నారా లోకేష్‌ ఓ పిల్ల కాకి: మంత్రి కారుమూరి | Minister Karumuri Venkata Nageswara Rao Comments On Nara Lokesh | Sakshi
Sakshi News home page

నారా లోకేష్‌ ఓ పిల్ల కాకి: మంత్రి కారుమూరి

Published Tue, Aug 22 2023 6:44 PM | Last Updated on Tue, Aug 22 2023 7:05 PM

Minister Karumuri Venkata Nageswara Rao Comments On Nara Lokesh - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే బీసీలకు మేలు జరిగిందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.

సాక్షి, పల్నాడు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే బీసీలకు మేలు జరిగిందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నారా లోకేష్‌ ఓ పిల్ల కాకి అంటూ దుయ్యబట్టారు. మూడు పర్యాయాలు సీఎంగా చేసిన చంద్రబాబు.. ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించాడా అని ప్రశ్నించారు.

‘‘బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదు. బీసీలను ఓట్లేసే యంత్రంలా చంద్రబాబు వాడుకున్నాడు. ఇష్టానుసారంగా దొంగ ఓట్లు రాయించింది చంద్రబాబే. అల్జీమర్స్‌ వ్యాధి చంద్రబాబు కుటుంబంలో ఉంది’’ అని మంత్రి మండిపడ్డారు.
చదవండి: పాదయాత్రలో లోకేష్‌కు జూ.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement