బస్సులు తక్కువ.. భక్తులు ఎక్కువ | Buses less than the devotees | Sakshi

బస్సులు తక్కువ.. భక్తులు ఎక్కువ

Jul 18 2015 12:44 AM | Updated on Sep 3 2017 5:41 AM

బస్సులు తక్కువ.. భక్తులు ఎక్కువ

బస్సులు తక్కువ.. భక్తులు ఎక్కువ

మంగపేట పుష్కరఘాట్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని పుణ్యస్నానాల ప్రాంతానికి భక్తులను ...

ములుగు : మంగపేట పుష్కరఘాట్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని పుణ్యస్నానాల ప్రాంతానికి భక్తులను చేరవేసేందుకు ఉచిత షటిల్ సర్వీసులు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా ఆచరణలో సాధ్యంకాలేదు. శుక్రవారం అమావాస్య అరుునా సాయంత్రం వరకు సుమారు 60వేల మంది భక్తులు తరలివచ్చారు. వీరిని గంపోనిగూడెం తరలించే క్రమంలో ట్రాఫిక్ సమస్య తలెత్తగా ప్రైవేటు వాహనాలు నిలిచిపోయూరుు. సీఐ శ్రీధర్‌రావు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో భారీగా తరలివచ్చే వాహనాలు నిలిపేందుకు మంగపేట పార్కింగ్ ప్రాంతంలో మరో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. కాగా, గంపోనిగూడెం నుంచి ఉచిత షటిల్ సర్వీసులు వేస్తామని చెప్పిన అధికారులు నిర్లక్ష్యం చేయడంతో తన భార్యాపిల్లలతో ఎండలో రెండు కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందని వరంగల్‌కు చెందిన భక్తులు వి.వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement