టీడీపీకి ఓటు వేసినందుకు... | AP capital village farmers concern their lands | Sakshi
Sakshi News home page

టీడీపీకి ఓటు వేసినందుకు...

Published Mon, Oct 26 2015 12:02 PM | Last Updated on Sat, Aug 18 2018 5:52 PM

చంద్రశేఖర్ తో మాట్లాడుతున్న వైఎస్ జగన్ - Sakshi

చంద్రశేఖర్ తో మాట్లాడుతున్న వైఎస్ జగన్

మల్కాపురం: 'ల్యాండ్ పూలింగ్ కు భూమి ఇవ్వనందుకు నా పంటను తగులబెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేశాం. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకు మాకు పట్టిన దుర్గతి ఇది' అని గద్దె చిన చంద్రశేఖర్ వాపోయారు.

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం చెందిన చంద్రశేఖర్ తన గోడును ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు వెళ్లబోసుకున్నారు. రాజధానికి తన పొలం ఇవ్వలేదన్న కక్షతో పంటకు నిప్పుపెట్టారని ఆయన ఆరోపించారు. భూములు ఇవ్వకపోవడం తాము చేసిన నేరమా అని ప్రశ్నించారు. చంద్రశేఖర్ కు చెందిన చెరుకు తోటను దుండగులు శుక్రవారం దగ్ధం చేశారు.

కాగా, తాము భూములు ఇవ్వబోమని చెబుతున్నా ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని వైఎస్ జగన్ తో పలువురు రైతులు చెప్పారు. తమకు అండగా నిలవాలని జననేతను కోరారు. రైతులను నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. అన్నదాతల తరపున పోరాడతామని, అవసరమైతే కోర్టుకు వెళతామని చెప్పారు. దుండగులు దగ్ధం చేసిన చంద్రశేఖర్ చెరకు తోటను వైఎస్ జగన్ పరిశీలించారు. అనంతరం పలువురు రైతులతో ఆయన మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement