సీఎం జగన్‌తో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, నిమ్మకూరు గ్రామస్తులు
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాంస్య విగ్రహాన్ని ఆయన స్వస్థలమైన నిమ్మకూరులో ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని మంత్రి కొడాలి నాని తెలిపారు. మంత్రి కొడాలి నాని, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌తో కలసి నిమ్మకూరులో ఉంటున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సీఎం వైఎస్ జగన్‌ని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలిశారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినందుకు వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
నిమ్మకూరులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని పెట్టాలని కోరగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. అనంతరం క్యాంప్ కార్యాలయం వద్ద మంత్రి కొడాలి నాని విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు శతజయంతి సందర్భంగా నిమ్మకూరులో ఆయన కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారని చెప్పారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నిమ్మకూరులో తాగునీటి సమస్యను ప్రస్తావించారన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి రూ.కోటి మంజూరు చేశారని చెప్పారు. నిమ్మకూరులో ఇతర సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment