సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అసైన్డ్ భూముల లెక్క తేలింది. కొత్త జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని అసైన్డ్ భూములన్నాయి.. ఎంతమంది అసైనీలకు ఈ భూములను కేటాయించారు.. అందులో ఎంత భూమి వ్యవసాయ యోగ్యంగా ఉందనే లెక్కలను ఇటీవల ప్రభుత్వం సేకరించింది. ఈ లెక్కల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా 22,52,340.37 ఎకరాల అసైన్డ్ భూములుండగా, 15,87,021 అసైనీలకు ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. ఇందులో 18,96,898.75 ఎకరాలు వ్యవసాయ యోగ్య భూములు కాగా, వ్యవ సాయ యోగ్యం కానివి 3,55,441.62 ఎకరా లున్నాయి.
ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా అసైన్డ్ భూములున్నాయని రెవెన్యూ వర్గాల ద్వారా సేకరించిన వివరాల ప్రకారం తేలింది. ఈ జిల్లాలో మొత్తం 1.85 లక్షల ఎకరాల అసైన్డ్ భూములుండగా, అందులో 1.78 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ యోగ్యమైన భూములుగా గుర్తించారు. ఇక, అతి తక్కువగా హైదరాబాద్‌లో 291 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా, అందులో ఒక్క ఎకరం కూడా వ్యవ సాయ యోగ్యం కాదని తేలింది. ఇక, వ్యవసాయ యోగ్యం కాని భూములు ఎక్కువగా నల్లగొండ(1.38 లక్షల ఎకరాలు)లో ఉండగా, అందులో 1,386 ఎకరాలే సాగుకు అనుకూలంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసిఫాబాద్ తర్వాత ఎక్కువ అసైన్డ్ భూములుండగా.. ఒక్క ఎకరం మినహా అంతా సాగుయోగ్యమైన భూమే కావడం గమనార్హం.
15–20% వరకు థర్డ్‌పార్టీ చేతుల్లో..
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల వారీగా అసైన్డ్ భూముల వివరాలను సేకరించిన ప్రభుత్వం త్వరలోనే ఈ విషయమై నిర్ణయం తీసుకో నుందని సమాచారం. ఈ భూములకు సంబంధించి వాస్తవ అసైనీల చేతుల్లో ఎంత భూమి ఉంది, థర్డ్ పార్టీల చేతుల్లో ఎంత భూమి ఉందనే వివరాలను కూడా సేకరిం చింది. మొత్తం అసైన్డ్ భూముల్లో 15–20% వరకు థర్డ్‌పార్టీ చేతుల్లో ఉన్నాయని, అది కూడా హైదరాబాద్ శివారు జిల్లాలో ఎక్కు వగా అన్యాక్రాంతమైనట్లు గుర్తించారు. అయితే, అసైనీలతోపాటు థర్డ్‌పార్టీ సామా జిక, ఆర్థికస్థితికి సంబంధించిన వివరాలనూ తీసుకున్న ప్రభుత్వం.. అసైనీల చేతిలో ఉన్న వ్యవసాయయోగ్య భూములపై వారికే సర్వ హక్కులు కల్పించనుందని తెలుస్తోంది. ఇందుకోసం అసైన్డ్ చట్టానికి సవరణ అవసర మని నిపుణులు చెబుతున్నారు.
ఈ సవరణ మేరకు అసైనీలకు ఆ భూములను క్రమబద్ధీ కరిస్తారని, థర్డ్‌పార్టీ చేతుల్లో ఉన్న సాగు యోగ్యభూములనూ వారి సామాజిక, ఆర్థిక స్థితి ఆధారంగా రెగ్యులరైజ్ చేసే అవకాశాలు న్నాయని తెలుస్తోంది. ఇక అసైనీల చేతుల్లో లేని వ్యవసాయ అయోగ్య భూములను మాత్రం ప్రభుత్వం తన స్వాధీనం చేసుకుం టుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అసైనీలకు కొంత పరిహారం చెల్లించి వాటిని తీసుకుంటుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment