సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెప్తారంటూ మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల మోతతో ప్రజలపై రూ.15వేల కోట్ల భారం మోపారని ధ్వజమెత్తారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎలా బతకాలంటూ ఆయన ప్రశ్నించారు. పేదవాడిని లక్షాధికారి చేస్తానని ఇప్పుడు చేస్తున్నదేంటీ? ఇలా బాదుడు బాధితే లక్షాధికారి భిక్షాధికారి అవుతాడంటూ ఆయన వ్యాఖ్యానించారు.
విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: వరుదు కళ్యాణి
విశాఖ: చంద్రబాబు మోసానికే బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. కొండనాలిక మందేస్తే ఉన్న ఉన్న నాలుక ఊడినట్లు ప్రజల పరిస్థితి తయారైందన్నారు. ‘‘విద్యుత్ ఛార్జీల పెంపుదల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజలపై భారం మోపితే చూస్తూ ఊరుకొం. ప్రజల తరఫున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే నిత్యవసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి.. ఇప్పుడు ప్రజలపై భారం మోపడం దుర్మార్గం’’ వరుదు కళ్యాణి మండిపడ్డారు.
సంపద సృష్టిస్తామని చెప్పి విద్యుత్ చార్జీలు పెంచి సంపద సృష్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్థికంగా రాష్ట్ర అభివృద్ధి చేస్తామని చెప్పి చంద్రబాబు కరెంట్ చార్జీల పేరుతో రూ.15 వేల కోట్ల రూపాయలను ప్రజలపై భారం మోపారని ధ్వజమెత్తారు.
ప్రజలపై భారం: ఎస్వీ మోహన్‌రెడ్డి
తాజాగా రూ. 9 వేల కోట్ల రూపాయలు విద్యుత్ భారం మోపి ఇంట్లో కరెంటు స్వీచ్ వేయాలంటే భయపడేవిధంగా చేస్తున్నారన్నారు. ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండా విద్యుత్ చార్జీల పేరుతో 15 వేల కోట్ల రూపాయలను ప్రజలపై భారం వేశారు. సెకి పేరుతో విద్యుత్ ఒప్పందంలో ఏదో జరిగిందని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఎల్లో మీడియా, టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో తక్కువ ధరకే విద్యుత్ ఒప్పందం కుదిరింది’’ అని ఎస్వీ మోహన్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment