సాక్షి, తాడేపల్లి: ధాన్యం కొనుగోళ్లపై రామోజీవి తప్పుడు రాతలు అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వంపై రామోజీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రైతులకు కనీసం ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదని, సీఎం జగన్ పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారని మంత్రి అన్నారు.
‘‘రాష్ట్రంలో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉందని విమర్శిస్తున్నారు. రామోజీ కళ్లు పెద్దవి చేసుకుని చూస్తే నాడు-నేడు ఏం జరిగిందో అర్థమవుతోంది. సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా రైతులకు మేలు జరిగే చర్యలు తీసుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం పచ్చగడ్డిలా మేసేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం 2 కోట్ల 65 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఈ ప్రభుత్వం 32 లక్షల మంది రైతుల నుంచి 3 కోట్ల 10 లక్షల 65 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించింది. 58 వేల కోట్లు చెల్లించాం’’ అని మంత్రి పేర్కొన్నారు.
‘‘చంద్రబాబు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇచ్చాం. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం. రామోజీ.. ఈనాడు పత్రికను మరింతగా దిగజారుస్తున్నారు. దళారీ వ్యవస్థ లేకుండా చేసిన మా పై నిందలా.. తప్పుడు రాతలు రాయడానికి రామోజీకి సిగ్గులేదా?. వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశాం. టీడీపీ హయాంలో దళారీ వ్యవస్థతో రైతులను దోచుకుతిన్నారు. రాష్ట్రంలో రైతులకు మంచి జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు. నిజాలు తెలుసుకుని వార్తలు రాయడం నేర్చుకో రామోజీ’’ అంటూ మంత్రి కారుమూరి దుయ్యబట్టారు.
చదవండి: సినిమా రేంజ్‌లో సీన్లు పండించిన పవన్.. ప్లాన్ బెడిసికొట్టింది!
‘‘దొంగ ఓట్లు చేర్చడంలో చంద్రబాబు దిట్ట. ఈ రోజు నిజం బయటపడటంతో చంద్రబాబు భయపడుతున్నాడు. చంద్రబాబు మాకొద్దు బాబోయ్ అంటున్నారు ప్రజలు. 600 హామీలిచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది ఎవరు?. డ్వాక్రా మహిళలను మోసం చేసింది ఎవరు? చంద్రబాబు, లోకేష్, పవన్ రోడ్లపై తిరగడం వల్ల వర్షాలు కూడా పడటం లేదు’’ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment