ట్రాఫిక్ జామ్ ఝూటం | The increase in traffic .. | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ జామ్ ఝూటం

Published Wed, Dec 30 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM

ట్రాఫిక్  జామ్ ఝూటం

ట్రాఫిక్ జామ్ ఝూటం

ఏమేవ్..ఆఫీసుకు వెళ్లాలి.. త్వరగా బాక్స్ రెడీ చెయ్..ఏంటండీ అంత తొందర.. ఇప్పుడు ఏడు గంటల కూడా
కాలేదు..హడావుడి చేస్తున్నారు.. హడావుడి కాకపోతే నిన్న 8.30 గంటలకు బయలుదేరా.. ఐదు కిలోమీటర్ల దూరంలోని ఆఫీసుకు చేరేపాటికి 10.30 గంటలైంది.. బాసు గయ్యమన్నాడు.. అమ్మో...ఆ ట్రాఫిక్ తలుచుకుంటేనే భయమేస్తోంది..నేను త్వరగా వెళ్లాలి. నువ్వు కానీకానీ..ఇవీ నిత్యం గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఇంటింటికో కథలు..ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిలలాడుతున్న ప్రజల వెతలు.
 
ట్రాఫిక్ సమస్య ఇక్కడ అధికం..
విజయవాడ నగరానికి ప్రవేశ ద్వారంగా ఉన్న కుమ్మరిపాలెం సెంటర్, రామవరప్పాడు రింగ్‌లో రోడ్డు వెడల్పు తక్కువగా ఉంది. బందరు రోడ్డులోని పశువుల ఆసుపత్రి సెంటర్, బెంజ్ సర్కిల్, పడమట, ఎన్టీఆర్ సర్కిల్, ఏలూరు రోడ్డులో మాచవరం డౌన్, గుణదల సెంటర్‌లోనూ ట్రాఫిక్ తిప్పలు ఎక్కువగా ఉన్నారుు. వన్‌టౌన్‌లో కాళేశ్వరరావు మార్కెట్, బొడ్డెమ్మ హోటల్, నెహ్రూ బొమ్మ సెంటర్, చిట్టినగర్, రథం సెంటర్ల ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారుు. కనకదుర్గ ఫ్లైఓవర్ పనుల కారణంగా వన్‌టౌన్ అంతా ట్రాఫిక్ అంక్షలు విధించారు. హైదరాబాద్ నుంచి నగరంలో వచ్చే వాహనాలు కుమ్మరిపాలెం మీదుగా సితార సెంటర్, కబేళా, వెంకట్రావ్ ఫ్లైఓవర్ పాల ఫ్యాక్టరీ మీదుగా ఎర్రకట్ట వైపు మళ్లిస్తున్నారు. ద్విచక్ర వాహనాలను సొరంగ మార్గం లోంచి అనుమతిస్తున్నారు. ఎర్రకట్ట రోడ్డు ఇరుకుగా ఉంది. గతంలో 30 అడుగులు ఉన్న ఎర్రకట్టను ఇటీవలే 12 అడుగులు వెడల్పు పెంచారు. ప్రస్తుతం ఈ మార్గంలో రోజు సగటున 25 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో 42 అడుగులు రోడ్డు కావటంతో అందులోనూ మూడు రైల్వే బ్రిడ్జిలు శిథిలావస్థ చేరటంతో
 
విజయవాడ : ట్రాఫిక్ పద్మ వ్యూహంలో జంట నగరాలు చిక్కుకున్నాయి. పక్కా ప్రణాళిక లేకపోవటం, ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉన్న రహదారులు ఇరుకుగా ఉంటడం, నగరానికి ప్రవేశ ద్వారాలుగా ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా చిన్న రోడ్లు ఉండటం వెరసి ట్రాఫిక్ సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. జంట నగరాలకు సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు, విదేశి ప్రతినిధుల తాకిడి పెరిగింది. వీఐపీల కోసం ట్రాఫిక్‌ను కొద్ది సేపు నిలువరిస్తే పునరుద్ధరించడానికి గంటపైనే పడుతుంది. రాజధాని నగర స్థాయికి తగ్గట్లుగా రోడ్లు లేవని సీఎంతో సహా అందరూ పదే పదే చెబుతున్నారు. వీటి అభివృద్ధికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణ  నుంచి ఒడిషా, చత్తీస్‌ఘడ్, తమిళనాడు, కర్ణాటక వెళ్లే వాహనాలు తప్పనిసరిగా నగరంలోకి రావాల్సిందే.

పక్కా ప్రణాళిక ఏది ?
విజయవాడలో దసరా ఉత్సవాలు, వీవీఐపీల బహిరంగ సభలు,  భవానీ దీక్షల సమయంలో ట్రాఫిక్ మళ్లింపులు మినహా శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు ఆలోచన చేయడం లేదు. గతంలో సీఎం రోడ్ల వెడల్పుకు వంద కోట్లు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. వరుస ప్రాజెక్ట్‌లతో అది అటకెక్కింది. నగర కమిషనర్‌గా గౌతం సవాంగ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ అంశాలపై బిజీగా ఉండటంతో ట్రాఫిక్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించ లేదు. గుంటూరులో నల్లపాడు, పొన్నూరు రోడ్లు పూర్తి స్థాయిలో విస్తరించకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రమాదం పొంచి ఉంది.
 
గుంటూరులో..
గుంటూరులో బస్టాండ్, జిన్నాటవర్, మార్కెట్, గుజ్జనగుండ్ల, బ్రాడీపేట నాలుగో లైను, శంకర్‌విలాస్, లక్ష్మీపురం, రింగ్ రోడ్డు సెంటర్లలో ట్రాఫిక్ ఎక్కువగా నిలిచిపోతోంది. నగరంలో ఎక్కడా వంద అడుగుల రోడ్డు లేదు. ఉన్న రోడ్లను అవసరాలకు అనుగుణంగా పది అడుగులు విస్తరిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో అక్రమణల కారణంగా విస్తరణ చేయడం లేదు. పట్నంబజార్ మెరుున్ రోడ్డులోకి వెళ్లి తిరిగి రావాలంటే కనీసం గంట సమయం  పడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement