సాక్షి, తాడేపల్లి: దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన చంద్రబాబు.. దళిత బాంధవుడు ఎలా అయ్యారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబును దళితులు నమ్మే పరిస్థితి లేదన్నారు.
‘‘దళితుల సంక్షేమం కోసం రూ.53 వేల కోట్లు ఖర్చు చేశాం.. గతంలో చంద్రబాబు దళితుల కోసం ఏం చేశారు. అంబ్కేదర్ స్ఫూర్తితో సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారు. దళితులు ఏం పీక్కారన్న లోకేష్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు. ఎస్సీ నియోజకవర్గాలలో అధిక భాగం ఎందుకు ఓడిపోయారో అర్థం చేసుకో చంద్రబాబు. 28 పథకాలు దళితుల కోసం తన హయాంలో పెట్టినట్లు చంద్రబాబు అబద్దాలు చెప్తున్నారు. జగన్ హయాంలో దళితులకు ఎంతో మేలు జరిగింది’’ అని అనిల్‌కుమార్ అన్నారు.
ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు కొత్త అవతారం ఎత్తారు. దళితులకు ఎవరేం చేశారో అసెంబ్లీలో చర్చిద్దాం. దమ్ముంటే చంద్రబాబు అసెంబ్లీకి వస్తే చర్చిద్దాం. మా సవాల్‌ని స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా?. దీనిపై రెండు రోజులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయించటానికి మేము రెడీ. ఆలయ బోర్డులలో దళితులను నియమించాలని చంద్రబాబు కనీసంగా కూడా ఆలోచించలేదు. మా పేదపిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవకూడదా?. అలా చదివించాలని ఏనాడైనా ఆలోచించావా చంద్రబాబూ?’’ అంటూ ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ దుయ్యబట్టారు.
చదవండి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
‘‘సీబీఎస్ఈ సిలబస్ పెట్టాలనీ, ట్యాబులు ఇవ్వాలనీ, స్కూల్స్ బాగు చేయించాలని ఏనాడైనా ఆలోచించారా?. 2 లక్షల కోట్లు పేదల ఖాతాలో వేస్తే అందులో అధిక భాగం లబ్ది పొందింది దళితులే. చంద్రబాబు, జగన్‌లలో ఎవరు మేలు చేశారో చర్చకు మేము సిద్దం. 28 పథకాలు తీసేశామని చంద్రబాబు చెప్తున్నారు. ఆ పథకాలు, వాటి ద్వారా లబ్ది పొందినవారి లిస్టు బయట పెట్టాలి. ఎక్కడకు వెళ్లినా ఓట్ల గురించే తప్ప.. పేదల అభివృద్ధి గురించి చంద్రబాబు ఏనాడూ మాట్లాడరు. రాజధానిలో అంబేద్కర్ విగ్రహం పెట్టలేక పారిపోయిన వ్యక్తి చంద్రబాబు. జగన్ 125 అడుగుల ఎత్తుతో విజయవాడ నడిబొడ్డున పెడుతున్నారు. అదీ చంద్రబాబు, సీఎం జగన్‌లకు వున్న తేడా. చంద్రబాబు హయాంలో ఒక్క ముస్లింకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు ఎందుకని?. ఇదేనా ముస్లింల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ?’’ అని అరుణ్‌కుమార్ మండిపడ్డారు.
చదవండి: ‘అవినాష్‌ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ దగ్గర లేవు’
Comments
Please login to add a commentAdd a comment