సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ కర్ణన్
మంచిర్యాలఅగ్రికల్చర్: వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యాలను సాధించి బహిరంగ మలమూత్ర విసర్జన లేని గ్రామాలుగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారులు, విద్యాధికారులు, సహాయ ప్రాజెక్టు అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం 1.42 లక్షలు కాగా.. ఇప్పటివరకు 1.10 లక్షలు పూర్తయ్యాయని తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించే ఉద్దేశంతో ఇప్పటివరకు జిల్లాలో రూ.21 కోట్లు ఖర్చు చేశామన్నారు. దండేపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, వేమనపల్లి మండల అభివృద్ధి అధికారులను మినహాయించి మిగతా మండల అభివృద్ధి అధికారులకు ఓపెన్ బావులు, ఫామ్‌పాండ్స్ నిర్మించడంలో జాప్యం జరిగినందున షోకాజ్ నోటీసులు జారీ చే యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేస వి సెలవులు ముగిసే లోగా పాఠశాలల్లో వంటశాలలు, మూత్రశాలలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మే 10న రైతుబంధు పథకం మొదటి విడత చెక్కుల పంపిణీకి మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు సంబంధిత శాఖల సమన్వయంతో ఎ లాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూ చించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి నుంచి మరణధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని, పట్టాదారు పా సుపుస్తకం, ఆధార్ అనుసంధానంతో పాటు రైతుల వివరాలను పునఃపరిశీలించాలని తహసీల్దార్, మండ ల స్థాయి అధికారులకు సూచించారు.
వ్యవసాయ వి స్తరణ అధికారులు ఉద్యానవన సిబ్బంది కలిసి ఫామ్‌పాండ్స్, ఓపెన్ బావుల లక్ష్యాలను పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అన్నారు. గ్రామ స్వరాజ్ అభియాన్ కింద తొమ్మిది మండలాల్లోని 18 గ్రామాల్లో ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో చేపట్టాలని జిల్లా సంక్షేమ అధికారులకు సూ చించారు. వేసవికాలంలో కలుషిత నీరు తాగడం వల్ల కన్నెపల్లి ఎస్టీ కాలనీలో జ్వరాలు ప్రబలి నలుగురు చనిపోవడం బాధాకరమన్నారు. మండలంలోని గ్రామపంచాయతీల పరిధిలో ఈవోపీఆర్‌డీలు, పంచాయతీ కార్యదర్శులతో గ్రామాల్లో పర్యటించి తాగునీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజు కేటాయించిన ఫార్మాట్‌లో నివేదిక పంపించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్‌డీలు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సంక్షేమ పథకాలపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులు, మండల అభివృద్ధి అధికారులు బ్యాంకు అధికారులతో కలిసి ప్రభుత్వ ఆర్ధిక చేయూత పథకాలపై ఈనెల 24వ తేదీలోపు లబ్దిదారులతో గ్రామçసభ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అటవీశాఖ, ఎక్సైజ్, ఉద్యానవనశాఖ, పేదరిక నిర్మూలన సంస్థ, గిరిజనాభివృద్ధి శాఖ, సింగరేణి తదితర శాఖల సమన్వయంతో నిర్ణీత లక్ష్యాన్ని సాధించాలన్నారు. నర్సరీలు, మొక్కల ప్లాంటేషన్‌ను వర్షాకాలం ప్రారంభం నాటికి పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల సంక్షేమాధికారులు రవూఫ్‌ఖాన్, ఖాజా నజీమ్ అలీ అఫ్సర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment