గ్రామాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ
మంత్రి ఈటల రాజేందర్
కమాన్‌చౌరస్తా: గ్రామాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమని మంత్రి ఈటల రాజేం దర్ అన్నారు. బుధవారం కరీంనగర్‌లోని కొండ సత్యలక్ష్మి గార్డెన్‌లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రజాప్రతినిధులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మా ట్లాడారు. గ్రామసభలు ప్రజాసమస్యల పరి ష్కారం దిశగా పనిచేయాలన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించి సంపూర్ణ పారిశుధ్యం సాధి ంచాలని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు నిబద్ధతతో పనిచేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ లక్ష్యం సాధిం చేందుకు ప్రజాప్రతినిధులు కృషిచేయాలని కోరారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 20వ తేదీ వరకు 100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసి బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా సాధిం చేందుకు ప్రజాప్రతినిధులు కృషిచేయాలన్నా రు.
గ్రామాలవారీగా ప్రజాప్రతినిధులు ప్రత్యేకశ్రద్ధ వహిస్తే మూడు నెలల్లో లక్ష్యాన్ని చేరుకోవ చ్చన్నారు. కేరళలో 90 శాతం మందికి మరుగుదొడ్లు ఉన్నాయని అందుకే ఆ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యం, చదువులో ముందున్నారని తెలిపా రు. దేశంలో 40 శాతం మంది పిల్లలు కల్తీ నీటి తో చనిపోతున్నారని.. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తే పిల్లల మరణాలు తగ్గుతాయని తెలి పారు. మరుగుదొడ్డి మంజూరు అయిన వెంట నే లబ్ధిదారులకు రూ. 6 వేలు చెల్తిస్తామని.. పూర్తయిన తర్వాత మరో రూ. 6 వేలు చెల్లిస్తారని, మొదటి బిల్లు సరిపోనియెడల స్వశక్తి సం ఘాల ద్వారా రూ. 5 వేలు రుణాలు మంజూరు చేస్తారని వివరించారు.
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడు తూ త్వరితగతిన నిర్మాణాలు జరిగేందుకు ముందస్తుగా కొన్ని నిధులు విడుదలచేయాల ని కోరారు. జిల్లాలో తాగునీటి సమస్యలు ఉన్నాయని.. ప్రజలు ఇబ్బంది పడకుండా నీటి ని రవాణా ద్వారా అందించాలన్నారు. పశువులకు నీటి తొట్టిలు నిర్మించాలన్నారు. సదస్సు లో అదనపు జాయింట్ కలెక్టర్ ఎ.నాగేంద్ర, జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ప్రకాశ్‌రావు, డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ, డ్వామా పీడీ గణేశ్, వయోజన విద్యాశాఖ డీడీ జయశంకర్, జిల్లా ఉప విద్యాధికారి ఆనందం, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.