minister Itala Rajender
-
నాలుగులైన్ల రోడ్డు విస్తరణ ప్రారంభం
► నాలుగు లైన్ల రోడ్డుగా సిరిసిల్ల బైపాస్ ► మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ కార్పొరేషన్ : పదికాలాల పాటు మన్నే విధంగా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ రోడ్ల విస్తరణ చేపడుతున్నామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సిరిసిల్ల బైపాస్ నాలుగులైన్ల రోడ్డు పనులను ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. కరీంనగర్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నివారించే ఉద్దేశంతోనే బైపాస్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఐదు కిలోమీటర్ల మేర రూ.13 కోట్లతో రోడ్డును అందంగా తీర్చిదిద్దుతామన్నారు. రద్దీ నివారణతో పాటు వేగంగా ప్రయాణించేందుకు అనువుగా రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాదరావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కార్పొరేటర్లు రూప్సింగ్, సునిల్‌రా వు, బోనాల శ్రీకాంత్, ఎ.వి. రమణ, నా యకులు ఈద శంకర్‌రెడ్డి, చల్ల హరిశంక ర్,జి.ఎస్‌ఆనంద్‌తదితరులు పాల్గొన్నారు. -
రైతుల గౌరవం పెంచాలి : మంత్రి ఈటల
► గిట్టుబాటు ధర కల్పించాలి ► మార్కెట్లో మచ్చ రాకుండా పాలకవర్గం పనిచేయాలి ► మంత్రి ఈటల రాజేందర్ జమ్మికుంట: వ్యవసాయ మార్కెట్లలో ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోందని, వాటిని అమలు చేసే బాధ్యత నూతన మార్కెట్ పాలకవర్గంపైనే ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంట నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల గౌరవం పెరిగేలా మార్కెట్ కమిటీ పాలకవర్గం చూడాలని సూచించారు. ప్రభుత్వానికి, రైతులకు మచ్చ రాకుండా పనిచేయాలన్నారు. మార్కెట్లను రైతాంగం పరం చేయాలనే అలోచనలతో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేస్తోందని చెప్పారు. దోపిడీ వ్యవస్థ నుంచి విముక్తి కలిగించి ఆదుకున్నప్పుడే రైతులు సంతోషంగా ఉంటారని, అందుకు మార్కెట్ కమిటీ పాలకవర్గం కృషి చేయాలన్నారు. మార్కెట్‌ను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులను అదుకోవాలని సూచించారు. రెండేళ్లుగా కాలం లేక మార్కెట్ కళ తప్పిందని, రైస్ మిల్లర్లు, కాటన్ మిల్లర్లు దివాళా దశలో ఉన్నారని, బ్యాంక్ అప్పులు చెల్లించలేని దుస్థితిలో వ్యాపారులు ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవాలని సూచించినా కొందరు ప్ర జాప్రతినిధులు పట్టించుకోవడం లేదని తెలిపారు. పదవులు వందేళ్లు ఉండవని, ఐదేళ్ల మాత్రమే ఉంటాయాన్నది మరిచిపోవద్దని పేర్కొన్నారు. ప్రజ లను పట్టించుకోని వాళ్లు చివరకు కాల గర్భంలో కలిసిపోతారని హెచ్చరించారు. జమ్మికుంట అంటేనే సీసీఐకి దడ -ఎంపీ వినోద్ కుమార్ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ అంటేనే సీసీఐ లాంటి సంస్థకు దడ పుడుతుందని ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడితే నిరసనలు, ఆందోళనతో నిలదీసే చైతన్యం ఇక్కడికి రైతులకుందని తెలిపారు. జమ్మికుంట మార్కెట్‌ను హైటెక్ మార్కెట్‌గా ఎంపిక చేసేందుకు మంత్రి ఈటల కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ
మంత్రి ఈటల రాజేందర్ కమాన్‌చౌరస్తా: గ్రామాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమని మంత్రి ఈటల రాజేం దర్ అన్నారు. బుధవారం కరీంనగర్‌లోని కొండ సత్యలక్ష్మి గార్డెన్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రజాప్రతినిధులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మా ట్లాడారు. గ్రామసభలు ప్రజాసమస్యల పరి ష్కారం దిశగా పనిచేయాలన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించి సంపూర్ణ పారిశుధ్యం సాధి ంచాలని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు నిబద్ధతతో పనిచేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ లక్ష్యం సాధిం చేందుకు ప్రజాప్రతినిధులు కృషిచేయాలని కోరారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 20వ తేదీ వరకు 100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసి బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా సాధిం చేందుకు ప్రజాప్రతినిధులు కృషిచేయాలన్నా రు. గ్రామాలవారీగా ప్రజాప్రతినిధులు ప్రత్యేకశ్రద్ధ వహిస్తే మూడు నెలల్లో లక్ష్యాన్ని చేరుకోవ చ్చన్నారు. కేరళలో 90 శాతం మందికి మరుగుదొడ్లు ఉన్నాయని అందుకే ఆ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యం, చదువులో ముందున్నారని తెలిపా రు. దేశంలో 40 శాతం మంది పిల్లలు కల్తీ నీటి తో చనిపోతున్నారని.. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తే పిల్లల మరణాలు తగ్గుతాయని తెలి పారు. మరుగుదొడ్డి మంజూరు అయిన వెంట నే లబ్ధిదారులకు రూ. 6 వేలు చెల్తిస్తామని.. పూర్తయిన తర్వాత మరో రూ. 6 వేలు చెల్లిస్తారని, మొదటి బిల్లు సరిపోనియెడల స్వశక్తి సం ఘాల ద్వారా రూ. 5 వేలు రుణాలు మంజూరు చేస్తారని వివరించారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడు తూ త్వరితగతిన నిర్మాణాలు జరిగేందుకు ముందస్తుగా కొన్ని నిధులు విడుదలచేయాల ని కోరారు. జిల్లాలో తాగునీటి సమస్యలు ఉన్నాయని.. ప్రజలు ఇబ్బంది పడకుండా నీటి ని రవాణా ద్వారా అందించాలన్నారు. పశువులకు నీటి తొట్టిలు నిర్మించాలన్నారు. సదస్సు లో అదనపు జాయింట్ కలెక్టర్ ఎ.నాగేంద్ర, జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రకాశ్‌రావు, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, డ్వామా పీడీ గణేశ్, వయోజన విద్యాశాఖ డీడీ జయశంకర్, జిల్లా ఉప విద్యాధికారి ఆనందం, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.