
సాక్షి, తాడేపల్లి: స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా మారింది.. ఆ భోజనం చేయలేక చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పిల్లలకు సరైన భోజనం కూడా పెట్టలేని మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. లోకేష్ విద్యాశాఖని పూర్తిగా గాలికి వదిలేశారని.. మిగతా శాఖల్లో వేలు పెట్టి షాడో సీఎంగా లోకేష్ వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు.
‘‘నిధులు ఇవ్వకుండా, మంచి భోజనం పెట్టకుండా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు?. ప్రభుత్వ చర్యల కారణంగా సగం మంది పిల్లలు కూడా స్కూళ్లలో భోజనం చేయటం లేదు. చిన్న పిల్లలు పురుగుల అన్నం తినలేక బాధ పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినంత తేలిగ్గా మంచి భోజనం మాత్రం పెట్టటం లేదు.
..వైఎస్ జగన్ హయాంలో గోరుముద్ద పేరుతో నాణ్యమైన భోజనం పెట్టారు. ఏరోజు ఏం పెట్టాలో మెనూ ప్రకారం భోజనం పెట్టారు. అధికారుల పర్యవేక్షణలో మధ్యాహ్న భజన పథకాన్ని జగన్ అమలు చేశారు.. కానీ కూటమి ప్రభుత్వం పిల్లలకు పురుగుల ఆహారం పెడుతోంది. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది’’ అని రవిచంద్ర హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment