'ట్రాఫిక్ సమస్యలేని నగరంగా హైదరాబాద్'
హైదరాబాద్: తెలంగాణ రహదారుల అభివృద్ధి కోసం రూ.14 వేల కోట్లు కేటాయించినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్ అండ్ బీ అధికారులతో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణలో వేల కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు.
తమ రాష్ట్రం గుండా వెళుతున్న జాతీయ రహదారిని పొడిగించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. హైదరాబాద్ ను ట్రాఫిక్ సమస్యలేని నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రధాన జిల్లా కేంద్రాల్లో ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్లు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు.