
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన ఉన్నత విద్య పేదవాళ్లందరికీ అందాలని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆకాంక్షించారు. ఈ దిశగా విద్యా సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. జాతీయ విద్యావిధానం–2020 ఈ తరహా మార్పు లకు శ్రీకారం చుడుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ’’విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్లు– పూర్వ విద్యార్థులతో సంబంధాలు’’ అనే అంశంపై సోమవారం రాజ్‌భవన్‌లో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని పలు విశ్వవి ద్యాలయాల వీసీలు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల్లో స్థిరపడిన వర్సిటీల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతు లు పెంచి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బోధన విధానాలు తీసుకురావాలని సూచించారు.
అకడమిక్ యాక్టివిటీని వర్సిటీలు మర్చిపోయాయి
ప్రపంచంతో పోటీ పడగల సత్తా రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఉందని, అయితే అకడమిక్ యాక్టివిటీని విశ్వవిద్యాలయాలు మరిచిపోయా యని ఆమె వ్యాఖ్యానించారు. సరైన బోధన విధానాలు, మౌలిక వసతులు కల్పిస్తే ఇప్పుడు ప్రపంచ విశ్వవిద్యాలయాల గురించి చెప్పుకున్నట్టే, భవిష్యత్‌లో మన యూనివర్సిటీల గురించి చర్చించుకునే వీలుందన్నారు. విద్యావికాసానికి డిజిటల్ లైబ్రరీ మంచి అవకాశంగా పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సహకారం విశ్వవిద్యాలయాలకు అత్యంత ముఖ్యమని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment