కేంద్రం టైటిల్‌తో బాబు డ్రామా | Sakshi
Sakshi News home page

కేంద్రం టైటిల్‌తో బాబు డ్రామా

Published Wed, May 1 2024 5:26 AM

Chandrababu drama with the title Kendra

అమల్లోకే రాని ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై నాటకాలు

భూములు లాక్కుంటున్నారంటూ ఎల్లో ముఠా వికృత క్రీడ 

ఐవీఆర్‌ఎస్‌ కాల్స్, వీడియోలతో భయభ్రాంతుల్ని చేసే యత్నం 

భూములన్నీ జగన్‌ పేరిటే రిజిస్టరు చేస్తున్నారంటూ పిచ్చి వ్యాఖ్యలు 

నిజానికి ఈ చట్టం తెచ్చేందుకు 1989 నుంచీ కేంద్రం ప్రయత్నాలు 

2009, 2011, 2015, 2019లో నాలుగుసార్లు ముసాయిదా చట్టాలు 

దేశ వ్యాప్తంగా అమలు చేయటానికి ‘నీతి ఆయోగ్‌’ కమిటీ 

ఎలా అమలు చేయాలో వివరిస్తూ రోడ్‌ మ్యాప్‌ జారీ 

దానికి తగ్గట్టు 2019లో ముసాయిదా చట్టం చేసిన మోదీ సర్కారు 

దీన్ని అమలు చేయాలంటే భూముల రీ సర్వే పూర్తవ్వాలి 

రీ సర్వేలో పక్కాగా ప్రతి ఒక్కరి హక్కునూ తేలుస్తూ పత్రాలు 

వాటి ఆధారంగానే అన్ని శాఖల రికార్డులూ ఏకం చేసి ‘రిజిస్టరు’ 

రాష్ట్రంలో 17 వేల గ్రామాలు... 6 వేల గ్రామాల్లో పూర్తయిన రీ సర్వే 

అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తేనే ఇక్కడా చేస్తామంటున్న ఆంధ్రప్రదేశ్‌ 

బీజేపీతో అంటకాగుతూ కూడా... చంద్రబాబు పచ్చి అబద్ధాలు 

లేని చట్టాన్ని రద్దు చేస్తామంటూ మేనిఫెస్టోలో కూడా హామీ 

దీన్ని మోదీ సభల్లో చెప్పగలరా? మోదీతో చెప్పించగలరా? 

చంద్రబాబు దివాలాకోరు తనంపై జనం మండిపాటు

అమలులోకి రాని చట్టంపై
ఇంత దుష్ప్రచారమెందుకు? ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం తేవాలని కేంద్రం స్పష్టంగా అన్ని రాష్ట్రాలకూ చెబుతున్న నేపథ్యంలో.. జనానికి నచ్చినా, నచ్చకపోయినా.. బలవంతంగానైనా దాన్ని అమల్లోకి తెచ్చే అవకాశం ఎవరి హయాంలో ఉంటుంది? బీజేపీతో కలిసి పోటీ చేస్తూ.. ఎన్‌డీఏతో కూటమి గట్టిన చంద్రబాబు నాయుడి హయాంలోనే కదా?  

ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా స్వతంత్రంగా
ఎన్నికల బరిలో ఉన్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆ చట్టాన్ని ప్రజల ఇష్టాయిష్టాల మేరకు అమల్లోకి తేవటమో, తేకుండా నిలిపేయటమో ఏదైనా చేయగలరు. కానీ చంద్రబాబు పరిస్థితి అలా కాదు కదా! బీజేపీతో కూటమి గట్టి పోటీ చేస్తున్నారు గనక.. ఎన్‌డీఏ పేరుతో ఓట్లడుగుతున్నారు కనక.. ప్రజలకు ఇష్టం ఉన్నా, లేకున్నా చచ్చినట్టు ఈ చట్టాన్ని అమలు చేసి తీరాలి. ఇది వాస్తవం. ఇది పచ్చి నిజం. మరి దొంగ మాటలెందుకు చంద్రబాబూ? పైపెచ్చు అమల్లోకి రాని ఈ చట్టాన్ని రద్దు చేస్తాననే ఓ పిచ్చి హామీని మేనిఫెస్టోలో పెట్టారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? మీ మానసిక స్థితి సరిగానే ఉందా? 

అసలు అమల్లోకే రాని ఈ చట్టంపై ఉన్నవీ లేనివీ చెబుతూ...
దాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ఆపాదిస్తూ.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేసిందని, అందరి భూములూ లాక్కుంటోందని దిగజారిపోయి దౌర్భాగ్యపు ప్రచారానికి దిగటం ఎంత నీచం? ఈ చంద్రబాబు నాయుడి నైచ్యానికి అంతూ పొంతూ ఉండదా? మనిíÙగా పుట్టాక కాస్తయినా సిగ్గూ శరం ఉండాలి కదా? 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెబుతున్న ఈ పెద్ద మనిíÙ.. ఇంత కుళ్లూ కుతంత్రాలతో.. జనం సాక్షిగా కళ్లు మూయకుండా అబద్ధాలు చెప్పేస్తూ విషం కక్కుతుండటం హేయం కాదా?

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి:  వాస్తవానికి ల్యాండ్‌ టైట్లింగ్‌  చట్టానికి పునాది పడింది 1989లోనే. భూ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలకటానికి, ఎవరి పేరుతో భూమి ఉందో వారి పేరిట టైటిల్‌ ఇచ్చి.. ఆ టైటిల్‌కు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చేలా చట్టాన్ని చేయాలని, దీనికోసం ల్యాండ్‌ రికార్డులన్నిటినీ డిజిటల్‌ చేయాల్సి ఉంటుందని అప్పట్లోనే తీర్మానించారు. ఆ తీర్మానాలకు కొనసాగింపుగా.. 2004లో జాతీయ ల్యాండ్‌ రికార్డుల కంప్యూటరీకరణ (ఎన్‌ఎల్‌ఆర్‌ఏపీ) పథకాన్ని రూపొందించారు.

దాని ప్రకారం 2009లో తొలి మోడల్‌ చట్టం తయారైంది. ఈ మోడల్‌ చట్టాన్ని అనుసరిస్తూ 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని తెచ్చింది. దానికి కొన్ని సవరణలు చేస్తూ 2015లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో ముసాయిదా చట్టాన్ని తెచ్చింది. అదిగో ఆ తర్వాతే...అంటే 2015లో ముసాయిదా తెచ్చాకే కేంద్ర ప్రభుత్వ నోడల్‌ ఏజెన్సీ ‘నీతీ ఆయోగ్‌’ దీనికో రోడ్‌ మ్యాప్‌ ఇచ్చింది. 

టైటిల్‌ గ్యారంటీకి ఏమేం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఏం చేస్తే మనం ఆ దశకు చేరుకోగలమనే రోడ్డు మ్యాప్‌ అది. ఆ రోడ్‌ మ్యాప్‌కు తగ్గట్టుగానే 2019లో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మరో ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. ఈ ముసాయిదాకు అనుగుణంగా.. ఈ చట్టాన్ని తేవాలంటే రాష్ట్ర భూముల సర్వేను పూర్తి చేయటం తప్పనిసరి కనక... ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 

రీ సర్వే పూర్తయితేనే ‘ల్యాండ్‌ టైట్లింగ్‌’ 
వాస్తవానికి రాష్ట్రంలో 17,000 గ్రామాలుండగా వాటిలో ఇప్పటికే 6 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తయింది. ఇంకా 11 వేల గ్రామాల్లో రీసర్వే జరగాల్సి ఉంది. రీ సర్వే జరిగి.. ఆ సందర్భంగా తలెత్తే వివాదాలన్నీ పరిష్కారం కావటానికి చాలా సమయం పడుతుంది. అదంతా పూర్తయ్యాక, రీ సర్వేలో పేర్కొన్న వ్యక్తులకు భూ హక్కు పత్రాలిస్తారు. ఆ పత్రాల ఆధారంగానే.. ప్రతి ఒక్కరికీ ఆయా భూముల టైటిల్‌ను వారి పేరిట మంజూరు చేస్తారు. అంటే.. రీ సర్వే పూర్తి కాకుండా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని తేవటం అసాధ్యం. రీ సర్వే పూర్తయి.. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం అమల్లోకి వస్తే... భూములపై సివిల్‌ కేసులు, క్రిమినల్‌ కేసులు, ఆర్థిక నేరాలు, ఇవేవీ లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇదీ వాస్తవం. 

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం అవసరమా? 
నిజానికిప్పుడు భూమికి సంబంధించి రకరకాల పత్రాలుంటున్నాయి. 10(1), అడంగల్‌ వంటివి రెవెన్యూ విభాగం ఇచ్చేవి. ఇక రిజిస్ట్రేషన్ శాఖ విషయానికొస్తే ఆ శాఖ రిజిస్టరైన ప్రతిసారీ ఒక డాక్యుమెంట్‌ నెంబరు కేటాయిస్తుంది. అంతేకాదు.. సర్వే సెటిల్‌మెంట్, ఎండోమెంట్, అటవీ శాఖ, వక్ఫ్, స్థానిక సంస్థలు.. వీటన్నిటి వద్దా ఒకే భూమికి సంబంధించి వేర్వేరు రికార్డులు ఉంటున్నాయి. ఆ భూమిని ఒకరు కొన్నప్పుడో, అమ్మినప్పుడో అన్ని రికార్డుల్లోనూ ఒకేసారి నమోదయ్యే అవకాశం లేదు.

దీంతో కొన్ని రికార్డుల్లో ఆ లావాదేవీలు నమోదవుతాయి. కొన్ని రికార్డుల్లో నమోదు కావటం లేదు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఒక భూమిని కొన్నాక... రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయాక... వేరెవరో వచ్చి అది తాను ముందే కొన్నానని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయాక... అది అసైన్డ్‌ భూమి అనో, గ్రామ కంఠం భూమి అనో, లేదా చుక్కల భూమి అనో తెలుస్తోంది. ఒక భూమికి సంబంధించిన రికార్డులు పలు చోట్ల పలు రకాలుగా ఉండటం వల్ల వస్తున్న సమస్య ఇది. 

ఇక రుణాల సంగతి తీసుకుంటే.. ఒక బ్యాంకు దగ్గరకు వెళ్లి డాక్యుమెంట్లు పెట్టి రుణాలు తీసుకుంటే ఆ సమాచారం రిజి్రస్టార్‌ కార్యాలయంలో అప్‌డేట్‌ కాదు. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్లు పోయాయని చెప్పి డూప్లికేట్‌ డాక్యుమెంట్‌ తీసుకుని దాని ఆధారంగా మరోసారి రుణం తీసుకోవటమో, రుణం తీçర్చకుండానే ఆ భూమిని అమ్మేయటమో జరుగుతోంది. నిజంగా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం అమల్లోకి వస్తే ఇలాంటి అక్రమాలçకు ఆస్కారం ఉండదు.  

అన్ని రికార్డులూ ఒకే రిజిస్టర్లో... 
ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం వస్తే... టైటిల్‌ రిజిస్టరులో ప్రతి భూమికీ ఒక యునిక్‌ నంబరును (రీ సర్వేలో పేర్కొన్న మేరకు) కేటాయిస్తారు. ఆ రిజిస్టరు భూములతో సంబంధం ఉండే ప్రతి విభాగానికీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా ప్రతి బ్యాంకుకూ, ఆర్థిక సంస్థకూ అందుబాటులో ఉంటుంది. దీంతో ఆయా సంస్థలు తామిచ్చే రుణాలతో సహా ఆ భూమికి సంబంధించిన లావాదేవీలన్నిటినీ ఆ రిజిస్టరులో నమోదు చేస్తాయి. కాబట్టి తదుపరి మోసాలకు, వివాదాలకు తావుండదు.  

అందుకే ప్రభుత్వ గ్యారంటీ  
మోసాలకు తావుండదు కనక.. ఈ చట్టం ప్రకారం ప్రతి భూమికీ ప్రభుత్వం ఆయా టైటిల్‌ దారు పేరిట బీమా చేయిస్తుంది. కాబట్టి ఊహించని పరిస్థితుల్లో ఆ భూమి తనదంటూ వేరెవరైనా వివాదం తెచ్చినా... ఒకవేళ అది ఏ అసైన్డ్‌ భూమో అని తేలినా.. టైటిల్‌ దారుకు ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుంది. అంటే ఆ టైటిల్‌దారుకు ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుందన్న మాట. ఇదీ చంద్రబాబు సహా ఎల్లో ముఠా ఎక్కడా చెప్పని పచ్చి నిజం.

మోదీతో చెప్పించు బాబూ? 
అసలు ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని తయారు చేసింది కేంద్రమే కదా? దానిపై వివిధ రాష్ట్రాలతో కమిటీ వేసి మరీ.. తగిన మార్గదర్శకాలు రూపొందించింది కేంద్ర ప్రభుత్వ నోడల్‌ సంస్థ ‘నీతీ ఆయోగ్‌’ కదా? ఆ కమిటీ నివేదిక మేరకు.. దానికి రకరకాల ముసాయిదాలు రూపొందించి.. దాన్ని అన్ని రాష్ట్రాలకూ పంపించింది అబద్ధమా? దానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన రాష్ట్రానికి సంబంధించిన ముసాయిదా చేయటం అబద్ధమా? ఆ కోవలోనే కదా! ఈ చట్టం తేవాలంటే ముందుగా రాష్ట్రం మొత్తాన్ని రీ సర్వే చేయాల్సి ఉంటుంది కనక ఆ సర్వే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

 అంత మాత్రానికే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం అమల్లోకి వచ్చేసిందంటూ అన్ని భూములనూ జగన్‌ ప్రభుత్వం తన పేరిట రాసేసుకుంటోందని చెబుతూ ఎన్నికల ముందర చంద్రబాబు, ఆయన పచ్చ ముఠా వికృత క్రీడ మొదలు పెట్టింది. లేని చట్టాన్ని రద్దు చేస్తామంటూ మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేయటం లేదు. బీజేపీతో, జనసేనతో కలిసి పోటీ చేస్తోంది. పైపెచ్చు రాష్ట్రంలో ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీనీ పిలిపిస్తోంది.

ఇప్పటికే ఒకసారి ప్రచారం చేసి వెళ్లిన నరేంద్ర మోదీ.. త్వరలో మళ్లీ రాష్ట్రానికి రాబోతున్నారు. మరి ఆ రోజున ప్రధాన మంత్రి ముందే ఈ చట్టాన్ని మేం అమలు చేయబోమని చెప్పగలవా చంద్రబాబూ? ఈ చట్టాన్ని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయబోమని మోదీతో చెప్పించగలవా? ల్యాండ్‌ టైట్లింగ్‌ అంటూ ఊగిపోతున్న పవన్‌ కల్యాణ్‌.. మోదీ ముందు అదే నటనను కొనసాగించగలరా? ఎన్నాళ్లీ పనికిమాలిన డ్రామాలు?

ఇదీ... ఎల్లో ముఠా సాగిస్తున్న విష ప్రచారం 
1. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ద్వారా భూములన్నీ లాగేసుకుంటారు. రాత్రికి రాత్రి ఆన్‌లైన్‌లో రికార్డులను మార్చేస్తారు. 
2. సివిల్‌ కోర్టులకు ఇక భూములపై అధికారాలు ఉండవు. ల్యాండ్‌ టైటిల్స్‌ కోర్టులు ఇవ్వాలి గానీ, రెవెన్యూ శాఖ ఎలా ఇస్తుంది..  
3. భూములకు సంబంధించిన అన్ని అధికారాలు తీసుకెళ్లి టైటిల్‌ రిజిస్టర్‌ అధికారికి ఇస్తున్నారు.. ఆయన ఎమ్మెల్యే, ఎంపీ, అధికార పార్టీ వాళ్లు చెప్పిన ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేస్తారు. 
4. ఈ చట్టం వచ్చాక భూములున్న వారంతా మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

అసలు వాస్తవాలు ఇవీ.. 
1. ప్రభుత్వం భూములెలా లాక్కుంటుంది? 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, గిరిజనులకు 3.22 లక్షల ఎకరాలకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు అందజేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కలలోనైనా ఇలాంటి ఆలోచన చేస్తుందా? నిజానికి రీసర్వే చేసేటపుడే ఆ భూమి ఎవరిదో తేల్చి.. వారి పేరిట హక్కు పత్రాలు ఇస్తోంది. ఆ హక్కుదారు పేరే కదా రికార్డుల్లో ఉంటుంది. మరి ఆ పేరును మార్చేయటం సాధ్యమా? రాత్రికి రాత్రి ఆన్‌లైన్లో ఎలా మార్చేస్తారు? మన పేరిట హక్కు పత్రం ఇచ్చినపుడు...ఆ  పత్రం మనదగ్గర ఉన్నపుడు రికార్డుల్లో మన పేరు మార్చేయటం ఎలా సాధ్యం? ఏ కొంచెం ఆలోచన ఉన్నా ఇది తెలిసిపోతుంది కదా! 

2. రికార్డుల్లో జరిగే తప్పులపై ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నది తహసీల్దారు, ఆర్‌డీఓ, కలెక్టరు ప్రభుత్వ అధికారులకే కదా? వీళ్లతో పాటు ఉండే టైటిల్‌ రిజి్రస్టారు కూడా ప్రభుత్వాధికారే ఉంటారు. దీన్లో తప్పేముంది? ఇక భూమి యాజమాన్యంపై వచ్చే సివిల్‌ వివాదాలు ఇప్పటి మాదిరే కోర్టుల్లోనే పరిష్కారమవుతాయి. దీన్లో ఎలాంటి తేడా ఉండదు. మరి కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదనటం పచ్చి అబద్ధం కాదా? 

3. అన్ని అధికారాలూ టైటిల్‌ రిజి్రస్టారుకు ఎందుకుంటాయి? ఇప్పుడు భూముల రిజిస్టరు సబ్‌ రిజి్రస్టారు కార్యాలయంలో ఉంటోంది. ఆయన కూడా ప్రభుత్వాధికారే. మరి ఆయన ఎమ్మెల్యే, ఎంపీలు చెప్పినట్లు రికార్డుల్లో పేర్లు మార్చేయగలుగుతున్నారా? ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేయగలుగుతున్నారా? రికార్డుల్లోని వివరాల నిర్వహణకు ప్రభుత్వం నియమించే గుమాస్తాగానే ఆయన్ను చూడాలి తప్ప.. రికార్డులు మార్చే అధికారం తనకు ఎందుకుంటుంది?  

4. మళ్లీ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు? అసలు ఆ అవసరం ఎందుకుంటుంది? వివిధ కార్యాలయాల్లో ఉండే వివరాలను ఆన్‌లైన్లో క్రోడీకరించి.. రీ సర్వేలో ఇచ్చిన హక్కు పత్రాల ఆధారంగా రిజిస్టరులో ప్రభుత్వమే నమోదు చేసుకుంటుంది. మళ్లీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement