
వైఎస్ జగన్ తో మాట్లాడుతున్న సురేశ్
ఉద్ధండరాయుడనిపాలెం: రాజధానికి భూములు ఇవ్వడం ఇష్టంలేదని ఉద్ధండరాయుడనిపాలెం గ్రామానికి చెందిన పలువురు స్పష్టం చేశారు. తమ వద్ద నుంచి బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటోందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
భూములు ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారని సురేశ్ అనే వ్యక్తి తెలిపాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే....
- భూములు మాకు ఇవ్వడం ఇష్టం లేదు
- 50 ఏళ్లుగా ఈ అసైన్డ్ భూముల్లో ఉంటున్నాం
- ఎన్టీఆర్ శిస్తు రద్దు చేశారు. మిగతా పన్నులు అన్నీ కడుతున్నాం
- మాది మూడో తరం, మా తాతలు కూడా ఇక్కడే ఉన్నారు
- భూములు ఇస్తున్నామని మేము ఎటువంటి సంతకాలు పెట్టలేదు
- అయినా బలవంతంగా భూములు తీసుకుంటున్నారు
- పంటలు దగ్ధం చేశారని వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు
- నన్ను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి మూడు రోజులు చిత్రహింసలు పెట్టారు
- వైఎస్ జగన్ నిప్పుపెట్టమన్నాడని చెప్పమన్నారు
- అసైన్డ్ భూముల లీజులు ముగిసిందని మమల్ని భయపెట్టారు
- ఏ ఒక్కరికి భూములు ఇవ్వడం ఇష్టం లేదు
- శంకుస్థాపన కార్యక్రమానికి మమ్మల్ని ఎవరినీ ఆహ్వానించలేదు
- శ్మశానంలోని సమాధిని ధ్వంసం చేసి రోడ్డు వేశారు
- మాకు రుణమాఫీ చేయలేదు. వృద్ధాప్య ఫించన్లు కూడా ఎవరికీ ఇవ్వలేదు
- భూములు ఇవ్వలేదన్న అక్కసుతో మాపై ప్రభుత్వం కక్ష సాధిస్తోంది