కృష్ణరాజపుర: నగరంలో విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ రద్దీని నివారించడానికి సమూహ సారిగె(మాస్ ట్రాన్స్‌పోర్ట్) వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఎంపీ పీ.సీ.మోహన్ తెలిపారు. మహదేవపుర పరిధిలోని హూడీ సమీపంలో ఎంపీ నిధులతో నిర్మించిన కొత్త రైల్వేస్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించి మాట్లాడారు. ఐటీబీటీ రంగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న బెంగళూరు నగరం రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో ట్రాఫిక్ కూడా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఈ పరిస్థితుల్లో మాస్‌ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఐటీబీటీ ఉద్యోగులకు అనకూలంతో పాటు ట్రాఫిక్ రద్దీనీ నియంత్రించవచ్చని తెలిపారు. అదేవిధంగా దొడ్డనెక్కుందిలో కూడా ఇటువంటి రైల్వేస్టేషన్‌ను నిర్మించడానికి చర్చలు జరగుతున్నాయని తెలిపారు. కావేరి నదీ జలాల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఏ అరవింద లింబావళి,రైల్వే అధికారి సంజీవ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
3
గణపతి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, బెంగళూరు : డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తన తండ్రి మరణానికి రాష్ట్ర మంత్రి కే.జేజార్జ్‌తో పాటు ఇద్దరు ఉన్నతాధికారులు కారణమని పేర్కొంటూ గణపతి కుమారుడు నేహాల్ మడికేరి కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు విచారణ జరిపిన సీఐడీ గణపతి ఆత్మహత్యకు కే.జేజార్జ్‌కు ఎటువంటి సంబంధం లేదని తేల్చుతూ ఈ విషయాన్ని కోర్టుకు ఇటీవల తెలియజేసింది. అయితే సీఐడీ చెప్పిన విషయంపై ఏమైనా అనుమానాలుంటే ఈనెల 29న కోర్టుకు విన్నవించుకోవచ్చునని న్యాయస్థానం నేహాల్‌కు సూచించింది.
దీంతో గురువారం ఆయన కోర్టుకు హాజరై సీఐడీ దర్యాప్తుపై ఎటువ ంటి సందేహం లేదని చెప్పారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ... తాను చదువుపై దృష్టి పెట్టాలన్నారు. అంతేకాకుండా కోర్టుకు పదేపదే రావడానికి కుదరదని తెలిపారు. అందువల్లే ఈ వివాదాన్ని ఇంతటికి ముగించాలనుకున్నానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తమ అన్న మరణంపై పలు సందేహాలు ఉన్నాయని అందువల్ల ఈ కేసును సీబీఐచేత విచారణ జరిపించాలని గణపతి తమ్ముడు మాచయ్య గురుఆవరం కోర్టులో ప్రత్యేక కేసు దాఖలు చేయడం గమనార్హం. ఈ కేసు విచారణను తదుపరి వచ్చే 24కు వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మాస్ ట్రాన్స్‌పోర్ట్‌తో ట్రాఫిక్ సమస్యకు చెక్
Published Fri, Sep 30 2016 1:59 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
Advertisement