Ravichandra
-
రాజ్యసభకు ఆ ముగ్గురూ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోటాలో మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఒక్కరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రక టించారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వారి లో కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్, వద్ది రాజు రవిచంద్ర మంగళవారం రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డి చేతుల మీదుగా ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. బుధవారం ధ్రువీకరణ పత్రం తీసుకుంటానని రేణుకా చౌదరి రిటర్నింగ్ అధికారికి సమాచారం ఇచ్చారు. భారీ ప్రదర్శనగా వచ్చిన అనిల్ యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకునేందుకు పార్టీ కార్యకర్తలతో భారీ ప్రదర్శనగా అసెంబ్లీకి చేరుకున్నారు. అనిల్ వెంట ఆయన తండ్రి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తదితరులున్నారు. అనిల్‌కుమార్ యాదవ్‌ను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుతో పాటు పలువురు అభినందించారు. ఈ సందర్భంగా అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజ్యసభకు వెళ్లే అవకాశం దక్కడం తన విజయం కాదని, తెలంగాణ యువజన కాంగ్రెస్ విజయమని వ్యాఖ్యానించారు. ఒక బీసీ బిడ్డను పెద్దల సభకు పంపి కాంగ్రెస్ అధిష్టానం బీసీలందరికీ తగిన గౌరవం ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్‌కు రుణపడి ఉంటానన్న వద్దిరాజు రాజ్యసభకు 2022లో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరపున తొలిసారిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర మరోమారు రాజ్యసభలో అడుగు పెడుతున్నారు. రెండోమారు రాజ్యసభకు ఎన్నికైన ఆయన రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్ గుప్తాతో పాటు పార్టీ నాయకులు ఉన్నారు. తనను రెండోసారి రాజ్యసభకు పంపిన పార్టీ అధినేత కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని, తెలంగాణకు రావాల్సిన విభజన హామీలపై పార్లమెంటులో గొంతెత్తుతానని వద్దిరాజు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయడంతో పాటు కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అయ్యేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. కాగా, ఈ నెల 8న రాష్ట్రం కోటాలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా 15 వరకు నామినేషన్లు స్వీకరించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్ ఒక స్థానం దక్కాయి. మూడు స్థానాలకు ముగ్గురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడం.. పరిశీలన, విత్‌డ్రా గడువు ముగియడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంగళవారం రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. -
ఆ ముగ్గురి ఎన్నిక లాంఛనమే!
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలో భాగంగా రాష్ట్రం నుంచి మూడు స్థానాలకు గాను మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం నామినేషన్ల గడువు పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు, బీఆర్ఎస్ నుంచి ఒక నామినేషన్ దాఖలు కావడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్‌నేత రేణుకా చౌదరి, యువనేత అనిల్‌కుమార్ యాదవ్ చెరి మూడేసి సెట్ల చొప్పున, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర రెండుసెట్ల నామినేషన్‌పత్రాలను సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థులు మూడే సి సెట్ల నామినేషన్లలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు (ఒక్కో దాంట్లో పదేసి మంది చొప్పున మొత్తం 60 మంది సభ్యులు)సంతకాలు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. గురువారం రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డికి రేణుకా చౌదరి తమ నామినేషన్ పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో సమర్పించారు. అనిల్‌కుమార్ యాదవ్ తమ పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు డి. శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో అందజేశారు. వద్దిరాజు రవిచంద్ర తమ పత్రాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు గంగుల కమలాకర్, నాగేందర్, జగదీశ్‌రెడ్డి సమక్షంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రేణుక, అనిల్‌కు బీఫామ్స్ అందజేసిన సీఎం అంతకుముందు సీఎం చాంబర్లో అభ్యర్థులు రేణుకాచౌదరి, అనిల్‌కుమార్‌కు రేవంత్‌రెడ్డి బీఫామ్స్ అందజేసినపుడు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆదిశ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డి, ఈర్లపల్లి శంకర్, తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు. గురువారం ఉదయం తెలంగాణ భవన్లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న వద్దిరాజు తెలంగాణ తల్లి విగ్రహానికి దండలు వేసి అసెంబ్లీకి చేరుకున్నారు. తొలుత అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరుల స్తూపానికి నివాళులర్పించారు. ఎన్నిక ఏకగ్రీవమే! వచ్చే ఏప్రిల్ 2న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ పదవీ కాలం ముగియనుండడంతో రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ మూడు సీట్లకు గాను నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మూడు నామినేషన్లే దాఖలు కావడంతో... కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలాబలాల ఆధారంగా ఈ నెల 27న ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేకుండానే వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న పత్రాల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 20న నామినేషన్ల ఉపసంహరణకు అఖరి రోజు. ఈ గడువు ముగియగానే ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. -
కేసీఆర్ హామీతో.. ఆ స్థానం పదిలమేనా!?
ఖమ్మం: వచ్చే ఏప్రిల్‌లో రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ముగ్గురూ బీఆర్ఎస్ నేతలే కాగా, వీరిలో జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్రతో పాటు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగు లింగయ్య యాదవ్ ఉన్నారు. ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నామినేషన్ల స్వీకరణ మొదలుకాగా.. ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కనున్నాయి. అయితే, గతంలోనే కేసీఆర్ మరోమారు వద్దిరాజుకు అవకాశమిస్తామని హామీ ఇచ్చినందున ఆయనకే పదవి దక్కుతుందని అనుచరుల్లో ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాలోనూ రవిచంద్రకే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -సాక్షిప్రతినిధి, ఖమ్మం ఇరవై నెలలు పదవిలో... బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆ స్థానంలో వద్దిరాజు రవిచంద్రను కేసీఆర్ రంగంలోకి దించారు. బీఆర్ఎస్కు అప్పుడు ఉన్న సంఖ్యాబలంతో ఆయన మే 2022లో రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఇరవై నెలల కాలంలో ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా తనదైన ముద్ర వేయడమే కాక మున్నూరుకాపు సామాజిక వర్గం ముఖ్యనేతగా బీఆర్ఎస్లోకి ఆ సామాజిక వర్గ నేతలను చేర్పించడంలో కీలకపాత్ర పోషించారు. అసెంబ్లీ ఎన్నికల సమయాన ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గ బాధ్యతలను కేసీఆర్ ఆయనకు అప్పగించారు. ఇక పార్లమెంట్లో ఉమ్మడి జిల్లా, రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలే కాక విభజన సమస్యలపైనా తన గళం వినిపించారు. హామీ నెరవేర్చాలని.. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్రతోపాటు మరో ఇద్దరి పదవీకాలం పూర్తి కానుండగా.. ఈసారి ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని చూస్తే ఒక్క స్థానం దక్కనుంది. ఒక్కో రాజ్యసభ స్థానానికి 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా.. బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ పార్టీకి ఒక స్థానం దక్కడం ఖాయమనే చెప్పాలి. కాగా, రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి వద్దిరాజుకు అవకాశం దక్కుతుందని కేసీఆర్ గతంలో పలు వేదికలు, సమావేశాల్లో ప్రస్తావించడంతో ఈ హామీ నెరవేర్చాలని ఆయన అనుచరుల నుంచి విన్నపాలు వస్తున్నాయి. కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏప్రిల్‌లో పదవీకాలం ముగియనున్న రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు ఏర్పాటుచేయగా.. వద్దిరాజు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ ఆశీర్వదిస్తే ఇదే సభలో అడుగు పెడతానన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా తన పదవీకాలంలో చరిత్రలో నిలిచిపోయే ఘటనల్లో భాగస్వామిని కావడానికి అవకాశమచ్చిన కేసీఆర్‌కు రుణపడి ఉంటానని తెలిపారు. అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు! రాజ్యసభకు ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఈనెల 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. నామినేషన్ల స్వీకరణ గడువు 15వరకు ఉండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి. అసెంబ్లీ బలాబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్కు ఒక స్థానం దక్కనుండడంతో రాజ్యసభలో పార్టీ వాణిని బలంగా వినిపించే అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లపై చర్చ జరుగుతుండగా.. బీఆర్ఎస్ తరఫున మాత్రం వద్దిరాజుకే ఖాయమని ప్రచారం ఉంది. రెండు, మూడు రోజుల్లోనే రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని సమాచారం. ఇవి చదవండి: పురుమల్లకు షోకాజ్ నోటీసు జారీ.. -
ఎటువంటి గ్రూప్ గొడవలు లేకుండా చూస్తామన్న నేతలు
-
శ్రీనివాసరావుతో సంబంధమేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావు కేసులో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. శ్రీనివాసరావుతో సంబంధాలేమైనా ఉన్నాయా? ఆర్థిక లావాదేవీలు జరిగాయా? అంటూ ప్రశ్నించారు. తమ ప్రాథమిక విచారణలో తేలిన అంశాలు, ఇద్దరు నేతలు తెలిపిన విషయాలను బేరీజు వేసుకున్నారు. బుధవారం సీబీఐ నోటీసులు అందుకున్న గంగుల, వద్దిరాజు గురువారం ఢిల్లీలో విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 7.40 గంటల వరకు సుమారు 8.40 గంటల పాటు జరిగింది. వేర్వేరుగా విచారణ అధికారులు గంగుల, వద్దిరాజు ఇద్దర్నీ వేర్వేరుగా ప్రశ్నించారు. శ్రీనివాసరావును కూడా వారికి ఎదురుగా కూర్చోబెట్టి వారు చెప్పిన సమాచారాన్ని ధ్రువీకరించుకున్నారు. ‘శ్రీనివాసరావుతో ఎప్పటినుంచి పరిచయం ఉంది? ఎక్కడెక్కడ కలిశారు? ఏమైనా ఆఫర్లు ఇచ్చాడా? లావాదేవీలు ఏమైనా జరిగాయా? ఎవరినైనా పరిచయం చేశాడా? డబ్బు చెల్లింపులు జరిగాయా.?’లాంటి పలు ప్రశ్నలకు సమాధానాలను రాబట్టేందుకు ప్రయత్నించారని తెలిసింది. కొన్ని విషయాల్లో తమ వద్ద ఉన్న ఆధారాలను వారి ముందు ఉంచి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారని సమాచారం. పూర్తిగా సహకరించాం: మంత్రి గంగుల విచారణ ముగిసిన తర్వాత గంగుల, వద్దిరాజు మీడియాతో మాట్లాడారు. గంగుల మాట్లాడుతూ.. ‘ఈ వ్యవహారంలో ఎలాంటి ఆలస్యం చేయరాదన్న ఉద్దేశంతో సీబీఐ అధికారులు పిలవగానే మేం ఢిల్లీలో విచారణకు హాజరయ్యాం. ఎందుకంటే మేం చట్టాలను గౌరవిస్తాం. న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి వారు చెప్పిన సమయాని కంటే ముందే వారి కార్యాలయానికి వచ్చాం. ఒక ఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో మా విచారణ జరిగింది. వారికి పూర్తిగా సహకరించాం. వారిని గుర్తుపట్టావా? అని శ్రీనివాసరావును ప్రశ్నించారు. అతన్ని వారం క్రితం ఒక మున్నూరు కాపు సమావేశంలో కలిశామని మేం చెప్పాం. రెండుసార్లు మాత్రమే కలిశాం. మున్నూరు కాపు బిడ్డ, ఐపీఎస్ అధికారి అని చెప్పినందుకు గుర్తించామే కానీ, ఆయనతో లావాదేవీలు చేయాలన్న ఆలోచనలు మాకు ఎవరికీ రాలేదు. ఈ విషయాలనే సీబీఐ అధికారులకు వివరించాం. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను తెలియజేశాం. మేం ఎక్కడా తప్పు చేయలేదు కాబట్టే వాస్తవాలు చెప్పాం. దీనిపై శ్రీనివాసరావును క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మేం చెప్పిన ప్రతి విషయాన్నీ రికార్డు చేసుకున్నారు. మా సమాధానాలతో సీబీఐ అధికారులు పూర్తిగా సంతృప్తి చెందారు. మా సంతకాలు తీసుకొని పంపించారు. మళ్లీ విచారణకు రమ్మని చెప్పలేదు. ఇదే ఫైనల్ విచారణ అన్నారు..’అని తెలిపారు. బయట జరుగుతున్న వదంతులు ఏవీ వాస్తవాలు కాదని మంత్రి గంగుల కొట్టిపారేశారు. మేం బంగారం కొనిచ్చామన్నది దుష్ప్రచారమే: ఎంపీ వద్దిరాజు ‘కాపు వ్యక్తిగా శ్రీనివాసరావు మాకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర ఉన్న ఫోన్లు, బంగారం ఆయన కొనుక్కున్నవే. మేము కొనిచ్చామన్నది0 దుష్ప్రచారమే. అది పూర్తిగా అవాస్తవం. అన్ని అంశాలు వివరించాం. అధికారులకు సహకరించాం. శ్రీనివాసరావును మా ఎదురుగా కూర్చోపెట్టి విచారించారు.. ’అని వద్దిరాజు చెప్పారు. -
ఎంపీ అర్వింద్ భాష మార్చుకోవాలి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ధర్మపురి అర్వింద్ ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఘోరమైన పదజాలం ఉపయోగిస్తున్నారని, భాష మార్చుకోవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హెచ్చరించారు. ఖమ్మంలోని తన స్వగృహంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రవిచంద్ర మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అర్వింద్ వంటి వారు ఇలాంటి భాషను ఉపయోగించడం సరికాదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వివాదాన్ని మున్నూరుకాపులపై జరిగిన దాడిగా కొందరు సామాజిక మాధ్యమాల్లో అభివర్ణిస్తున్నారని... ఇది రెండు పార్టీల మధ్య గొడవే తప్ప, కులపరమైన దాడిగా భావించవద్దని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడి హోదాలో కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణ మాదిరి అభివృద్ధి లేదని, అందుకే ఆ పార్టీ నేతలు ఓర్వలేక సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని వద్దిరాజు ఆరోపించారు. -
గ్రానైట్ పరిశ్రమపై ఈడీ దాడులు సరికాదు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రానైట్ కంపెనీల కార్యాల యాలపై ఈడీ, ఐటీ దాడులు చేయడం సరికాదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభిప్రాయపడ్డారు. తన కుటుంబ సభ్యులు, సమీప బంధువు గంగుల కుటుంబానికి సంబంధించిన గాయత్రి, శ్వేత గ్రానైట్ కంపెనీలపై ఈడీ, ఐటీలు దాడులకు దిగడం శోచనీయమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు చేపట్టే విచారణకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ పరిశ్రమతో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి మాత్రమే వస్తుందని, తమకు కేంద్రం నుంచి ఎటువంటి రాయితీలు రాలేదని తెలిపారు. కరోనా కారణంగా మా ర్కెట్ దెబ్బతిని గ్రానైట్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉందని, ఈ పరిశ్రమలో జీరో వ్యాపారం అనే మాటే లేదని స్పష్టం చేశారు. -
త్వరలోనే మున్నూరు కాపు కార్పొరేషన్
కాచిగూడ: మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం అనుకూలంగా ఉన్నారని, త్వరలోనే కార్పొరేషన్ ఏర్పాటవుతుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో శనివారం కాచిగూడలోని మున్నూరు కాపు భవన్, మ్యాడం అంజయ్య హాల్లో మున్నూరు కాపు ప్రజాప్రతినిధుల సత్కార కార్యక్రమం మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న కాచిగూడ మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డును త్వరలోనే దేవాదాఖ శాఖ పరిధి నుంచి బయటకు తీసుకువస్తామన్నారు. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో చర్చించడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్నూరుకాపులందర్ని ఏకం చేయడం జరుగుతుందని, ఆ దిశగా ప్రయత్నాలను మొదలుపెట్టి 90 శాతం వరకు పూర్తి చేశామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సహకారా అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ ఆకుల లలిత, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగళారపు లక్ష్మణ్, జెల్లి సిద్దయ్య, దామేర జ్ఞానేశ్వర్, మామిండ్ల శ్రీనివాస్, బండి పద్మ, రాకేష్, కొండూరు వినోద్‌కుమార్, గంగం రవి, చింతపండు మల్లేష్, ఎనుగుల మాణిక్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం నిర్ణయంతో అగ్గి రాజుకుంది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సైనిక నియామకాలను కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టాలన్న కేంద్రప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో దేశవ్యాప్తంగా అగ్గి రాజుకుందని, యువత రగిలిపోతున్నా రని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రప్రభు త్వం వెంటనే అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), బండి పార్థసారథిరెడ్డి శనివారం తొలిసారి ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద పార్టీ శ్రేణులు వారికి ఘనస్వాగతం పలికి.. ర్యాలీగా ఖమ్మం లోని సర్దార్ పటేల్ స్టేడియంలో సాయంత్రం ఏర్పాటుచేసిన ‘కేసీఆర్‌కు కృతజ్ఞత సభ’కు చేరుకున్నారు. ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ యువతను మోసం చేస్తున్న కేంద్రంపై సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాడనున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి, పారిశ్రామికంగా ఎదిగేందుకు దోహదం చేసిన ఖమ్మం గడ్డను ఎప్పటికీ మరువబోనని అన్నారు. బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ ఎనిమిదేళ్లలో ముఖ్య మంత్రిగా కేసీఆర్ సాధించిన ప్రగతి అద్భుత మని కొనియాడారు. సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తదితరులు మాట్లాడారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. -
‘గ్రానైట్ కుటుంబాన్ని విస్మరించను’
ఖమ్మం మయూరిసెంటర్: తాను వ్యాపారంలో ఎద గడానికి, రాజకీయంగా రాణించడానికి దోహద పడిన గ్రానైట్ కుటుంబాన్ని జీవితంలో ఎన్నడూ విస్మరించబోనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఏ పదవి లేకుండానే గ్రానైట్ పరిశ్రమకు ఎంతో చేశానని, ఇప్పుడు ఎంపీగా ఎన్నికైన తర్వాత ఈ పరిశ్రమను కాపాడుకోవడం లో ముందుంటానని చెప్పారు. ఇటీవల రాజ్యసభ కు ఎన్నికైన రవిచంద్రను తెలంగాణ గ్రానైట్ పరి శ్రమ యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఆది వారం హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి వం దలాది మంది గ్రానైట్ యజమానులు ఈ కార్యక్ర మానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అసోసి యేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ అధ్యక్షతన జరిగిన సభలో రవిచంద్ర మాట్లాడుతూ.. గ్రానైట్ పరిశ్రమలో ఉన్న వాళ్లంతా తన కుటుంబ సభ్యులని అన్నారు. వారికి ఏ కష్టం వచ్చినా కుటుంబ పెద్దగా ముందుంటానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రానైట్ కుటుంబం నుంచి ఇంత కాలం తానొక్కడినే ఎంపీగా ఉన్నానని, ఇప్పుడు రవిచంద్ర కూడా ఎన్నికవడం సంతోషకర మన్నారు. సభలో గ్రానైట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాయల నాగేశ్వరరావు, సంఘం ప్రతినిధులు పాటిబండ్ల యుగంధర్, ఉప్పల వెంకటరమణ, గంగుల ప్రదీప్, రాయల నాగేశ్వర రావు, జిల్లా అశోక్, చక్రధర్‌రెడ్డి, శరాబందీ, కోటేశ్వరరావు, నరేందర్, వెంకట్రావు, ఫణి కుమార్, శ్రీధర్, రవీందర్రావు పాల్గొన్నారు. -
వద్దిరాజు నామినేషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఉపఎన్నిక స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర గురువారం నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి కుటుంబసభ్యులు, పలువురు రాష్ట్రమంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి వచ్చిన వద్దిరాజు శాసనసభ కార్యదర్శి, రిటర్నింగ్ అధికారికి మూడు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు టీఆర్ఎస్ కార్యకర్తలతో కలసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కుకు చేరుకుని అమరుల స్తూపానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతి రాథోడ్, వి.శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్ తదితరులు వద్దిరాజును అభినందించారు. ఈ నెల 20న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, దాస్యం వినయ్‌భాస్కర్, వివేకానంద, జీవన్‌రెడ్డి, నన్నపునేని నరేంద ర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బండా ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లోని లాన్ లో తెలంగాణ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో వద్దిరాజుకు ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. హైదరాబాద్‌లోని మున్నూరుకాపుల ఆత్మగౌరవ భవనాన్ని జూన్ 9న కేసీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. -
పదవి కాలం మ్యాటర్ కాదు
-
స్మాల్ స్టెప్ తీసుకున్నా
తమిళ పాఠాలు నేర్చుకుంటున్నారు హీరోయిన్ అమైరా దస్తూర్. హిందీలో ‘మెంటల్ హై క్యా’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసి ‘మేడిన్ చైనా, ప్రస్థానం’ (తెలుగు ‘ప్రస్థానం’ హిందీ రీమేక్) సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళం నేర్చుకోవడానికి కారణం ఉంది. అధిక్ రవిచందర్ దర్శకత్వంలో ప్రభుదేవా నటించనున్న ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో నటించనున్నారట అమైరా. ఈ సినిమాలో సొంత డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయ్యారట. అందుకే తమిళం నేర్చుకుంటున్నారు. ‘‘సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల్లో సొంత డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల వెండితెరపై ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ పర్ఫెక్ట్గా రిప్లెక్ట్ అవుతాయి. అలాగే మన పెర్ఫార్మెన్స్లోనూ తేడా కనిపిస్తుంది. సినిమా ప్రమోషన్ టైమ్‌లోనూ నాకు బాగా హెల్ప్ అవుతుంది. ఎవరైనా తమిళంలో ఏదైనా చెప్పినప్పుడు పక్కవారిని ట్రాన్స్‌లేట్ చేయమనే బాధ కూడా పోతుంది. నటిగా నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ఇదొక స్మాల్ స్టెప్‌గా భావిస్తున్నాను’’ అని అమైరా చెప్పుకొచ్చారు. ఇంతకుముందు తమిళంలో ‘అనేగన్’ చిత్రంలో ధనుష్ సరసన నటించారామె. -
ఆర్థిక శాఖ ధిక్కార శైలి
సాక్షి, అమరావతి: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి ఖజానాను ఖాళీ చేయడమే లక్ష్యంగా రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర వ్యవహార శైలిపై అధికార యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రభుత్వానికి సమస్యలు సృష్టించడమే లక్ష్యంగా రవిచంద్ర వ్యవహరిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సి ఉన్నా రవిచంద్ర ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా చంద్రబాబు ప్రయోజనాల కోసమే పని చేయడం పట్ల నివ్వెరపోతున్నారు. ఈనెల 27న కాంట్రాక్టర్లకు రూ.వెయ్యి కోట్లు చెల్లింపు ప్రతి నెలా ఉద్యోగుల వేతనాల కోసం మిగతా రంగాలకు ఇవ్వ కుండా కొన్ని నిధులను నిల్వ ఉంచుతారు. అయితే రవిచంద్ర పనితీరు అందుకు భిన్నంగా ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఈనెల 27న కాంట్రాక్టర్లకు ఆయన ఏకంగా రూ.1,000 కోట్ల బిల్లులను చెల్లించేశారు. నాబార్డు, విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టిన పనులైనా సరే ఉద్యోగుల వేతనాలు చెల్లించిన తరువాతే మిగతా రంగాల బిల్లులను ఆర్థిక శాఖ చెల్లిస్తుంది. ప్రతి నెల 1వతేదీ నుంచి 10వతేదీ వరకు కేవలం ఉద్యోగుల వేతనాల బిల్లులనే మంజూరు చేస్తారు. 10వ తేదీ తరువాతే మిగతా రంగాలకు చెందిన బిల్లులను పాస్ చేస్తారు. అయితే ఉద్యోగుల వేతనాలను చెల్లించడానికి సైతం ఖజానాలో నిధులు లేకుండా ఖాళీ చేయడమే లక్ష్యంగా రవిచంద్ర పని చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితాలు వెల్లడై కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న విషయం తేటతెల్లమైనప్పటికీ చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేయడం పట్ల సచివాలయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రెండు రోజుల్లో రూ.2,325 కోట్లు ఎన్నికల ఫలితాల ముందు రోజు అంటే 22వ తేదీన ఏకంగా రూ.2,025 కోట్ల మేర బిల్లులను కాంట్రాక్టర్లకు రవిచంద్ర చెల్లించేసిన విషయం తెలిసిందే. ఫలితాల రోజు అంటే 23వ తేదీన మరో రూ.300 కోట్ల బిల్లులను చెల్లించేశారు. ఇవన్నీ కాంట్రాక్టర్లకు చెందిన బిల్లులే కావడం గమనార్హం. ఒకపక్క చిరు ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదు. మరోపక్క కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు విడుదల చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు ఇవ్వకుండా నీరు–చెట్టు లాంటి పనులు చేసిన టీడీపీ నేతలకు బిల్లులను రవిచంద్ర చెల్లిస్తున్నారు. సీఎస్ ఆదేశాలను ధిక్కరించడం కాదా? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏయే బిల్లులు చెల్లించాలో సూచిస్తూ ప్రాధాన్యతలను నిర్ధారించినప్పటికీ ఆయన ఆదేశాలను ధిక్కరించే రీతిలో రవిచంద్ర వ్యవహరించడం సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. ‘చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. ఆయన చెప్పిన పనులన్నీ అధికారులు చేయాల్సిన పనిలేదు. కానీ రవిచంద్ర చంద్రబాబు చెప్పిన వారికల్లా బిల్లులు చెల్లించడం ఆశ్యర్యం కల్పిస్తోంది’ అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. గవర్నర్ నరసింహన్ డిజిగ్నేటెడ్ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రకటించినా సరే ఇంకా చంద్రబాబు చెప్పినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎలా పనిచేస్తారనే చర్చ సచివాలయంలో కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు రెగ్యులర్‌గా చెల్లించాల్సిన బిల్లులన్నీ పక్కనపెట్టేసి కేవలం చంద్రబాబుకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే బిల్లులనే రవిచంద్ర చెల్లింపులు చేశారు. అందుకోసం పెద్ద ఎత్తున అప్పులు చేసి మరీ చెల్లింపులు చేయడం గమనార్హం. కొత్త ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర! ప్రతి నెలా ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లించేందుకు రూ.4,500 కోట్లు అవసరం. అయితే రవిచంద్ర ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేకుండా చేశారు. మంగళవారం నాటికి వేస్ అండ్ మీన్స్ రూ.1,500 కోట్లతోపాటు మరో రూ.500 కోట్లు ప్రత్యేక డ్రాయింగ్ నిధిని కూడా వాడేశారు. ఈ నెలలోఓపెన్ మార్కెట్లో సైతం రుణం పొందేందుకు వీలు లేకుండా ఫలితాల ముందే రుణం తీసుకున్నారు. ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వడం లేదని కొత్త ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర ఇందులో కనిపిస్తోందని, ఏ అధికారీ ఇంత బరితెగించి వ్యవహరించరనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. మళ్లీ ఓవర్ డ్రాఫ్ట్‌కి వెళ్తేగానీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించే పరిస్థితి కనిపించడం లేదని ఆర్థికశాఖ వర్గాలు వాఖ్యానిస్తున్నాయి. -
పెద్దోళ్లు కుదరదన్నారు
రవిచంద్ర, సుమయ హీరో, హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఈ 2 మనసులు’. ఆది పినిశెట్టి దర్శకత్వంలో శేఖర్ మూవీస్ పతాకంపై చంద్రశేఖర్ ఎస్. నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్, ఓ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చంద్రశేఖర్ ఎస్. మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రకథని చాలామంది పెద్ద హీరోల వద్దకు తీసుకెళితే ఎవ్వరూ డేట్స్ ఇవ్వలేదు. బ్యానర్ ఏంటి? సినిమా వస్తుందా? లేదా? అని అడిగేవారు. దీంతో అందరూ కొత్తవాళ్లనే తీసుకున్నాం. ఎప్పటికైనా మాది చాలా పెద్ద బ్యానర్ అవుతుందని ఆశిస్తున్నా. ఇందులోని నటీనటులు, టెక్నీషియన్లు అందరూ కొత్తవాళ్లు అయినా సినిమా చాలా బాగా వస్తోంది. ఇప్పటి వరకూ 70 శాతం షూటింగ్ పూర్తయింది’’ అన్నారు. ‘‘ఇదొక ప్రేమకథ. నా తమ్ముడు సత్య ఈ చిత్రం స్క్రిప్ట్ విషయంలో నాకు చాలా సపోర్ట్ చేశాడు. మమ్మల్ని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం’’ అన్నారు ఆది పినిశెట్టి. ‘‘ఈ మధ్య వచ్చిన ప్రేమ కథలకి చాలా భిన్నంగా మా సినిమా ఉంటుంది’’ అని రవిచంద్ర అన్నారు. రంగి, మహేశ్, కాదంబరి కిరణ్, తిరుపతి, జావెద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నందన్‌కృష్ణ, సంగీతం: జి.వి.ఎం.గౌతమ్. -
దైవదర్శనానికి వెళుతూ మరొకరు..
అగళి: మండలంలోని ఎంఎం పాళ్యం గ్రామానికి చెందిన రవిచంద్ర (20) తన మిత్రులతో కలిసి బైక్‌లో శనీశ్వరస్వామి దర్శనం కోసం పావగడకు వెళుతుండగా పావగడ సమీపంలో టాటా సుమో వాహనం ఢీకొంది. బైక్‌లోని ముగ్గురికీ గాయాలయ్యాయి. రవిచంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. పావగడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రవిచంద్ర స్నేహితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. -
నేడు ఒలింపిక్ రన్
అనంతపురం కల్చరల్ : సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో శుక్రవారం ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నట్లు సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి రవిచంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు టవర్‌క్లాక్ నుంచిlసప్తగిరి సర్కిల్ వరకు ఒలింపిక్ రన్ సాగుతుందన్నారు. డీఈఓ అంజయ్యతో పాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొంటారన్నారు. భారత క్రీడాకారులకు మద్దతుగా కవులు తమ కవితలను వినిపిస్తారన్నారు. కవులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలన్నారు. -
బీదాకే ఎమ్మెల్సీ?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్రకు శాసనమండలి సీటు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇదే ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. శాసనమండలి ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియకు ప్రారంభమైంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని.. ఈలోపు ఎన్నో మార్పులు జరగవచ్చని పార్టీశ్రేణులు భావిస్తున్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటా కింద ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అందులో టీడీపీకి మూడు స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. వీటిలో కులప్రాతిపదికన కేటాయించినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. కుల సమీకరణలు తీసుకుంటే ఒకటి రెడ్డి, మరొకటి కమ్మ, లేదా ముస్లిం, ఇంకొకటి ఎస్సీ లేదా బీసీ సామాజికవర్గానికి దక్కే అవకాశాలున్నాయి. పదినెలలుగా ఊరిస్తూ వచ్చిన శాసనమండలి ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో... ఈసారి ఎలాగైనా తనకే దక్కుతుందని సోమిరెడ్డి, మరోవైపు బీదా, ఆదాల ప్రభాకర్‌రెడ్డి భావిస్తున్నారు. కుల ప్రాతిపదిక ప్రకారం అయితే జిల్లాలో ఎక్కువ అవకాశాలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికే ఉన్నాయని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి ఒక సీటు ఖాయం చేశారని ప్రచారం జరుగుతోంది. ఆ లెక్కన లింగారెడ్డికి ఇస్తే.. బీసీ సామాజికవర్గానికి ఒకటి కట్టబెట్టనున్నారు. అందులో భాగంగా బీదా రవిచంద్రకు దాదాపు ఖరారు చేశారనే ప్రచారం జరుగుతోంది. మూడో ఎమ్మెల్సీ స్థానాన్ని కోస్తా జిల్లాకు ఖాయం చేసినట్లు తెలిసింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో... జిల్లాలో ఎమ్మెల్సీ కోసం ముగ్గురు నేతలు పోటీపడుతున్న విషయం తెలిసిందే. వీరిలో ఒకరికి ఇస్తే మరో ఇద్దరు అలక వహించే అవకాశం ఉందని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. బీదాకు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని సోమిరెడ్డి, ఆదాల వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియార్టీని పరిగణనలోకి తీసుకుంటే సోమిరెడ్డికే ఇవ్వాలని ఆయన వర్గం పట్టుబడుతోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆదాల ప్రభాకర్‌రెడ్డికి నాడు పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని బాబు హామీ ఇచ్చారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఆదాల పార్టీలో చేరటంతోనే టీడీపీకి ఓటు బ్యాంకు పెరిగిందని ఆయన వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. తమ నాయకుడికి ఎమ్మెల్సీ కట్టబెట్టకపోతే.. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆ రెండువర్గాలు హెచ్చరికలు చేస్తున్నాయి. దీంతో పార్టీ అధిష్టానం జిల్లాకు ఇచ్చే ఎమ్మెల్సీని కర్నూలు జిల్లాకు కేటాయిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాలో మూడు వర్గాలు ఎమ్మెల్సీ పదవి కోసం పోటీపడుతున్న తరుణంలో ఎవరో ఒకరికి ఇస్తే.. మిగిలిన రెండు వర్గాలు అలక వహించే అవకాశం ఉంది. అదే సమయంలో ఎవరో ఒకరు కఠిన నిర్ణయం తీసుకుంటే పార్టీకి తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోంది. ఇదంతా ఎందుకు వచ్చిన తంట అని కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఫరూక్‌కు కట్టబెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే జరిగితే జిల్లాకు శాసనమండలి ఎన్నికల్లో మొండిచేయి చూపే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ తలనొప్పి ఎప్పుడు ఏ ముప్పును తీసుకొస్తుందోనని తమ్ముళ్లలో ఆందోళన మొదలైంది. -
పాలు పితికే వేళ.. జాగ్రత్తలు పాటించాలి
కందుకూరు: పశువుల నుంచి పాలు పితికే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే అటు పశువుల ఆరోగ్యంతో పాటు ఇటు పాలను స్వచ్ఛంగా ఉంచవచ్చు. దీంతో ఎక్కువ సమయం పాలు చెడిపోకుండా ఉంటాయి. వీటి నుంచి తీసిన వెన్న, నెయ్యి, మంచి రుచి, వాసన కలిగి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పాల శుభ్రత అనేది పశువుల ఆరోగ్య స్థితి, పశుశాలలు, పాలు పితికే మనిషి, పాలు నిల్వ ఉంచే పాత్రల శుభ్రత మీద ఆధారపడి ఉంటుందంటున్నారు మండల పశువైద్యాధికారి రవిచంద్ర . పాలు పితికే సమయంలో పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఆయన పలు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. పశువుల ఆరోగ్య స్థితి... పాలిచ్చే పశువుల ఆరోగ్యం పట్ల రైతులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. అంటువ్యాధులతో బాధపడే పశువులను మంద నుంచి వేరు చేసి పశువైద్యుల సలహా మేరకు అవసరమైన చికిత్సను అందించాలి. పశువు శరీర భాగాలైన కడుపు, డొక్కలు, పొదుగు పాలు పితికే ముందు శుభ్రంగా కడిగి తడి బట్టతో తుడవాలి. డొక్కలకు పొదుగుకు మధ్య ఉండే వెంట్రుకలను పొడవు పెరగనీయకుండా కత్తిరించాలి. పొదుగును శుభ్రపరిచి పొడిబట్టతో తుడవాలి. ఆ తర్వాత పాలు పితకాలి. పాలు తీయడం పూర్తయిన తర్వాత యాంటీసెప్టిక్ ద్రావణం (ఉదాహరణకు కోర్సలిన్ ద్రావణం లీటర్ నీటికి 2 మి.లీ కలపాలి)తో కడగాలి. అదే నీటితో పిండిన వ్యక్తి తన చేతులను కడుక్కోవాలి. పితికిన వెంటనే నేలపై పశువును అరగంట వరకు పడుకోనీయవద్దు. అప్పుడే పాలు పిండటంతో చను రంధ్రాలు తెరచుకోని ఉంటాయి. దీంతో ఒక వేళ పశువు పడుకుంటే ఆ రంధ్రాల నుంచి నేలపై ఉన్న బ్యాక్టీరియా త్వరగా పొదుగులోకి చేరి పొదుగు వాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. పాలు పితికిన వెంటనే పశువు పడుకోకుండా ఉంచాలంటే వాటి ముందు గడ్డి కాని లేదా దాణా పెట్టాలి. పశువుల షెడ్లో... పశువుల షెడ్లను ఎత్తయిన, నీరు నిల్వ ఉండని ప్రాంతంలో నిర్మించుకోవాలి. దీంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వీలవుతుంది. షెడ్ లోపలఙగడ్డి గాని లేదా ఇటీవల మార్కెట్లో ప్రత్యేకంగా వస్తున్న రబ్బర్ షీట్లను గాని పరుచుకోవచ్చు. షెడ్లో దోమలు, ఈగలు రాకుండా జాగ్రత్త వహించాలి. అవసరాన్ని బట్టి క్రిమి సంహారక మందులను పిచికారీ చేయాలి. దుమ్ము లేచే నేల అయితే పాలు తీసే ముందు కొద్దిగా నీరు చల్లాలి. పాలు తీసే వ్యక్తి... పశువుల నుంచి పాలు తీసే వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి. అంటువ్యాధులు, చర్మ వ్యాధులతో బాధపడేవారిని పాలు తీయడానికి ఉపయోగిం చవద్దు. పాలు తీసే వారి చేతి గోర్లు పెరగకుండా కత్తిరించుకునేలా చూడాలి. పాలు తీసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కుని పొడి గుడ్డతో తుడుచుకోవాలి. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకుని మరొక దాని పాలు తీయాలి. లేకపోతే ఆ పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. వేడినీటితో పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. -
ప్రేమిస్తే... పోయే కాలం
ప్రేమ అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే. కానీ, అదే సర్వస్వం అనుకుని కెరీర్‌ని ప్లాన్ చేసుకోకుండా నేటి యువత సమయాన్ని వృథా చేసుకుంటున్నారనే కథాంశంతో డి.ఇ. రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమిస్తే పోయే కాలం’. రవిచంద్ర దర్శకుడు. చిత్రవిశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేస్తూ -‘‘తల్లి ప్రేమ, సోదర ప్రేమ, యువతీ యువకుల మధ్య ప్రేమ.. ఏ ప్రేమలో అయినా అతి తగదని చెప్పే సినిమా ఇది. జీవితంలో ఒక్క క్షణం గడిచిపోతే తిరిగి రాదని యువత తెలుసుకోవాలి. కెరీర్‌ని ప్లాన్ చేసుకోవాలనే సందేశం ఉంది’’ అని చెప్పారు. -
నేరుగా ఆస్పత్రులకే మందులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ ఆస్పత్రులకు సరిపడా మందులను ఇక నేరుగా ఆస్పత్రులకే సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) మేనేజింగ్ డెరైక్టర్ ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు. వైద్యాధికారులు పంపించే ఇండెంట్‌కు అనుగుణంగా ప్రతి మూడు నెలలకోసారి ఔషధాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, మలి దశ లో రాష్ట్రమంతా ఈ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని స్ఫూర్తి భవన్లో వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మందుల వినియోగానికి సంబంధించినగడువును పరిశీలించాల్సిన బాధ్యత సీనియర్ ప్రజారోగ్యాధికారు(ఎస్పీహెచ్ఓ) లదేనని స్ప ష్టం చేశారు. ఈ ప్రాజెక్టు అమలుపై ఈ నెల 31 న ఎంసీహెచ్ఆర్డీలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్న ట్లు చెప్పారు. స్టోర్స్‌లలో మందుల నిల్వలను విధిగా డీఎంహెచ్ఓలు పరిశీలించాలని ఆదేశించారు. మల్కాజ్గిరి, సరూర్‌నగర్, పరిగి, కుల్కచర్ల తదితర పీహెచ్సీలలో అవసరానికి మించి మందులు తీసుకుంటున్నట్లు తమ దృష్టి కి వచ్చిందని, ఈ వ్యవహారంపై ఆరా తీయాలని అన్నారు. ఉపకేంద్రాల్లో వెంటిలేషన్ ఉం డేలా నమూనాలను తయారు చేసి సమర్పిం చాలన్నారు. ఆస్పత్రుల మరమ్మతులకు ఏటా రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలి పారు. సమావేశంలో కలెక్టర్ బి. శ్రీధర్, జేసీ-2 ఎంవీరెడ్డి, డీఎంహెచ్‌వో సుభాష్‌చంద్రబోష్, డీసీహెచ్ఎస్ హన్మంతరావు పాల్గొన్నారు.