సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ ఆస్పత్రులకు సరిపడా మందులను ఇక నేరుగా ఆస్పత్రులకే సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ) మేనేజింగ్ డెరైక్టర్ ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు. వైద్యాధికారులు పంపించే ఇండెంట్‌కు అనుగుణంగా ప్రతి మూడు నెలలకోసారి ఔషధాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, మలి దశ లో రాష్ట్రమంతా ఈ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని స్ఫూర్తి భవన్‌లో వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మందుల వినియోగానికి సంబంధించినగడువును పరిశీలించాల్సిన బాధ్యత సీనియర్ ప్రజారోగ్యాధికారు(ఎస్‌పీహెచ్‌ఓ) లదేనని స్ప ష్టం చేశారు. ఈ ప్రాజెక్టు అమలుపై ఈ నెల 31 న ఎంసీహెచ్‌ఆర్‌డీలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్న ట్లు చెప్పారు. స్టోర్స్‌లలో మందుల నిల్వలను విధిగా డీఎంహెచ్‌ఓలు పరిశీలించాలని ఆదేశించారు.
మల్కాజ్‌గిరి, సరూర్‌నగర్, పరిగి, కుల్కచర్ల తదితర పీహెచ్‌సీలలో అవసరానికి మించి మందులు తీసుకుంటున్నట్లు తమ దృష్టి కి వచ్చిందని, ఈ వ్యవహారంపై ఆరా తీయాలని అన్నారు. ఉపకేంద్రాల్లో వెంటిలేషన్ ఉం డేలా నమూనాలను తయారు చేసి సమర్పిం చాలన్నారు. ఆస్పత్రుల మరమ్మతులకు ఏటా రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలి పారు. సమావేశంలో కలెక్టర్ బి. శ్రీధర్, జేసీ-2 ఎంవీరెడ్డి, డీఎంహెచ్‌వో సుభాష్‌చంద్రబోష్, డీసీహెచ్‌ఎస్ హన్మంతరావు పాల్గొన్నారు.
నేరుగా ఆస్పత్రులకే మందులు
Published Thu, Aug 22 2013 12:00 PM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement