రద్దీ వేళల్లో హైదరాబాద్ రోడ్లపై ప్రయాణానికి పట్టే సమయం ఇది
లెక్కకట్టిన అంతర్జాతీయ సంస్థ టామ్‌టామ్
ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలో సర్వే
హైదరాబాద్‌కు వరల్డ్‌లో 18...దేశంలో 4వ ర్యాంక్
సాక్షి, హైదరాబాద్: రద్దీ వేళల్లో హైదరాబాద్ రోడ్లపై ఓ వాహనం 10 కిలోమీటర్లు వెళ్లాలంటే.. సరాసరిన 32 నిమిషాలు పడుతోంది. అంతర్జాతీయ సంస్థ టామ్‌టామ్ ఈ విషయం ప్రకటించింది. ఈ సంస్థ స్లో మూవింగ్ ట్రాఫిక్ ఇండెక్స్ (14వ ఎడిషన్) పేరుతో సోమవారం ఓ జాబితాను విడుదల చేసింది. ఆయా నగరాలకు ర్యాంకింగ్స్ ఇవ్వగా, హైదరాబాద్‌కు జాతీయస్థాయిలో నాలుగో ర్యాంక్, అంతర్జాతీయ స్థాయిలో 18వ ర్యాంక్ దక్కింది.
62 దేశాలో సర్వే
ఆసియా, యూరప్, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆస్ట్రేలి యా ఖండాల్లోని 62 దేశాల్లో టామ్‌టామ్ సంస్థ సర్వే చేపట్టింది. వీటిలో ఉన్న నగరాలను 3 కేటగిరీలుగా విభజించింది.
» 80 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న వాటిని మెగా సిటీలు, 80 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న వాటిని లార్జ్ సిటీ, 8 లక్షలు అంత కంటే తక్కువ జనాభా ఉన్న వాటిని స్మాల్ సిటీలుగా విభజించి సర్వే చేపట్టింది.
» ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల నుంచి సమాచారం సేకరించిన టామ్‌టామ్ దాన్ని క్షేత్రస్థాయిలో విశ్లేషించింది. ఆయా నగరాల జనాభా, అక్కడ ఉన్న వాహనాల సంఖ్య, రోడ్ల శాతం, ట్రాఫిక్ సిబ్బంది తదితరాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషించింది.
అప్పుడు.. ఇప్పుడూ అంతే..
టామ్‌టామ్ సంస్థ సర్వే ప్రకారం హైదరాబాద్‌లో రద్దీ వేళల్లో 10 కి.మీ ప్రయాణించడానికి 32 నిమిషాల సమయం పడుతోంది. గత ఏడాది నిర్వహించిన సర్వేలోనూ ఇదే నమోదైంది. ఏ డాది కాలంలో పెరిగిన వాహనాలకు తగ్గట్టు ప్రభుత్వ విభాగాలు అభివృద్ధి చర్యలు తీసుకోని కారణంగానే ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది.
ఆసియాలో ఉన్న ఇతర నగరాల్లోనూ ఈ సమయం పెద్దగా తగ్గడం, పెరగడం నమోదు కాలేదు. ట్రాఫిక్ రద్దీ, రోజూ గంటల తరబడి రోడ్లపై గడపటం వల్ల ప్రతి ఒక్కరూ విలువైన పని గంటల్ని నష్టపోతున్నారని టామ్‌టామ్ తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment