Wall posters ban
-
Ghmc: పోస్టర్లు బ్యాన్..ఆమ్రపాలి కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో వాల్ పోస్టర్లు బ్యాన్ చేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి శుక్రవారం(సెప్టెంబర్27) సర్క్యులర్ జారీ చేశారు. జీహెచ్ఎంసీలో వాల్ పోస్టర్లు,వాల్ పెయింటింగ్స్ పై సీరియస్‌గా వ్యవహరించాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.సినిమాల పోస్టర్లు కూడా ఎక్కడా అతికించకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.ఒకవేళ ఆదేశాలను పట్టించుకోకుండా పోస్టర్లు వేస్తే మాత్రం జరిమానా విధించాలని సర్క్యులర్‌లో తెలిపారు.ఇదీ చదవండి: మూసీకి వరద..జీహెచ్ఎంసీ హై అలర్ట్ -
ఎన్నికల కోడ్ అమల్లోనూ పక్షపాతం!
సాక్షి, పొన్నూరు: ఎన్నికల కోడ్‌ను అమలు చేయాల్సిన అధికారుల పనితీరుపై విమర్శలొస్తున్నాయి. మండల పరిధిలోని బ్రాహ్మణకోడూరు, దొప్పలపూడి, మన్నవ, ఉప్పరపాలెం తదితర గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ను పంచాయతీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. రాజకీయపార్టీ నాయకులకు చెందిన విగ్రహలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉంటే తొలగించాలని నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో గ్రామాల్లో ఘర్షణలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడు వచ్చి 10 రోజులు దాటినా అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పటికై నా ఎన్నికల అధికారులు స్పందించి అన్ని గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చేబ్రోలు: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికి అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా అధికారులు స్పందించికపోవటంపై విమర్శలు వ్యక్తంమవుతున్నాయి. మండల కేంద్రమైన చేబ్రోలులో పలు ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన బోర్డులు దర్శనమిస్తూనే ఉన్నాయి. చేబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలోని జీబీసీ ప్రధాన రహదారి పక్కన ఉన్న తల్లీ బిడ్డ చల్లగా కార్యాలయ గోడలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, పరిటాల సునీత, ఎమ్మెల్యే నరేంద్రకుమార్ల ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు, వాల్ ఫోస్టర్లు తొలగింపునకు నోచుకోలేదు. చంద్రన్న సంచార చికిత్స వాహనంపై ముఖ్యమంత్రి ఫొటోను అలాగే ఉంచారు. నారాకోడూరు, చేబ్రోలు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థతి. గ్రామాల్లో అధికారుల పనితీరు టీడీపీకి ఒక న్యాయం, వైఎస్సార్ సీపీకి మరో న్యాయం అన్న చందంగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. -
వాల్‌పోస్టర్లు నిషేధం
సాక్షి, అమరావతి: రాష్ర్టంలోని పట్టణాలు, నగరాల్లో అనుమతి లేకుండా గోడలపై రాతలు రాయటం, పత్రికలు అతికించడాన్ని నిషేధిస్తూ త్వరలో ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మొక్కలు, నీటి సంరక్షణ వంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రత్యేకంగా అదనపు మార్కులు కేటాయిస్తామన్నారు. గురువారం దుర్గాఘాట్‌లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన చంద్రబాబు.. అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాస్తవ తనిఖీ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. దీనికోసం రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఓ డ్రోన్ కెమెరా అందిస్తామన్నారు. ఒక్కో డ్రోన్ కెమెరా ఏడు గంటల్లో 150 కిలోమీటర్ల పరిధిలోని వాస్తవ పరిస్థితిని రికార్డు చేస్తుందన్నారు. కైజలా యాప్ ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వం సమాచారం సేకరించి తిరిగి వారికి చేరవేస్తుందన్నారు. కేంద్రం నుంచి 1,700 కోట్లు రావాలి పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకూ జరిగిన, జరగాల్సిన పనుల వివరాలను సీఎం వెల్లడించారు. ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పనులను ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్‌లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ర్టం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ. 1,700 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పూర్తయ్యేలా ఈ ఏడాది రూ. మూడు వేల నుంచి నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రం నిధులు విడుదల చేయాలన్నారు.