FactCheck: Eenadu Ramoji Rao False Propaganda On Higher Education In AP, Facts Inside - Sakshi
Sakshi News home page

ఏది నిజం?: ‘ఈనాడు’ వంకర రాతలు.. రామోజీ ఇవన్నీ సాధ్యమయ్యాయిగా?

Published Sat, Jul 15 2023 6:59 AM | Last Updated on Sat, Jul 15 2023 4:53 PM

Eenadu Ramoji False Propaganda On Higher Education - Sakshi

నిజాలకు పాతరేసి.. అబద్ధాలు అందంగా అచ్చు వేయటంలో ‘ఈనాడు’ దిట్ట. ఏలినవారు కావాల్సిన వారైతే... ఏమీ చేయకపోయినా సాహో.. అంటూ పొగడ్తలు కురిపిస్తుంది. అదే అధికారం తమవారి చేతుల్లో లేకపోతే మాత్రం... ‘ప్రతిపక్ష’ పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని ఒకనాడు కోర్టుకే నేరుగా చెప్పారు ఘనత వహించిన రామోజీరావు. ఇదంతా ఎందుకంటే... ఉన్నత విద్యా వ్యవస్థలో తీసుకు రావాల్సిన మార్పులను వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన విజన్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వీసీలతో సమావేశమై భవిష్యత్తులో చేపట్టాల్సిన మార్పులను చర్చించారు.

అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న టెక్నాలజీలను మన పిల్లలు ఒడిసి పట్టుకోవటానికి యూనివర్సిటీలు ఏం చేయాలో ఆయన చెప్పారు. ఆ వార్త యథాతథంగా వేస్తే... ముఖ్యమంత్రి విజన్‌ అందరికీ తెలుస్తుందని, చదువుకున్న వారిలోను, విద్యార్థుల్లోను సానుకూలత వస్తుందని భయపడిన రామోజీరావు... ‘సీఎంగారూ! ఇదెలా సాధ్యం?’ అంటూ తన పైత్యం మొత్తాన్ని జోడించి ఒక కథనాన్ని వండేశారు. యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టలేదని, నిధులు మళ్లించేస్తున్నారని, వైస్‌చాన్స్‌లర్లుగా, పాలకమండలి సభ్యులుగా అధికార పారీ్టకి కావాల్సిన వారిని నియమించారని... ఇలా చేతికొచ్చినంత  రాసిపారేశారు. మరి ఇందులో నిజమెంత?  ఏది నిజం? 

నిజమే! ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పోస్టు­లు భర్తీ కావటం లేదు. కాకపోతే అది గడిచిన నాలుగేళ్లుగా కాదు. చాలా సంవత్సరాలుగా!!. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నాటి నుంచీ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్లుగా, పాలక మండలి సభ్యులుగా తన బంధువులనే నియమించుకున్నారు. వారు అడ్డగోలుగా అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కేసి తమకు కావాల్సిన వారిని, ముడుపులిచ్చిన వారిని నియమించుకోబోయారు.

ఆ పోస్టులను ఆశిస్తున్న పలువురు నిరుద్యోగులు, వారి తీరు నచ్చన ఆయా వర్సిటీల్లోని సిబ్బంది ఈ వ్యవహారంపై కోర్టులకెళ్లారు. దీంతో రిక్రూట్‌మెంట్లు నిలిచిపోయాయి. ఆ పోస్టులన్నీ అలానే ఖాళీగా ఉండిపోయాయి. మరి అలా వర్సిటీల్లో తమ బంధువుల్ని నియమించుకున్నందుకు చంద్రబాబును ఎన్న­డూ ప్రశి్నంచలేదెందుకు రామోజీరావు గారూ? వారు అడ్డగోలుగా పోస్టుల భర్తీ చేయబట్టే కదా... కోర్టుల్లో కేసులు పడి రిక్రూట్‌మెంట్లు నిలిచి పోయా­యి.

దాన్ని కూడా ఎన్నడూ ప్రశ్నించలేదెందుకు? ఇవన్నీ పక్కనబెడితే... కనీసం ఆ కోర్టు కేసుల్ని త్వరగా పరిష్కరించి పోస్టులు భర్తీ చేయాల్సిన బాధ్య­త ప్రభుత్వంపై ఉందనే వార్తలు సైతం ‘ఈనాడు’ రాస్తే ఒట్టు!. ఇప్పుడేమో ఆ కేసులన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ పోస్టు­ల భర్తీ చేపడుతున్న ప్రభుత్వాన్ని మాత్రం ప్రశి్నంచటం మొద­­లెట్టారు రామోజీ!!. నాలుగేళ్లూ ఊరు­కుని ఇప్పు­డెందుకంటూ సన్నాయి నొక్కులు మొద­లు పెట్టారు.

అసలు ఐదేళ్లూ ఏమీ చేయని చంద్రబాబు­ను... కోర్టు కేసులకు కారకుడైన చంద్రబాబును మాత్ర­ం వెనకేసుకొస్తూనే ఉన్నారు. పైపెచ్చు ఈ ప్రభుత్వం యూనివర్సిటీల పాలక మండళ్లలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో 50% మహిళలకే అవకాశమిస్తోంది. దాన్ని కూడా పక్కనబెట్టి అంతా అధికార పారీ్టవారే అంటూ దుర్మార్గపు రాతలకు దిగిం­ది ‘ఈనాడు’. అదీ రామోజీరావు తీరు!!. ఇదీ నిజం. 

నిధులు మళ్లించిందెవరు రామోజీ? 
వర్సిటీల నిధులను దారిమళ్లించినట్లు ‘ఈనాడు’ అవాస్తవాలను వండి వార్చేసింది. మరి ఇందులో నిజమెంత? టీడీపీ ప్రభుత్వ హయాంలోనే యూనివర్సిటీలకు ఉరి వెయ్యటానికి చంద్రబాబు నిధుల దుబారా పథకాన్ని అమలు చేశారు. అంటే... ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారాల కోసం యూనివర్సిటీల్లో సమావేశాలు నిర్వహించారు. సమావేశం వర్సిటీలో కనక దానికయ్యే ఖర్చు మొత్తాన్ని వర్సిటీల నుంచే చేయించారు. ఇందుకోసం ఆయా యూనివర్సిటీలు ఒక్కొక్కటి రూ.10 కోట్ల చొప్పున ఖర్చు చేశాయి. కానీ అప్పట్లో ‘ఈనాడు’ పెన్నెత్తితే ఒట్టు.

ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పనులకోసం స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయించింది. వర్సిటీలు సహా ఇతర సంస్థలు తమ వద్ద అదనంగా ఉన్న నిధులను బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే వచ్చే వడ్డీకన్నా ఎక్కువ వడ్డీ చెల్లిస్తూ కార్పొరేషన్లో డిపాజిట్‌ చేసేలా చర్యలు తీసుకున్నారు. వర్సిటీల నిధులకు అధిక వడ్డీ చెల్లిస్తూ తిరిగి వారికి అవసరమైనప్పుడు ఇస్తున్నారు. బాబు దుబారాపై కళ్లు మూసుకుని... డిపాజిట్లను నిధులు మళ్లించటమని అంటున్నారంటే రామోజీని ఏమనుకోవాలి? ఎంతైనా రామోజీ.. రామోజీనే!! 

సాక్షాత్తూ యూజీసీ చైర్మన్‌ చెప్పారు  
జూలై 1న సాక్షాత్తూ యూజీసీ ౖచైర్మన్‌ కాకినాడలో జరిగిన సమావేశంలో... ఉన్నత విద్యకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ పలు అంశాల్లో ముందున్నదని వ్యాఖ్యానించారు. కానీ ‘ఈనాడు’ మాత్రం ఉన్నత విద్యపై బురద చల్లుతూ విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో భయాందోళనలను కలిగించడానికి ప్రయత్నిస్తోందన్నది నిజం. గడిచిన నాలుగేళ్లలో దేశంలోనే తొలిసారిగా ఏపీలోని పలు యూనివర్సిటీల్లో సంస్కరణలు తెచ్చారు. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్లానింగ్‌ బోర్డు, రీజనల్‌ క్లస్టర్‌ గ్రూపులు, 10 నెలల తప్పనిసరి ఇంటర్న్‌షిప్, కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్టులు, నైపుణ్య  కోర్సులు వంటి అనేక సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఇదే క్రమంలో ప్రపంచ స్థాయిలోని మేటి వర్సిటీల్లో ఉన్న నాలుగేళ్ల కోర్సును నూతన జాతీయ విద్యా విధానంతో అనుసంధానం చేసి విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలన్నీ ‘ఈనాడు’కు అసాధ్యమైనవిగా కనిపించటం విచిత్రమే మరి.

ఎందుకంటే చేస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు కాదు కాబట్టి ‘ఈనాడు’కు సహజంగానే అవన్నీ అసాధ్యమైనవిగా కనిపిస్తాయి. ఒక కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెట్టే ముందు దానిపై లోతుగా అధ్యయనం చేయటం, ప్రణాళికాబద్ధంగా అమలుకోసం సన్నద్ధమవటం వంటివి చేస్తున్నపుడు ఏదో ఒకరకంగా బురద జల్లాలనే లక్ష్యంతో ‘ఈనాడు’ వరుస కథనాలు రాస్తూనే ఉంది.

నిజం చెప్పాలంటే నిన్న జరిగిన వైస్‌చాన్సలర్ల సమావేశం.. ఈ ప్రభుత్వం వచ్చాక జరిగిన మొదటి సమావేశం కాదు. 2021 అక్టోబర్‌ 25న తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్‌ ఉపకులపతులతో సమావేశమై ఉన్నత విద్యపై దిశానిర్దేశం చేశారు. ఈ నాలుగేళ్లలో దాదాపుగా 10 సార్లు ఉన్నత విద్యపై అధికారులతో సమీక్షలు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఉన్నత విద్యపై ఇన్ని సమీక్షలు, సమావేశాలు నిర్వహించలేదు. వీటన్నిటినీ విస్మరించిన ‘ఈనాడు’... నాలుగేళ్ల తరవాత తొలి­సారిగా వీసీలతో సమావేశం నిర్వహిస్తున్నారన్న తరహాలో కథనాన్ని వండిందంటేనే.. రామోజీ దుర్బుద్ధిని అర్థం చేసుకోవచ్చు. 

ఆరంభం నుంచే పటిష్ట పునాదులు
ఒక్క ఉన్నత విద్యలోనే కాకుండా పునాది స్థాయి నుంచే విద్యార్ధులను తీర్చిదిద్దేలా రాష్ట్రంలో పలు సంస్కరణలను సీఎం జగన్‌ తొలిరోజు నుంచీ అమలు చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకోవడమే కాకుండా పలు రాష్ట్రాలకు ఆదర్శంగానూ నిలిచాయి. పాఠశాల విద్యలో నాడు–నేడు, అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద వంటి పథకాలు యూపీ, అస్సాం, బీహార్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. గతంలో ప్రయివేటుకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమాన్ని వైఎస్‌ జగన్‌ సీఎం అయిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టించారు.

దీనిపైనా చంద్రబాబు, రామోజీ విషం చిమ్మి అడ్డుపడే ప్రయత్నం చేశారు. నూతన విద్యావిధానం కన్నా ముందే రాష్ట్రంలో ఫౌండేషన్‌ విద్యావిధానాన్ని తీసుకువచ్చి శిశుస్థాయి నుంచే పిల్లల్లో అక్షరజ్ఞానానికి సీఎం శ్రీకారం చుట్టారు. నాడునేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, సీబీఎస్‌ఈ విధానం వంటి విధానాలను తెచ్చి పాఠశాల విద్యను బలోపేతం చేశారు. 6వ తరగతి నుంచి అన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లను నెలకొల్పి డిజిటల్‌ బోధన చేయిస్తున్నారు. ప్రతి ఏటా 8వ తరగతికి వచ్చే విద్యార్ధులకు, టీచర్లకు ట్యాబులను కూడా అందిస్తూ... దిగ్గజ ఎడ్యుటెక్‌ కంపెనీ బైజూస్‌ పాఠాలను కూడా అందులో అందజేస్తున్నారు. 

ఉన్నత విద్య భారం  పూర్తిగా ప్రభుత్వానిదే... 
ఉన్నత విద్యలో చేరే ప్రతి విద్యార్థికీ పూర్తి ఫీజురీయింబర్స్‌మెంటుతో పాటు వారి వసతి ఖర్చులనూ ప్రభుత్వమే భరించేలా ముఖ్యమంత్రి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్నారు. దీనికోసం గత నాలుగేళ్లలో రూ.15వేల కోట్ల వరకు ప్రభుత్వం వెచి్చంచింది. గత ప్రభుత్వంలో 35వేలు మాత్రమే ఫీజు ఇవ్వడంతో మిగతా మొత్తాన్ని విద్యార్ధులే కట్టుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం పూర్తిభారం ప్రభుత్వానిదే కావటంతో ఇంటర్‌ తరవాత డ్రాపవుట్లు గత ప్రభుత్వంలో 21 శాతం ఉండగా ఇపుడు 6 శాతానికి తగ్గారు. ఉన్నత విద్యలోనూ నేటి అవసరాలకు తగ్గట్టుగా కరిక్యులమ్‌ అభివృద్ధి చేయించారు. బెంగళూరు ఐఐఎస్‌సీ ప్రొఫెసర్‌ బాలకృష్ణన్‌ నేతృత్వంలో కమిటీని వేసి సంస్కరణలకు శ్రీకారం చుట్టించారు. డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసి నాలుగేళ్ల హానర్‌ కోర్సులను ఏర్పాటు చేయించారు.  

27 వేల పరిశ్రమలు, సంస్థల అనుసంధానంతో ఇంటర్న్‌షిప్‌.
విద్యార్ధులకు ఇంటర్న్‌íÙప్‌కోసం కాలేజీలను జిల్లాల వారీగా 27వేల పరిశ్రమలతో అనుసంధానం చేయించారు. చదువులు పూర్తి చేసేనాటికే విద్యార్ధులకు అవసరమైన ఉద్యోగ, ఉపాధి నైపుణ్యాలు సమకూరేలా చేశారు. విద్యార్ధులలో నైపుణ్యాలకోసం  553 ఎంటర్‌ప్రెన్యూర్‌íÙప్, ఇంక్యుబేషన్, స్టార్టప్‌ కేంద్రాల ఏర్పాటుచేయించారు.  మైక్రోసాఫ్ట్‌ ద్వారా రూ.32 కోట్లతో  1.62 లక్షల మందికి సర్టిఫికేషన్‌ కోర్సులు అందించారు.

మరో 1.95 లక్షల మందికి వివిధ కంపెనీలతో వర్చువల్‌ ఇంటర్న్‌íÙప్‌ అందించారు. నాస్కామ్‌ ఫ్యూచర్‌స్కి­ల్స్, ఎడ్యుస్కిల్స్, బీఎస్‌ఎన్‌ఎల్, సేల్స్‌ఫోర్సు, పాల్‌ ఆల్టో, బ్లూప్రిజమ్, ఫుల్‌స్టేక్, ఏడబ్ల్యూఎస్, ఎంప్లాయిమెంటు ఎక్స్‌ప్రెస్‌ వంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలతో వర్చువల్‌ శిక్షణ ద్వారా నైపుణ్యాలను మెరుగుపర్చారు. సాఫ్ట్‌వేర్, ఐటీ రంగాల్లోనే కాకుండా  బ్యాంకింగ్, ఫైనాన్సియల్, క్స్‌టైల్స్, అపెరల్, లైఫ్‌సైన్సెస్, అగ్రికల్చర్, హెల్త్‌కేర్‌ తదితరాల్లో ఇంటర్న్‌íÙప్‌ వల్ల విద్యార్ధులకు అవగాహన పెరుగుతోంది. బాబు హయాంలో 37వేలు మాత్రమే ప్లేస్‌మెంట్లు ఉండగా గత ఏడాదికి ఈ సంఖ్య 85వేలకు చేరింది. ఈ ఏడాదిలో 1.20 లక్షల మందికి ప్లేస్‌మెంట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంతా ‘పచ్చ’గానే ఉండాలనుకునే రామోజీరావు కళ్లకు ఇవేవీ ఎన్నటికీ కనిపించకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు.

బాబు హయాంలో ఒక్కపోస్టూ భర్తీ చేయలేదే..
మన పిల్లలని ప్రపంచస్థాయి లీడర్లుగా ఎదగకుండా ఆపింది ఎవరు? అనేది ‘ఈనాడు’ ప్రశ్న. దీనికి సమాధానం చంద్రబాబే. ఎందుకంటే విశ్వవిద్యాలయాలలోని ఖాళీలు భర్తీ కాకపోవడానికి కారణం ఆయనే. చంద్రబాబు అధికారంలో ఉన్న తొలి తొమ్మిదేళ్ళూ... అంటే 1995 నుంచి 2004 వరకు,  ఆలాగే, ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయాక 2014 నుండీ 2019 వరకూ విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఆచార్యుడినీ నియమించలేదు. దీన్ని రామోజీరావు ఎప్పుడూ ప్రశ్నించలేదు కూడా!. 

విశ్వవిద్యాలయాల్లో 71 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, ఆయా కోర్సుల్లో పిల్లలకు పాఠాలు చెప్పేవారు లేకుంటే కృత్రిమ మేధ వంటి కొత్త కోర్సుల వల్ల ఉపయోగం ఏమిటనేది ‘ఈనాడు’ ప్రశ్న. వాస్తవానికి మారుతున్న సమకాలీన సామాజిక అవసరాల దృష్ట్యా కొత్త కోర్సులు వస్తుంటాయి. వాటికి అవసరమైన నిపుణులను వర్సిటీల్లో నియమించుకోవాలి. అంతేకానీ, ప్రస్తుతం నిపుణులు లేరు కాబట్టి కొత్త కోర్సులను తేవొద్దని చెప్పటం ఏ రకమైన పాత్రికేయం?  

వర్సిటీల్లో ర్యాంకులు పడిపోతున్నాయనీ, ఈ సమయంలో కొత్త కోర్సులు అవసరమా? అనేది ‘ఈనాడు’ కథనంలో ప్రధానమైన అంశం. ర్యాంకులు పడిపోవడానికి శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఆచార్యులు లేకపోవడమే కారణం. దీనికి ప్రధాన బాధ్యుడు చంద్రబాబే. నియామకాలు చేపట్టకపోవటం, కోర్టు కేసులపై దృష్టిపెట్టకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.

ర్యాంకులను పునరుద్ధరించుకోవడానికి  ముఖ్యమంత్రి, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌ వంటి విశ్వవిద్యాలయాల అభివృద్ధి నమూనాలను తీసుకోవాలని దార్శనికతతో వివరించారు. రాబోయే కొద్ది రోజుల్లో బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టాలని సూచించారు. తద్వారా విశ్వవిద్యాలయాలను శక్తివంతమైన సాంకేతిక, ఆధునిక విద్యా కేంద్రాలుగా మారాలన్నారు. కార్యాచరణ మొదలుపెట్టి విద్యార్థులను గ్లోబల్‌ లీడర్లుగా తయారు చేయాలని పేర్కొన్నారు.

వాస్తవానికి ముఖ్యమంత్రి ప్రతిపాదించిన అంశాలు, ఏ నిరుద్యోగినీ బాధించవు. అవకాశాలు పెంచుకోవడానికి, మరికొంత మందిని ఉపాధికి చేరువ చేయడానికి కృత్రిమ మేధ ఉపయోగ పడుతుంది. బహుశా, ఇలాంటి విధానం ‘ఈనాడు’కు నచ్చి ఉండకపోవచ్చు. లేకపోతే ఇలా చెప్పింది చంద్రబాబు కాదు కాబట్టి నచ్చి ఉండకపోవచ్చు. విశ్వవిద్యాలయాల్లో పోస్టులు త్వరలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు సిద్ధమవుతుండటాన్ని గమనించి... ఎలాగైనా నియామకాలు జరగకూడదనే కుట్ర ఈ కథనంలో స్పష్టంగా కనబడుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement