సాక్షి, తాడేపల్లి: ఏపీలో తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిసినా కూటమి ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. అప్పులు తెచ్చుకుని రైతులు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఘాటు విమర్శలు చేశారు.
చివరికి టీడీపీ కార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వం వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రైతుల గురించి ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులు ధాన్యం రాశుల వద్ద గగ్గోలు పెడుతున్నారు. బుడమేరుకు వరదలు వస్తాయని తెలిసినా విజయవాడని ముంచేసినట్టుగానే ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారు. తుపాను వస్తుందని తెలిసినా రైతులను అప్రమత్తం చేయలేదు. రైతుసేవా కేంద్రాల వద్దకు వెళ్తే మిల్లర్ల దగ్గరకు వెళ్లమని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
విజయవాడ నుండి మచిలీపట్నం వరకు ఎక్కడ చూసినా రోడ్డు పక్కన ధాన్యం రాసులే కనిపిస్తున్నాయి. అప్పులు తెచ్చుకుని రైతులు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదు. రైతులను ఈ ప్రభుత్వం వెంటిలేటర్ల మీదకు నెట్టేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి మాటలు కోటలు దాటుతున్నాయేగానీ చేతల్లో ఏమీ కనపడటం లేదు. కనీసం టార్బలిన్ పట్టాలు, గోనె సంచులు కూడా ఇవ్వటం లేదు. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వం గుర్తించాలి
రాష్ట్రంలో ఒక్క బస్తా ఐనా మద్దతు ధరతో రైతుల నుండి కొనుగోలు చేశారా?. మాతో వస్తే రైతుల గోడు మంత్రులకు చూపిస్తాం. చివరికి టీడీపీ కార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వం వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేల కోట్ల రూపాయలు స్కామ్ చేయటానికి ప్రభుత్వ పెద్దలు రెడీగా ఉన్నారు. గ్రామాల్లో తేమ శాతం 15% ఉంటే మిల్లర్ల దగ్గరకు వెళ్తే 20% ఉన్నట్టు చూపిస్తున్నారు. మధ్యవర్తులు, దళారుల ద్వారా వేల కోట్ల రూపాయలు రైతుల నుండి దోచుకుంటున్నారు
ఒక్కో బస్తా మీద రూ.425ల చొప్పున ఈ మాఫియా కొట్టేస్తోంది. వైఎస్ జగన్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడు. మద్యం, ఇసుక మీద ఉన్న ప్రేమ.. రైతుల మీద ప్రభుత్వానికి లేదు. రైతు సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. హాయ్ అని మెసేజ్ పెడితే ధాన్యం మొత్తం కొనిపిస్తానని మంత్రి నాదెండ్ల మనోహర్ మాటలు చెప్తున్నారు. ఎంతమంది మెసేజ్‌లు పెట్టినా ఆ మంత్రికి చలనం లేదు. మెసేజ్ కాదు ఇకమీదట గిల్లితేనైనా రైతుల అవస్థలు గుర్తొస్తాయేమో? అంటూ చురకలంటించారు.
Comments
Please login to add a commentAdd a comment