దొప్పలపూడిలో ఎన్టీఆర్ విగ్రహానికి ముసుగు వేయని దృశ్యం
సాక్షి, పొన్నూరు: ఎన్నికల కోడ్‌ను అమలు చేయాల్సిన అధికారుల పనితీరుపై విమర్శలొస్తున్నాయి. మండల పరిధిలోని బ్రాహ్మణకోడూరు, దొప్పలపూడి, మన్నవ, ఉప్పరపాలెం తదితర గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ను పంచాయతీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. రాజకీయపార్టీ నాయకులకు చెందిన విగ్రహలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉంటే తొలగించాలని నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో గ్రామాల్లో ఘర్షణలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడు వచ్చి 10 రోజులు దాటినా అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పటికై నా ఎన్నికల అధికారులు స్పందించి అన్ని గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
చేబ్రోలు: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికి అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా అధికారులు స్పందించికపోవటంపై విమర్శలు వ్యక్తంమవుతున్నాయి. మండల కేంద్రమైన చేబ్రోలులో పలు ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన బోర్డులు దర్శనమిస్తూనే ఉన్నాయి. చేబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలోని జీబీసీ ప్రధాన రహదారి పక్కన ఉన్న తల్లీ బిడ్డ చల్లగా కార్యాలయ గోడలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, పరిటాల సునీత, ఎమ్మెల్యే నరేంద్రకుమార్‌ల ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు, వాల్ ఫోస్టర్లు తొలగింపునకు నోచుకోలేదు. చంద్రన్న సంచార చికిత్స వాహనంపై ముఖ్యమంత్రి ఫొటోను అలాగే ఉంచారు. నారాకోడూరు, చేబ్రోలు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థతి. గ్రామాల్లో అధికారుల పనితీరు టీడీపీకి ఒక న్యాయం, వైఎస్సార్ సీపీకి మరో న్యాయం అన్న చందంగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment