Ramoji
-
రామోజీ లేరు.. విచారణా అక్కర్లేదు!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు.. యావద్భారతం ఒక కేస్ స్టడీగా గమనిస్తున్న వ్యవహారం.. ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 45 (ఎస్) ఉల్లంఘన జరిగిందా? లేదా? అన్నది ఆరు నెలల్లో తేలా్చలంటూ స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించిన నేరం.. సెక్షన్ 45 (ఎస్)ను ఉల్లంఘిస్తూ, అక్రమ డిపాజిట్ల సేకరణ జరిగిందంటూ స్వయంగా ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసిన పరిస్థితి.. నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది మంది డిపాజిటర్లపై తీవ్ర ప్రభావం చూపే ఆర్థిక లావాదేవీలు.. ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు.. ఇందుకు భిన్నంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు చూసి విశ్లేషకులు, నిపుణులు నివ్వెర పోతున్న పరిస్థితి.. డిపాజిటర్ల వైపు నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు రామోజీ వైపు నిలబడుతున్న వైనం.. ఆర్బీఐ మాటలూ బేఖాతర్.. మరోవైపు చనిపోయిన రామోజీపై నేరం నెట్టేసి.. చేతులు దులుపేసుకునే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రయత్నం.. ఇప్పుడు ఈ అంశంపైనే సర్వత్రా ఆసక్తి...సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు వేల కోట్ల రూపా యల ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) ఆధారాలతో సహా ఒకవైపు నిరూపిస్తుంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఊసే ఎత్తడం లేదు. పైపెచ్చు మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని ప్రస్తుత కర్త కిరణ్‌ను చట్ట ఉల్లంఘనల నుంచి కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను చాలా సూటిగా తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.మార్గదర్శి ఫైనాన్షియర్స్ కర్త రామోజీరావు మరణించిన నేపథ్యంలో, ఈ వ్యాజ్యాలపై విచారణే అవసరం లేదని చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు తేల్చి చెప్పింది. అనవసరమైన విచారణ జరిపి సమయాన్ని వృథా చేసుకోవద్దని ఏకంగా హైకోర్టుకే సూచించింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఆర్బీఐ చూసుకుంటుంది.!: ఏపీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ఫిర్యాదులు ఏవీ లేవని, పత్రికా ప్రకటనలు ఇచ్చిన తరువాత కూడా ఎవరూ ముందుకు రాలేదని, అందువల్ల విచారణ జరిపి ప్రయోజనం లేదని ఏపీ ప్రభుత్వం వివరించింది.ఒకవేళ తర్వాత ఎవరైనా ఫిర్యాదు చేస్తే, వారి సంగతి రిజర్వు బ్యాంక్ చూసుకుంటుందని ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే రీతిన వాదనలు వినిపించింది. అయితే కోర్టు తీర్పు మేరకు చర్యలు చేపడతామంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. ఏ వాదన వినిపిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్కు లబ్ది చేకూరుతుందో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలాంటి వాదనలే వినిపించాయి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనల్లో ఎక్కడా మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావుల అక్రమాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం. మార్గదర్శి అక్రమాలకు ఆధారాలున్నా, కనీస స్థాయిలో కూడా వాటి గురించి ప్రస్తావించలేదు. డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమే: ఆర్బీఐ మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన వైఖరిని పునరుద్ఘాటించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 (ఎస్)కి విరుద్ధంగా ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లు వసూలు చేశారని మరోసారి తేల్చి చెప్పింది. ఇలా చేయడం సెక్షన్ 58బీ(5ఏ) ప్రకారం అత్యంత శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. రామోజీ లేరు కాబట్టి, పిటిషన్‌ను మూసివేయాలంటూ మార్గదర్శి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును అభ్యరి్థంచింది.రిజర్వ్ బ్యాంక్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ, రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్‌యూఎఫ్ బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదురోవాల్సిందేనని స్పష్టం చేశారు. కేసును మూసేయాలంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థన సమర్థనీయం కాదన్నారు. చట్టవిరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించిందని, ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)ను ఉల్లంఘించిందని ఆయన మరోసారి ధర్మాసనానికి గుర్తు చేశారు. హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావు మరణించినా కూడా విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. అప్పుడు అలా చెప్పి.. ఇప్పుడు ఇలా..: ఉండవల్లి మరోవైపు ఈ కేసులో కోర్టు సహాయకారిగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, గతంలో అసలు ఎలాంటి అక్రమాలు జరగలేదని మార్గదర్శి ఫైనాన్షియర్స్ బల్లగుద్ది మరీ చెప్పిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఒకవేళ అక్రమాలు ఏవైనా జరిగి ఉంటే అందుకు రామోజీరావే బాధ్యత వహించాల్సి ఉందని ఇప్పుడు చెబుతోందన్నారు. మనిషి మరణించినా కూడా ప్రాసిక్యూషన్ ఆగదన్నారు. కుటుంబ సభ్యులు బాధ్యులు కారు: మార్గదర్శి కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను మార్చి 7కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ కె.సుజనలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఆ రోజున ఉండవల్లి వాదనలు పూర్తిస్థాయిలో వింటామంది. అంతక్రితం మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, రామోజీ మృతి చెందినందున ఆయన నేర చర్యలకు కుటుంబ సభ్యులు బాధ్యులు కారని తెలిపారు. సివిల్ చర్యల విషయంలో వాదనలు వినిపిస్తామన్నారు. రామోజీరావు ఓ కంపెనీ యజమాని అని, ఆ కంపెనీ చర్యలకు యజమానే వహించాల్సి ఉంటుందన్నారు. యజమాని చనిపోయారు కాబట్టి మిగిలిన కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సిన అవసరం లేదన్నారు. నేపథ్యం ఇదీ.. చట్ట నిబంధలను ఉల్లంఘించి ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లు వసూలు చేసినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ అ«దీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేయాలంటూ మార్గదర్శి, రామోజీరావు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రజనీ, నాంపల్లి కోర్టులో అధికారి దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ 2018, డిసెంబర్ 31న తీర్పునిచ్చారు.ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అన్నీ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, అ«దీకృత అధికారి ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచి్చన తీర్పును తప్పుపట్టింది. ఆ తీర్పును రద్దు చేసింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. దీంతో తెలంగాణ హైకోర్టు 2024, జూన్ నుంచి తన విచారణను ప్రారంభించింది. అంతా ఆయన చేశారు..: మార్గదర్శి ఫైనాన్షియర్స్ విచారణ కొనసాగుతుండగానే మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన బాధ్యతలను తప్పించుకుని, వివాదాన్ని మరణించిన రామోజీ మీదకు తోసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. ఈ మేరకు హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యకలాపాలు చేపట్టినందున దాని కర్త రామోజీరావు మాత్రమే బాధ్యడవుతారని, ఇతర కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని ఆ పిటిషన్లో పేర్కొంది. దీంతో న్యాయస్థానం తొలుత ఈ అనుబంధ పిటిషన్లపై వాదనలు వినేందుకు సిద్ధమైంది. కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రిజర్వ్ బ్యాంక్‌ను సైతం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు వారు కూడా కౌంటర్లు దాఖలు చేశారు. తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ శ్యామ్ కోషి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. -
మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం!
‘న నిశ్చితాత్ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. అందుకు ఉదాహరణ ఎన్టీఆర్. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివనీ, గమ్యం చేరవనీ నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలుస్తారు. గొప్ప మనసున్న తండ్రి ఆయన. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పరిపాలించారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి చిత్తశుద్ధితో పాటుపడ్డారు. అందుకే – మరణించిన తరువాత కూడా ఆ మహోన్నత వ్యక్తి నేటికీ జీవించే ఉన్నారు.తెలుగు రాష్ట్రంలో కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28న జన్మించిన మహానేత ఎన్టీఆర్ గారికి నేటికి 101 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ ఆయన దివ్య తేజస్సు తగ్గలేదు. మరణించి 28 సంవత్సరాలు అయినా ఎన్టీఆర్ పేరు అభిమానుల గుండెల్లో మారుమ్రోగుతూనే వుంది. ఆ రూపం అలరిస్తూనే ఉంది. ఆయన సినిమాలు, రాజకీయ జీవితంలో మాదిరిగానే ఆయన వ్యక్తిత్వంలోనూ అనేకానేక విశేషాంశాలు ఇమిడి ఉన్నాయి. ఎన్టీఆర్ గారిలో మొదటి నుండి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడటం, అనుకున్నది సాధించేవరకు వెనుకడుగు వేయకపోవటం అనేవి ప్రత్యేక గుణాలు. ఇవే ఆయనను సినీ, రాజకీయ రంగాల్లో విజయపథం వైపు నడిపించాయి. ‘న నిశ్చితాత్ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. ఆ లక్షణం ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిలో చూశాను. ముక్కుసూటిగా పోయే ఇలాంటి నాయకులకు శత్రువులు కూడా ఎక్కువే అనడటానికి వీరిద్దరూ ఎదుర్కొన్న సంఘటనలే సాక్ష్యం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా – ఆయన భార్యగా అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని కనుక ఆయన వ్యక్తిత్వాన్ని తెలియచేసే ప్రధానమైన రెండు మూడు సంఘటనలు వివరిస్తాను. ఒక్క మా పెళ్లి విషయంలోనే తీసుకుంటే పెళ్లికి ముందు– తర్వాత ఎన్టీఆర్ ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా వేడుకల్లో ఎన్టీఆర్ మా వివాహ ప్రకటన చేయగానే చంద్రబాబు ఆ ప్రకటన ప్రజల్లోకి వెళ్లకూడదని మైకులాపించి, లైట్లు ఆర్పించారు. అయినా ఆయన మరుసటి రోజు ఇంట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా పెళ్లిని ప్రకటించి మరీ వివాహం చేసుకున్నారు. అక్కడ నుండి నన్ను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా చేయటానికి చంద్రబాబు, కుటుంబ సభ్యులు కలిసి ఎన్నో పన్నాగాలు పన్నారు. ఎన్టీఆర్ ధైర్యంగా నన్ను అందరి ముందుకు తీసుకెళ్లి నా స్థానం ఏమిటో సగర్వంగా ప్రకటించారు. ప్రతి అవమానంలో అండగా నిలబడి మాకు కీడు చేస్తున్న వారందరినీ ఎదిరించారు. చీకటి రాజకీయాలకు అలవాటు పడ్డ చంద్రబాబు లాంటి వ్యక్తికి ఆయనొక సవాలుగా నిలబడ్డారు. పెద్ద వయస్సులో ఒంటరితనంతో బాధపడుతున్న ఎంతోమందికి మా వివాహం ఒక మార్గం చూపించింది. దాని మీద కొన్ని ఆర్గనైజేషన్స్ ఏర్పడటం కూడా ఒక విశేషమే! మరో సంఘటన – 1994 ఎన్నికల ప్రచారంలో నన్ను ఇంట్లో ఉంచమని అనేకమంది ద్వారా చెప్పించారు. ఎన్.వి రమణ లాంటి అన్యాయవాదుల్ని ఇంటికి పంపి ఈ పెళ్లి చెల్లదని కూడా వాదించేటట్లు చేశారు. ఎన్టీఆర్ దేనికీ చలించలేదు. తన ఆలోచన మార్చుకోలేదు. నన్ను తీసుకునే ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. స్వయంగా 216 స్థానాలు, మిత్ర పక్షాలకు మరో 34 స్థానాలు సంపాదించి రాజకీయరంగంలో ఒక రికార్డు సాధించారు. మళ్లీ ఆ స్థాయి రికార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరగరాశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని తమ అధికార దాహంతో లాగేయాలని కుట్రలు పన్నిన రామోజీ, చంద్రబాబు అందుకు నన్నే కారకురాలిగా చూపించారు. ఒక రాజ్యాంగేతర శక్తిగా నా ప్రాతను చిత్రీకరించి, నన్ను విడిచి పెడితేనే తిరిగి పదవి ఇస్తామని ప్రలోభపెట్టారు. ఇక్కడే ఎన్టీఆర్ గొప్ప వ్యక్తిత్వం మేరు పర్వతం లాగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవటానికి సిద్ధపడ్డారు కానీ భార్యను మాత్రం వదులుకోలేదు. పైగా వారికో సవాల్ విసిరారు. ‘‘నా పార్టీ, నేను సాధించుకున్న పదవి నాకు తిరిగి ఇవ్వటమేమిటి? ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న స్త్రీని బయటకు పంపించటం ఏమిటి? మీ భార్యల్ని అలా వదిలేస్తారా? నా భార్య తప్పు చేసిందని నిరూపించండి. బహిరంగంగా ఆమెను శిక్షిస్తాను’’ అన్నారు. ఈ మాటలు ఆయన ఆత్మవిశ్వాసాన్ని, తనపై నమ్మకాన్ని నిలబెట్టాయి. ఎప్పటికప్పుడు వారి నిందల నుండి నన్ను గుండెల్లో పొదువుకొని కాపాడుకున్నారు ఆయన. ఒక సందర్భంలో ఎన్టీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ– ‘‘రాజ్యం కోసం ఆ రాముడు తన భార్యను అడవులకు పంపేశాడు. కానీ ఈ రాముడు తన భార్య గౌరవం కోసం అధికారాన్నే వదులుకున్నాడు’’ అన్నారు. ఇలాంటి నిశ్చితాభిప్రాయాలు ఎంతమంది మగవాళ్లలో ఉంటాయి?! చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు. ఎన్టీఆర్ గారి సదభిప్రాయాలను, ఆశయాలను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుని కుటుంబ సభ్యులు ఎంతో బాధించారు– వేధించారు– అవమానాల పాలు చేశారు. అయినా చివరి క్షణం వరకు ఆయన తన కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉన్నారు. ప్రతిరోజూ వాళ్ల ఇంటికి స్వీట్లూ, ఫ్రూట్లూ పంపిస్తూనే వచ్చారు. వాళ్లు అప్పుడప్పుడూ వచ్చి డబ్బు పట్టుకుని పోతూ ఉండేవారు. మళ్లీ బయట మాత్రం వాళ్లంతా చంద్రబాబుతో చేతులు కలపడం! ఏది ఏమయినా గొప్ప మనసున్న తండ్రి ఎన్టీఆర్. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పాలించినవారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి ప్రయత్నించి భంగపడ్డ ధీరుడు.ఎన్ని రకాలుగా చంద్రబాబు, రామోజీలు కుట్రలు పన్ని అవమానించినా, పదవి లాగేసినా తల వంచకుండా తన చివరి క్షణం వరకు ఆయన తన పోరాటాన్ని కొనసాగించారే తప్ప ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ‘‘స్థిరత్వం, ధీరత్వం, ఉచితజ్ఞతా, ప్రియ వక్తృత్వం– చత్వారో సహజాగుణాః అభ్యాసే న లభ్యంతే’’ అని పెద్దలు చెప్పినట్లు ఈ లక్షణాలు ఆయన పుట్టుకతోనే వచ్చాయి. చివరి వరకు ఆ గుణాలు నిలబెట్టుకున్న ధీర గంభీరుడు ఎన్టీఆర్. నిబద్ధత లేని జీవితం ముళ్ల చెట్టు లాంటిది. ఎవరికీ ఉపయోగం ఉండదు. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివి. గమ్యం చేరవు. ఇది నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలుస్తారు. అందుకే మరణించి కూడా నేటికీ మన మధ్య జీవించే ఉన్నారు. డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త ఎన్టీఆర్ సతీమణి -
తోడు దొంగలు
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు, చెరుకూరి రామోజీరావు.. అందరికీ చిరపరిచితమైన ఈ తోడు దొంగలు పైకి అత్యంత సత్యవంతులుగా, నీతీ నిజాయితీల గురించి ఒకరు మాటల్లో, మరొకరు రాతల్లో లెక్కలేనన్ని పాఠాలు చెబుతూ సమాజ నిర్దేశకులుగా కనిపిస్తారు. వారి చరిత్ర చూస్తే అంతా అవినీతి, అక్రమాలే. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, నయవంచనలే పరమపద సోపానాలుగా ఎదిగిన వారు.రాజకీయ నాయకుడిగా చంద్రబాబు, మీడియా అధిపతిగా రామోజీరావు 40 ఏళ్లుగా ఒకరికొకరు సహకరించుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్ల సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. రాజకీయంగా చంద్రబాబును ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి రామోజీరావు అన్ని రకాలుగా అండదండలు అందించారు. రామోజీ వ్యాపార సామ్రాజ్య విస్తరణకు చంద్రబాబు బరితెగించి సహకరించారు. చంద్రబాబు కోసం రామోజీ తన మీడియాను విశృంఖలంగా ఉపయోగించారు. ఈ ఎన్నికల్లోనూ సిగ్గు విడిచి, బట్టలూడదీసుకుని మరీ అబద్ధాల యుద్ధం చేశారు.జీజే రెడ్డి అనే ప్రముఖుడి దగ్గర గుమస్తాగా చేరి ఆయన ఆస్తులన్నింటినీ కొట్టేసిన ఘరానా దొంగ రామోజీ. మార్గదర్శి చిట్‌ఫండ్స్, ఈనాడు కూడా జీజే రెడ్డి ఆలోచనలే. జీజే రెడ్డిపై దేశద్రోహం కేసు నమోదవడంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. దీంతో ఆయన ఆస్తులన్నింటినీ రామోజీరావు సొంతం చేసుకున్నారు. మార్గదర్శిలో రామోజీ వాటా కేవలం రూ.10 మాత్రమే. మిగిలిన పెట్టుబడి అంతా జీజే రెడ్డిదే. దీనిపై ఇటీవల ఆయన కుమారుడు యూరీ రెడ్డి కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.జీజే రెడ్డే కాదు.. సొంత బంధువులను కూడా మోసం చేసి విజయవాడ, విశాఖలో వారి ఆస్తులు కొల్లగొట్టారు రామోజీ. ఇలా దోపిడీ మార్గాల్లో సమకూర్చుకున్న ఆస్తులను రక్షించుకునేందుకు రాజకీయాలను ఉపయోగించుకున్నారు. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీని గుప్పిట్లో పెట్టుకున్నారు. దీనికి ఎన్టీఆర్ అంగీకరించకపోవడంతో అధికారం కోసం గుంట నక్కలా వేచి చూస్తున్న చంద్రబాబును చేరదీశారు. ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి చంద్రబాబుతో కలిసి కుట్ర పన్నారు.రామోజీ అండదండలతో చంద్రబాబు సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక రామోజీరావు వ్యాపారాలకు అన్ని రకాలుగా సహకరించారు. చంద్రబాబు అవినీతికి రామోజీ సహకరించారు. ఈనాడు విస్తరణ, మార్గదర్శి ద్వారా వేల కోట్లు దోచుకోవడానికి, ఫిలిం సిటీకి వేలాది ఎకరాల పేదల భూములు కొట్టేయడానికి సహకరించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే రామోజీ సంస్థలు వేల కోట్లకు ఎదిగాయి.చంద్రబాబు ఏలేరు, ఐఎంజీ భారత్ కుంభకోణాలకు రామోజీ మద్దతుచంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కుంభకోణాలు, అక్రమాలకు రామోజీ కప్పెట్టేశారు. బాబు ఎంత భయంకరమైన స్కాములు చేసినా ఈనాడులో ఒక్క అక్షరం రాయలేదు సరికదా, ఆయన్నో గొప్ప విజనరీగా చిత్రీకరించారు. ఐఎంజీ భారత్, ఏలేరు భూముల కుంభకోణాలు బయటకు రాకుండా తొక్కిపెట్టారు.హైదరాబాద్‌లో స్టేడియంలు నిర్మించి, ఒలింపిక్ క్రీడాకారులను తయారు చేసే పేరుతో ఐఎంజీ భారత్‌కి 2004లో ఆపద్ధర్మ సీఎంగా ఉండగా చంద్రబాబు 800 ఎకరాలను అక్రమంగా కేటాయించాడు. దీన్ని కోర్టు తప్పు పట్టింది. ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని ఇటీవల తీర్పు కూడా ఇచ్చింది. ఇలాంటి ఎన్నో అక్రమాలను కప్పి పుచ్చి చంద్రబాబును గొప్ప నేతగా చూపించే ప్రయత్నం చేశారు రామోజీ. 2004లో ఓడిపోయిన తర్వాత కూడా చంద్రబాబుకు రాజకీయంగా సహకారం అందించారు.రామోజీ బంటుగానే చంద్రబాబుతన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడిన రామోజీకి చంద్రబాబు ఎప్పుడూ బంటుగానే ఉన్నారు. ఈనాడు గ్రూపు ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని దివాలా తీసే పరిస్థితులకు వెళ్లినప్పుడు చంద్రబాబు సహకారం అందించారు. మార్గదర్శి అక్రమాలు బయటపడి రామోజీ జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కోసం నిలబడి తెరవెనుక నుంచి మద్దతు పలికారు. దీనికి ప్రతిగా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు రామోజీ శాయశక్తులా ప్రయత్నించారు.2014–19 సంవత్సరాల మధ్య ప్రపంచమే నివ్వెరపోయేలా జరిగిన అమరావతి భూముల కుంభకోణం సహా ఆయన చేసిన అరాచకాలని్నంటినీ రామోజీ కప్పిపుచ్చారు. ఈ ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబును గెలిపించేందుకు సిగ్గు ఎగ్గు వదిలేసి ప్రజల మెదళ్లలో విషం ఎక్కించేందుకు సర్వశక్తులూ ఒడ్డారు.ఇలా ఆది నుంచి తోడు దొంగల్లా బాబు, రామోజీ ఒకరికొకరు ఆలంబనగా నిలబడి మోసాలు, కుట్రలతో ప్రజలను వంచిసూ్తనే ఎదిగారు. ఇప్పుడు కూడా వాటినే అస్త్రాలుగా ఉపయోగించుకుని ఈ దొంగలిద్దరూ మళ్లీ అధికారంలోకి వచ్చి దోపిడీని కొనసాగించాలని తహతహలాడుతున్నారు. కానీ నమ్మకం, నయవంచనలకు నిలువెత్తురూపాలైన ఈ ఇద్దరు రాక్షసుల ఆటలు సాగే పరిస్థితులు కనిపించట్లేదు. -
కబ్జాకోరు రామోజీ
రోజూ ఉషోదయం నుంచే గురివింద నీతులు చెప్పే ఓ రామోజీ.. దీనికి మీరేం సమాధానం చెబుతారు? వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి, ఆ చట్టం గురించి నీకు తెలీదా? లేక ఈ చట్టం చంద్రబాబు చుట్టం అనుకున్నావా? నాకు వర్తించదనే గర్వమా? ఒక మత సంస్థ భూమిని ఇంత దౌర్జన్యంగా, నిస్సిగ్గుగా లాక్కొన్నదే కాకుండా.. దౌర్జన్యం చేయడం, బెదిరించడం, పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెడతామని హెచ్చరించడం..ఇవన్నీ మీ చంద్రబాబును చూసుకునే కదా! ఈనాడును అడ్డుపెట్టుకుని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? అవునులే.. ఫిల్మ్ సిటీ భూములే కొట్టేశాను.. ఇవెంత అనుకున్నావేమో.. ఇలాంటి బాగోతాలు ప్రతి జిల్లాలోనూ లెక్కలేనన్ని ఉంటే ఇదొక్కటేగా బయటపడింది అనుకోవచ్చు.. తీగ లాగితే డొంక కదులుతుందన్న సామెతను ఓసారి గుర్తు చేసుకోండి.కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కర్నూలు నగర సమీపంలో అత్యంత విలువ చేసే వక్ఫ్ బోర్డు (మసీదుకు చెందిన) భూమిని ఈనాడు రామోజీరావు అక్రమంగా చేజిక్కించుకున్నారు. తనకున్న పలుకుబడి, పత్రికను అడ్డం పెట్టుకుని అడ్డదారిలో వెళ్లి విలువైన భూమిలో పాగా వేశారు. వక్ఫ్ బోర్డు నోటీసులు, కోర్టులను లెక్క చేయక తను చెప్పిందే వేదమంటూ ఏకంగా ఆ భూమి తనదేనంటూ బోర్డు కూడా పెట్టారు. కర్నూలు–హైదరాబాద్ రహదారిలో సంతోష్ నగర్ దాటిన తర్వాత ఈనాడు జిల్లా ఎడిషన్ (ఎడిటోరియల్ విభాగం + ప్రింటింగ్) ఏర్పాటు చేసిన చోటుకు పక్కనే వక్ఫ్ భూమి ఉంది. రామోజీ తన కుమారుడు, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఎండీ సీహెచ్ కిరణ్ ద్వారా పావులు కదిపి.. ఈ కంపెనీ పేరుతో ఆ భూమిని కొనుగోలు చేసినట్లు మత పెద్ద ఒకరిని లోబరుచుకుని రికార్డులు సృష్టించారు. వక్ఫ్ భూములను కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరమని అందరికీ గురివింద నీతులు చెప్పే రామోజీ రావు ఇలా అక్రమ మార్గంలో ఈ భూమిని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ భూమిని కాపాడుకునే విషయమై వక్ఫ్ అధికారులు పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రామోజీ పలుకుబడి ముందు అవి సరిపోలేదు. కన్ను పడింది.. కబ్జా చేశాడు.. కర్నూలు నగర శివారులోని మునగాలపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 80లో 4.68 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో, 1963 అక్టోబరు 24వ తేదీన ముద్రించిన వక్ఫ్ గెజిట్‌లో ఈ భూమి గ్రామ జామియా మసీదుకు చెందిన భూమి అని స్పష్టంగా నమోదై ఉంది. అంటే మసీదుకు చెందిన ఇనాం భూమి. కాశ్నిర్ – కన్యాకుమారి 44వ నంబర్ జాతీయ రహదారి (గతంలో ఎన్‌హెచ్–7)ని ఆనుకుని ఉంది.ఈ 4.68 ఎకరాల్లో ఈనాడు గ్రూపునకు చెందిన ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ 2.78 ఎకరాలను 1995 డిసెంబర్ 15న అప్పటి ముతవల్లి మజీద్ హుసేన్‌ను మభ్యపెట్టి, భయపెట్టి అక్రమంగా రిజిస్టర్ చేయించుకుంది. అప్పట్లో ఈ స్థలంలో తన పత్రిక కార్యాలయం భవన నిర్మాణానికి ప్రయత్నించగా, వివాదం చెలరేగి, స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో వక్ఫ్ భూమి పక్కనే ఉన్న మరో ప్రైవేటు స్థలంలో ఈనాడు కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. కానీ ఈ భూమిపై కన్ను పడటంతో ఆ తర్వాత తప్పుడు మార్గంలో చేజిక్కించుకుని అక్రమంగా తన ఆ«దీనంలోనే ఉంచుకున్నారు. ఎండీ కిరణ్ పేరుతో నోటీసులు మసీదులు, దర్గాల నిర్వహణ కోసం గతంలో పూరి్వకులు వక్ఫ్‌కు భూములు, స్థలాలు బోర్డుకు స్వా«దీన పరుస్తారు. వీటిని ముతవల్లులు నిర్వహించి, వాటి ద్వారా వచ్చే సొమ్ముతో మసీదు నిర్వహణ ఖర్చులు పోనూ మిగిలిన సొమ్ములో కొంత బోర్డుకు కౌలు (గుత్త) రూపంలో చెల్లించాలి. ఇలాంటి భూమిని రామోజీ అక్రమంగా పొందారని గుర్తించిన వక్ఫ్ బోర్డు.. ఆ భూమిని తమకు స్వా«దీన పరచాలని ఈనాడు సంస్థ, ఉషోదయ పబ్లికేషన్స్ ఎండీ కిరణ్ పేరుతో వక్ఫ్ అధికారులు పలుసార్లు నోటీసులు జారీ చేశారు. వాటన్నింటికీ రామోజీ, ఆయన తనయుడు ఇసుమంతైనా స్పందించలేదు. ముతవల్లిని అరెస్టు చేయించిన ఈనాడు జామియా మసీదుకు చెందిన సర్వే నంబర్ 80లోని మొత్తం 4.68 ఎకరాల ఇనాం భూమిలో ఈనాడు – ఉషోదయ సంస్థ 2.78 ఎకరాలను అప్పటి ముతవల్లి మజీద్ హుసేన్ నుంచి అక్రమంగా పొందడంతో మిగిలిన 1.90 ఎకరాల భూమిని సాగు చేసుకొని మసీదు బాగోగులు, నిర్వహణ కోసం ఉపయోగించుకుందామని ప్రస్తుత ముతవల్లి షేక్షావలి ఆ భూమిలోకి వెళ్లారు. ఈనాడు యాజమాన్యం తమ సంస్థ ప్రతినిధుల ద్వారా ముతవల్లి షేక్షావలిని తీవ్రంగా బెదిరించింది. ఆ భూమి అంశం కోర్టులో ఉందని, తమ భూమిలో అక్రమంగా ప్రవేశించారంటూ పోలీసులతో అరెస్టు చేయించింది. దీంతో వక్ఫ్ బోర్డు అధికారులు జోక్యం చేసుకుని వాస్తవాలన్నీ వివరించడంతో పోలీసులు ఆయన్ను వదిలేశారు. వక్ఫ్ చట్టం గురించి తెలీదా రారా.. వక్ఫ్ ఆస్తులు ఎప్పటికీ వక్ఫ్ బోర్డుకు చెందినవే అని గతంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచి్చంది. అవి మసీదులు, ఆ మత సంస్థలకే చెందాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. వక్ఫ్ ఆక్ట్ 52ఏ సవరణ (2013 నవంబరు 1వ తేదీ) ప్రకారం వక్ఫ్ బోర్డు భూములు కొనుగోలు చేసిన, అమ్మిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. ఇంత కఠినంగా చట్టాలున్నా, ఈనాడు రామోజీరావు (రారా) చంద్రబాబు ద్వారా వాటిని తన చుట్టాలుగా మార్చుకొని అనుభవిస్తున్నారు.కాగా, రాష్ట్రంలోనే అత్యధిక వక్ఫ్ ఆస్తులు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,104 సంస్థలు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉండగా, 741 సంస్థలు ఆస్తులు కలిగి ఉన్నాయి. వీటి పేర్లతో 22,599.89 ఎకరాల భూమి గెజిట్‌లో నమోదైంది. మరో 10 వేల ఎకరాలు గెజిట్‌లో నమోదు కాని భూములున్నాయి. ప్రస్తుతం రామోజీ రావు ఆక్రమించిన భూమి గెజిట్‌లో నమోదైనది కావడం గమనార్హం. చర్యలు తీసుకోకుండా ఒత్తిడి రామోజీరావు చెరలో అక్రమంగా ఉన్న వక్ఫ్ భూములను రక్షించాలని కోరుతూ అప్పట్లో స్థానికులు ఆందోళనలు చేశారు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలిచ్చారు. దీంతో రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. అక్రమంగా పొందిన వక్ఫ్ భూములను స్వా«దీనం చేసుకునే ముందు వక్ఫ్ యాక్ట్ 51, 52 సెక్షన్ల కింద బోర్డు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అయితే బెదిరింపులు, ఒత్తిళ్ల కారణంగా అధికారులు వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 54 కింద ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్‌కు 1999 జూన్ 7న నోటీసులిచ్చారు. ఈ సెక్షన్ నిందితులు అని నిర్ధారించాకే చర్య తీసుకోవడానికి వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు.అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి తేవడంతోనే అధికారులు ఈ తిరకాసు సెక్షన్ కింద నోటిసులిచ్చారని తెలుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న రామోజీరావు వక్ఫ్ బోర్డు నోటీసులను సవాలు చేస్తూ ఏపీ వక్ఫ్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. ఎనిమిదేళ్ల పాటు విచారణ సాగింది. 2008 ఏప్రిల్ 22న తీర్పు వెల్లడైంది. గెజిట్ నోటిఫికేషన్‌తో పాటు సర్వే కమిషనర్ రిపోర్టు ఆధారంగా సర్వే నంబర్ 80లో ఉన్న భూమి వక్ఫ్ భూమిగా నిర్ధారించింది. అధికారుల తప్పిదాన్ని ఎత్తి చూపి, వక్ఫ్ బోర్డు ఇచ్చిన నోటిసుల సెక్షన్లు సరైనవి కావని తప్పుబట్టింది.పూర్తి స్థాయి చర్యలకు ‘వక్ఫ్ యాక్ట్ సెక్షన్లు 51, 52 కింద నోటీసులిచ్చే అధికారం వక్ఫ్ బోర్డు సీఈఓకు సంపూర్ణంగా ఉందని తీర్పునిచి్చందని అధికారులు చెప్పారు. వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 54 కింద నోటీసులు జారీ చేసి, భూమిని స్వా«దీనం చేసుకోడానికి చట్టం ఒప్పుకోదని.. సరైన మార్గంలో చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ తీర్పు వెలువడిన మూడేళ్ల తర్వాత 2011 సెపె్టంబరు 20న ట్రిబ్యూనల్ సూచించిన సెక్షన్ 51 కింద బోర్డు సీఈఓ నోటీసులిచ్చారు. తర్వాత జిల్లా వక్ఫ్ అధికారులు కలెక్టర్‌కు పలుమార్లు లేఖలు రాశారు. ఈ భూమి రిజి్రస్టేషన్‌ను రద్దు చేయాలని 2019లో కర్నూలు జిల్లా కలెక్టర్ నోటీసులిచ్చారు. రామోజీ తన పలుకుబడితో రిజి్రస్టేషన్ అధికారులను భయపెట్టి నోటీసులు అమలు కాకుండా చూసుకున్నారు. దీంతో ఇప్పటికీ ఆ భూమి ఈనాడు చెరలోనే ఉండిపోయింది. రామోజీరావు ఆక్రమించిన భూమిలో రెండు బోర్డులు ఏర్పాటు చేశాడు. అందులో ‘‘దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్.. యాజ్ ఫర్ ది జడ్జిమెంట్ డేటెడ్ 22–04–2008 ఆఫ్ ఏపీ వక్ఫ్ ట్రిబ్యునల్.. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్’’ అని రాశాడు. దీన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారట! అతిక్రమించింది ఎవరు రామోజీ? నువ్వు, నీ కుమారుడు కాదా? వక్ఫ్ చట్టాన్ని అతిక్రమించి కబ్జా చేసిందే మీరు. ఈ బోర్డు చూస్తుంటే దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్లుంది. మిమ్మల్ని చూసే ఈ నానుడి పుట్టుకొచి్చంది కాబోలు. ఆ జడ్జిమెంట్‌లో ఏముందో మీకు తెలియకపోతే ఇంగ్లిష్ తెలిసిన వాళ్లెవరితో అయినా చదివించుకోండి. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం కాకుండా పూర్తి స్థాయి చర్యలకు ‘వక్ఫ్ యాక్ట్ సెక్షన్లు 51, 52 కింద నోటీసులిచ్చే అధికారం రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓకు సంపూర్ణంగా ఉందని స్పష్టంగా చెప్పింది. ఆ తీర్పు మేరకే ఆ తర్వాత మీకు సెక్షన్ 51 కింద నోటీసులివ్వడం నిజం కాదా? ఆ భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని 2019లో కర్నూలు జిల్లా కలెక్టర్ నోటీసులు ఇవ్వడం వాస్తవం కాదా? ఆ ఆదేశాలు అమలు కాకుండా మీరు బెదిరించలేదా? ఇన్ని వాస్తవాలమధ్య ఆ భూమి తమదని బోర్డు పెట్టడానికి కొంచెమైనా సిగ్గుండాలి.సమగ్ర విచారణలో బండారం బట్టబయలుకలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ తిరుపతి సాయి మండల సర్వేయర్‌తో కలిసి సమగ్ర విచారణ జరిపారు. 2019 ఆగస్టు 20వ తేదీన కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. సర్వే నంబర్ 80లోని 4.68 ఎకరాలు ఆర్.ఎస్.ఆర్, ఆర్.ఓ.ఆర్ రికార్డ్స్, ఆన్ లైన్ అడంగల్ ప్రకారం అది మసీదు ఇనామ్కు చెందిన భూమి అని స్పష్టం చేశారు. అదే సర్వే నంబర్లోని 2.78 ఎకరాల భూమిని 1995 డిసెంబరు 15 తేదీన ఈనాడు పేపర్‌కు చెందిన ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిందని నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక, ఇతరత్రా పరిశీలన అనంతరం 2019 అక్టోబర్ 14వ తేదీన అప్పటి జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆ రిజి్రస్టేషన్‌ను రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.అది వంద శాతం వక్ఫ్ బోర్డు భూమే ఈనాడు సంస్థ ఆ«దీనంలో ఉన్న సర్వే నంబర్ 80లోని 4.68 ఎకరాల భూమి పక్కాగా వంద శాతం వక్ఫ్ బోర్డు భూమే. వక్ఫ్ గెజిట్‌లో కూడా స్పష్టంగా ఉంది. ఆ భూమి మసీదుకే దక్కాలని నేను పని చేసిన కాలంలో పలుసార్లు నోటీసులు జారీ అయ్యాయి. అయినా స్పందించ లేదు. రాష్ట్ర బోర్డు అధికారులకు చెప్పాం. వాళ్లు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. వాటిని వాళ్లు ఖాతరు చేయలేదు. – నూర్ మహమ్మద్, వక్ఫ్ బోర్డు రిటైర్డు ఇన్స్పెక్టర్ మసీదు భూమిని అన్యాయంగా లాక్కున్నారు మునగాలపాడు గ్రామానికి చెందిన జామియా మసీదుకు చెందిన 4.68 ఎకరాల భూమిని గతంలో ముతవల్లి నుంచి ఈనాడు వాళ్లు అక్రమంగా పొందారు. చేసిన తప్పులను ఎత్తిచూపాల్సిన పత్రిక యజమానులే ఇలా అన్యాయానికి పాల్పడ్డారు. దీనిపై గతంలో మా సంఘం ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చాలా మంది కలెక్టర్లకు విన్నపాలు చేశాం. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.25 కోట్లకు పైగా ఉంటుంది. – సయ్యద్ రోషన్ అలీ, రిటైర్డు తహశీల్దార్, ఏపీ ముస్లిం కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు పొలం వద్దకు వెళ్తే అరెస్టు చేయించారు ఈనాడు సంస్థ తమ ఆ«దీనంలో పెట్టుకున్న భూమి పక్కాగా మా గ్రామ మసీదుకు చెందినదే. దీనిని కాపాడుకునేందుకు మా గ్రామస్తులు, పెద్దలతో కలిసి ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆ భూమి మసీదుకు చెందినదని బోర్డులు పెట్టబోయాము. అది మా భూమి అని ఈనాడు బోర్డు పెట్టింది. ఆ భూమి వద్దకు వెళ్లిన నన్ను పోలీసులతో అరెస్టు చేయించారు. మమ్మల్ని భయపెట్టారు. ఈ భూమి కోర్టులో ఉందని అనేక ఇబ్బందులకు గురి చేశారు. – షేక్షావలి, జామియా మసీదు ముతవల్లి, మునగాలపాడు, కర్నూలు మండలం, కర్నూలు జిల్లా -
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి ఆస్తి ఎవరు లాక్కోగలరు?. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు ఏం తెలుసు?’’ అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా భూమి మాది కాకపోతే మరెవరిది.. రామోజీ.. అన్నం తినేవాళ్ళు ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడరు, రాయరు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే, ఇలాంటి తప్పుడు కూతలు, రాతలు. భూ వివాదాల్లో, దళారులు, లిటిగెంట్లకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ఈ చట్టం. ప్రస్తుతం ఈ చట్టం కోర్టు పరిధిలో ఉంది.. రాష్ట్రంలో అమల్లో లేదు. వక్రబుద్ధి, క్రిమినల్ మైండ్‌తో ఉన్నవారే, ఈ చట్టాన్ని వెపన్‌గా వాడుకుంటున్నారు. ఎన్నికల తర్వాత ఈ దుష్ప్రచారం చేసే కూటమి నేతలెవరూ ప్రజలకు కనిపించరు’’ అంటూ ధ్వజమెత్తారు.మంత్రి బొత్స మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:⇒ఏకంగా మీ భూమి మీది కాదు అంటూ రాతలు రాస్తున్నారు. అసలేంటీ రాతలు? నా భూమి నాది కాకపోతే మరెవరది? ⇒మరొక పేపర్లో, నేల చట్టంలో..నింగీ..గాలి అంటూ రాతలు రాశాడు⇒ఈ రాతలు పోలింగ్ జరిగే వరకే. ఆ మర్నాడు వాళ్లు ఈ వార్తలు రాస్తే అడగండి. అప్పుడు వీళ్లకు, సామాజిక బాధ్యత ఏమీ ఉండదు.⇒ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఏదో ఒక విధంగా ప్రజలను మభ్యపెట్టి తమ ఫ్రెండ్స్‌గా ఉన్న కూటమికి లాభం చేకూర్చాలనే⇒ప్రజలేమన్నా అమాయకులనుకుంటున్నారా? మీ మాట ఎవరు నమ్ముతారు? ⇒మీరు చేసే ప్రచారం, వాస్తవాలకు ఇంత దూరంగా ఉంటే, ఇక ప్రజలు నమ్ముతారనుకోవడం మీ భ్రమే⇒ఏ కోణంలో మీ భూమి మీది కాదో వాళ్లు సమాధానం చెప్పాలి⇒మీ అనుమానాలేంటి అడగండి.. నేను సమాధానం చెప్తాను. ప్రజలకు కూడా మీ రాతలపై క్లారిటీ కావాలి కదా?⇒మీరు చేస్తున్న మాయ, మోసం, మీ కడుపు మంట ప్రజలకు తెలియాలి⇒రామోజీరావు, రాధాకృష్ణల బాధ కూడా ప్రజలకు తెలియాలి కదా? అడగండి..నేను సమాధానం చెప్తాదళారులు, లిటిగెంట్లకు ఆస్కారం లేకుండా పూర్తి హక్కులు కల్పించే చట్టం⇒ప్రభుత్వం ఒక బాధ్యత గలది. ఏదైతే లోపభూయిష్టమైన విధానాలున్నాయో వాటి ద్వారా ప్రజలు నష్టపోకూడదని, సామాన్యుడికి మేలు జరగాలని ఆలోచిస్తుంది.⇒అవినీతికి తావులేకుండా, దళారులు, లిటిగెంట్లకు ఎక్కడా అవకాశం లేకుండా ఉండాలని మేం ఈ చట్టం తెస్తున్నాం⇒ఈ వ్యవస్థలో మార్పులు చేర్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ⇒అందులో భాగంగానే ఇది జరుగుతోంది. ప్రస్తుతం కోర్టుల్లో ఉంది. పబ్లిక్ హియరింగ్ రావాలి. అప్పుడు కానీ చట్టంగా మారదు.⇒ఈ లోపు మీటింగులు పెట్టి..., ఒకరు జోగిపోయి.., ఒకరు ఊగిపోయి మాట్లాడుతున్నారు.⇒ఏకంగా ఈనాడు వారైతే మీ భూమే మీది కాదని రాసేస్తారు. ఏం ఖర్మ వచ్చింది వీళ్లకు?⇒మళ్లీ మళ్లీ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాం. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున చెప్తున్నాం. ఏదైతే దళారులు, అవినీతిపరులు, లిటిగెంట్లు చేసే దగాను అరికట్టడానికే ఈ విధానం.⇒భారతదేశం యావత్తు దీనిలో లోపాలను సవరించి చట్టాలను తేవాలని నిర్ణయించింది.⇒అందులో భాగంగా మా ప్రభుత్వం కూడా దానిలో ఉన్న అన్నిటినీ అధ్యయనం చేస్తోంది.⇒దానికింకా బోలెడంత ప్రాసెస్ ఉంది. పబ్లిక్ హియరింగ్, సర్వే పూర్తి కాకుండా చట్టంగా మారదు.⇒ఏ గ్రామమైతే పబ్లిక్ హియరింగ్, సర్వే పూరైన గ్రామాలే ఈ చట్ట పరిధిలోకి వస్తాయి.⇒ప్రస్తుతం అయితే అది కూడా కోర్టులో ఉంది.పవన్ కల్యాణ్ పెద్ద మేధావా?:⇒పవన్ కల్యాణ్‌కు ఏం తెలుసని మాట్లాడుతున్నాడు..? ఆయనేమన్నా పెద్ద మేధావా? ⇒ఎవడైనా రిజిస్ట్రేషన్లలో జిరాక్స్ కాపీలు ఇస్తారా? అన్నం తినే వాడు మాట్లాడే మాటలేనా అవి?⇒జిరాక్స్ కాపీలు ఇస్తే ప్రజలు అమాయకులనుకుంటున్నారా? ఒప్పుకుంటారా? ⇒ప్రభుత్వం తరఫున జిరాక్స్ కాపీలు ఇస్తున్నారని ప్రచారం చేయడం, తప్పు అని చాలా సార్లు చెప్పాను.⇒పవన్ కల్యాణ్ మాటలకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు.⇒ఆయనొక రాజకీయ నాయకుడు..ఆయన ఆరోపణలకు మా ఖర్మకి మేం సమాధానం చెప్పాలా? ⇒తెలిసీ తెలియని అంశాలను ఏవరో రాసిస్తే ఊగిపోయి చదివేస్తే సరిపోతుందా?⇒ఆయన భాష కూడా మారింది. రాజకీయాల్లో ఉన్నవాళ్లు అలాంటి భాష ఎవరైనా మాట్లాడాతారా?⇒ఏమీ తెలియని పవన్ కల్యాణ్ మాట్లాడితే మనందరం వినాలా?⇒అతని భాషను ప్రజాస్వామ్యంలో ఎవరైనా అంగీకరిస్తారా?⇒ఇప్పుడు ఆ యాక్ట్ ఫోర్స్‌లో లేదు. ⇒అసలు ఒక్క సీటు కూడా లేని పవన్ కల్యాణ్ ప్రతిపక్షం ఏంటి?⇒ఆయనకొచ్చిన ఒక్క సీటు వ్యక్తి కూడా నీదగ్గర ఉండనని వెళ్లిపోయాడు.⇒ఈనాడు, ఆంధ్రజ్యోతి వారికి ఎంత ఉక్రోషం ఉందో వారి రాతలను బట్టి అర్ధం అవుతుంది.⇒మేం కాల్చిన గుడ్డ మీ నెత్తిన వేశాం..మీ చెప్పాల్సింది చెప్పుకోండి అన్నట్లుంది వారి వ్యవహారం.⇒ఏదో ఒక తప్పుడు రాతలు రాసేస్తాం..ఆ తర్వాత మేం దాని గురించి ప్రశ్నించం అని అనుకుంటున్నారు. ⇒ప్రజలారా మీరే ఆ పత్రికల తీరును ఆలోచన చేయండి. మీరే డిసైడ్ చేయండి.⇒ఆ పత్రికల ద్వంద వైఖరి, బుద్ధిని గమనించండి.వక్రబుద్ధి, క్రిమినల్ మైండ్‌తో ప్రతిపక్షాలు:⇒ఏ గ్రామమైతే సర్వే పూర్తి చేసుకుంటుందో ఆ గ్రామమే దీని పరిధిలోకి వస్తుంది.⇒తర్వాత ఏదైనా అభ్యంతరాలుంటే జిల్లా జడ్జి స్థాయిలో అప్పిలేట్ అథారిటీ దృష్టికి తీసుకురావచ్చు.⇒కోర్టుకు కూడా ఎప్పుడైనా వెళ్లొచ్చు. దానికేమీ ఇబ్బంది లేదు.⇒ప్రత్యర్థులు వారి వక్రబుద్ధి, క్రిమినల్ మైండ్‌తో దీన్ని వెపన్‌గా వాడుకోవాలని చూస్తున్నారు. ⇒క్రిమినల్ మైండ్ ఉన్నవాళ్లు కాబట్టే, ఇలాంటి సున్నితమైన సమస్యపై అపోహలు సృష్టిస్తున్నారు.⇒జగన్ ఫోటోను పట్టాదారు పాసుపుస్తకంపై వేశారంటున్నారు. మరి ఎన్టీఆర్ బొమ్మను మరుగుదొడ్లపై వేశారు కదా. దానికేం చెప్తారు?రిజిస్ట్రేషన్ పేపర్లు ఎవరి ఇంట్లో వారివి ఉంటాయి, సందేహం ఎందుకు?⇒బొమ్మ ఉంటే మాకు వచ్చేట్లయితే, ఎన్టీఆర్ బొమ్మ ఉన్న మరుగుదొడ్డి వాళ్లకు వెళ్లిపోతుందా?⇒ అసలు మీ ఇంట్లో కాగితాలు..మా ఇంట్లో ఎవరు పెట్టుకుంటారు?⇒రిజిస్ట్రేషన్ కాగితం నీ ఇంట్లో ఉంటుంది కానీ..మరెవరింట్లోనే ఎందుకుంటుంది? ⇒ ఎవరో ఏదో చెప్తేస్తే, కడుపులో మంట ఉన్న వాళ్లు రాతలు రాస్తుంటే వాటిని నమ్మాల్సిన అవసరం లేదు⇒రాజకీయ కోణంలో, క్రిమినల్ మైండ్‌తో, దుర్భిద్ధితో చేస్తున్న దుష్ప్రచారం ఇది⇒వీళ్లు రాసే రాతలు, చేసే ప్రచారం తప్పు అని చెప్పే బాధ్యత మాపై ఉంది⇒దీనిలో జిల్లా అప్పిలేట్ విచారించిన తర్వాత కింది కోర్టుల పరిధి ఉండదు. అందుకు కొంతమంది న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు⇒కేవలం లిటిగేషన్ తగ్గించడానికే కింది కోర్టుల పరిధి తీసేశాం⇒ఒక జిల్లా జడ్జి స్థాయి అధికారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ కింది కోర్టులకు ఎలా వెళ్తాం?⇒సామాన్య ప్రజలు కోర్టులు చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం⇒ఎప్పుడో బ్రిటీష్ కాలంలో సర్వే జరగబట్టి రికార్డులు సరిగ్గా లేక కోర్టు వివిధాలు, లిటిగేషన్లు వస్తున్నాయి⇒ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా దశల వారీగా ప్రతి గ్రామాన్ని సర్వే చేస్తోంది⇒మొదటి దశ అయిపోయింది. రెండో దశ కొనసాగుతోంది. తర్వాత అర్బన్‌లో కూడా సర్వే చేస్తాందేశంలో 73 శాతం భూ వివాద కేసులే...:⇒కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ 68 నుంచి 73 శాతం కేసులు భూవివాదాలే.⇒సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ చట్టం రైతు ప్రయోజనాల కోసమే తెచ్చానని చాలా సార్లు చెప్పారు.⇒తొలుత గ్రామాల్లో భూసేకరణ జరగాలి. ఆ సందర్భంలో ఏదైనా వివాదాలు వస్తే కింది స్థాయి ఎమ్మార్వో ఆఫీసులో ఇద్దరినీ కూర్చోబెట్టి పరిష్కరిస్తారు.⇒ఒక వేళ అక్కడ ఇద్దరూ ఒప్పుకోకపోతే ఆ భూమి హక్కులు ఎవరికీ ఇవ్వరు.⇒ఆ తర్వాత జిల్లా జడ్జి స్థాయిలో సమస్య పరిష్కారానికి వెళ్లొచ్చు.⇒ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లొచ్చు. అప్పీలింగ్ అథారిటీ రెండేళ్ల వరకూ ఉంటుంది. ⇒ఈ రకంగా రాతలు రాయడం అనేది చాలా పెద్ద క్రైం. ⇒ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ ఇదో పెద్ద క్రైం.⇒ఈ ప్రజాస్వామ్యంలో ఎవడి ఆస్తి ఎవడు తీసుకుంటాడు?వాళ్ళ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితంతో సమానం⇒కూటమిలో ముగ్గురున్నారు. ఒకరు కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లు. ఒకరు రాష్ట్రంలో అధికారం చేసినవాళ్లు..మరొకరు ఎక్కడా ఏదీ లేని వాళ్లు.⇒వాళ్లలో ఒకరు ఒప్పుకోకుండా, ఇద్దరు ఒప్పుకుంటే ఇక ప్రజలకు క్లారిటీ ఏముంటుంది? ⇒వాళ్ళ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితంతో సమానం. దానిలో పెట్టిన వాటి గురించి ఎందుకు ఆలోచించాలి?⇒వాళ్లకున్న అత్మాభిమానం ఏంటి? మాకున్న అహంకారం ఏంటో చెప్పండి.⇒8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచామని అనడం చాలా తప్పు. చంద్రబాబు చేసిన నిర్వాకం వల్ల ఒక సారి ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏర్పడింది.⇒ఎన్నికలు అయిన తర్వాత పాత్రికేయులకు చెప్పిన విధంగా వారికి స్థలాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా -
రామోజీ ఫిల్మ్‌సిటీ: ఈనాడు ఆఫీసు పైనుంచి పడి మహిళ మృతి
-
దొరికిపోయిన గజదొంగ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాజీ సీఎం చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై సాక్షాత్తూ ఐటీ శాఖే నిగ్గు తేల్చినా పచ్చ మీడియా ఎందుకు కథనాలు రాయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు దొరికిన దొంగ.. గజదొంగ! చిన్న కాంట్రాక్టులోనే రూ.118 కోట్లు నొక్కితే 14 ఏళ్లు సీఎంగా బొక్కిందెంత? రామోజీ, ఏబీఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడు కళ్లకు ఇవి కనిపించడం లేదా? ఈ బాగోతాన్ని రాయాలనిపించడం లేదా?’ అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ అవినీతిని ప్రశ్నిస్తారని తాను అనుకోవడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబుకు సొంత వదినే కాబట్టి ఆమె మాట్లాడటం లేదని, ఇక కమ్యూనిస్టులు ఎలాగూ స్పందించరని చెప్పారు. కన్నబాబు ఆదివారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. తెహల్కా ఎప్పుడో చెప్పింది చంద్రబాబు తనను ఎవరూ ఏమీ చేయలేరని, సచ్చిలుడినని కితాబు ఇచ్చుకుంటున్నారు. జాతీయ మీడియా కథనాలతో ఆయన ఎంత దుర్మార్గమైన అవినీతి చేశారో బహిర్గతమైంది. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు షోకాజ్‌పై దాటవేత వైఖరి అనుసరిస్తున్నారు. చంద్రబాబుకు డబ్బులు అందాయనడానికి వాట్సాప్ చాట్స్, ఈ–మెయిల్ ఆధారాలున్నాయని ఐటీశాఖ స్పష్టం చేసింది. చిన్న కాంట్రాక్టుల్లోనే చంద్రబాబు ఇంత డబ్బు నొక్కేశారంటే ఆయన ఎంత పెద్ద గజదొంగ అయి ఉంటాడు? ఇంత జరిగినా చంద్రబాబు నోరు విప్పట్లేదు. ఆయన వందిమాగధులు, భజన బృందాలు స్పందించడం లేదు. ఎల్లో మీడియా అసలే మాట్లాడదు. కాకినాడలో నిర్వహించిన పార్టీ జోన్–2 సమావేశంలో ఈ విషయాన్ని ఎందుకు ఖండించలేకపోయావు బాబూ? కనీసం నీ కార్యకర్తలకైనా సమాధానం చెప్పే దమ్ము లేదంటే తప్పు జరిగిందనే విషయం అర్థమవుతోంది. చంద్రబాబు ఎలా అవినీతి సామ్రాజ్యం నిర్మించుకున్నాడో 1999లోనే తెహల్కా చెప్పింది. ఓటుకు కోట్లు కేసు ద్వారా కూడా ఆయన వద్ద ఎంత అవినీతి సొమ్ము పేరుకు పోయిందో వెల్లడైంది. లోకేశ్ పాత్ర కూడా.. ఈ అవినీతి బాగోతంలో చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేశ్ పేరు కూడా చెబుతున్నారు. చిన్నచిన్న రాజకీయ ఆరోపణలకే పరువు నష్టం దావా వేసిన చరిత్ర మీ హెరిటేజ్‌కు, మీకు ఉంది కదా! మీ అవినీతిని బహిర్గతం చేసిన జాతీయ మీడియాపై పరువు నష్టం దావా వేసే దమ్ముందా? తేలు కుట్టిన దొంగల్లా ఎందుకున్నారు? 2014లో చంద్రబాబు 650 అంశాలతో ఇచ్చిన మేనిఫెస్టోకే దిక్కు లేదు. ఎన్నికలు కాగానే దాన్ని మాయం చేశారు. అధికారంలోకి వస్తానని ఆయనకే నమ్మకం లేదు. ఇక ఆయన ప్రజలకు గ్యారెంటీ ఇవ్వడం ఏమిటి? గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి లాస్ట్ బాల్ అన్నట్లుగా చంద్రబాబు సూపర్ సిక్స్ అంటున్నారు. ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఎలాగూ లేదు. పార్టీ ఉంటుందో లేదో తెలియదు. కచ్చితంగా బౌండరీలో క్యాచ్ ఇచ్చి నిష్క్రమిస్తారు. -
‘ఈనాడు తప్పుడు రాతలు.. కళ్లు పెద్దవి చేసుకుని చూడు రామోజీ’
సాక్షి, తాడేపల్లి: ధాన్యం కొనుగోళ్లపై రామోజీవి తప్పుడు రాతలు అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వంపై రామోజీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రైతులకు కనీసం ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదని, సీఎం జగన్ పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారని మంత్రి అన్నారు. ‘‘రాష్ట్రంలో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉందని విమర్శిస్తున్నారు. రామోజీ కళ్లు పెద్దవి చేసుకుని చూస్తే నాడు-నేడు ఏం జరిగిందో అర్థమవుతోంది. సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా రైతులకు మేలు జరిగే చర్యలు తీసుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం పచ్చగడ్డిలా మేసేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం 2 కోట్ల 65 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఈ ప్రభుత్వం 32 లక్షల మంది రైతుల నుంచి 3 కోట్ల 10 లక్షల 65 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించింది. 58 వేల కోట్లు చెల్లించాం’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇచ్చాం. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం. రామోజీ.. ఈనాడు పత్రికను మరింతగా దిగజారుస్తున్నారు. దళారీ వ్యవస్థ లేకుండా చేసిన మా పై నిందలా.. తప్పుడు రాతలు రాయడానికి రామోజీకి సిగ్గులేదా?. వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశాం. టీడీపీ హయాంలో దళారీ వ్యవస్థతో రైతులను దోచుకుతిన్నారు. రాష్ట్రంలో రైతులకు మంచి జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు. నిజాలు తెలుసుకుని వార్తలు రాయడం నేర్చుకో రామోజీ’’ అంటూ మంత్రి కారుమూరి దుయ్యబట్టారు. చదవండి: సినిమా రేంజ్లో సీన్లు పండించిన పవన్.. ప్లాన్ బెడిసికొట్టింది! ‘‘దొంగ ఓట్లు చేర్చడంలో చంద్రబాబు దిట్ట. ఈ రోజు నిజం బయటపడటంతో చంద్రబాబు భయపడుతున్నాడు. చంద్రబాబు మాకొద్దు బాబోయ్ అంటున్నారు ప్రజలు. 600 హామీలిచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది ఎవరు?. డ్వాక్రా మహిళలను మోసం చేసింది ఎవరు? చంద్రబాబు, లోకేష్, పవన్ రోడ్లపై తిరగడం వల్ల వర్షాలు కూడా పడటం లేదు’’ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. -
Fact Check: బురద రాతలే పునరావృతం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును ప్రణా ళికాబద్ధంగా పూర్తి చేసేందుకు నిర్వాసి తులకు దశలవారీగా పునరావాస కల్పనపై చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై పదేపదే దుష్ప్రచారం చేయడంతోపాటు చంద్రబాబు తప్పిదాలను సైతం ఈ ప్రభుత్వానికి అంటగట్టే దుస్సాహసానికి ఈనాడు రామోజీ ఒడిగడుతున్నారు. ‘జగనన్నా.. ఇంకెన్నేళ్లు ముంచుతారు?’ శీర్షికన ప్రచురించిన కథనంలో ప్రతి అక్షరం పచ్చి అబద్ధమే. ఆరోపణ: వరదొచ్చిన ప్రతిసారీ పోలవరం పరిధిలోని గ్రామాలు ముంపునకు గురవుతు న్నాయి. సీఎం జగన్ హామీకి అనుగుణంగా ఇప్పటికీ పునరావాసం పూర్తి కాలేదు. వాస్తవం: పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం లేదు. స్పిల్ వే 48 గేట్లను పూర్తిగా ఎత్తివేసి వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు వదిలేస్తున్నారు. అలాంటప్పుడు కొత్తగా ముంపు సమస్య ఎలా వస్తుంది రామోజీ? గోదావరి వరద ఉద్ధృతి సమయంలో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పుడు.. పోలవరం కట్టక ముందు విలీన మండలాల్లో ముంపునకు గురయ్యే గ్రామాలే ఇప్పుడూ ముంపునకు గురయ్యాయి. గతంలో మాదిరి గానే ఆయా గ్రామాల్లో వరద బాధితులను పునరావాస శిబిరాలకు తరలించి బియ్యం, కందిపప్పు, వంటనూనెతోపాటు తక్షణం నగదు సాయం అందించి వరద తగ్గాక బాధితులను ఆయా గ్రామాలకు చేర్చారు. వరద సహాయ కార్యక్రమాల అమలును సీఎం జగన్ సోమ, మంగళవారాల్లో స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ప్రభుత్వ తక్షణ స్పందనపై బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. సీజన్ ముగిసేలోగా పంట నష్టానికి ప్రభుత్వం రైతులకు పరిహారం అందించనుంది. ఆరోపణ: పోలవరంలో 45.72 మీటర్ల వరకూ నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించడానికి రూ.20 వేల కోట్లకుపైగా అవసరం. నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని ప్రధాని మోదీని కోరుతానని 2022 జూలై 27న ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చలేదు. వాస్తవం: నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు 2022 ఆగస్టు 22న ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే సమయంలో నాటి సీఎం చంద్రబాబు 2013–14 ధరల ప్రకారం రూ.20,398 కోట్లతో పూర్తి చేస్తానని అంగీకరించిన అంశాన్ని గుర్తు చేశారు. అందులో నిర్వాసితుల పునరావాస వ్యయం రూ.7,279 కోట్లేనని ప్రస్తావించారు. కానీ భూసేకరణ చట్టం 2013 ప్రకారం వాస్తవంగా నిర్వాసితుల పునరావాస వ్యయం రూ.23,875 కోట్లు ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యంలో 2013–14 ధరలతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని సీఎం జగన్ తేల్చి చెప్పారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి బటన్ నొక్కి జమ చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు తొలి దశ పూర్తికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని అభ్యర్థించారు. 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఖరారు చేసిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి ఆ మేరకు నిధులిచ్చి ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ పోలవరానికి నిధుల విడుదలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్ శక్తి శాఖకు దిశానిర్దేశం చేశారు. వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌ను సరిదిద్దడం, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులతోపాటు తొలి దశ (41.15 మీటర్ల కాంటూర్) పూర్తికి రూ.12,911.15 కోట్లను అదనంగా ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ జూన్ 5న అంగీకరించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన లైడార్ సర్వేలో 41.15 కాంటూర్ పరిధిలోకి మరో 32 గ్రామాలు వస్తాయని తేలింది. ఆయా గ్రామాల్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి రూ.5,217 కోట్లు మంజూరు చేయా లని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఆరోపణ: 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ప్రభుత్వం వారిని ముంచేస్తోంది. వాస్తవం: టీడీపీ హయాంలో కమీషన్లు రావనే ఉద్దేశంతో నిర్వాసితులకు చంద్రబాబు పునరావాసం కల్పించలేదు. నాడు నవయుగకు నామినేషన్‌పై పనులను కట్టబెట్టడంతో డీపీటీ (దోచుకో పంచుకో తినుకో) పద్ధతిలో ప్రజాధనాన్ని దోచుకున్న రామోజీ గత సర్కారు నిర్వాకాలను ఎండగట్టలేదు. ఇప్పుడు వాటిని వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి ఆపాదించే దుస్సాహసానికి ఒడిగట్టారు. టీడీపీ సర్కార్ ఐదేళ్లలో రూ.484 కోట్లను ఖర్చు చేసి కాంటూర్ లెవల్‌తో నిమిత్తం లేకుండా అక్కడ కొందరికి ఇక్కడ కొందరికి తరహాలో 3,110 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించింది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల జీవన ప్రమాణాలు పెంచేలా మెరుగైన ప్యాకేజీని అమలు చేస్తున్నారు. నాలుగేళ్లలో రూ.16,777 కోట్లు ఖర్చు చేసి ఇప్పటికే 8,446 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగతా కుటుంబాలకు కూడా పునరావాసం కల్పన పనులు శరవేగంగా సాగుతున్నా రామోజీ కనపడనట్లు నటిస్తున్నారు. -
ఏది నిజం?: ‘ఈనాడు’ వంకర రాతలు.. రామోజీ ఇవన్నీ సాధ్యమయ్యాయిగా?
నిజాలకు పాతరేసి.. అబద్ధాలు అందంగా అచ్చు వేయటంలో ‘ఈనాడు’ దిట్ట. ఏలినవారు కావాల్సిన వారైతే... ఏమీ చేయకపోయినా సాహో.. అంటూ పొగడ్తలు కురిపిస్తుంది. అదే అధికారం తమవారి చేతుల్లో లేకపోతే మాత్రం... ‘ప్రతిపక్ష’ పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని ఒకనాడు కోర్టుకే నేరుగా చెప్పారు ఘనత వహించిన రామోజీరావు. ఇదంతా ఎందుకంటే... ఉన్నత విద్యా వ్యవస్థలో తీసుకు రావాల్సిన మార్పులను వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన విజన్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వీసీలతో సమావేశమై భవిష్యత్తులో చేపట్టాల్సిన మార్పులను చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న టెక్నాలజీలను మన పిల్లలు ఒడిసి పట్టుకోవటానికి యూనివర్సిటీలు ఏం చేయాలో ఆయన చెప్పారు. ఆ వార్త యథాతథంగా వేస్తే... ముఖ్యమంత్రి విజన్ అందరికీ తెలుస్తుందని, చదువుకున్న వారిలోను, విద్యార్థుల్లోను సానుకూలత వస్తుందని భయపడిన రామోజీరావు... ‘సీఎంగారూ! ఇదెలా సాధ్యం?’ అంటూ తన పైత్యం మొత్తాన్ని జోడించి ఒక కథనాన్ని వండేశారు. యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టలేదని, నిధులు మళ్లించేస్తున్నారని, వైస్‌చాన్స్‌లర్లుగా, పాలకమండలి సభ్యులుగా అధికార పారీ్టకి కావాల్సిన వారిని నియమించారని... ఇలా చేతికొచ్చినంత రాసిపారేశారు. మరి ఇందులో నిజమెంత? ఏది నిజం? నిజమే! ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పోస్టులు భర్తీ కావటం లేదు. కాకపోతే అది గడిచిన నాలుగేళ్లుగా కాదు. చాలా సంవత్సరాలుగా!!. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నాటి నుంచీ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్లుగా, పాలక మండలి సభ్యులుగా తన బంధువులనే నియమించుకున్నారు. వారు అడ్డగోలుగా అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కేసి తమకు కావాల్సిన వారిని, ముడుపులిచ్చిన వారిని నియమించుకోబోయారు. ఆ పోస్టులను ఆశిస్తున్న పలువురు నిరుద్యోగులు, వారి తీరు నచ్చన ఆయా వర్సిటీల్లోని సిబ్బంది ఈ వ్యవహారంపై కోర్టులకెళ్లారు. దీంతో రిక్రూట్మెంట్లు నిలిచిపోయాయి. ఆ పోస్టులన్నీ అలానే ఖాళీగా ఉండిపోయాయి. మరి అలా వర్సిటీల్లో తమ బంధువుల్ని నియమించుకున్నందుకు చంద్రబాబును ఎన్నడూ ప్రశి్నంచలేదెందుకు రామోజీరావు గారూ? వారు అడ్డగోలుగా పోస్టుల భర్తీ చేయబట్టే కదా... కోర్టుల్లో కేసులు పడి రిక్రూట్మెంట్లు నిలిచి పోయాయి. దాన్ని కూడా ఎన్నడూ ప్రశ్నించలేదెందుకు? ఇవన్నీ పక్కనబెడితే... కనీసం ఆ కోర్టు కేసుల్ని త్వరగా పరిష్కరించి పోస్టులు భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే వార్తలు సైతం ‘ఈనాడు’ రాస్తే ఒట్టు!. ఇప్పుడేమో ఆ కేసులన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ పోస్టుల భర్తీ చేపడుతున్న ప్రభుత్వాన్ని మాత్రం ప్రశి్నంచటం మొదలెట్టారు రామోజీ!!. నాలుగేళ్లూ ఊరుకుని ఇప్పుడెందుకంటూ సన్నాయి నొక్కులు మొదలు పెట్టారు. అసలు ఐదేళ్లూ ఏమీ చేయని చంద్రబాబును... కోర్టు కేసులకు కారకుడైన చంద్రబాబును మాత్రం వెనకేసుకొస్తూనే ఉన్నారు. పైపెచ్చు ఈ ప్రభుత్వం యూనివర్సిటీల పాలక మండళ్లలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో 50% మహిళలకే అవకాశమిస్తోంది. దాన్ని కూడా పక్కనబెట్టి అంతా అధికార పారీ్టవారే అంటూ దుర్మార్గపు రాతలకు దిగింది ‘ఈనాడు’. అదీ రామోజీరావు తీరు!!. ఇదీ నిజం. నిధులు మళ్లించిందెవరు రామోజీ? వర్సిటీల నిధులను దారిమళ్లించినట్లు ‘ఈనాడు’ అవాస్తవాలను వండి వార్చేసింది. మరి ఇందులో నిజమెంత? టీడీపీ ప్రభుత్వ హయాంలోనే యూనివర్సిటీలకు ఉరి వెయ్యటానికి చంద్రబాబు నిధుల దుబారా పథకాన్ని అమలు చేశారు. అంటే... ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారాల కోసం యూనివర్సిటీల్లో సమావేశాలు నిర్వహించారు. సమావేశం వర్సిటీలో కనక దానికయ్యే ఖర్చు మొత్తాన్ని వర్సిటీల నుంచే చేయించారు. ఇందుకోసం ఆయా యూనివర్సిటీలు ఒక్కొక్కటి రూ.10 కోట్ల చొప్పున ఖర్చు చేశాయి. కానీ అప్పట్లో ‘ఈనాడు’ పెన్నెత్తితే ఒట్టు. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పనులకోసం స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయించింది. వర్సిటీలు సహా ఇతర సంస్థలు తమ వద్ద అదనంగా ఉన్న నిధులను బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే వచ్చే వడ్డీకన్నా ఎక్కువ వడ్డీ చెల్లిస్తూ కార్పొరేషన్లో డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకున్నారు. వర్సిటీల నిధులకు అధిక వడ్డీ చెల్లిస్తూ తిరిగి వారికి అవసరమైనప్పుడు ఇస్తున్నారు. బాబు దుబారాపై కళ్లు మూసుకుని... డిపాజిట్లను నిధులు మళ్లించటమని అంటున్నారంటే రామోజీని ఏమనుకోవాలి? ఎంతైనా రామోజీ.. రామోజీనే!! సాక్షాత్తూ యూజీసీ చైర్మన్ చెప్పారు జూలై 1న సాక్షాత్తూ యూజీసీ ౖచైర్మన్ కాకినాడలో జరిగిన సమావేశంలో... ఉన్నత విద్యకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పలు అంశాల్లో ముందున్నదని వ్యాఖ్యానించారు. కానీ ‘ఈనాడు’ మాత్రం ఉన్నత విద్యపై బురద చల్లుతూ విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో భయాందోళనలను కలిగించడానికి ప్రయత్నిస్తోందన్నది నిజం. గడిచిన నాలుగేళ్లలో దేశంలోనే తొలిసారిగా ఏపీలోని పలు యూనివర్సిటీల్లో సంస్కరణలు తెచ్చారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు, రీజనల్ క్లస్టర్ గ్రూపులు, 10 నెలల తప్పనిసరి ఇంటర్న్‌షిప్, కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులు, నైపుణ్య కోర్సులు వంటి అనేక సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఇదే క్రమంలో ప్రపంచ స్థాయిలోని మేటి వర్సిటీల్లో ఉన్న నాలుగేళ్ల కోర్సును నూతన జాతీయ విద్యా విధానంతో అనుసంధానం చేసి విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలన్నీ ‘ఈనాడు’కు అసాధ్యమైనవిగా కనిపించటం విచిత్రమే మరి. ఎందుకంటే చేస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు కాదు కాబట్టి ‘ఈనాడు’కు సహజంగానే అవన్నీ అసాధ్యమైనవిగా కనిపిస్తాయి. ఒక కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెట్టే ముందు దానిపై లోతుగా అధ్యయనం చేయటం, ప్రణాళికాబద్ధంగా అమలుకోసం సన్నద్ధమవటం వంటివి చేస్తున్నపుడు ఏదో ఒకరకంగా బురద జల్లాలనే లక్ష్యంతో ‘ఈనాడు’ వరుస కథనాలు రాస్తూనే ఉంది. నిజం చెప్పాలంటే నిన్న జరిగిన వైస్‌చాన్సలర్ల సమావేశం.. ఈ ప్రభుత్వం వచ్చాక జరిగిన మొదటి సమావేశం కాదు. 2021 అక్టోబర్ 25న తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్ ఉపకులపతులతో సమావేశమై ఉన్నత విద్యపై దిశానిర్దేశం చేశారు. ఈ నాలుగేళ్లలో దాదాపుగా 10 సార్లు ఉన్నత విద్యపై అధికారులతో సమీక్షలు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఉన్నత విద్యపై ఇన్ని సమీక్షలు, సమావేశాలు నిర్వహించలేదు. వీటన్నిటినీ విస్మరించిన ‘ఈనాడు’... నాలుగేళ్ల తరవాత తొలిసారిగా వీసీలతో సమావేశం నిర్వహిస్తున్నారన్న తరహాలో కథనాన్ని వండిందంటేనే.. రామోజీ దుర్బుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఆరంభం నుంచే పటిష్ట పునాదులు ఒక్క ఉన్నత విద్యలోనే కాకుండా పునాది స్థాయి నుంచే విద్యార్ధులను తీర్చిదిద్దేలా రాష్ట్రంలో పలు సంస్కరణలను సీఎం జగన్ తొలిరోజు నుంచీ అమలు చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకోవడమే కాకుండా పలు రాష్ట్రాలకు ఆదర్శంగానూ నిలిచాయి. పాఠశాల విద్యలో నాడు–నేడు, అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద వంటి పథకాలు యూపీ, అస్సాం, బీహార్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. గతంలో ప్రయివేటుకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమాన్ని వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టించారు. దీనిపైనా చంద్రబాబు, రామోజీ విషం చిమ్మి అడ్డుపడే ప్రయత్నం చేశారు. నూతన విద్యావిధానం కన్నా ముందే రాష్ట్రంలో ఫౌండేషన్ విద్యావిధానాన్ని తీసుకువచ్చి శిశుస్థాయి నుంచే పిల్లల్లో అక్షరజ్ఞానానికి సీఎం శ్రీకారం చుట్టారు. నాడునేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, సీబీఎస్ఈ విధానం వంటి విధానాలను తెచ్చి పాఠశాల విద్యను బలోపేతం చేశారు. 6వ తరగతి నుంచి అన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను నెలకొల్పి డిజిటల్ బోధన చేయిస్తున్నారు. ప్రతి ఏటా 8వ తరగతికి వచ్చే విద్యార్ధులకు, టీచర్లకు ట్యాబులను కూడా అందిస్తూ... దిగ్గజ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ పాఠాలను కూడా అందులో అందజేస్తున్నారు. ఉన్నత విద్య భారం పూర్తిగా ప్రభుత్వానిదే... ఉన్నత విద్యలో చేరే ప్రతి విద్యార్థికీ పూర్తి ఫీజురీయింబర్స్మెంటుతో పాటు వారి వసతి ఖర్చులనూ ప్రభుత్వమే భరించేలా ముఖ్యమంత్రి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్నారు. దీనికోసం గత నాలుగేళ్లలో రూ.15వేల కోట్ల వరకు ప్రభుత్వం వెచి్చంచింది. గత ప్రభుత్వంలో 35వేలు మాత్రమే ఫీజు ఇవ్వడంతో మిగతా మొత్తాన్ని విద్యార్ధులే కట్టుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం పూర్తిభారం ప్రభుత్వానిదే కావటంతో ఇంటర్ తరవాత డ్రాపవుట్లు గత ప్రభుత్వంలో 21 శాతం ఉండగా ఇపుడు 6 శాతానికి తగ్గారు. ఉన్నత విద్యలోనూ నేటి అవసరాలకు తగ్గట్టుగా కరిక్యులమ్ అభివృద్ధి చేయించారు. బెంగళూరు ఐఐఎస్సీ ప్రొఫెసర్ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిటీని వేసి సంస్కరణలకు శ్రీకారం చుట్టించారు. డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసి నాలుగేళ్ల హానర్ కోర్సులను ఏర్పాటు చేయించారు. 27 వేల పరిశ్రమలు, సంస్థల అనుసంధానంతో ఇంటర్న్‌షిప్. విద్యార్ధులకు ఇంటర్న్íÙప్కోసం కాలేజీలను జిల్లాల వారీగా 27వేల పరిశ్రమలతో అనుసంధానం చేయించారు. చదువులు పూర్తి చేసేనాటికే విద్యార్ధులకు అవసరమైన ఉద్యోగ, ఉపాధి నైపుణ్యాలు సమకూరేలా చేశారు. విద్యార్ధులలో నైపుణ్యాలకోసం 553 ఎంటర్ప్రెన్యూర్íÙప్, ఇంక్యుబేషన్, స్టార్టప్ కేంద్రాల ఏర్పాటుచేయించారు. మైక్రోసాఫ్ట్ ద్వారా రూ.32 కోట్లతో 1.62 లక్షల మందికి సర్టిఫికేషన్ కోర్సులు అందించారు. మరో 1.95 లక్షల మందికి వివిధ కంపెనీలతో వర్చువల్ ఇంటర్న్íÙప్ అందించారు. నాస్కామ్ ఫ్యూచర్‌స్కిల్స్, ఎడ్యుస్కిల్స్, బీఎస్ఎన్ఎల్, సేల్స్‌ఫోర్సు, పాల్ ఆల్టో, బ్లూప్రిజమ్, ఫుల్‌స్టేక్, ఏడబ్ల్యూఎస్, ఎంప్లాయిమెంటు ఎక్స్‌ప్రెస్ వంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలతో వర్చువల్ శిక్షణ ద్వారా నైపుణ్యాలను మెరుగుపర్చారు. సాఫ్ట్వేర్, ఐటీ రంగాల్లోనే కాకుండా బ్యాంకింగ్, ఫైనాన్సియల్, క్స్‌టైల్స్, అపెరల్, లైఫ్‌సైన్సెస్, అగ్రికల్చర్, హెల్త్‌కేర్ తదితరాల్లో ఇంటర్న్íÙప్ వల్ల విద్యార్ధులకు అవగాహన పెరుగుతోంది. బాబు హయాంలో 37వేలు మాత్రమే ప్లేస్మెంట్లు ఉండగా గత ఏడాదికి ఈ సంఖ్య 85వేలకు చేరింది. ఈ ఏడాదిలో 1.20 లక్షల మందికి ప్లేస్మెంట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంతా ‘పచ్చ’గానే ఉండాలనుకునే రామోజీరావు కళ్లకు ఇవేవీ ఎన్నటికీ కనిపించకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. బాబు హయాంలో ఒక్కపోస్టూ భర్తీ చేయలేదే.. మన పిల్లలని ప్రపంచస్థాయి లీడర్లుగా ఎదగకుండా ఆపింది ఎవరు? అనేది ‘ఈనాడు’ ప్రశ్న. దీనికి సమాధానం చంద్రబాబే. ఎందుకంటే విశ్వవిద్యాలయాలలోని ఖాళీలు భర్తీ కాకపోవడానికి కారణం ఆయనే. చంద్రబాబు అధికారంలో ఉన్న తొలి తొమ్మిదేళ్ళూ... అంటే 1995 నుంచి 2004 వరకు, ఆలాగే, ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయాక 2014 నుండీ 2019 వరకూ విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఆచార్యుడినీ నియమించలేదు. దీన్ని రామోజీరావు ఎప్పుడూ ప్రశ్నించలేదు కూడా!. విశ్వవిద్యాలయాల్లో 71 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, ఆయా కోర్సుల్లో పిల్లలకు పాఠాలు చెప్పేవారు లేకుంటే కృత్రిమ మేధ వంటి కొత్త కోర్సుల వల్ల ఉపయోగం ఏమిటనేది ‘ఈనాడు’ ప్రశ్న. వాస్తవానికి మారుతున్న సమకాలీన సామాజిక అవసరాల దృష్ట్యా కొత్త కోర్సులు వస్తుంటాయి. వాటికి అవసరమైన నిపుణులను వర్సిటీల్లో నియమించుకోవాలి. అంతేకానీ, ప్రస్తుతం నిపుణులు లేరు కాబట్టి కొత్త కోర్సులను తేవొద్దని చెప్పటం ఏ రకమైన పాత్రికేయం? వర్సిటీల్లో ర్యాంకులు పడిపోతున్నాయనీ, ఈ సమయంలో కొత్త కోర్సులు అవసరమా? అనేది ‘ఈనాడు’ కథనంలో ప్రధానమైన అంశం. ర్యాంకులు పడిపోవడానికి శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఆచార్యులు లేకపోవడమే కారణం. దీనికి ప్రధాన బాధ్యుడు చంద్రబాబే. నియామకాలు చేపట్టకపోవటం, కోర్టు కేసులపై దృష్టిపెట్టకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ర్యాంకులను పునరుద్ధరించుకోవడానికి ముఖ్యమంత్రి, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి విశ్వవిద్యాలయాల అభివృద్ధి నమూనాలను తీసుకోవాలని దార్శనికతతో వివరించారు. రాబోయే కొద్ది రోజుల్లో బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టాలని సూచించారు. తద్వారా విశ్వవిద్యాలయాలను శక్తివంతమైన సాంకేతిక, ఆధునిక విద్యా కేంద్రాలుగా మారాలన్నారు. కార్యాచరణ మొదలుపెట్టి విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తయారు చేయాలని పేర్కొన్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి ప్రతిపాదించిన అంశాలు, ఏ నిరుద్యోగినీ బాధించవు. అవకాశాలు పెంచుకోవడానికి, మరికొంత మందిని ఉపాధికి చేరువ చేయడానికి కృత్రిమ మేధ ఉపయోగ పడుతుంది. బహుశా, ఇలాంటి విధానం ‘ఈనాడు’కు నచ్చి ఉండకపోవచ్చు. లేకపోతే ఇలా చెప్పింది చంద్రబాబు కాదు కాబట్టి నచ్చి ఉండకపోవచ్చు. విశ్వవిద్యాలయాల్లో పోస్టులు త్వరలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు సిద్ధమవుతుండటాన్ని గమనించి... ఎలాగైనా నియామకాలు జరగకూడదనే కుట్ర ఈ కథనంలో స్పష్టంగా కనబడుతోంది. -
ముస్లింలపై ‘ఈనాడు’ ద్వంద్వ నీతి!.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో ముస్లిం సమాజంపై వివక్ష చూపి వారిని తీవ్ర వేధింపులకు గురిచేసినా ఒక్క అక్షరం ముక్క రాయని ఈనాడు పత్రిక ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారిని సగౌరవంగా నిలబెట్టినా అన్యాయం చేస్తున్నారంటూ దుష్ప్రచారానికి దిగింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివారం అమరావతిలోని ఒక ముస్లిం కాలనీకి వెళ్లి ముస్లిం యువకులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఈ క్రమంలో ఏర్పడిన ఉద్రిక్తతలను తొలగించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటే దాన్ని ముస్లిం యువకులపై దాడిగా ఈనాడు చిత్రీకరించి చిలవలు పలవలుగా కథనం రాసింది. ఒక యువకుణ్ణి పోలీసులు కొడుతున్నట్లు ఫొటో ఒకటి ప్రచురించి వైఎస్సార్సీపీ ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్లు చూపించడానికి తాపత్రయపడింది. దేశద్రోహం కేసుపై ఎందుకు రాయలేదు? ఈ చిన్న ఘటనను భూతద్దంలో చూపించిన ఈనాడు.. చంద్రబాబు హయాంలో ముస్లింలపై అడుగడుగునా దారుణాలు జరిగినా ఏనాడూ రాయలేదు. 2018లో చంద్రబాబు సీఎంగా ఉండగా గుంటూరులో నారా హమారా పేరుతో నిర్వహించిన సభలో కొందరు యువకులు తమకిచ్చిన హామీలు అమలుచేయాలని ప్లకార్డులు చూపించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి వారిపై రాజద్రోహం కేసుపెట్టి చిత్రహింసలు గురిచేసినప్పుడు ఈనాడులో కనీసం వారి గురించి రాయలేదు. కేవలం చంద్రబాబును ప్రశ్నించారనే కారణంతో 9 మంది యువకులపై ఉగ్రవాదులనే ముద్రవేసి నెలలపాటు వారిని చిత్రహింసలకు గురిచేశారు. సామాన్య ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు ఏమిటని ముస్లిం సమాజం యావత్తూ ఆందోళన చేసినా ఈనాడు స్పందించలేదు. గుంటూరులో పలు సాకులు చూపి ముస్లిం పిల్లలు 200 మందిపై కేసులు పెట్టినా, వేధించినా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు తెలుగుదేశం ప్రయోజనాల కోసం ఏమీ జరగకపోయినా ముస్లిం యువకులపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూ ఇష్టారాజ్యంగా రాతలు రాయడంపై ఆ వర్గంలోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. చదవండి: మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ కీలక నిర్ణయం వారికి మంత్రి పదవి ఇవ్వకపోయినా పట్టించుకోలేదు నిజానికి.. చంద్రబాబు ముస్లింలను అన్ని రకాలుగా అవమానించడంతోపాటు తీవ్రంగా అణచివేశారు. టీడీపీకి ఓట్లు వేయలేదనే కక్షతో కనీసం ఆ వర్గానికి చంద్రబాబు తన కేబినెట్లో నాలుగేళ్లపాటు చోటు కల్పించలేదు. నంద్యాల ఉప ఎన్నిక రావడంతో ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకు చివరి ఆర్నెలల్లో ఎన్ఎండీ ఫరూక్‌ను మంత్రిని చేశారు. దీనిపై అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది.ముస్లిం సమాజమంతా ముక్తకంఠంతో చంద్రబాబు తీరును వ్యతిరేకించినా ఈనాడుకు పట్టలేదు. ఇప్పుడుమాత్రం చంద్రబాబుకు మేలు చేకూర్చేందుకు వారిపై ప్రేమ ఒలకబోసేలా వార్తలు రాయడంపై ముస్లింలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
‘కదులుతున్న ‘మార్గదర్శి’ అక్రమాల డొంక.. రామోజీ బెంబేలు’
సాక్షి, అమరావతి: మార్గదర్శి అక్రమాల డొంక కదలడంతో రామోజీ బెంబేలెత్తుతున్నారని.. అందుకే దళితులపై దమనకాండ అంటూ ‘ఈనాడు’ అడ్డగోలు రాతలు రాస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘మార్గదర్శి కేసులో ప్రధాన ముద్దాయి రామోజీరావు. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వంపై బురదజల్లే రాతలు. ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే రామోజీకి పరాభవం తప్పదు. బాబు, రామోజీ ముసుగు దొంగలు’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు. ‘‘దళితులపై దమనకాండ జరిగింది బాబు హయాంలోనే.. దళితులను అడ్డుపెట్టుకుని మా ప్రభుత్వంపై బురదచల్లుతావా?. టీడీపీ హయాంలో కారంచేడు, దళితుల ఊచకోత ఘటనలపై రామోజీ ఎందుకు కథనాలు రాయలేదు..?. గరగపర్రులో దళితుల వెలివేత, పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసిన ఘటనలు రామోజీ కళ్లకు కనిపించలేదా?. అచ్చెన్న మహిళను కాలితో తంతే.. మీకు ముచ్చటగా అనిపించిందా..?. సీఎం జగన్ పాలనలో దళితులకు జరుగుతున్న మేలు రామోజీకి అట్రాసిటీగా కనిపిస్తుందా..? ఫిల్మ్ సిటీలో దళితుల భూములను కొట్టేసింది రామోజీనే’’ అంటూ మంత్రి నాగార్జున దుయ్యబట్టారు. మంత్రి నాగార్జున ఇంకా ఏమన్నారంటే..: రామోజీ.. ఇవేనా జర్నలిజం విలువలు..? రామోజీరావు, ఈనాడు పేపర్ పెట్టుకున్న తర్వాత ఇన్నేళ్లకు దళితులు గుర్తుకొచ్చారా..? ఈరోజు రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నట్లు కథనాలు రాయడానికి ఆయనకు సిగ్గుందా..? అని అడుగుతున్నాను. చంద్రబాబు హయాంలో దళితులపై ఏ విధంగా దాడులు, అఘాయిత్యాలు, వెలివేతలు, జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను వివస్త్రను చేసిన సంఘటనలపై కథనాలను ఎందుకు రాయలేదు రామోజీ..? ఇదేనా మీ జర్నలిజం విలువలు..?. కారంచేడులో దళితులపై దాడులు జరిగినప్పుడు.. అప్పుడు జరిగిన అగ్రవర్ణాల అహంకారం గురించి ఈనాడు ఎందుకు రాయలేదు..? ఆరోజు దళితులపై జరిగిన దమనకాండకు కారకులైన వారి గురించి ఇప్పుడు రాయొచ్చు కదా.. రామోజీరావు సొంత సామాజికవర్గానికి చెందిన వారు దళితులపై మారణకాండ జరుపుతున్నప్పుడు .. ఇది తప్పు అని ఎందుకు రాయలేదు..? అని ప్రశ్నిస్తున్నాను. బాబు, రామోజీ ముసుగుదొంగలు ఎందుకంటే.. తన రాతలతో చంద్రబాబుకు రాజకీయంగా లబ్ధి జరగాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఈనాడు ముసుగులో నువ్వు వ్యాపారాలు చేయాలి. మార్గదర్శి ఎవరిది..? అందులో వ్యాపార భాగస్వాములు ఎవరు..? ఎవరి డబ్బులతో రామోజీరావు వ్యాపారం చేస్తున్నాడు. మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల కేసులో.. ప్రస్తుతం సీఐడీ ఇప్పటికే నలుగుర్ని అరెస్టు చేశారు. రేపు మార్గదర్శి కేసులో ఈనాడు రామోజీరావు ప్రధాన ముద్దాయి అవుతున్నాడని .. ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. అందుకే, ఇప్పుడు దళితులపై దాడులంటూ.. తప్పుడు కథనాలు రాస్తున్నాడనేది పచ్చి నిజం. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాల డొంక కదిలేకొద్దీ.. రామోజీకి బుర్ర పనిచేయడం లేదు. మార్గదర్శి చిట్ ఫండ్ పేరుతో.. జనం సొమ్మును తన వేరే వ్యాపారాలకు విస్తరించి, చిట్స్ వేసిన ఖాతాదారుల జీవితాలతో చెలగాటమాడుతున్నది రామోజీనే. రామోజీ చిట్స్- చీటింగ్ బాగోతాన్ని సీబీసీఐడీ అధికారులు తవ్వి తీస్తుంటే.. ఆయనకు, ఆయనకు వకాల్తా పలుకుతున్న చంద్రబాబు, దుష్ట చతుష్టయానికి కడుపు రగిలిపోతుంది. ఫిల్మ్ సిటీలో దళితుల భూములు కొట్టేసిన రామోజీరావు రామోజీఫిల్మ్‌సిటీ నిర్మాణానికి సంబంధించి దళితుల భూముల్ని కబ్జా చేసినట్లు రామోజీరావుపై పలు కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఇప్పటికీ కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పక్కనబెట్టి ఈరోజు దళితులపై ప్రేమ పుట్టుకొచ్చినట్లు, ఈ రాష్ట్రంలో ఎవరో దళిత డాక్టర్లపై దాడులు జరుగుతున్నట్లు తప్పుడు రాతలతో నీచమైన మనస్తత్వాన్ని రామోజీరావు ప్రదర్శిస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. ఇటువంటి దౌర్భాగ్యపు రాతలతో చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ లకు రాజకీయంగా పట్టం కట్టాలనుకుంటే వారి ప్రయత్నాలు ఫలించేదే లేదు. రాజకీయాల్లో చంద్రబాబు ఒక దొంగ అయితే.. ఆయన్ను భుజానెత్తుకుని విషపురాతలు రాసే రామోజీరావేమో గజదొంగ అని చెప్పుకోవాలి. ఇప్పటికైనా ప్రజల్ని మభ్యపెట్టే రాతలు మానుకోకపోతే ఈనాడు రామోజీరావుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు హయాంలో దళితులపై అరాచకాలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దళితులు అలో లక్ష్మణా.. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఎస్సీ, ఎస్టీలపై ఇష్టానుసారంగా దాడులు, అఘాయిత్యాలు జరిగినప్పుడు పోలీసుస్టేషన్ల చుట్టూ తిరిగి కేసులు పెట్టమని రోధిస్తే ఏ ఒక్కడూ పట్టించుకున్న దాఖలాల్లేవు. అచ్చెన్నాయుడు మహిళను కాలుతో తంతే ఎందుకు కేసు పెట్టలేదు..? గరగపర్రులో దళితులు వెలివేత కేసు ఏంచేశారు..? పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసిన కేసుకు సంబంధించి పెందుర్తి పోలీసుస్టేషన్ ముందు ధర్నాకు దిగితే.. ఆ కేసుల్ని ఏం చేశారు..? వాటిని ఎందుకు అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు..? ఈ ఘటనలపై ఈనాడులో వరుస కథనాలు ఎందుకు రాయలేదో.. రామోజీరావు సమాధానం చెప్పాలి..? ఇవన్నీ ఈనాడుకు ముచ్చటగా అనిపించాయా..? దళితుల మేలుపై చర్చకొస్తారా..? రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో సుభిక్షమైన పరిపాలన జరుగుతోంది. రాజ్యాంగ బద్ధంగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానంతో సుభిక్షమైన పరిపాలన అందజేస్తుంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా సంక్షేమపథకాలతో సంతోషంగా ఉన్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత దళితుల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం గురించి మంచిగా ఆలోచించే ముఖ్యమంత్రి వచ్చారని వైఎస్ జగన్‌ని ప్రతీ పేదోడి ఇంట్లో దేవుడుగా కొలుస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబుకు, రామోజీరావుకు కన్నుకుట్టే విషయమైంది. దళితుల రక్షణకు, వారి మేలుకు మేం బాధ్యతగా పనిచేస్తున్నామని దమ్ముగా చెబుతున్నాను. అడ్డగోలు రాతలకు, నీచమైన రాతలకు ఈనాడు వేదికగా ఉంది. దళితులకు ఎవరి హయాంలో ఏం మేలు జరిగిందో... మీరు చర్చకు రాగలరా..? అట్రాసిటీ అంటే అర్ధమేంటి..? ఈనాడు మాత్రం ‘దళితులపై దమనకాండ’ అంటూ విషప్రచారానికి పూనుకుంటుంది. అసలు అట్రాసిటీ అంటే రామోజీరావు దృష్టిలో ఏంటి..? రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంగ్లీషుమీడియం తీసుకొచ్చి పేదపిల్లలకు చదువు చెప్పడాన్ని అట్రాసిటీ అంటారా..? రాజధాని ప్రాంతంలో భూముల్ని పేదలకు ఇస్తామంటే.. ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని టీడీపీ అడ్డుకోవడాన్ని అట్రాసిటీ అంటారా..? కొన్ని లక్షల కోట్లు డీబీటీ రూపంలో దళితులకు సంక్షేమపథకాల కింద నేరుగా మా ప్రభుత్వం అందజేస్తుంటే అది అట్రాసిటీనా..?. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 68శాతం రాజకీయ పదవులిచ్చి అత్యున్నత స్థానాల్లో నిలబెట్టడాన్నిరామోజీరావుకు అట్రాసిటీగా కనిపిస్తున్నాయా.?. పేదోడికి గూడును కల్పిద్దామని.. వారికి ఉచితంగా ఇంటి స్థలమిచ్చి రుణసాయంతో ఇల్లు నిర్మించడమే కాకుండా వారికి ఉపాధిచూపాలని తపనపడే ప్రభుత్వం మీకు అట్రాసిటీకి పాల్పడుతున్నట్లు కనిపిస్తుందా..? పేదవాళ్లకు సాయం చేయడం అనేది నీకు, నువ్వు అండగా ఉండే నీ నాయకుడు చంద్రబాబుకు చేతగాదు. పేదవాళ్లను అక్కునజేర్చుకుని భావితరాల భవిష్యత్తుకోసం మా ప్రభుత్వం గొప్ప పరిపాలన అందిస్తుంటే.. అది రామోజీరావుకు అట్రాసిటీగా కనిపిస్తుందా..? దళితులకు ‘బాబు’చేసిన మోసం గురించి ఎందుకు రాయవు..? చంద్రబాబు హయాంలో ఐదు ఏళ్లలో, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.33,625.49 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపితే.. ఆ డబ్బు దళితులకు దేనికోసం ఖర్చుచేశారో.. అందులో అవినీతి ఎంత జరిగిందో.. ఎంతమంది చేతులు మార్చుకున్నారో.. ఈ కుంభకోణాలపై కథనాలు రాసే దమ్ము రామోజీరావుకు ఉందా..? అని అడుగుతున్నాను. అదే మా వైస్సార్సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలనలో ఫిబ్రవరి మాసాంతానికి దళితుల సంక్షేమానికి రూ.51,293 కోట్లు ఖర్చుచేశాం. డీబీటీ ద్వారా ఒక్క పైసా అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ అయితే.. వీటిమీద రాతలు రాయడానికి చేతులు కదలడం లేదా రామోజీరావు..? అని అడుగుతున్నాను. చదవండి: లోకేష్‌కు ఆ సంగతి తెలిసినా.. తెలియనట్లు నటిస్తున్నారా? -
గతం గుర్తుందా రామోజీ?.. ఆ విషయం ‘ఈనాడు’కు తెలియదా!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఈనాడు మీడియా ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. ఏపీ అభివృద్దికి పెద్ద శత్రువుగా ఈ మీడియా మారిందంటే ఆశ్చర్యం కాదు. ఒక వైపు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు తేవడానికి ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం విశాఖపట్నంలో భారీ స్థాయిలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్‌ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 3,4 తేదీలలో ఈ సదస్సు జరగబోతోంది. దీనికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలను రప్పించడానికి మంత్రులు, ఐఎఎస్ అధికారులు విశేష కృషి చేస్తుంటే దానిని ఎలా చెడగొట్టాలా అని ఈనాడు మీడియా ఆలోచన చేస్తోంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అమర్నాథ్ తదితరులు బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలలో పర్యటించి సన్నాహక సదస్సులు పెడుతున్నారు. వారి సమావేశాలకు ప్రముఖులు హాజరువుతున్నారు. ఏపీకి ఉన్న అపార అవకాశాలను మంత్రులు తెలియచేస్తున్నారు. విశాఖ సమ్మిట్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో ఈనాడు మీడియా పుల్లలు వేయడం ఆరంభించింది. అందులో భాగంగా శనివారం నాడు ఒక కథనాన్ని ఇచ్చింది. పారిశ్రామిక రాయితీ జాడేది అని హెడింగ్ పెట్టి మొదటి పేజీలో పరిచారు. ప్రభుత్వం ప్రోత్సహాకాలను సకాలంలో చెల్లించలేదట. తీరా చూస్తే అదంతా కలిపి 728 కోట్లేనని ఆ మీడియాలోనే తెలిపారు. పైగా అది కూడా గత ఆగస్టునుంచే ఉన్న బకాయి. నిజానికి ఏ ప్రభుత్వంలో అయినా పారిశ్రామిక ఇన్సెంటివ్‌లు ఒకసారిగా చెల్లింపులు జరగవు. క్రమేపీ విడతల వారీగా ఇస్తుంటారు. గతంలో నాలుగైదేళ్ల పాటు కూడా పరిశ్రమలకు బకాయిలు చెల్లించని ఘట్టాలు చాలానే ఉన్నాయి. తెలుగుదేశం హయాంలో ఈ బకాయిలు ఎలా ఉన్నాయో మాత్రం ఈ మీడియా రాయలేదు. అప్పుడంతా బకాయి లేకుండా చెల్లించారా?. టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి 3400 కోట్ల రూపాయల బకాయి ఉందట. ఆ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు చెల్లించవలసిన సుమారు వెయ్యి కోట్ల రూపాయల పైగా బకాయిలను జగన్ ప్రభుత్వం చెల్లించిందన్న సంగతి ఈనాడు మీడియాకు తెలియదా! ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఆంద్రకు రావాలని అనుకుంటే,వారిని చెడగట్టడానికి గాను ఇక్కడ బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం సరిగా చెల్లించడం లేదన్న సంకేతం ఇవ్వడానికి, ఇలా దురుద్దేశపూరితంగా కథనం రాసిన సంగతి అర్దం అవుతూనే ఉంది. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈనాడు వారు ఇలాంటి దిక్కుమాలిన కథనాలు ఎన్ని వండి వార్చారో! కియా పరిశ్రమ వెళ్లిపోతోందని తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలు విపరీత ప్రచారం చేశాయి. కాని ఆ సంస్థ వారు అదనంగా 400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడాతమని ప్రకటించారు. ఏపీకి ఎన్నడూ రాని ఆదిత్య బిర్లా వచ్చి పరిశ్రమలు పెడుతున్నారు. అయినా ఇక్కడకు పరిశ్రమలు రావడం లేదని దుష్ప్రచారం చేస్తుంటారు. విశాఖలో ఎల్జి పాలిమర్స్ సంస్థ నుంచి గ్యాస్ వెలువడడంతో పదమూడు మంది మరణించారు. ఆ సంస్థ తిరిగి తెరవడానికి వీలు లేదని టీడీపీ, ఎల్లో మీడియా వాదించాయి. అదే చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎంపికి చెందిన సంస్థలో పొల్యూషన్ సమస్య సృష్టిస్తుంటే, వారికి నోటీసు ఇవ్వగానే నానా యాగి చేశాయి. ఇదే ఎంపీ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటిస్తే, ఇంకే ముంది ఏపీకి రానివ్వడం లేదని అన్నారు. తదుపరి ఆయనే ఏపీలో కూడా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటిస్తే ఈ మీడియా నోరుమూసుకుంది. కాకినాడ వద్ద ఫార్మా హబ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపితే, అది వద్దని టీడీపీ ఏకంగా లేఖ రాస్తే, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా తందాన అంటూ వంతపాడాయి. గతంలో శ్రీసిటీకి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భూమి సేకరిస్తుంటే, రాష్ట్రంలో పారిశ్రామక సెజ్ లకు ఏర్పాట్లు చేస్తుంటే ఈనాడు రామోజీరావు దానిని వ్యతిరేకిస్తూ ఏకంగా సంపాదకీయం రాశారు. అదంతా ప్రజా వంచనగా వ్యాఖ్యానించారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016 లో ఒక వార్త రాస్తూ అదంతా భాగ్యసీమ అయిపోయిందని రాసింది. అసలు ఆ పారిశ్రామికవాడ రావడానికి కృషి చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు మాత్రం ప్రస్తావించకుండా జాగ్రత్తపడింది. అదే పద్దతిలో ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వం పరిశ్రమలు తీసుకువస్తుంటే వ్యతిరేక కథనాలు రాయడానిక నానా పాట్లు పడుతోంది. నెల్లూరు జిల్లా రాపూరు వద్ద సోలార్ ప్రాజెక్టుల కోసం పారిశ్రామికవాడను ఏర్పాటు చేస్తుంటే దానిని ఫలానా వారికి ఇస్తున్నారు.. అది ముఖ్యమంత్రి జగన్ సన్నిహితులది అంటూ దిక్కుమాలిన రాతలకు పాల్పడింది. అంతే తప్ప ఆ పారిశ్రామికవాడ వస్తే వేలాది మందికి ప్రయోజనం కలుగుతుందని మాత్రం రాయడానికి వారికి మనసు ఒప్పలేదు. తెలంగాణకు గత ఏడాదికాలంలో సుమారు రెండువేల కోట్ల పెట్టుబడులే వచ్చినా, చాలా గొప్పగా వచ్చాయని, అదే ఏపీకి సుమారు నలభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చినా, ఏమీ రాలేదని ఉన్నవిలేనట్లు, లేనివి ఉన్నట్లు ఈనాడు ప్రచారం చేయడం దుర్మార్గంగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ ఒన్ స్థానంలో ఉన్నా, వీరు మాత్రం గుర్తించరు. ఇలాంటి దుష్టచతుష్టయాన్ని ఎదుర్కుంటూ జగన్ ప్రభుత్వం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు చాలా కృషి చేయవలసి వస్తోంది. చంద్రబాబు టైమ్‌లో విశాఖలో సదస్సులు పెట్టి దారిపోయేవారితో ఒప్పందాలు చేసుకున్నా, ఆహా, ఓహో అంటూ వీరే ఊదరగొట్టారు. వాటిలో పదో వంతు కూడా వాస్తవరూపం దాల్చకపోయినా, ఎన్నడూ వీరు ఆ విషయాలను ప్రజలకు చెప్పలేదు. మాల్ ఏర్పాటుకు విశాఖలో అత్యంత విలువైన స్థలాన్ని లూలూ అనే కంపెనీకి కేటాయిస్తే, వారు ఏళ్ల తరబడి దానిని నిర్మించలేదు. ఈ ప్రభుత్వం ఆ స్తలాన్ని వెనక్కి తీసుకుని వేరే అవసరాలకు కేటాయిస్తే తప్పు పడుతుంది. అమరావతి పేరుతో ఉన్న పల్లెల్లలో బిఆర్ షెట్టి అనే ఆయనకు వంద ఎకరాలను గత ప్రభుత్వం కేటాయించింది. అక్కడ ఆస్పత్రి తదితర నిర్మాణాలు చేస్తారని తెలిపింది. కాని అలాంటివి ఏమీ చేయకపోయినా ఆ ప్రభుత్వ పట్టించుకోలేదు.పైగా బిఆర్ షెట్టిపై దుబాయిలో కేసులు వచ్చాయన్న సంగతి ఆ తర్వాత వార్తలలో వచ్చింది. అప్పట్లో బోగస్ కంపెనీలతో హడావుడి చేస్తే, ఇప్పుడు నిజమైన కంపెనీలు వస్తుంటేనే ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. జిందాల్ స్టీల్స్ జమ్మలమడుగులో 8800 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అంతా సిద్దం అయ్యాకే అక్కడ జగన్ శంకుస్థాపనకు వెళ్లారు. అయినా ఒక్కోసారి కొన్ని పరిశ్రమలు అనుకున్నట్లు రావచ్చు. రాకపోవచ్చు. అది ఏ ప్రభుత్వంలోనైనా జరుగుతుంటుంది. కాని టీడీపీ ప్రభుత్వంలో అలాంటివాటిని కప్పిపుచ్చి, ఈ ప్రభుత్వంలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చిలవలు, పలవులు చేసి వార్తలు ఇవ్వడం ఈనాడుకు రివాజుగా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదాని గతంలో చంద్రబాబును కలిస్తే గొప్ప విషయంగా ప్రాజెక్టు చేశారు. అదే జగన్‌ను కలిస్తే రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారని దుర్మార్గపు రాతలకు టీడీపీ మీడియా పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. వచ్చే పరిశ్రమలను ఏదో రకంగా అడ్డుకుని, మళ్లీ ఆ నెపాన్ని ప్రభుత్వంపైనే నెట్టే ప్రమాదం ఉంది. చదవండి: రామోజీ తప్పు చేస్తే ఉద్యోగులు బలిపశువులా? ఏ మీడియా అయినా ప్రభుత్వంలోని లోటుపాట్లు రాయడం తప్పుకాదు. కాని నిర్మాణాత్మక విధానంలో కాకుండా, రాష్ట్ర అభివృద్దిని ఎలా చెడగొట్టాలన్న ధ్యేయంతో ఈ మీడియా పనిచేస్తోంది. సరిగ్గా విశాఖ సమ్మిట్‌కు ముందు ఇలాంటి దారుణమైన కథనాలు రాయడం ఆరంభించారంటేనే వారి దుష్ట తలంపు తెలుస్తూనే ఉంది. పరిశ్రమల మంత్రి అమరనాథ్ మీడియా సమావేశంలో చెప్పిన వాటికి తన పైత్యం జోడించి మళ్లీ రాశారు. అందుకే ఈనాడు, తదితర టీడీపీ మీడియా అంతా ఇప్పుడు ఏపీ పాలిట విలన్‌గా మారాయని ఒకటికి పదిసార్లు చెప్పవలసి వస్తోంది. చివరిగా ఒక మాట!. ఆంగ్ల దినపత్రిక అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని ప్రముఖంగా రాస్తే, ఏపీలో పుట్టి పెరిగిన తెలుగు దినపత్రిక అయిన ఈనాడు ఆ పెట్టుబడులు రాకుండా ఎలా చేయాలా అన్న యావతో కథనాలు ఇస్తోంది. దీనినే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమని అంటారు. -హితైషి -
Fact Check: రామోజీ దిగులు ‘ఈనాడు’ రాతల్లో కనపడుతోంది..
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల సొంతింటి కలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా సాకారం చేస్తుంటే, తన ఆత్మీయుడు ఉనికి కోల్పోవడం ఖాయం అని ‘ఈనాడు’ రామోజీరావుకు దిగులు పట్టుకుంది. ఏకంగా 17,005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్తగా ఊళ్లనే నిర్మిస్తుండటం చూసి.. అవి పూర్తయితే టీడీపీకి పుట్టగతులుండవని నిద్ర కరువైంది. ఏదో ఒకటి చేసి ఆ ఇళ్ల నిర్మాణాలు సమాజానికి కన్పించకుండా కనికట్టు చేయాలని ‘నవరత్న ఇల్లు.. పల్లె పేదకు లేదు!’ అంటూ శుక్రవారం ఓ కథనాన్ని వండివార్చారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వం ఏకంగా 30.65 లక్షలకు పైగా పేద కుటుంబాలకు గృహ యోగం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 30.65 లక్షల ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. వీరికి రూ.56,102 కోట్ల విలువైన భూములను కేటాయించింది. వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్తగా ఊళ్లనే నిర్మిస్తున్నారు. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఏకంగా రూ.36 వేల కోట్లకు పైగా వెచ్చిస్తోంది. ఇప్పటి వరకూ రెండు దశల్లో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, ఇప్పటికే 17.22 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఈ వాస్తవాలన్నీ అందరికీ కళ్లెదుటే కనిపిస్తున్నా, ఈనాడుకు మాత్రం కనిపించలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని బురద చల్లుతుండటం దారుణం. చదవండి: Fact Check: అది రోత రాతల వంటకం ఇప్పటికే రెండు దశల్లో శర వేగంగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతుండగా, త్వరలో మూడో దశ కింద మరికొన్ని అదనపు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. మున్సిపల్, పట్టణాభివృద్ధి, గ్రామీణ ఇలా ఏ లబ్ధిదారులకైనా ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం యూనిట్‌కు రూ.1.80 లక్షలు ఇస్తోంది. దీంతో పాటు పావలా వడ్డీకి రూ.35 వేల బ్యాంక్ రుణ సాయం చేస్తోంది. వీటికి అదనంగా 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా ఇవ్వడంతో పాటు, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై అందిస్తోంది. ఎక్కడైనా కోర్టు కేసులు, లబ్ధిదారు మరణం, లబ్ధిదారుల శాశ్వత వలస వంటి ఇతర సమస్యల కారణంగా ఇంటి నిర్మాణం చేపట్టని సందర్భాల్లో మాత్రమే ఆయా ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి తప్ప లబ్ధిదారులను ఎక్కడా తొలగించలేదు. -
Fact Check: అది రోత రాతల వంటకం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై పనిగట్టుకుని ఈనాడు వండి వారుస్తున్న అసత్య కథనాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. తాజాగా.. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థల డైట్ చార్జీలపై ఆ పత్రిక వండిన రాతల వంటకం రోత పుట్టించేలా ఉంది. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావించే ఆ క్షుద్ర పత్రిక ‘మాటల వంటకమే’ అంటూ అవాస్తవాలతో ఒక కథనాన్ని అచ్చోసింది. నిజానికి.. ఆ వసతి గృహాలపై చంద్రబాబు సవతి ప్రేమ గత పరిస్థితిని గమనించిన వారెవరికైనా ఇట్టే అర్థమవుతుంది. పైగా బోలెడు బకాయిలు తన హయాంలో చెల్లించలేదు. నిజానికి.. ఈ డైట్ ఛార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఇవి ఆమోదించే దశలో ఉండగా ఈనాడు ఈ వాస్తవాలన్నింటినీ మరుగునపరిచి ఉద్దేశపూర్వకంగా, ఎప్పటిలాగే తన కడుపుమంటను తీర్చుకుంది. దీనిని ఖండిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు కె. హర్షవర్థన్ శుక్రవారం వాస్తవాలు వెల్లడించారు. అవి ఏమిటంటే.. ►2012లో ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ హాస్టళ్లకు డైట్ ఛార్జీలు పెంచారు. ►2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు 2018 వరకు వాటిని పెంచాలనే ఆలోచన చేయలేదు. ►కానీ, 2019లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2018 జూలై నుంచి పెంచింది. అంటే.. ఈ చార్జీలు పెంచింది కేవలం ఎనిమిది నెలలు మాత్రమే. పైగా ఇందుకు అవసరమైన బడ్జెట్‌ను విడుదల చేయలేదు. ఫలితంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ►2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. బాబు మిగిల్చిన బకాయిల మొత్తం రూ.132 కోట్లను క్లియర్ చేసింది. ►ఆ తర్వాత డైట్ ఛార్జీలు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని 2022 ఆగస్టులో సీఎం జగన్ అధికారులను ఆదేశించగా వారు పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. ► దీని ద్వారా 5.92 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. అలాగే, డైట్ ఛార్జీల కోసం రూ.755 కోట్లు బడ్జెట్ కేటాయించారు. తాజా పెంపు ప్రతిపాదనలతో ప్రభుత్వంపై అదనపు ఆరి్థక భారం రూ.110 కోట్లకు పైగానే ఉంటుంది. ఆరి్థకపరమైన భారంతో కూడుకున్న ఈ అంశంపై ఆయా విభాగాల వివరణాత్మక పరిశీలన, సంప్రదింపులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆ ఫైలు ఆమోదించే దశలో ఉంది. ►ఇవేకాక.. నాడు–నేడు కింద రాష్ట్రంలో వివిధ రకాల 3,013 సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థలను మూడు దశల్లో రూ.3,300 కోట్ల అంచనాతో అభివృద్ధి చేసేందుకు చేసిన ప్రతిపాదనలు ఆమోదానికి సిద్ధంగా ఉన్నాయి. ►ఇందులో ప్రధానంగా టాయిలెట్లలో నీటి సరఫరా, విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, ఎల్ఈడీ లైట్లు, మంచినీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, వంటగది ఆధునీకరణ, ప్రహారీ గోడలు, దోమల మ్యాట్లు, స్మార్ట్ టీవీ, క్రీడా సామగ్రి, లైబ్రరీ పుస్తకాలు, డ్రైనేజీ వ్యర్థ జలాలను సురక్షితంగా పారవేయడంతో పాటు పరిసరాల సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ►ఈ సమయంలో డైట్ ఛార్జీల పెంపుదల ఫైల్ క్లియరెన్స్ అవకాశం ఉందనే విషయాన్ని మరుగున పరిచి ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించడం సరికాదు. బలహీనవర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో బురదజల్లే రాతలు రాయడం దుర్మార్గం. -
బాకీలంటూ.. తప్పుడు బాకాలు.. ఇదేం జర్నలిజం రామోజీ?
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులు, పెండింగ్ బిల్లులు, గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులపై ‘ఈనాడు’ పచ్చి అబద్ధాలను ప్రచురిస్తోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ మండిపడ్డారు. నిపుణుల పేరుతో అంతులేని అబద్ధాలు అచ్చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఎవరా నిపుణులు? పేర్లు వెల్లడించే ధైర్యం ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ లెక్కలను గణాంకాల సహితంగా వెల్లడిస్తోందని, కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నివేదికలే ఇందుకు సాక్ష్యమని గుర్తు చేశారు. లేని అప్పులు, పెండింగ్ బిల్లులు, గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులు ఉన్నట్లు తప్పుడు గణాంకాలు ఎలా ప్రచురిస్తారని నిలదీశారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్బీఐ గణాంకాల ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ రాజ్యసభలో స్పష్టంగా చెప్పినప్పటికీ రూ. 9.16 లక్షల కోట్లు అంటూ ఏ గణాంకాలు, ఆధారాలు ప్రకారం ఈనాడు కథనాలను ప్రచురించింది? వాటిని పట్టుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతారు? బడ్జెట్ లోపల అప్పులతో పాటు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిన కార్పొరేషన్ అప్పుల గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజెంటేషన్‌తో సవివరంగా తెలియచేసినా ఈనాడు ఊహాగానాలతో, నిపుణులు అంచనాల పేరుతో అవాస్తవ కథనాలను ఎలా ప్రచురిస్తుంది? రాష్ట్ర అప్పులకు సంబంధించి ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా అవే తప్పుడు వార్తలను పథకం ప్రకారం పదేపదే ప్రచారం చేస్తోంది. ♦ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులు రెట్టింపు అయ్యాయంటూ టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. గత ప్రభుత్వ హయాంలో అప్పులు రెట్టింపు అయినట్లుగా ఇప్పుడు అందుకు ఏమాత్రం ఆస్కారం లేదు. రాష్ట్ర అప్పులపై టీడీపీ ఎంపీ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరి్థక శాఖ ‘‘స్టేట్ ఫైనాన్సెస్– ఏ స్టడీ ఆఫ్ స్టేట్ బడ్జెట్’’ అర్బీఐ నివేదికతో స్పష్టమైన సమాధానం ఇవ్వడంతో తట్టుకోలేక దు్రష్పచారానికి పాల్పడుతున్నారు. ♦ప్రస్తుత ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో అప్పులు 62.78 శాతం మాత్రమే పెరిగాయి. అప్పులు రెట్టింపు కావాలంటే ఒక్క 2023–24లోనే రూ.1,01,150 కోట్ల మేర అప్పులు చేయాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర జీఎస్డీపీలో 7.5 శాతానికి సమానం. కేంద్ర నిబంధనల ప్రకారం జీఎస్డీపీలో 3.5 శాతానికి మించి అప్పులు చేయడానికి వీలుండదు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గత సర్కారు పాలనలో మాదిరిగా అప్పులు రెట్టింపు అయ్యేందుకు ఆస్కారమే లేదు. ♦చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఇప్పటి మాదిరిగా ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయకున్నా, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు లేనప్పటికీ అప్పులు మాత్రం రెట్టింపు అయ్యాయి. కోవిడ్‌తో ఆరి్థక ఇబ్బందులు ఎదురైనా సమర్థంగా అధిగమించి సీఎం జగన్ ప్రభుత్వం రూ.1.92 లక్షల కోట్లను పేదలకు నేరుగా పారదర్శకంగా అందించి ఆదుకుంది. ♦విభజన తర్వాత 2014 నాటికి రాష్ట్ర అప్పులు రూ.1,13,797 కోట్లు ఉండగా చంద్రబాబు దిగిపోయే నాటికి 2019 మే నాటికి రూ.2,71,797.56 కోట్లకు ఎగబాకాయి. టీడీపీ పాలనలో అప్పులు ఏకంగా 138.84 శాతం అంటే 2.38 రెట్లు పెరిగాయి. సగటున ఏటా అప్పుల్లో 19.02 శాతం వృద్ధి నమోదైంది. ♦వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2,71,797.56 కోట్లుగా ఉన్న అప్పులు 2022 – 23 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరుకున్నాయి. నాలుగేళ్లలో అప్పుల్లో 62.78 శాతం వృద్ధి నమోదైంది. అంటే సగటున 13.55 శాతమే. ఇది టీడీపీ సర్కారు సగటు 19.02 శాతంతో పోలిస్తే తక్కువే. ♦గత సర్కారు ఎన్నికలకు ముందు రెండు నెలల్లో ఓట్ల కోసం భారీగా అప్పులు చేసింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా 2019 ఏప్రిల్ 9న ఒకే రోజు రూ.5,000 కోట్లు అప్పులు చేసింది. నాడు నోరు మెదపని టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు నిబంధనల ప్రకారం అప్పులు తీసుకుంటున్నా ఏదో ఘోరం జరిగిపోతున్నట్లు విషం చిమ్ముతున్నాయి. వీటిని పట్టుకుని విషయంపై అవగాహన లేని పవన్‌కళ్యాణ్ లాంటి వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ♦వాస్తవానికి టీడీపీ సర్కారు నిబంధనలకు మించి ఐదేళ్లలో రూ.48,128.70 కోట్లు ఎక్కువ అప్పులు చేసింది. దీనిపై ఈనాడు కలం కదల్లేదు ఎందుకో మరి? ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లలో నిబంధనలకు లోబడి రూ.2,696.76 కోట్లు తక్కువ అప్పులు చేసినా, ఇంత మెరుగ్గా ద్రవ్య నిర్వహణ చేస్తున్నా ప్రశంసించకపోగా బురద చల్లడం ఏమిటి? ♦పెండింగ్ బిల్లులు ఏకంగా రూ.1.85 లక్షల కోట్లు ఉన్నట్లు ఈనాడు పచ్చి అబద్ధాలను ప్రచురించింది. వీటికి ఆధారాలున్నాయా? మొత్తం పెండింగ్ బిల్లుల వివరాలను వెల్లడించే ధైర్యం ఉందా? పెండింగ్ బిల్లులపై గత ఏడాది సెపె్టంబర్ 19వ తేదీన అసెంబ్లీ వేదికగా ఆరి్థక మంత్రి స్పష్టంగా చెప్పారు. టీడీపీ అధికారం నుంచి దిగిపోయే సరికి పెండింగ్ బిల్లులు రూ.40,172 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.21,673 కోట్లు మాత్రమే ఉన్నాయని ప్రకటించారు. గత సర్కారు పెండింగ్ బిల్లుల గురించి ఒక్క ముక్క రాయకుండా తప్పుడు వార్తలు ఎందుకు? ఇదేనా ఈనాడు పాటించే జర్నలిజం, మీడియా విలువలు? ♦ రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు రాష్ట్ర అప్పులు ఎలా అవుతాయి? నాన్ గ్యారెంటీ రుణాలు రూ.87,233 కోట్లు అంటూ ఈనాడు ప్రచురించిన కథనం అవాస్తవం. ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు చేసే రుణాలు ప్రభుత్వ అప్పుల కిందకు రావు. ఆమాత్రం కనీస అవగాహన లేకుండా కథనాలు ప్రచురించారు. ఉదాహరణకు ఎన్టీపీసీ తీసుకునే రుణాలు కేంద్ర ప్రభుత్వ అప్పుల కిందకు రావు. టీటీపీ హయాంలో ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కమ్‌లు రూ.55,108.94 కోట్లు నాన్ గ్యారెంటీ రుణాలు తీసుకుంటే వాటి గురించి ఈనాడు ఎప్పుడైనా రాసిందా? నాన్ గ్యారెంటీ రుణాలను కేంద్రం అప్పులుగా ఎప్పుడైనా చూపించిందా? ♦ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ కార్పొరేషన్లు చేసిన అప్పుల్లో ఎక్కడా దాపరికం లేకుండా ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) ప్రకారం అసెంబ్లీకి వెల్లడించాం. 2021 డిసెంబర్ 31 నాటికి పూచీకత్తు రుణాలు రూ.1.17,730 కోట్లు ఉన్నట్లు అసెంబ్లీకి వెల్లడించాం. 2022లో మరికొన్ని గ్యారెంటీ రుణాలు పెరిగినా రూ.1.27 లక్షల కోట్లకు మించదు. అలాంటిది రూ.1.78 లక్షల కోట్లు ఉన్నట్లు ఈనాడు ఏ ఆధారాలతో రాసింది? ♦ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకే గ్యారెంటీ రుణాలున్నాయి. ఆర్బీఐ, 15వ ఆర్థిక సంఘం నిర్థారించిన మేరకే రాష్ట్ర అప్పులున్నాయి. కంపెనీల యాక్ట్ కింద ఆడిట్ లేకుండా లెక్కలను ఎవరైనా రిలీజ్ చేస్తారా? ఆడిట్ పూర్తయ్యాక వాటిని వెల్లడిస్తారు. ఈలోగా తమ ఇష్టానుసారంగా లెక్కలు గట్టి రాసుకుంటామనే ధోరణిలో టీడీపీ అనుకూల మీడియా వ్యవహరిస్తోంది. ♦నిపుణుల అంచనాల పేరుతో వాస్తవాలను వక్రీకరించి తప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. నా బ్యాంకు ఖాతాల్లో ఎన్ని డబ్బులున్నాయో నిపుణులకు ఎలా తెలుస్తుంది? ఊహాగానాలతో, ఇష్టం వచి్చన అంకెలతో తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
రామో 'ఛీ'
-
రామోజీ అవినీతిపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది
-
'చెప్పేందుకే రామోజీ నీతులు'
-
నష్టాల్లో ఉన్నామంటూ రామోజీ ఫిల్మ్ సిటీ కుంటే షాకు
-
నిజాలు దాచి.. వైఎస్‌పై శివాలు
-
బోగస్ రాతలు
-
ఒప్పందం బాబుది.. భూములిచ్చింది రోశయ్య..