ముసుగు వేసిందెవరు ?
ధర్మవరంటౌన్, న్యూస్‌లైన్ : ఎన్నికల నేపథ్యంలో నేతల విగ్రహాలకు ముసుగు వేయడంలో వివక్ష కనిపిస్తోంది. ధర్మవరంలోని పాండురంగ సర్కిల్‌లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్ విగ్రహానికి ముసుగు తొడిగారు.
పక్కనున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని మాత్రం అలానే ఉంచారు. ఓటర్లను ప్రభావితం చేస్తాయనుకుంటే రెండు విగ్రహాలకూ ముసుగు వేయాలి కానీ.. ఇలా ఒక దానికి వేసి.. మరొక దాన్ని అలాగే ఉంచడం ఏమిటని ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. ఈ విషయంపై తహశీల్దార్, మునిసిపల్ కమిషనర్‌లను సంప్రదిస్తే ముసుగు వేయించింది తాము కాదంటే తాము కాదని అన్నారు. ఆదేశాలు లేకుండానే అత్యుత్సాహంతో ముసుగు వేసిన వారెవరో తెలియాల్సి ఉంది.