్షల మంది అక్కాచెల్లెమ్మలు లబ్ధి పొందుతున్నారు. జగనన్న చేదోడు 3 లక్షల మందికి, జగనన్న తోడు దాదాపు 5.5 లక్షల మందికి... ఇలా చెప్పుకొంటూపోతే, పల్లె గడపలో ప్రభుత్వం నుంచి పథకాలు అందుకోని వారు ఉండరనే చెప్పాలి. అందుకే ప్రగతిపథం వైపు అడుగులేస్తున్న ప్రతి ఇంటి గడపలో నూతన సంవత్సరం శోభ కనిపిస్తోంది. చదువు ఒక్కటే పేదల తలరాత మారుస్తుందని నమ్మిన ప్రభుత్వం ఇది. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే దృఢ సంకల్పం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఉండటం వల్లే ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చి... అందులో బైజూస్ పాఠాలు అందిస్తున్నారు. ఒకప్పుడు కేవలం కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమయిన ఇలాంటివి ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో సాకారం కావడం.. రాజ్యాంగం ఇచ్చిన సమాన అవకాశాలు పొందే హక్కును రక్షించడమే. నాణ్యమైన చదువులతో పైకొస్తున్న ప్రతి విద్యార్థి.. ఒక తరం తలరాత మార్చే చైతన్యదీప్తి. ఈ వెలుగులతో కొత్త సంవత్సరం శోభ పల్లె గడప తొక్కింది. (క్లిక్ చేయండి: బాబోయ్! హ్యాండిల్ విత్ కేర్...) - కైలే అనిల్ కుమార్ ఎమ్మెల్యే, పామర్రు, కృష్ణా జిల్లా -
పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దు
పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడం అంటే కేవలం వారు తలదాచుకోవడానికి గూడు కల్పించడమే కాదు... సమాజంలో సగౌరవంగా తలెత్తుకు బతికే ఆత్మవిశ్వాసాన్ని కూడా కల్పించడమే. అందుకే సొంత ఇల్లు పేదల ఆత్మగౌరవ సూచిక. పేద, బడుగు, బల హీన వర్గాలకు ఇంటిస్థలం కాగితం చేతికివ్వడం అంటే ఆత్మగౌరవ పతాకాన్ని వారి చేతికిచ్చినట్లే. ప్రభుత్వం రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళల పేరిట ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లను నిర్మింపజేస్తోంది. ఇదంతా ఉచితమే. పేదల మీద భారం లేకుండా సొంత ఇంటి కలను నిజం చేసే బాధ్యతను ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నారు. ఫలితంగా 31 లక్షల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లి చూసినా... ప్రభుత్వం కల్పించే మౌలిక వసతుల వ్యయం కలిపితే ఇంటి స్థలం, ఇల్లు ఖరీదు రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుంది. పట్టణాలుగా రూపు దిద్దుకోనున్న 17 వేల ‘జగనన్న కాలనీ’లలో ఇళ్ల ఖరీదు మనం చూస్తుండగానే రెట్టింపు కావడం తథ్యం. ఒక పేద కుటుంబం అన్ని సంక్షేమ పథకాలనూ అందుకుంటూ సొంత ఇంట్లో ఉంటే... మెరుగైన జీవితం వారికి తప్పకుండా దక్కుతుంది. ఆయా కుటుంబాల అభ్యున్నతికి బాటలు పడతాయి. దశాబ్దం తిరిగే సరికి... సమాజంలో గణనీయమైన మార్పును మనం చూస్తాం. అభివృద్ధికి నిర్వచనం... నేటి కంటే రేపు బాగుండటం అని ముఖ్యమంత్రి పదేపదే చెబుతుంటారు. దానికి సాక్ష్యంగా ‘వైఎస్సార్ జగనన్న’ కాలనీలు సగర్వంగా తలెత్తుకుని నిలబడతాయి. పేదల ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవ సూచీలుగా నిలిచే జగనన్న కాలనీలు... మహిళా సాధికారతకు శాశ్వత చిరునామా కానున్నాయి. 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరిటే ప్రభుత్వం ఇవ్వడం ముఖ్యమంత్రి ముందుచూపునకు నిదర్శనం. స్త్రీ ఆలోచనకు అనుగుణంగా నడిస్తే ఆ కుటుంబాలు తప్పకుండా బాగుపడతాయి. బాగుపడ్డ కుటుంబాల సమాహా రంగా జగనన్న కాలనీలు రూపుదిద్దుకోనున్నాయి. రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరు వైఎస్సార్ జగనన్న కాలనీవాసి కానున్నారు. ఒక్కో ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటారనుకున్నా.. కోటీ పాతిక లక్షల మంది ఈ కాలనీల్లో నివసిస్తారు. రాష్ట్ర జనాభాలో నాలుగోవంతు మందికి ఆవాసం కల్పించే కాలనీలకు సకల సౌకర్యాల కల్పన బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. పేరుమోసిన రియల్ ఎస్టేట్ సంస్థల వెంచర్లలో కూడా కల్పించలేనన్ని మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. సీసీ రోడ్లు, తాగునీటి సరఫరా పైపులైన్లు, భూగర్భ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు అన్ని కాలనీల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికీ భూగర్భ కేబుళ్లు వేస్తున్నారు. పేదలకు ‘క్వాలిటీ లైఫ్’ అందించడానికి ప్రభుత్వం చేపట్టిన మహాయజ్ఞం ఇది. పేదలు ఆత్మగౌరవంతో జీవిస్తూ అభివృద్ధి పథంలో అడుగులు వేయడానికి రంగం సిద్ధమవు తున్న తరుణంలో... వాస్తవాలు గ్రహించకుండా, రాజకీయాల కోసం పేదల ఇళ్ల నిర్మాణాన్ని వాడుకోవడం సమంజసం కాదని పవన్ కల్యాణ్ గ్రహించాలి. ఆత్మ గౌరవంతో జీవించడానికి తొలి అడుగు పడుతున్న సమయంలో పేదల ఆత్మవిశ్వాసాన్ని రాజకీయాల కోసం దెబ్బతీస్తే భవిష్యత్ తరం ఆయన్ని క్షమించదు. ఇంటిని కేవలం ఇటుకలు, సిమెంట్‌తో నిర్మితమైన ఓ కట్టడంగా మాత్రమే కాకుండా... పేదల జీవితంగా పవన్ గుర్తించాలి. నిరుపేదల జీవితాలను రాజకీయం చేయడం వల్ల నష్టపోయేది పేదలే కాదు... పవన్ కూడా. నిర్మాణాత్మకంగా వ్యవహరించే ఆలోచన ఆయ నకు ఉంటే... బడుగుల జీవితాలు బాగుపడుతున్న తీరును అభినందించాలి. పేదల ఆత్మగౌరవానికి భంగం కలిగించవద్దని వినయంగా మనవి చేస్తున్నా. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణ శ్రీబాగ్ ఒప్పందంలోనే ఉంది) - కైలే అనిల్ కుమార్ ఎమ్మెల్యే; పామర్రు, కృష్ణా జిల్లా