
'మరో 500 ఎకరాల భూమి అవసరం'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఇప్పటివరకు భూ సమీకరణ ద్వారా 33 వేల ఎకరాల భూమి సేకరించామని ఆ రాష్ట్ర మునిసిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. గుంటూరు జిల్లా తుళ్లురు మండలం మందడం గ్రామంలో భూమిని చదును చేసే కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... రాజధాని కోసం మరో 500 ఎకరాల భూమి అవసరం అవుతుందన్నారు. ఆ భూమి కూడా భూ సేకరణ ద్వారానే తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రాజధాని రైతుల రుణమాఫీ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి పి.నారాయణ ప్రకటించారు.