సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును ప్రణా ళికాబద్ధంగా పూర్తి చేసేందుకు నిర్వాసి తులకు దశలవారీగా పునరావాస కల్పనపై చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై పదేపదే దుష్ప్రచారం చేయడంతోపాటు చంద్రబాబు తప్పిదాలను సైతం ఈ ప్రభుత్వానికి అంటగట్టే దుస్సాహసానికి ఈనాడు రామోజీ ఒడిగడుతున్నారు. ‘జగనన్నా.. ఇంకెన్నేళ్లు ముంచుతారు?’ శీర్షికన ప్రచురించిన కథనంలో ప్రతి అక్షరం పచ్చి అబద్ధమే.
ఆరోపణ: వరదొచ్చిన ప్రతిసారీ పోలవరం పరిధిలోని గ్రామాలు ముంపునకు గురవుతు న్నాయి. సీఎం జగన్ హామీకి అనుగుణంగా ఇప్పటికీ పునరావాసం పూర్తి కాలేదు.
వాస్తవం: పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం లేదు. స్పిల్ వే 48 గేట్లను పూర్తిగా ఎత్తివేసి వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు వదిలేస్తున్నారు. అలాంటప్పుడు కొత్తగా ముంపు సమస్య ఎలా వస్తుంది రామోజీ? గోదావరి వరద ఉద్ధృతి సమయంలో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పుడు.. పోలవరం కట్టక ముందు విలీన మండలాల్లో ముంపునకు గురయ్యే గ్రామాలే ఇప్పుడూ ముంపునకు గురయ్యాయి.
గతంలో మాదిరి గానే ఆయా గ్రామాల్లో వరద బాధితులను పునరావాస శిబిరాలకు తరలించి బియ్యం, కందిపప్పు, వంటనూనెతోపాటు తక్షణం నగదు సాయం అందించి వరద తగ్గాక బాధితులను ఆయా గ్రామాలకు చేర్చారు. వరద సహాయ కార్యక్రమాల అమలును సీఎం జగన్ సోమ, మంగళవారాల్లో స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ప్రభుత్వ తక్షణ స్పందనపై బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. సీజన్ ముగిసేలోగా పంట నష్టానికి ప్రభుత్వం రైతులకు పరిహారం అందించనుంది.
ఆరోపణ: పోలవరంలో 45.72 మీటర్ల వరకూ నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించడానికి రూ.20 వేల కోట్లకుపైగా అవసరం. నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని ప్రధాని మోదీని కోరుతానని 2022 జూలై 27న ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చలేదు.
వాస్తవం: నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు 2022 ఆగస్టు 22న ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే సమయంలో నాటి సీఎం చంద్రబాబు 2013–14 ధరల ప్రకారం రూ.20,398 కోట్లతో పూర్తి చేస్తానని అంగీకరించిన అంశాన్ని గుర్తు చేశారు. అందులో నిర్వాసితుల పునరావాస వ్యయం రూ.7,279 కోట్లేనని ప్రస్తావించారు. కానీ భూసేకరణ చట్టం 2013 ప్రకారం వాస్తవంగా నిర్వాసితుల పునరావాస వ్యయం రూ.23,875 కోట్లు ఉంటుందని వివరించారు.
ఈ నేపథ్యంలో 2013–14 ధరలతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని సీఎం జగన్ తేల్చి చెప్పారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి బటన్ నొక్కి జమ చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు తొలి దశ పూర్తికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని అభ్యర్థించారు. 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఖరారు చేసిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి ఆ మేరకు నిధులిచ్చి ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ పోలవరానికి నిధుల విడుదలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్ శక్తి శాఖకు దిశానిర్దేశం చేశారు.
వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌ను సరిదిద్దడం, ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులతోపాటు తొలి దశ (41.15 మీటర్ల కాంటూర్) పూర్తికి రూ.12,911.15 కోట్లను అదనంగా ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ జూన్ 5న అంగీకరించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన లైడార్ సర్వేలో 41.15 కాంటూర్ పరిధిలోకి మరో 32 గ్రామాలు వస్తాయని తేలింది. ఆయా గ్రామాల్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి రూ.5,217 కోట్లు మంజూరు చేయా లని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది.
ఆరోపణ: 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ప్రభుత్వం వారిని ముంచేస్తోంది.
వాస్తవం: టీడీపీ హయాంలో కమీషన్లు రావనే ఉద్దేశంతో నిర్వాసితులకు చంద్రబాబు పునరావాసం కల్పించలేదు. నాడు నవయుగకు నామినేషన్‌పై పనులను కట్టబెట్టడంతో డీపీటీ (దోచుకో పంచుకో తినుకో) పద్ధతిలో ప్రజాధనాన్ని దోచుకున్న రామోజీ గత సర్కారు నిర్వాకాలను ఎండగట్టలేదు. ఇప్పుడు వాటిని వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి ఆపాదించే దుస్సాహసానికి ఒడిగట్టారు.
టీడీపీ సర్కార్ ఐదేళ్లలో రూ.484 కోట్లను ఖర్చు చేసి కాంటూర్ లెవల్‌తో నిమిత్తం లేకుండా అక్కడ కొందరికి ఇక్కడ కొందరికి తరహాలో 3,110 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించింది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల జీవన ప్రమాణాలు పెంచేలా మెరుగైన ప్యాకేజీని అమలు చేస్తున్నారు. నాలుగేళ్లలో రూ.16,777 కోట్లు ఖర్చు చేసి ఇప్పటికే 8,446 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగతా కుటుంబాలకు కూడా పునరావాసం కల్పన పనులు శరవేగంగా సాగుతున్నా రామోజీ కనపడనట్లు నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment