రాష్ట్రాన్ని ఆవహేళన చేయవద్దు:ఆళ్ల నాని | ysr congress party leader alla nani advice to telangana leaders | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని ఆవహేళన చేయవద్దు:ఆళ్ల నాని

Nov 1 2013 2:21 PM | Updated on Sep 2 2017 12:12 AM

రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని స్పష్టం చేశారు.

రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని స్పష్టం చేశారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని అవహేళన చేయవద్దని ఆయన తెలంగాణ వాదులకు విజ్ఞప్తి చేశారు. సమైక్య రాష్ట్రం కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రాణ త్యాగానికైనా సిద్ధంగానే ఉన్నాట్లు ఆయన తెలిపారు.

 

భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన నల్గొండ, ఖమ్మం జిల్లాలో బాధితులను పరామర్శించడానికి తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెళ్తే తెలంగాణ వాదులు, కాంగ్రెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆళ్లనాని ఈ సందర్భంగా ప్రశ్నించారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. అయితే తెలంగాణవాదులు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని బ్లాక్ డేగా వ్యవహరించడం పట్ల ఆళ్లనాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆళ్లనానిపై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement