Telangana leaders
-
లీడర్ల వింత ప్రచారాలు..
-
రాజకీయ అవసరాల కోసమే తెలంగాణ నేతల విమర్శలు : పేర్ని నాని
-
చిన్ననోట్ల కోసం తెలంగాణ నేతలు పాట్లు!
సాక్షి, అమరావతి: తెలంగాణలో ఎన్నికల వేడి మొదలు కావడంతో రాజకీయ నేతలు ‘చిల్లర’ సమస్య ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో పంపిణీ కోసం భారీగా నిల్వ చేసిన రూ.2,000 నోట్లను చిన్న నోట్లలోకి మార్చుకునేందుకు బ్యాంకులు, పెట్రోల్ బంకులను ఆశ్రయిస్తున్నారు. దీంతో రూ.500, రూ.200 నోట్లకు గిరాకీ ఏర్పడింది. నోట్లు మార్పిడి చేసినందుకు 2 నుంచి 5 శాతం దాకా కమీషన్ ఆఫర్ చేస్తున్నారు. బ్యాంకు లావాదేవీలపై ఎన్నికల సంఘం నిఘా వేయటంతో నోట్ల మార్పిడికి తెలంగాణ నేతలు పక్క రాష్ట్రాలపై దృష్టి సారిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్, కర్నాటకలోని ప్రైవేట్ బ్యాంకులను సైతం ఎంచుకుంటున్నారు. తనిఖీల్లో తెలం గాణలో పట్టుబడుతున్న నగదులో రూ.500 నోట్లే అత్యధికంగా ఉండటం నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్నారనేది రుజువు చేస్తోంది. భారీ లావాదేవీలపై ఐటీ, ఆర్బీఐ నిఘా తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో భారీ నగదు లావాదేవీలపై ఐటీ శాఖ, ఆర్బీఐ నిఘా వేశాయి. రూ.2 లక్షలకు మించి నగదు తీసుకునే వారి వివరాలను సేకరిస్తున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రూ.5 లక్షలకు మించి నగదు తీసుకుంటే కారణాలను లిఖిత పూర్వకంగా నమోదు చేయాలని తమకు మౌ ఖికంగా ఆదేశాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. తెలంగాణకు చెందిన వివిధ పార్టీల నాయకులు చిన్న నోట్ల కోసం విశాఖ, విజయవాడల్లోని తమ కార్యాలయాలను సంప్రదిస్తున్నట్లు ప్రైవేట్ బ్యాంకు అధికారులు ధృవీకరించారు. -
పదవుల్లేవు... పైసలొచ్చే పనుల్లేవు..!
ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న తెలంగాణ టీడీపీలో నేతలను ఒక తాటి మీదకు తీసుకువచ్చేందుకు పార్టీ అధినాయకత్వం ఆపసోపాలు పడుతోంది. పెదబాబు.. చినబాబులు వరసగా సమావేశాలు పెడుతున్నా పెద్దగా ప్రయోజం ఉండడం లేదన్నది తమ్ముళ్ల ఆవేదన. తెలంగాణలో పార్టీని బతికించుకుందామని హై కమాండ్ నానా తిప్పలు పడుతున్నా ఎలాంటి ఉపయోగం కనిపించడం లేదంటున్నారు. దీనికి పెద్దగా తలలు బద్దలు కొట్టుకుని ఆలోచించాల్సిన పని లేదని, తెలంగాణ నేతల గొంతెమ్మ కోర్కెల చిట్టా కొండపల్లి చాంతాడంత ఉండడం... అధినేత ఆ విషయంలో ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో వరస సమావేశాలు నిరుపయోగం అవుతున్నాయంటున్నారు. మరో వైపు పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందన్నది ఇంకో వాదన. వ్యక్తిగత ప్రతిష్ట కోసం నానా తిప్పలు పడుతున్న ఓ నేత సీనియర్లను కాదని కాలరెగరేయడం కూడా సమస్యగా మారిందని ఓ తెలుగు తమ్ముడు వాపోయాడు. పదవుల్లేవు.. పైసలొచ్చే పనుల్లేవు.. వెంటొచ్చే జనాలు లేరు.. మీటింగులు ఈటింగులతో ఏమైతదని నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయినా పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని అధినేత పడుతున్న తాపత్రయం నేతలకు పట్టడం లేదంటున్నారు. నేతల గొంతెమ్మ కోర్కెలు తీరిస్తే కానీ పరిస్థి తి పట్టాలు ఎక్కేలా లేదని ఓ సీనియర్ నేత తన అనుభవాన్నంతా రంగరించి మరీ చెబుతున్నారు..! -
పై చేయి మనదే బ్రదర్ !
‘జంప్ జిలానీ ... జన నేత గులామీ ..’ అంటూ వలస నేతలపై సెటైర్లు విసురుకుంటూ తెలంగాణ టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నరు. వరసబెట్టి ఎమ్మెల్యేలంతా పార్టీ మారినా, వారి అనుచరులంతా గులాబీ కండువాలు కప్పుకున్నా, నియోజకవర్గాలకు నియోజకవర్గాలు ఖాళీ అయినా... విశ్వాస ఘాతకులు పోతే పోయిండ్రు.. పైచేయి మాత్రం మనదే బ్రదర్ అంటూ ఒకరు భుజాలు ఒకరు చరుచుకుంటున్నరు. పార్టీ కేడర్‌లో ధైర్యం నింపేందుకు నానా తంటాలు పడుతున్న తెలంగాణ నాయకులు అసలు సిసలు సరుకే మిగిలిందని గొప్పలు పోతున్నరు. అసలు పోయినోళ్లంతా ‘చచ్చినోళ్లతో సమానం మాకు..’ అని ఒక నాయకుడంటే.. ‘ తెలంగాణలో మనమే బలంగా ఉన్నాం..’ అంటూ మరో నాయకుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఏ నేత ఎప్పుడు గట్టుదాటుతాడో తెలియని అయోమయంలో ఉన్న పార్టీ నాయకత్వం, కార్యకర్తలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతోంది.... ఏ ఎన్నికల్లో పోటీ చేసినా, ఓడిపోవడం రివాజుగా మారినా.. ‘కింద పడ్డా పై చేయి మనదే..’ అని కేడర్‌ను సమాధాన పరుస్తున్నారు. ‘ వీళ్ల కథలు ఎవరికి తెలియదు. ప్యాకేజీ దొరకగానే వీళ్లు మాత్రం జంప్ చేయరా.. బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అయ్యేందుకని నీతులు చెప్పరా ఏందీ..’ అంటూ కార్యకర్తలు తమ తీర్పు ఇచ్చేస్తున్నారు. -
కేరళ పర్యటనలో స్థానిక సంస్థల ప్రతినిధులు
కేరళనుంచి సాక్షి ప్రతినిధి: స్థానిక పరిపాలన, పంచాయతీరాజ్ వ్యవస్థల తీరుతెన్నులను అధ్యయనం చేసేందుకు తెలంగాణ నుంచి పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు ఆది వారం కేరళకి వచ్చారు. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన షెడ్యూల్ మేరకు వందమంది జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు త్రిసూర్ సమీపంలోని కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్(కిలా)కు చేరుకున్నారు. కేరళలో స్థానిక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధివిధానాలపై అక్కడి గ్రామీణాభివృద్ధి విభాగం నిపుణులు వీరికి వివరిస్తారని, ప్రజాప్రతినిధులు కొన్ని గ్రామాలను పరిశీలిస్తారని తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. -
తమ్ముళ్లకు బాబు క్లాస్?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలకు అధినేత చంద్రబాబు అంక్షింతలు వేశారా..? ఆధిపత్య పోరుతో స్థాయిని మరిచి ఒకరిపై ఒకరు తిట్లదండకం అందుకుంటున్న నాయకులను దారిలోకి తెచ్చే ప్రయత్నం చేశారా..? విజయవాడలో మంగళవారం టీ టీడీపీ నాయకులతో చంద్రబాబు జరిపిన సమావేశం వేడి వేడిగా కొనసాగిందని సమాచారం. సుమారు నాలుగైదు గంటలపాటు రెండు దఫాలుగా సమావేశం జరిగింది. ఈ భేటీకి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. భోజన విరామం వరకు అందరు నాయకులతో కలిపి సమావేశం జరిపిన బాబు అనంతరం రమణ, ఎర్రబెల్లి, రేవంత్‌లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతకు ముందు పార్టీ నాయకుడు లోకేష్ కూడా వీరితో సమావేశమై చర్చించారు. పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్న వివరాల మేరకు.. రాష్ట్ర నాయకులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఎలా..? అంతా కలిసి ఉండండి. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నామన్న సంగతి మరిచిపోవద్దు. నాయకులు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలి. మిమ్ముల్ని మీరు గౌరవించుకోకుంటే పార్టీ కేడర్ ఎలా మిమ్ముల్ని గౌరవిస్తుంది.. అని వీరికి క్లాస్ తీసుకున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి జరగాల్సిన కృషిపైనా వీరికి హితబోధ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని, సాధ్యమైనంత వరకు నేతలు అందరూ కలిసి వెళ్లాలని సూచించారు. జిహెచ్ఎంసిలో సైతం డివిజన్ల వారీగా సమావేశాలు జరపాలని, నారాయణ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగడం ఖాయం కాబట్టి ఆ ఎన్నికకు కూడా సిద్ధం కావాలని టీ టీడీపీ నేతలకు బాబు వివరించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి వరంగల్ ఉప ఎన్నికల్లో టీడీపీకి టికెట్ ఇవ్వమని మిత్రపక్షమైన బీజేపీ అడుగుతానని బాబు వీరికి హామీ ఇచ్చారు. అయితే, ఏ పార్టీ అభ్యర్ధి పోటీ చేసినా, ఎన్డీయే అభ్యర్ధిగా ఉంటారని, విజయం కోసం శ్రమించాలని వీరికి సూచించారు. మరో వైపు వరంగల్‌కు చెందిన పార్టీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్లోకి వెళుతున్న అంశాన్నీ చంద్రబాబు ఆరా తీశారు. ఆమె పార్టీ మారడం వల్ల నష్టమేమీ ఉండదని తెలంగాణ నాయకులు బాబుకు సమాధానం చెప్పారని సమాచారం. వచ్చే నెల 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించాలని, ఆ సమావేశానికి తాను హాజరవుతానని బాబు చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీని పటిష్టం చేయడంపైనే దృష్టి పెట్టాలని వీరికి హిత బోధ చేశారు. రేవంత్‌కు దొరకని అపాయింట్మెంట్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శనివారం జరిగిన సమావేశంలో పార్టీ నాయకుల మధ్య జరిగిన గొడవ, నేతల మధ్య ఉన్న విభేదాలపై చంద్రబాబు అసహనం ప్రద ర్శించారని తెలిసింది. తెలంగాణ నాయకులంతా కలిసి పాల్గొనాల్సిన ఈ సమావేశానికి ముందే సోమవారం రేవంత్‌రెడ్డి విజయవాడకు చేరుకుని బాబు అపాయింట్మెంటు కోరారని, ఆయన నిరాకరించారని సమాచారం. మంగళవారం సమావేశానికి ముందు కూడా వ్యక్తిగతంగా ఒక్కడే కలిసే ప్రయత్నం చేసినా, ఎర్రబెల్లి, రమణలతో కలిసి రావాలని రేవంత్‌కు వెనక్కి పంపినట్లు చెబుతున్నారు. ఈ ముగ్గురు నాయకులను కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్నట్లు సమచారం. కాగా, బాబుతో జరిగిన సమావేశంలో తెలంగాణ అధ్యక్షుడు గడిచిన నెల రోజుల్లో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలు, బంద్, ఢిల్లీ పర్యటన, ఆందోళన కార్యక్రమాల గురించి వివరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
బాబుపై టీటీడీపీ నేతల గుస్సా!
-
బాబుపై టీటీడీపీ నేతల గుస్సా!
♦ రేవంత్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై అసంతృప్తి ♦ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా గుర్తింపు లేదన్న విమర్శ ♦ డబ్బులు - లాబీయింగ్ ఒక్కటే అర్హతా అని ప్రశ్నిస్తున్న నేతలు ♦ తమదారి తాము చూసుకుంటామంటున్న నాయకులు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ తెలంగాణ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కొత్త కమిటీ ఏర్పాటుపై పార్టీలో మెజారిటీ నాయకులు ఏ మాత్రం సంతోషంగా లేరని సమాచారం. పాతికేళ్లకు పైగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లను పక్కన పెట్టి కేవలం డబ్బులతో లాబీయింగ్ చేయగలుగుతాడనుకున్న రేవంత్‌రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును కట్టబెట్టడాన్ని తప్పు పడుతున్నారు. పేరుకు ఎల్.రమణకు రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించినా, ఆయనను డమ్మీ చేయడం కోసమే రేవంత్‌ను తెరపైకి తెచ్చారన్న వాదన కూడా వినిపిస్తున్నారు. ఈ విషయమై కొందరు సీనియర్ నేతలు నేరుగా చంద్రబాబు వద్దే తమ అసంతృప్తి వెళ్లగక్కారని సమాచారం. అధినేతే స్వయంగా పార్టీలో అంతర్గత పోరుకు, అసంతృప్తులకు కారణమయ్యారని ఓ నేత ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముందు నుంచీ రేవంత్‌రెడ్డికి అందలం వేయాలని భావించారన్నది సీనియర్ నాయకుల ప్రధాన అభియోగం. నాలుగునెలల కిందట జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు కోసం రేవంత్ కోట్ల రూపాయలు పోగేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు రూ.5కోట్లు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుని అడ్వాన్సుగా రూ.50 లక్షలు ఇస్తూ ఆయన ఏసీబీకి అడ్డంగా దొరికి పోయారు. రేవంత్‌పై ఇంత పెద్ద మచ్చ ఉన్నా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవి ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘భవిష్యత్తులోనూ ఇదే స్థాయి లాబీయింగ్ చేయడానికి పనికొస్తాడని అందలం ఎక్కించారా..? పార్టీ కోసం నాయకులు ఎవరి స్థాయిలో వారు పని చేస్తున్నా, పనిగట్టుకుని రేవంత్‌రెడ్డిని ఎందుకు ఎక్స్పోజ్ చేశారు.. ఎందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు...’ అని పార్టీ సీనియర్ నాయకుడొకరు మండిపడ్డారు. సీనియర్లకు మనస్తాపం పార్టీకి సుదీర్ఘసేవలు అందించిన పలువురు సీనియర్లకు మనస్తాపం కలిగించేలా రాష్ట్ర కమిటీ కూర్పు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్‌రెడ్డి సిఫారసు చేసిన వారికే రాష్ట్ర కమిటీలో పదవులు దక్కాయన్న విమర్శలూ వస్తున్నాయి. సీబీఐ డెరైక్టర్‌గా, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కె.విజయరామారావుకు ఏ కమిటీలోనూ ప్రాతినిధ్యం లేకుండా పోయిందంటున్నారు. ఆయనను పొలిట్‌బ్యూరో సభ్యునిగా తీసుకోవాలని ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ‘నాయకత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. పార్టీ పరువు తీసిన వారికి అందలం వేసి, పార్టీ విలువను పెంచిన వారిని పక్కన పెట్టారు. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే, మేము పార్టీలో కొనసాగడంలో అర్థం లేదు... మా దారి మేము చూసుకోవడం మినహా మరో మార్గం లేదు..’ అని పార్టీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ, సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులకు గవర్నర్ పదవి ఇప్పిస్తోందని ఊదరగొట్టారు. మరి ఆ స్థాయి నేత అయితే, పార్టీ కమిటీల్లో పెద్దగా ప్రాధాన్యం ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ కమిటీ ఏర్పాటుతో సీనియర్లను దూరం చేసుకునేందుకు తమ గొయ్యి తామే తవ్వుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసు కేసులు ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇచ్చి, పార్టీలో క్లీన్ ఇమేజ్ ఉన్నవారికి చెయ్యిచ్చారని తెలంగాణ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. మొత్తంగా తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీ కూర్పుతో చంద్రబాబు, రేవంత్‌ను అందలం ఎక్కించినా, మిగతా నేతల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యారన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. -
తెలంగాణను అడ్డుకున్న వారే.. ప్రగతినీ
హన్మకొండ కల్చరల్ (వరంగల్ జిల్లా): తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నవారే ప్రగతిని కూడా అడ్డుకుంటున్నారని.. రాజకీయ, సైద్ధాంతిక విభేదాలను పక్కన బెట్టి ఇలాంటి వారిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రజాతంత్ర దినపత్రిక 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి ఆమర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన కార్యక్రమంలో శ్రీహరి ముఖ్య అతిథిగా మాట్లాడారు. దశాబ్దాల కల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందరెందరో వివిధ రకాలుగా కృషిచేశారని, తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేశారన్నారు. తీరా తెలంగాణ వచ్చే సమయానికి పక్కకు పోయినవారు కూడా ఉన్నారని అన్నారు. 15 ఏళ్లుగా ప్రభుత్వాలు అనుసరించిన అనాలోచిత చర్యల వల్ల విశ్వవిద్యాలయాలు కోలుకొలేనంతంగా దెబ్బతిన్నాయన్నారు. కేవలం 8మంది ప్రొఫెసర్లతో పాలమూరు విశ్వవిద్యాలయం కొనసాగడం బాధకరమని.. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా నియూమకాలు జరిగాయన్నారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు భవిష్యత్‌లో న్యాక్ గుర్తింపు కష్టంగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు ఉన్నత స్థానంలో ఉండాలంటే మంచి స్టాఫ్‌ను నియమించుకోవాలని, అప్పుడే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. చాన్స్‌లర్, వైస్ చాన్సలర్లను నియమించడానికి కొత్తచట్టాలను తేవడంలో కొంత అలస్యం జరుగుతోందన్నారు. త్వరలో విద్యావేత్తలతో ఈ విషయమై సమావేశమవుతానన్నారు. -
‘పాలమూరు’ను నిర్మించి తీరుతాం
షాద్‌నగర్ రూరల్: సీమాంధ్ర నాయకులు ఎన్నికుట్రలు, కుతంత్రాలు పన్నినా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టంచేశారు. ఉమ్మడిరాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతపెట్టుదారులు, బడాబాబుల పెత్తనం కొనసాగడంతో తెలంగాణప్రాంతం ఎక్కువగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలోని గణేష్ గార్డెన్స్‌లో టీవీవీ శిక్షణ తరగతుల్లో ఆయన ప్రసంగించారు. అంతకుముందు సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర నాయకుల పాలనలో తెలంగాణ పూర్తిగా వెనకబడిపోయిందన్నారు. జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తే తాగు, సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు. పథకం పూర్తికి పార్టీలకతీతంగా తెలంగాణ నాయకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాసంఘాలు, నేతలు కలిసికట్టుగా ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని కోరారు. కృష్ణాజలాల్లో వాటా సాధిస్తాం జిల్లాప్రజలు వలసలతో జీవనం గడుపుతున్నారని, వలసల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీవీవీ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య కోరారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంపొందించాలని, వ్యవసాయరంగానికి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించాలన్నారు. కృష్ణాజలాల్లో వాటా సాధించి తీరుతామన్నారు. ప్రాజెక్టులను సీమాంధ్ర నాయకులు అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు. షాద్‌నగర్ ప్రాంతంలో అనేక పరిశ్రమలున్నా ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి దొరకడంలేదన్నారు. కార్యక్రమంలో టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవిందర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయకుమార్, కోశాధికారి టీజీ శ్రీనివాస్, సతీష్‌రెడ్డి, లక్ష్మినాయక్, రాజారాం, రవింద్‌గౌడ్, కృష్ణబగాడే, నర్సింహా, చంద్రశేఖర్, నర్సింలు, ప్రశాంత్, కిష్టప్ప, శ్రీహరి పాల్గొన్నారు. -
ఆదివాసీలను ముంచడం సరికాదు
- పోడు భూములు లాక్కొనేందుకే హరితహారం - తుడుందెబ్బ నేత పోదెం బాబు - ములుగులో ర్యాలీ.. ఆర్డీ కార్యాలయ ముట్టడి ములుగు : ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం పేరు మీద తెలంగాణ నాయకులు ఆదివాసీలను ఆంధ్ర ప్రాంతానికి బలిస్తే.. నేడు తెలంగాణ ప్రభుత్వం కంతనపల్లి, మణుగూరు థర్మల్ ప్రాజెక్టు, కుంటాల హైడల్ ప్రాజెక్టు, ఇచ్చంపల్లి ప్రాజెక్టులతో ఆదివాసీలను ముంచడం సరికాదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు పోదెం బాబు అన్నారు. ఈ మేరకు సమితి ఆధ్వర్యంలో సోమవారం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవిని నమ్ముకుని పోడు వ్యవసాయంతో జీవిస్తున్న ఆదివాసీల భూములను ప్రభుత్వం హరితహారం పేరుతో లాక్కొని మొక్కలు నాటేందు కు అణచివేత చర్యకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు తహసీల్దార్లు ఏజె న్సీ సర్టిఫికెట్లు జారీ చేయడం లేదని, ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 వేల వరకు లంచం తీసుకుంటున్నారని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలం రవికుమార్ ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏటూరునాగారం మండలాన్ని స్వయం ప్రతిపత్తి గల ఆదివాసీ జిల్లా కేంద్రంగా ప్రకటించాలని తుడుందెబ్బ ములుగు డివిజన్ కమిటీ అధ్యక్షుడు ముద్దెబోయిన రవి డిమాండ్ చేశారు. ఆ తర్వా త తమ సమస్యలు పరిష్కరించాలని కార్యాలయ అధికారికి వినతిపత్రం అందించారు. సంఘం నేతలు తాటి హన్మంతరావు, ఆగబోయిన రవి, కోరగట్ల లక్ష్మణ్‌రావు, నాలి సారయ్య, పులిసె బాల క్రిష్ణ, జివ్వాజి రవి, వట్టం నాగరాజు, కొండ నాగరాజు పాల్గొన్నారు. -
రైతు ఆత్మహత్యలపై రాహుల్‌వి మొసలి కన్నీళ్లు
ప్రాణహిత డిజైన్ మార్చొద్దు: టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి హైదరాబాద్: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ విమర్శించింది. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో విదర్భ రైతుల ఆత్మహత్యలపై పార్లమెంటులో కన్నీళ్లు పెట్టుకున్న రాహుల్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఏ ప్రయత్నం చే యలేదని ఆ పార్టీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. శుక్రవారం ఇక్కడ పార్టీ నేతలు చంద్రశేఖర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డిలతో కలసి మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడిరాష్ట్రంలో 24 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, 11 నెలల టీఆర్ఎస్ పాలనలో వెయ్యిమంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కనీసం కాంగ్రెస్‌వారికి కూడా భరోసా ఇవ్వలేదు రాహుల్‌గాంధీ పర్యటనపై కిషన్‌రెడ్డి ధ్వజం హైదరాబాద్: రైతుభరోసా యాత్ర పేరిట తెలంగాణకు వచ్చిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కనీసం కాంగ్రె స్ కార్యకర్తలకు కూడా భ రోసా కల్పించలేకపోయారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ నేతలు సాంబమూర్తి, వి.దినేష్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, నాగూరావు నామోజీలతో కలసి కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు ప్రజాసమస్యలపై పోరాడుతానంటున్నా రాహుల్‌గాంధీ గత పదేళ్లు ఎక్కడ తొంగున్నారని ప్రశ్నించారు. మోదీ సూట్ గురించి అపరిపక్వతతో మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇక్కడకు వచ్చి భూమి బంగారం అని మాట్లాడుతున్న రాహుల్ మరి తన బావ వాద్రాకు ఇచ్చిన భూమి, గతంలో యూపీఏ ప్రభుత్వం సేకరించిన భూమి ఇనుమా అని నిలదీశారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గజం కూడా సేకరించలేదన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ది.. పాపాల చరిత్ర : గట్టు హైదరాబాద్: కాంగ్రెస్‌ది పూర్తిగా పాపాల చరిత్ర అని, చేసిన పాపాలను కడిగేసుకునేందుకు చేపడుతున్న ఈ యాత్రకు ‘పశ్చాత్తాప యాత్ర’ అని పేరు పెట్టుకుంటే సరిపోయేదని టీఆర్ఎస్ నాయకుడు గట్టు రామచంద్రరావు విమర్శించారు. ఇది, రైతు భరోసా యాత్ర కాదని, ఫక్తు రాజకీయ, కాంగ్రెస్ భరోసా యాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇవ్వాళే కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ మాదిరిగా యాత్ర చేపడుతుంటే, రాహుల్ గాంధీ మాటలను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు ఇవ్వలేదు, తాగడానికి నీరివ్వలేదు, ఎవరికీ ఏ సాయం చేయలేదు, కాబట్టే క్షమాపణ చెప్పడానికి వచ్చానని రాహుల్ అంటే కరెక్టుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. పరిహారం ఇచ్చి.. పాపాలను కడి గేసుకోలేరు రాహుల్ పర్యటనపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హైదరాబాద్ : పదేళ్ల తమ పదవీ కాలంలో రైతు వ్యతిరేక విధానాలు అవలంభించి, వారి దుస్థితికి, ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్ రెండు లక్షల చొప్పున పరిహారం చెల్లించి తన పాపాలను కడిగేసుకోలేదని టీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తమ పదేళ్ల కాలంలో కాంగ్రెస్ నివారించలేకపోయిన రైతు ఆత్మహత్యలను.. టీఆర్ఎస్ ప్రభుత్వం పదినెల్ల కాలంలో చేయలేక పోయిందంటూ విమర్శించడం విడ్డూరమన్నారు. రాహుల్‌ది కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నమన్నారు. -
పేరు రైతుది.. పవర్ హైదరాబాద్‌కా?
తెలంగాణ నేతలపై పరకాల ధ్వజం * శ్రీశైలం విద్యుత్‌ను ఏ వ్యవసాయ క్షేత్రానికి తరలించారు? * నగరంలో రెండున్నర గంటలు కోత పెట్టి వ్యవసాయానికి ఇవ్వొచ్చు.. అప్పుడు ఏ రైతూ ఆత్మహత్య చేసుకోడు అవగాహన లోపంతోనే బాబుపై నిందలు సాక్షి, హైదరాబాద్ : రైతుల పేరుతో తెలంగాణ నేతలు నానా యాగీ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ధ్వజమెత్తారు. రైతుల పేరు చెప్పి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కారు.. అందులో ఏ రైతుకైనా ఒక్క యూనిట్ ఇచ్చారా అని నిలదీశారు. 1,307 మిలియన్ యూనిట్ల అక్రమ విద్యుత్‌ను ఏ గోతిలో పోశారని ప్రశ్నిం చారు. రైతుల పేరు చెప్పి విద్యుత్‌ను హైదరాబాద్‌కే తరలిస్తున్నారన్నారు. ఆ విద్యుత్‌ను ఏ వ్యవసాయ క్షేత్రానికి ఇచ్చారో తెలంగాణ ప్రజలు నిలదీయాలన్నారు. ఆయన మంగళవారం సచి వాలయంలో విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం విద్యుత్‌ను హైదరాబాద్‌కు సరఫరా చేసే బదులు రైతులకు అందిస్తే ఆత్మహత్యలు ఉం డేవి కాదన్నారు. నగరంలో రోజూ రెండున్నర గంటలు కోత విధించి, ఆ విద్యుత్‌ను వ్యవసాయానికి అందిస్తే ప్రయోజనం ఉండేదని, అప్పుడు ఏ రైతూ ఆత్మహత్య చేసుకోడని చెప్పారు. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ప్రభుత్వం ఈ పని చేసి ఉండేదన్నారు. సీఈఆర్సీ నిర్ణయానికి కట్టుబడతాం కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం విషయంలో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్ సీ) నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పరకాల చెప్పారు. ఇది ఏపీఈఆర్సీ పరిధిలోది కాదని ఆ సంస్థే తేల్చిందని గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టు అయితేనే సీఈఆర్సీకి వెళ్లాలన్న విలేకరుల సందేహాన్ని ఆయన కొట్టిపారేశారు. కృష్ణపట్నం ప్రాజెక్టులో తెలంగాణకు వాటాలు మాత్రమే ఉన్నాయని, విద్యుత్ ఒప్పందాలు జరగలేదని తెలిపారు. -
మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా 'తెలుగు నేతలు'
న్యూఢిల్లీ: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు సీనియర్ నేతలను ఎంపిక చేసినట్లు ఏఐసీసీ గురువారం వెల్లడించింది. తెలంగాణ నుంచి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, మాజీ ఎంపీలు వివేక్, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్‌లను ఎంపిక చేసినట్లు తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ బోత్స ఝాన్సీతోపాటు కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణి, కిషోర్ చంద్రదేవ్, పళ్లంరాజు లను ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రకటించింది. 288 మంది సభ్యులు గల మహారాష్ట్ర శాసనసభకు వచ్చే నెల 15న ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఎన్నికల సంఘం ఇప్పటికే జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధిక శాసనసభ స్థానాలు కైవసం చేసుకోవాలని ఇప్పటికే పలు పార్టీలు దృష్టి సారించాయి. అందులోభాగంగా ప్రధాన పార్టీలు వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నాయి. -
పదవుల లొల్లి
-
అచ్చతెలుగులో ఆరంభం.. ముగింపు
గవర్నర్ ప్రసంగాన్ని సావధానంగా విన్న శాసనసభ్యులు సాక్షి, హైదరాబాద్: ‘మాన్యశ్రీ శాసన సభాపతి, మాన్యశ్రీ శాసన మండలి అధ్యక్షులు, గౌరవ శాసన సభ్యులు, మండలి సభ్యులు అందరికీ నా శుభాభివందనములు’ - ఈ మాటలు మరెవరివో కాదు... మన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్వే. తెలంగాణ అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి బుధవారం ఆయన చేసిన ప్రసంగం ఇలా అచ్చ తెలుగులో మొదలై.. చివర్లో మళ్లీ తెలుగులోనే ముగించారు. గతంలో ఉమ్మడి రాష్ర్టంలో గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించిన ప్రతిసారీ విపక్షాలు తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపాయి. ప్రసంగ ప్రతులు చించడం, కుర్చీలు, మైకులు విరగ్గొట్టడం వంటివి కూడా చోటుచేసున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని స్వయం పాలన లక్ష్యాన్ని సాకారం చేసుకున్న ఆనందంలో ఉన్న ప్రజాప్రతినిధులంతా గవర్నర్ ప్రసంగాన్ని సావధానంగా విన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న ఇదే నరసింహన్‌ను గతంలో ‘గో బ్యాక్’ అన్న తెలంగాణ నేతలు ఇప్పుడు ఆయనకు వినయంగా, గౌరవపూర్వకంగా సహకరించారు. గవర్నర్‌కు కుడివైపున స్పీకర్ మధుసూదనాచారి, ఎడమవైపున మండలి చైర్మన్ విద్యాసాగర్‌రావు ఆసీనులయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించిన నరసింహన్ 20 నిమిషాలపాటు రాష్ర్ట ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యతలను వివరించారు. ‘తెలంగాణ రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సమావేశానికి అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు చరిత్రాత్మక శుభదినం’ అని గవర్నర్ ప్రసంగం తెలుగులో ప్రారంభమైంది. ‘భారత రాజ్యాంగానికి లోబడి తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతిపౌరునికీ సమానహోదా, రక్షణ కల్పిస్తామని నేను హామీ ఇస్తున్నాను. సర్వజన హితాయ...సర్వజన సుఖాయ - ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం-ఆశయం.. జైహింద్’ అని తెలుగులోనే ఆయన ప్రసంగం ముగిసింది. గతంలో 30 పేజీలకుపైగా ఉండే గవర్నర్ ప్రసంగ పత్రం ఈసారి 16 పేజీలకే పరిమితమైంది. నరసింహన్ ప్రసంగం చాలా సరళంగా, సూటిగా ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇదీ గవర్నర్ ప్రసంగం తీరు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ అభివృద్ధికి ఎటువంటి ఢోకా ఉండదనే భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. మెల్బోర్న్, వియన్నా, వాంకోవర్, టొరెంటో వంటి అంతర్జాతీయ నగరాల మాదిరి భాగ్యనగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమని ప్రకటించారు. లండన్, న్యూయార్క్ సిటీల వలే నగరం మొత్తం సీసీ కెమెరాలను అమర్చి ‘సేఫ్‌సిటీ’గా తీర్చిదిద్దుతామన్నారు. రాజకీయ అవినీతిని నిర్మూలిస్తామని, పరిశ్రమలకు ఇబ్బందులు కలగకుండా సీఎం కార్యాలయంలో ‘ప్రత్యేక ఛేజింగ్ విభాగం’ ఏర్పాటు చేస్తామని చెప్పడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత, రుణాల మాఫీ ఏమైందని తెలుగుదేశం సభ్యులు ఎర్రబెల్లి, రేవంత్‌లు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించగా.. ముందు మీ చంద్రబాబును అడగండి అని మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో పాటు టీఆర్ఎస్ శాసనసభ్యులు బదులిచ్చారు. -
ఆశల పల్లకీలో గులాబీ నేతలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : టీఆర్ఎస్ నేతలు నామినేటెడ్ పోస్టులపై గురి పెట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతలు ఎలాగైనా పదవులను సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి గులాబీ జెండా మోస్తు న్న ద్వితీయ శ్రేణి నేతలు ప లువురు తమ స్థాయిని బట్టి పదవులను ఆశిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రాపకా న్ని ముందే పొందిన నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం అనివార్యంగా మారిన నేపథ్యంలో ఏ ప్రాతిపదికను పాటిస్తారోనన్న చర్చ జరుగుతోంది. ‘ఎమ్మెల్సీ’ ఎవరిని వరించేనో.. జిల్లాలో రెండు ఎంపీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలను గెలిచి టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. దీంతో ఆధిష్టానం రాజకీయంగా, అభివృద్ధి పరంగా జిల్లాకు ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటా కింద జిల్లాకు చెందిన నాయకుడికి ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సీట్ల సర్దుబాటు కోసం పలువురు సీనియర్లకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని పార్టీ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. నిజామాబాద్ అర్బన్, రూరల్‌ల నుంచి టికెట్ ఆశించిన బస్వా లక్ష్మీనర్సయ్య, డాక్టర్ భూపతిరెడ్డిలతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్గౌడ్లకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని పేర్కొన్నారు. అయితే కేసీఆర్ ప్రకటించిన ఐదారు రోజులకే బస్వా లక్ష్మీనర్సయ్య కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఎమ్మెల్సీ రేసులో జిల్లాకు చెందిన డాక్టర్ భూపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్‌లు మిగిలారు. అలాగే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డిలు ఈ పదవులను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ కమిటీ, కార్పొరేషన్లపైన.. పలువురు సీనియర్ నేతలు రాష్ర్ట, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులపై గురి పెట్టారు. ఆగ్రోస్, ఆర్టీసీ తదితర కార్పొరేషన్ల చైర్మన్లు, డెరైక్టర్ల స్థానాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి పదవుల వేటలో పడేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారు. డీపీసీ, విజిలెన్స్ మానిటరింగ్, జడ్పీ, మండల, కార్పొరేషన్, మున్సిపాలిటీలలో కోఆప్షన్ సభ్యుల కోసం కొందరు ఇప్పటికే సంబంధిత ఎమ్మెల్యేలను కలిసి, తమ పేర్లను ప్రతిపాదించాలని కోరుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్, పిట్లం, గాంధారి తదితర ఏఎంసీల చైర్మన్, డెరైక్టర్ పదవుల కోసం సిఫారసులు మొదలయ్యాయి. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన నిట్టు వేణుగోపాల్‌రావు, పున్న రాజేశ్వర్లతో పాటు అన్ని నియోజకవర్గాల నాయకులు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల చుట్టూ ద్వితీయశ్రేణి నాయకులు చక్కర్లు కొడుతున్నారు. వీరి ఆశలను కేసీఆర్ ఏ విధంగా నెరవేరుస్తారో వేచి చూడాలి. -
ఇతర పార్టీలపై కాంగ్రెస్ ఆధారపడదు:శ్రీధర్ బాబు
హైదరాబాద్: ఇతర పార్టీలపై కాంగ్రెస్ ఆధారపడదని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ తో పొత్తు గానీ, విలీనం గానీ ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఆశించలేదన్నారు. ఇతర పార్టీలపై ఆధారపడే అవసరం కాంగ్రెస్ కు ఎప్పుడూ ఉండదన్నారు. జానారెడ్డి నివాసంలో సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబు, షబ్బీర్ ఆలీలు మంగళవారం సమావేశమైయ్యారు. అనంతరం టీఆర్ఎస్ పొత్తు, విలీనం చర్చలకు సంబంధించి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీదేనని తెలిపారు. ఉద్యమ స్పూర్తితో పాటు కాంగ్రెస్ కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను పిట్టల దొరగా అభివర్ణించారు. ఆయన ఏనాడు నిజాలు చెప్పలేదన్నారు. విలీనం కుదరదన్న తమకు టీఆర్ఎస్ తో పొత్తు కూడా అవసరం లేదన్నారు. విలీన అంశంపై హైకమాండ్ కు, కేసీఆర్ కు మధ్య జరిగిన సంభాషణను అవసరమొచ్చినప్పుడు బయటపెడతామన్నారు. -
'అండగా ఉంటామనటం ఫ్యాషన్ అయిపోయింది'
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగుల హక్కుల గురించి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగ జేఏసీ నేతలు మండిపడ్డారు. సీమాంధ్రకు కనీస న్యాయం చేయకుండా కాంగ్రెస్, బేజేపీలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయని వారు ధ్వజమెత్తారు. తెలంగాణలో సెటిలైన సీమాంధ్రులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సీమాంధ్రులకు అండగా ఉంటామంటూ తెలంగాణ నేతలు మాట్లాడటం ఒక ఫ్యాషన్‌గా మారిందని జేఏసీ నేతలు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులకు ప్రత్యేక భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. -
తెలంగాణలో భారీ ఎత్తున సభలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. నియోజకవర్గాలు, మండలాలవారీగా సభలు నిర్వహించి సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 25 నుంచి జిల్లా కేంద్రాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆదివారం గాంధీభవన్‌లో తెలంగాణ జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లతో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. తెలంగాణ ఇచ్చినందున ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్‌కే దక్కాలని, అందుకోసం కార్యక్రమాలు చేపట్టాలని బొత్స వారికి సూచించారు. తర్వాత ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు షబ్బీర్‌అలీ, జీహెచ్‌హెంసీ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు కృతజ్ఞతల పేరుతో జిల్లాల వారీగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. మార్చి మొదటివారంలో హైదరాబాద్‌లో తలపెట్టిన భారీ సభకు సోనియా రాబోతున్నారని తెలిపారు. అనంతరం వారు నిలువెత్తు సోనియా బొమ్మలతో కూడిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. గాంధీభవన్‌లో కిరణ్ బొమ్మ తొలగింపు గాంధీభవన్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్రపటాన్ని ఆది వారం తొలగించారు. ఆయన స్థానంలో కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్చార్జ్ గులాంనబీ ఆజాద్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. గాంధీభవన్‌లోని మీడియా సమావేశ మందిరంలో నిన్నటి వరకూ సోనియా, రాహుల్, మన్మోహన్, దిగ్విజయ్, కిరణ్, బొత్స చిత్రపటాలతో కూడిన పెద్ద ఫ్లెక్సీ ఉండేది. ఆది వారం మీడియాతో మాట్లాడేందుకు సమావేశమందిరానికి వచ్చిన షబ్బీర్‌అలీ, దానంలు ఫ్లెక్సీలో కిరణ్ చిత్రపటం ఉన్న విషయం గమనించి వెంటనే కిరణ్ ఫొటోను కప్పేశారు. తర్వాత కిరణ్ స్థానంలో ఆజాద్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. -
సోనియా ఇంటికి క్యూ కట్టిన టీ.కాంగ్రెస్ నేతలు
న్యూఢిల్లీ : తెలంగాణ కల సాకారం అవటంతో హస్తినలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు హడావుడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు ఆమె నివాసానికి టీ.కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్, మంత్రి గీతారెడ్డి విడివిడిగా సోనియాతో భేటీ అయ్యి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో తెలంగాణ ప్రాంత నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వద్దని విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సోనియా గాంధీని ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక శుక్రవారం సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీలో కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే టీఆర్ఎఓస్ -
ఒత్తిడిలో కమలం!
బిల్లులో సవరణల కోసం ఇరుప్రాంతాల పార్టీ నేతల పట్టు ఇరు ప్రాంతాల నేతలను సమాధానపరిచే యత్నంలో నేతలు తెలంగాణకు కట్టుబడి ఉన్నామంటూనే.. సీమాంధ్ర సమస్యలపై రాజీ పడబోమంటూ సమాధానం సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లులో సవరణల కోసం బీజేపీకి చెందిన సీమాంధ్ర, తెలంగాణ నేతలు పార్టీ అగ్రనేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. సీమాంధ్ర, తెలంగాణ బీజేపీ నేతలు రాజ్యసభలో విపక్ష నేత అరుణ్‌జైట్లీని, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రవిశంకర్ ప్రసాద్, అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్లను కలిసి బిల్లులో చేయాల్సిన సవరణల పత్రాలను అందజేశారు. హరిబాబు, శాంతారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, రఘునాథబాబు తదితరులతో కూడిన సీమాంధ్ర నేతల బృందం ఈ నేతలను కలిసి, 14 సవరణలను, డిమాండ్లను వివరించింది. పోలవరం మినహా మిగతా డిమాండ్లను కేంద్రం పట్టించుకోలేదని తెలిపింది. సీమాంధ్రకు రెవెన్యూ లోటు, ఉమ్మడి రాజధానిపై తలెత్తే చిక్కుల విషయంలో అరుణ్ జైట్లీ కూడా సీమాంధ్ర నేతలతో ఏకీభవించినట్టు సమాచారం. సీమాంధ్రుల డిమాండ్ల విషయంలో రాజీ పడేదిలేదని ఆయన వారికి భరోసా ఇచ్చారు. తాజాగా సోమవారం తెలంగాణకు చెందిన బీజేపీ శాసన సభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డిలతో కూడిన బృందం 10 సవరణలు కోరుతూ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్లను కలిసింది. హైదరాబాద్‌ను మూడేళ్ల వరకే ఉమ్మడి రాజధాని చేయాలని, ఆ తరువాత సీమాంధ్రులు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకునేలా బిల్లులో సవరణలు తేవాలని కోరింది. సీమాంధ్రకు వేరే హైకోర్టు ఏర్పాటు చేయాలని, తెలంగాణలోని వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఏ ప్రాంతంలో ఉన్నవారికి ఆ ప్రాంతంలో పింఛను అందించాలని, ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలని ఈ బృందం కోరింది. ఇరు ప్రాంతాల నేతలు గట్టిగా వాదనలు వినిపిస్తుండటంతో పార్టీ పెద్దలు ఇరకాటంలో పడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే.., సీమాంధ్రుల సమస్యల విషయంలో రాజీపడబోమని ఇరు ప్రాంతాల నేతలను సమాధానపరిచే ప్రయత్నంలో ఉన్నారు. నేడు పార్టీ వైఖరి స్పష్టమవుతుంది: నాగం ‘బీజేపీ విధానం చిన్న రాష్ట్రాలకు అనుకూలం. అందులో ఎలాంటి మార్పులేదని పార్టీ జాతీయ నేతలు స్పష్టం చేస్తున్నారు’ అని పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి సోమవారం రాత్రి మీడియాకు చెప్పారు. మంగళవారం బిల్లు పెట్టిన తర్వాత పార్టీ వైఖరి స్పష్టమవుతుందని తెలిపారు. ‘ఇప్పుడు సవరణలు చేయకపోతే మోడీ అధికారంలోకి వచ్చాక సవరణలు చేయించుకుందామని సీమాంధ్ర బీజేపీ నేతలే చెప్పారు. రాష్ట్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని సీమాంధ్ర నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని నాగం అన్నారు. చంద్రబాబు సమన్యాయం నాటకాలకు తెరదించాలన్నారు. -
టీడీపీతో పొత్తు కోసం తెలంగాణలో బీజేపీని చంపుతారా?
వెంకయ్యపై యెన్నం ధ్వజం ఆయన ఒక ప్రాంత ప్రతినిధిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం ఇది నోటికాడికొచ్చే ముద్దను లాగుతున్నట్లు కాదా అని ప్రశ్న ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని లగడపాటికి యెండల వినతి న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ బిల్లును అధ్యయనం చేసిన తరువాతే దానికి మద్దతుపై స్పందిస్తామంటూ బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ కల సాకారమయ్యే సమయంలో వెంకయ్య చేసిన వ్యాఖ్యలు పాలకుండలో విషం చిమ్మినట్లుగా ఉందని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు సీమాంధ్ర ప్రతినిధిగా ఉన్నాయే తప్ప.. ఆయన జాతీయ నాయకుడిగా పార్టీ విధానాన్ని మాట్లాడటం లేదని విమర్శించారు. సీమాంధ్రలో పార్టీకి ఊపిరిపోయటం కోసం, తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం తెలంగాణలో సజీవంగా ఉన్న పార్టీని చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. యెన్నం ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని ఏపీభవన్‌లో బీజేపీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, బిల్లు మీరు పెట్టకుంటే మేమే పెడతామన్న వెంకయ్యనాయుడు ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసం? తెలంగాణ కోసం వందలాది యువకులు బలిదానం చేసుకున్న సంగతి తెలియదా? బీజేపీ కార్యకర్తలు చనిపోయిన సంగతి విస్మరించారా? సీమాంధ్ర ప్రతిపాదనలను జైరాం రమేశ్‌కు అందజేసిన మీరు.. తెలంగాణ తరపున మేమిచ్చిన వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? జాతీయ నాయకుడిగా ఉంటూ ఈ విషయంలో ఒక ప్రాంత ప్రతినిధిగా మాట్లాడడం పక్షపాతం కాదా? నోటికాడికొచ్చే ముద్దను లాగుతున్నట్లు కాదా? రాజ్యసభలో బిల్లును అడ్డుకుంటే మా పరిస్థితి ఏమిటి? సీమాంధ్ర కోసం తెలంగాణలో పార్టీని చంపుతారా? తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం తెలంగాణలో బలంగా ఉన్న బీజేపీని ఫణంగా పెడతారా? 2004 సమయంలో టీడీపీతో పొత్తు పెట్టి బీజీపీనీ భ్రష్టు పట్టించిన మీరు ఇప్పుడు మళ్లీ అదే పనిచేస్తున్నారంటే ఏమనుకోవాలి? ఏనాడూ సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించని మీకు ఇప్పుడు పార్టీ గుర్తుకొచ్చిందా? అందుకోసం తెలంగాణలో పార్టీని చంపి సీమాంధ్రలో బతికించుకోవాలనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించారు. యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్లమెంటు లో విభజన బిల్లును అడ్డుకునేందుకు ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోమని చెబుతున్న సబ్బంహరికి జై ఆంధ్రా, జై తెలంగాణ ఉద్యమంలో ఎన్ని వందలమంది ప్రాణాలు కోల్పోయారో తెలియదా అని ప్రశ్నించారు. ‘‘విభజన బిల్లును అడ్డుకునేందుకు క్రికెట్, కబడ్డీ ఆడతానంటున్న లగడపాటిని ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని కోరుతున్నా. అధికారంలోకొస్తే తెలంగాణ ఇస్తామని మేనిఫెస్టోలో హామీనిచ్చి గెలిచిన లగడపాటి.. పార్టీ ఇచ్చిన హామీని నెరవేరుస్తుంటే ఇప్పుడెందుకు ఎగిరిపడుతున్నాడు?’’ అని ధ్వజమె త్తారు. ప్రాంతీయ నేతగా వ్యవహరించొద్దు: నాగం నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: సున్నితమైన తెలంగాణ అంశం గురించి మాట్లాడేటప్పుడు స్థాయిని మరిచి ప్రాంతీయ నేతగా వ్యవహరించొద్దని వెంకయ్యనాయుడికి నాగర్కరూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ బీజేపీ నేతలమంతా ఆయన్ను కలుస్తాం. నష్టపోయిన వారికి ఏం సవరణలు అక్కరలేదా? దోచుకున్నవారికే మళ్లీ దోచి పెడతారా అని ప్రశ్నిస్తాం. తెలంగాణకు కట్టుబడి ఉంటామని చెబుతూనే మరోవైపు సవరణల పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారు. బీజేపీలో ఏ ఒక్క వ్యక్తి నిర్ణయం చెల్లుబాటు కాదు. కేంద్ర కమిటీ తీర్మానమే అమలవుతుంది’’ అని పేర్కొన్నారు. -
సమావేశాలను బహిష్కరించే యోచనలో టి.మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిపై గుర్రుగా ఉన్న తెలంగాణ నేతలు బడ్జెట్ సమావేశాలను బహిష్కరించే యోచనలో ఉన్నారు. రేపట్నుంచి ఆరంభం కానున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనకుండా తమ నిరసన వ్యక్తం చేయాలని వారు భావిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే టి.మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చురుగ్గా చర్చలు సాగుతున్నాయి. సీఎం కిరణ్ , స్పీకర్ మనోహర్ ల వైఖరిపై టి.నేతలు నిరసన వ్యక్తం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2014-15) ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు పనిదినాలు మాత్రమే సమావేశాలు జరుగుతాయి. సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు అమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 10.08 గంటలకు సభ సమావేశం కాగానే ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను సమర్పిస్తారు. -
చూపులన్నీ అటే... హస్తినలో నేతల మకాం
హైదరాబాద్ : తెలంగాణ బిల్లు ఢిల్లీ చేరిన నేపథ్యంలో అందరి చూపులతో పాటు...ఇరుప్రాంతాల నేతలు హస్తన దారి పట్టారు. విభజనపై ఆంధ్రప్రదేశ్ పాత్ర ముగిసి హస్తిన పాత్రకు, దేశ రాజధాని మంత్రాంగానికి తెర లేచింది. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా బడా నాయకుల నుంచి చోటా మోటా నేతల వరకు ఢిల్లీలోనే మకాం వేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంత మంత్రులతో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఢిల్లీలో మంత్రాంగం సాగిస్తుండగా ఇప్పుడు టీడీపీ నేతలు కూడా వారితో జత కలిశారు. బిల్లును సాఫీగా సాగిపోయేలా చేసేందుకు తెలంగాణ ప్రాంత నేతలు... ఎలాగైనా అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు శక్తియుక్తులు, ఎత్తులు పైఎత్తులకు తెర లేపారు. బిల్లుకు ఆమోదం సాధించుకునేందుకు తెలంగాణ ప్రాంత నేతలు.. ఎలాగైనా అడ్డుకోవాలని సీమాంధ్ర నేతలు ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. మరోవైపు సోమవారం ఉదయమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు హస్తిన చేరింది. అంతకు ముందు చర్చ జరపడం కోసం ఎలాగైతే విమానంలో టీ.బిల్లు రాష్ట్రానికి వచ్చిందో... చర్చ అనంతరం కూడా బిల్లును అలాగే విమానంలో చేర్చారు. -
టీడీపీ డబుల్ డ్రామా!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 విషయంలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తన డ్రామాను బుధవారం రక్తికట్టించింది. ఓటింగ్ జరపాలని సీమాంధ్ర నేతలు... ఓటింగ్ అక్కరలేదని తెలంగాణ నేతలు పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించారు. ఓటింగ్ జరపాలని, చర్చకు గడువు పొడిగించాలని స్పీకర్‌ను డిమాండ్ చేస్తూ పార్టీ సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు శాసనసభా మందిరంలో బైఠాయిస్తే... ఓటింగ్ పెట్టకుండా వెంట నే తిప్పి పంపాలంటూ తెలంగాణ ప్రాంత పార్టీ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపారు. బుధవారం సభ వాయిదా పడిన వెంటనే అధినేత చంద్రబాబు రెండు ప్రాంతాల ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అది పూర్తికాగానే ఎమ్మెల్యేలు ప్రాంతాల వారీగా ఆందోళనకు దిగడం గమనార్హం. టీడీపీ డ్రామా పర్వం కొనసాగిందిలా... - రాష్ట్ర విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో కేంద్రం తీరుకు నిరసనగా గురువారం బంద్ పాటించాలని సీమాంధ్ర టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, సీఎం రమేష్ కోరారు. - సభ వాయిదాపడక ముందు పార్టీ ఎమ్మెల్యేలు ప్రాంతాల వారీగా చీలిపోయి ఒకే సమయంలో ఎవరి వాదనకు అనుగుణంగా వారు స్పీకర్ ఛాంబర్లో వేరువేరుగా ధర్నా నిర్వహించారు. సభ వాయిదా పడిన వెంటనే పార్టీ ఎమ్మెల్యేలు మరోసారి చంద్రబాబుతో సమావేశమయ్యారు. - బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని అన్ని పార్టీలకు చెందిన సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు సభలోనే బైఠాయించాల్సిందిగా చంద్రబాబు సూచిం చారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తాము నిరసన తెలుపుతున్నామని పోలీసులు అరెస్టు చేసేవరకూ గంటకో మారు వచ్చి మీడియాకు వెల్లడించాల్సిందిగా ఆదేశించారు. - అధినేత సూచనను ఎమ్మెల్యేలు తూ.చ. తప్పకుండా పాటించారు. దేవినేని ఉమా మహేశ్వరరావు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, గాలి ముద్దుకృష్ణమనాయుడు తదితరులు టీవీ ఛానళ్లలో వార్తలు ప్రసారమయ్యే - సమయానికి వచ్చి మాట్లాడి మళ్లీ సభామందిరంలోకి వెళ్లారు. బిల్లును సమగ్రంగా చర్చించేందుకు ఫిబ్రవరి 28 వరకూ గడువు పెంచాలని, బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. - మరోవైపు బిల్లుపై ఓటింగ్ నిర్వహించవద్దని, యధావిధిగా రాష్ట్రపతికి తిప్పి పంపాలని కోరుతూ తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సిం హులు నేతృత్వంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద సుమారు గంటపాటు నిరసన తెలిపారు. - బిల్లుపై సీఎం ఇచ్చిన నోటీసును స్పీకర్ తిరస్కరిం చాలని ఎర్రబెల్లి, మోత్కుపల్లి డిమాండ్ చేశారు. అలాగే గడువు పెంచొద్దని కోరుతూ తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు రాష్ట్రపతికి లేఖ రాశారు. -
టీ నేతలంతా ఒకేతాటిపై..!
77వ నిబంధన కింద ఇచ్చిన నోటీసుల తిరస్కరణకు డిమాండ్ ఉభయ సభల్లో ఐకమత్యంతో వ్యహరించాలని నిర్ణయం మంత్రి పొన్నాల నివాసంలో ప్రజా ప్రతినిధుల భేటీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పిపంపేందుకు సభలో తీర్మానం చేసేలా రూల్ 77 కింద స్పీకర్‌కు అందిన నోటీసులను తిరస్కరించాలని పార్టీలకతీతంగా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఉభయ సభల్లోనూ అందరూ ఐకమత్యంతో వ్యవహరించాలని, ఆ నోటీసుల తిరస్కరణకు గట్టిగా పట్టుబట్టాలని నిర్ణరుుంచారు. శాసనసభ నియమావళి 76, 77 కింద ఉభయ సభల్లో సభా నాయకులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. ఆదివారం మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు సమావేశమయ్యూరు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ప్రసాద్‌కుమార్, ఉత్తమకుమార్‌రెడ్డి, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్ అనిల్, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఆమోస్, భూపాల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతోపాటు ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు (టీడీపీ), నాగం జనార్దన్‌రెడ్డి (బీజేపీ)లు హాజరయ్యారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే మంత్రి పొన్నాల ఫోనులో ఇతర తెలంగాణ ప్రాంత నేతలతోనూ చర్చించారు. సోమవారం ఉభయ సభల్లోనూ ఎప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి చర్చలు జరుపుతూ ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని నేతలు నిర్ణయించారు. విభజన బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ ముఖ్యమంత్రి, మండలి సభా నాయకుడు ఇచ్చిన నోటీసులు తమకు ఆమోదయోగ్యం కాదనే విషయం స్పీకర్, మండలి చైర్మన్లను మరోసారి కలిసి తెలియజేయాలని మంత్రులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సమావేశానంతరం అందుబాటులో ఉన్న మంత్రులందరూ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయ్యూరు. ప్రభుత్వం తరఫున అందజేసిన తీర్మానం నోటీసులను తిరస్కరించాలని కోరారు. నోటీసులు వ్యతిరేకిస్తున్నాం: మంత్రి పొన్నాల ముఖ్యమంత్రి అందజేసిన నోటీసులను తాము వ్యతిరేకిస్తున్నట్టు పొన్నాల విలేకరులతో చెప్పారు. మంత్రివర్గ సభ్యులమైన తమను సంప్రదించకుండా ప్రభుత్వ పక్షాన నోటీసులివ్వడం అప్రజాస్వామిక, నిరంకుశ చర్యగా భావిస్తున్నామన్నారు. నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. సోమవారం సభలో తెలంగాణ కోరుకుంటున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, సీపీఐ, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలంతా ఒకే వ్యూహంతో ముందుకు సాగుతారని చెప్పారు. ముఖ్యమంత్రి చర్యలకు ప్రజలే న్యాయనిర్ణేతలని, ప్రజాకోర్టులో తగిన బుద్ధి చెబుతారని గండ్ర, పొంగులేటి వ్యాఖ్యానించారు. -
టీడీపీ, టీఆర్ఎస్ వాగ్వాదం
చంద్రబాబుతో ‘జై తెలంగాణ’ అనిపించండి: జోగు రామన్న నాడు డీలర్ దయూకర్, నేడు డాలర్ దయూకర్: వినయ్‌భాస్కర్ శవాలపై చందాలు వసూలు చేసే పార్టీ టీఆర్ఎస్: ఎర్రబెల్లి శ్రీకాంతాచారి మృతికి ఆ పార్టీయే కారణం సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో టీఆర్ఎస్, తెలుగుదేశం తెలంగాణ నేతలు మరోసారి మాటల యుద్ధానికి దిగారు. విభజన బిల్లుపై శుక్రవారం చర్చలో పాల్గొన్న టీఆర్ఎస్ సభ్యులు జోగు రామన్న, దాస్యం వినయ్ భాస్కర్ చంద్రబాబు, టీడీపీల వైఖరిపై విరుచుకుపడ్డారు. దీంతో టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియంలోకి వచ్చి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ శనివారానికి సభను వాయిదా వేయాల్సివచ్చింది. ఆగ్రహించిన దయాకర్‌రావు ఇయర్ ఫోన్లను విసిరికొట్టారు. ఎవరేమన్నారు? జోగు రామన్న: ఆదిలాబాద్‌కు వచ్చిన సమయంలో చంద్రబాబును అక్కడి నేతలు ‘జై తెలంగాణ’ అనమని కోరినా పట్టించుకోలేదు. ఆయన వైఖరికి విసిగి నేను ఆ పార్టీకి రాజీనామా చేశా. ఆ పార్టీ తెలంగాణ నేతలు ఇప్పటికైనా బాబుతో ‘జై తెలంగాణ’ అనిపించాలి. దయాకర్‌రావు: శ్రీకాంతాచారి ఆత్మహత్యాయత్నం సమయంలో చంద్రబాబు అతనితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. దానికి నేనే సాక్షి. ఆయన వైద్య ఖర్చులను మేమే భరించాం. అప్పుడు టీఆర్ఎస్ నేతలు ఎక్కడ పడుకున్నారు? దాస్యం వినయ్ భాస్కర్: వరంగల్ జిల్లాలో బలిదానం చేసుకున్న యువకులు ‘దయాకర్‌రావు ద్రోహి’ అని లేఖల్లో రాశారు. డీలర్ దయాకర్‌రావు డాలర్ దయాకర్‌రావుగా ఎదిగారు. మా అన్న దాస్యం ప్రణయ్‌భాస్కర్ ఎన్కౌంటర్ల గురించి మాట్లాడుతూ తెలంగాణ పదాన్ని ఉచ్చరిస్తే.. స్పీకర్ స్థానంలో ఉన్న యనమల రామకృష్ణుడు ఆ పదాన్ని వాడొద్దని నిషేధించారు. కేసీఆర్ ఉద్యమంతోనే మాట్లాడే అవకాశం కలిగింది. దయాకర్‌రావు: టీఆర్ఎస్ శవాలపై చందాలు వసూలు చేసే పార్టీ. దొంగదీక్ష చేసిన కేసీఆర్, ఒంటిపై కిరోసిన్‌పోసుకుని డ్రామా ఆడిన హరీష్‌రావుల వల్లనే వెయ్యిమంది విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడపెట్టారు. వారిలా నేను ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని బతకలేదు. నేను జిల్లా డీలర్ల సంఘానికి అధ్యక్షునిగా చేశా. మా నాన్న 1964లోనే పంచాయతీ సమితి అధ్యక్షునిగా పోటీ చేశారు. ఎల్ఎంబీ చైర్మన్‌గా ఉన్నారు. -
విలీనం తర్వాత రెండేళ్లకే పశ్చాత్తాపం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావాలని అప్ప ట్లో కొందరు తెలంగాణ నేతలు కోరింది నిజమేనని, అయితే రెండేళ్లకే వారు పశ్చాత్తాప పడ్డారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. బుధవారం ఆయన జేఏసీ ముఖ్య నేతలు కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్, వి.శ్రీనివాస్‌గౌడ్, మాదు సత్యం, కృష్ణ యాదవ్‌తో కలిసి జేఏసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో విలీనం కావడానికి ముందుగా చేసుకున్న ఒప్పందాలు, షరతులను అమలు చేయకపోవడంతో తెలంగాణ నేతలు రెండేళ్లకే బాధపడ్డారని పేర్కొన్నారు. సీమాంధ్రకు చెందిన గుప్పెడుమంది కో సం తెలంగాణ వనరులను కొల్లగొట్టి విధ్వంసం చేశారని విమర్శించారు. తెలంగాణలో ఉపాధికోసం, సంపద సృష్టికోసం ఏర్పాటుచేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ వంటివాటిని సమైక్య పా లకులు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని కోదండరాం ధ్వజమెత్తారు. ప్రస్తుతం అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లులోని అంశాల గురించి చర్చించకుండా నిజాంపై మాట్లాడుతూ రాష్ట్రపతి ఇచ్చిన గడువును సీమాంధ్ర పాలకులు దుర్వినియోగం చేశారని అన్నారు. నిజాం ఎంత నిరంకుశంగా పాలించాడో అంతకంటే అరాచకంగా సీమాంధ్ర పాలకులు వ్యవహరించారని ఆరోపిం చారు. తెలంగాణకోసం, హక్కుల కోసం అడిగే పరిస్థితి కూడా లేకుండా అప్రజాస్వామికంగా పాలించారని విమర్శించారు. శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసత్యాలను, అభూత కల్పనలను చెప్తున్నారని, వాటికి తగిన సమాధానం చెప్తామని కోదండరాం అన్నారు. సమ్మక్క-సారక్క జాతరకో సం ప్రభుత్వం శాశ్వత ఏర్పాట్లు చేయడం లేదని, ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలించడానికి జేఏసీ బృందం వెళ్తుం దని వెల్లడించారు. కత్తి వెంకటస్వామి, శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ సీమాంధ్ర సమస్యలను చర్చించి పరిష్కరించుకోవడం లో అక్క డి నేతలు విఫలమయ్యారని విమర్శించారు. హైదరాబాద్‌లో తెలంగాణవాదుల సభలకు అనుమతి ఇవ్వకుండా సీమాంధ్ర సభలకు ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. ఫిబ్రవరిలో ఢిల్లీలో వర్క్‌షాపు టి.బిల్లులో సవరణల అంశంపై చర్చించడానికి ఢిల్లీలో వర్క్‌షాపును నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో బిల్లుపై శాసనసభలో చర్చ జరుగుతున్న తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. శాసనసభలో బిల్లుపై చర్చ పూర్తయిన తర్వాత ఢిల్లీ పర్యటన పెట్టుకోవాలని నిర్ణయించారు. సింగరేణి నిర్వాసితులకు పరిహారం పెంచాలి సింగరేణి భూ నిర్వాసితులకు కొత్త చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు బుధవారం కోదండరాం, అద్దంకి దయాకర్, భూ నిర్వాసితుల సంఘం నేత రంగరాజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని భూములకు ప్రభుత్వం పాత చట్టాల ప్రకారం పరిహారం ఇవ్వాలని చూస్తోందని, దీని వల్ల భూమిని కోల్పోయినవారికి అన్యాయం జరుగుతుందని రంగరాజు అన్నారు. -
విభజన బిల్లు.. గడువు గడబిడ
సమీపిస్తున్న విభజన బిల్లు గడువు... రాష్ట్రపతికి పోటాపోటీ లేఖలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు గడువు విషయంలో కాంగ్రెస్‌లోని సీమాంధ్ర, తెలంగాణ నేతలు పరస్పరం భిన్న వాదనలు చేస్తున్నారు. అదే వైఖరిని ప్రతిబింబిస్తూ రాష్ట్రపతికి లేఖలు రాయడానికి కూడా సిద్ధవువుతున్నారు. గడువు పెంచాలంటూ సీమాంధ్ర నేతలు, పెంచరాదని కోరుతూ తెలంగాణ నేతలు ఆయనకు లేఖలు రాయాలన్న నిర్ణయానికి వచ్చారు. విభజన బిల్లు డిసెంబర్ 13న శాసనమండలికి, రాష్ట్ర అసెంబ్లీకి చేరడం తెలిసిందే. 40 రోజుల్లోగా అసెంబ్లీ అభిప్రాయంతో దాన్ని తిప్పి పంపాలని రాష్ట్రపతి నిర్దేశించారు. ఆ గడువు జవనరి 23వ తేదీతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో గడుపు పెంపు కోరుతూ సీవూంధ్ర వుంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరికి వారే విడిగా రాష్ట్రపతికి లేఖలు రాయూలని నిర్ణయించారు. ఈ మేరకు దాదాపు ఒకే రకమైన లేఖను సిద్ధం చేసి, దానిపై సంతకాలు పెట్టి పంపిస్తున్నారు. ‘‘అసెంబ్లీలో ప్రస్తుతం 270 మందికి పైగా సభ్యులున్నారు. బిల్లుపై ప్రతి సభ్యుడూ తన అభిప్రాయం చెప్పాలి. కనుక మరికొంత గడువు అవసరమే. అదే విషయూన్ని రాష్ట్రపతిని లేఖ ద్వారా కోరనున్నాం’’ అని వూజీ వుంత్రి గాదె వెంకటరెడ్డి పేర్కొన్నారు. చర్చలో పార్టీలవారీగా సవుయుం కేటారుుంచడం సరికాదని, సభ్యులు వ్యక్తిగతంగా అభిప్రాయాలు చెప్పుకునేందుకు అవసరమైన సవుయం ఇవ్వాల్సి ఉంటుందని ఆయనన్నారు. గడువు పెంచొద్దు ఇక తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలేమో గడువు పెంచాల్సిన అవసరం లేనే లేదంటూ రాష్ట్రపతికి లేఖలు రాస్తున్నారు. ఇలా మొత్తం 119 మంది ఎమ్మెల్యేలూ సంతకాలతో కూడిన లేఖలు రాయాలన్న ఆలోచనతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాల సేకరణ దాదాపు పూర్తయిందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. గడువు పెంచొద్దంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా విడిగా రాష్ట్రపతికి ఒక లేఖ రాయనున్నట్టు ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ తెలిపారు. ఇక బీజేపీలో చేరిన స్వతంత్ర ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డితో పాటు పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి మరో లేఖ రాస్తామని శాసనసభాపక్ష నాయకుడు యెండల లక్ష్మీనారాయణ చెప్పారు. ఇలా ఎమ్మెల్యేలు పార్టీలవారీగా లేఖ రాయాలని నిర్ణయించుకున్నా వాటన్నింట్లోనూ ఒకే విషయాన్ని ప్రస్తావిస్తామని వారంటున్నారు. బిల్లుపై చర్చకు సంబంధించి మూడు ప్రధానాంశాలను రాష్ట్రపతికి రాసే లేఖలో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. ‘‘ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్ర శాసనసభలోనే విభజన బిల్లు చర్చకు వస్తే కేవలం పది గంటల పాటు మాత్రమే చర్చించి కేంద్రానికి తిప్పి పంపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పటికే 20 గంటలకు పైగా చర్చ సాగింది. శాసనసభ్యులందరూ బిల్లుపై తమ అభిప్రాయాలను సవరణల రూపంలో ఇప్పటికే స్పీకర్‌కు అందజేశారు. తొమ్మిది వేలకు పైగా సవరణలు తనకందాయంటూ స్పీకర్నే సభలో ప్రకటించారు’’ అని ప్రస్తావిస్తున్నారు. కిరణ్ లేఖపై పెదవి విరుపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సభా నాయకుడిగా ఉంటూ, గడువు పెంచాలని కోరుతూ ఎవరికీ చెప్పకుండా రాష్ట్రపతికి అత్యంత రహస్యంగా లేఖ రాయడంపై ఆయన సన్నిహిత మంత్రుల్లో కూడా విస్మయం వ్యక్తమైంది. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న తరుణంలో సభకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా సీఎం లేఖ రాయడమేమిటని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా రాష్ట్రపతికి లేఖ రాయాల్సిన అవసరమేమొచ్చిందో అర్థం కావడం లేదని కిరణ్ సన్నిహిత మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. -
ఏకమై.. కుట్రను అడ్డుకుందాం
జెండాలు, ఎజెండాలు పక్కన పెడదాం తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభలో రాష్ట్రపతి పంపిన బిల్లుపై చర్చ జరపకుండా మరికొంత సమయం గడువు కోరేందుకు వ్యూహం పన్నారని ఆరోపించారు. ఈ కుట్రను అడ్డుకునేందుకు జెండాలు, ఎజెండాలను పక్కనపెట్టి పార్టీలకతీతంగా తెలంగాణ ప్రజాప్రతినిధులంతా పోరాడాలని నిర్ణయించారు. అందులో భాగంగా త్వరలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి సహా కేంద్ర పెద్దలను కలిసి సీమాంధ్ర నేతల కుట్రలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో అసెంబ్లీలో విభజన బిల్లుపై సాఫీగా చర్చ జరిగేలా, నిర్దిష్ట గడువులోపు రాష్ట్రపతికి పంపేలా ఒత్తిడి తెచ్చేలా ఎప్పటికప్పుడు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను ఏకతాటిపైకి తెచ్చి వ్యూహం రూపొందించేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీతోపాటు ఒప్పుకుంటే టీఆర్ఎస్, ఎంఐఎం నేతలను సభ్యులుగా చేర్చాలని నిర్ణయించారు. శుక్రవారం శాసనసభ ముగిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి కె.జానారెడ్డి అధ్యక్షతన మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్‌హౌస్‌లో తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బసవరాజు సారయ్య, సునీత లక్ష్మారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరైన ఈ భేటీలో మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి(టీడీపీ), నాగం జనార్దన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి(బీజేపీ) హాజరయ్యారు. హన్మంతు షిండే, చెన్నమనేని రమేశ్ మినహా టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ ఈటెల రాజేందర్, హరీష్‌రావు సహా 16 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్‌లు అనిల్, ఆరెపల్లి మోహన్‌తోపాటు 20 మంది ఎమ్మెల్యేలు, 10 ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు... తొలుత జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ బిల్లును అడ్డుకునే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో జెండా, ఎజెండాలను పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. సభలో చివరి వరకు చర్చ జరగకుండా చేసి మరింత గడువు కోరాలని సీమాంధ్ర నేతలు ఎత్తుగడ వేస్తున్నందున దాన్ని తిప్పికొట్టేందుకు ఎప్పటికప్పుడు వ్యూహం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు తెలంగాణ సభ్యులంతా ప్రతిరోజూ సభలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో కలిపి సమన్వయ కమిటీని ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు అన్ని పార్టీల నేతలు మద్దతు తెలిపారు. టీడీపీ తరపున ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీజేపీ నుంచి నాగం, కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ నుంచి రాజేందర్‌ను కమిటీలో సభ్యులుగా నియమించారు. సీపీఐ, ఎంఐఎం ఈ సమావేశానికి రాకపోయినప్పటికీ తెలంగాణకు సానుకూలంగా ఉన్నందున వారిని కూడా కమిటీలో చేర్చుకోవాలని నిర్ణయించారు. సమయం వృథా కానివ్వొద్దు.. సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ శాసనసభ నుంచి తొందరగా విభజన బిల్లును పంపేందుకు సమయం వృథా కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా తెలంగాణకు చెందిన 119 మంది ఎమ్మెల్యేలంతా తెలంగాణ బిల్లుకు మద్దతు చెబుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేపట్టాల్సిన సూచనలను ప్రతిపాదిస్తూ మూకుమ్మడిగా స్పీకర్‌కు లేఖ అందజేస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. దాంతో చాలా మేరకు సమయం కలిసి వస్తుందన్నారు. అలాగే బిల్లు విషయంలో స్పీకర్ నిబంధనల మేరకు వ్యవహరించేలా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. నాగం మాట్లాడుతూ సీమాంధ్రులు చేస్తున్న కుట్రలను జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లి దేశవ్యాప్త చర్చ జరపాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అందరం కలిసి త్వరలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధానితోపాటు కేంద్ర పెద్దలందరినీ కలిసి సీమాంధ్ర కుట్రలను వివరిస్తూ లేఖలను అందజేయాలని ప్రతిపాదించారు. సమావేశంలో మిగిలిన నేతలంతా అందుకు మద్దతు పలికారు. అసెంబ్లీ సమావేశాల విరామం సమయంలో ఢిల్లీ వెళ్దామని, తేదీని ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేయాలని నిర్ణయించారు. విభజన కోసం ఐక్యంగా ఉంటూ పోరాడుదామని, అయితే టీడీపీని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఎర్రబెల్లి అన్నారు. కరడుగట్టిన సమైక్యవాదిగా ఉన్న శైలజానాథ్ శాసనసభా వ్యవహారాలను అప్పగించడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని రేవూరి ప్రకాష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దీన్ని ఆషామాషీగా తీసుకోకుండా అందరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. పొంగులేటి మాట్లాడుతూ సభలో విభజన బిల్లుపై చర్చ జరగనందుకు నిరసనగా ప్రతిరోజూ గాంధీ విగ్రహం వద్ద వివిధ రూపాల్లో నిరసన తెలిపితే బాగుంటుందని సూచించారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ శ్రీధర్‌బాబు తరహాలో మిగిలిన తెలంగాణ మంత్రులంతా రాజీనామా చేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. వెంటనే జోక్యం చేసుకున్న శ్రీధర్‌బాబు.. ప్రస్తుతం ఆ అవసరం లేదన్నారు. సమావేశానంతరం ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. బిల్లును అడ్డుకుంటే ప్రతిఘటిస్తాం: జానారెడ్డి జెండా, ఎజెండాను పక్కనపెట్టి తెలంగాణ లక్ష్యంగా కలిసికట్టుగా ఉంటూ పోరాడుతాం. తెలంగాణ బిల్లును సభలో చర్చకు రాకుండా ఉంటే ప్రతిఘటిస్తాం. సీమాంధ్రల వ్యూహాలకు ప్రతివ్యూహం రూపొందించి అమలు చేస్తాం. త్వరలో రాష్ట్రపతిని కలిసి బిల్లుపై చర్చ జరగకుండా ఎవరు ఆటంకం కలిగించారో వివరిస్తాం. కేంద్ర, రాష్ట్రాల కుమ్మక్కు: మోత్కుపల్లి, ఎర్రబెల్లి విభజన ప్రక్రియను పూర్తి చేయాల్సిందే. కానీ వ్యూహాత్మకంగా జాప్యం జరుగుతోంది. ఇది చూస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై కావాలనే జాప్యం చేస్తున్నారన్న అనుమానం కలుగుతోంది. ఫిబ్రవరిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి విభజనను పూర్తి చేయాలి. అలా కాకుండా జాప్యం చేస్తే మాత్రం అందుకు పూర్తి బాధ్యత కేంద్రమే వహించాలి. కిరణ్‌కు సీఎం పదవి ఎందుకు: నాగం వాణిజ్య శాఖను సమర్ధవంతంగా నిర్వహించలేకపోయిన కిరణ్ ముఖ్యమంత్రి పదవిని సమర్ధవంతంగా ఎలా నిర్వహిస్తారు? రాష్ట్రాన్ని సరిగా నడపలేని సీఎం విభజనను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నాడు. నంగనాచి మాటలతో అడ్డుకోవద్దు: ఈటెల రాజేందర్ సీమాంధ్ర నేతలు నంగనాచి మాటలు చెబుతూ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ నేతలెవరూ ఊరుకోరు. ఇప్పటికైనా విభజన బిల్లుపై చర్చ జరపాలి. సీమాంధ్ర ప్రజల సమస్యలుంటే చెప్పాలి. వాటి పరిష్కారానికి సూచనలు చేయాలి. సీమాంధ్రులెంత అరిచి గీపెట్టినా తెలంగాణ ఆగదనే సత్యాన్ని గ్రహించాలి. -
టీ గరంగరం!
గొంతు విప్పుతాం బిల్లు ఆమోదం పొందేలా చూస్తాం అవసరమైతే అన్ని పార్టీల సహకారం ‘సాక్షి’తో జిల్లా శాసనసభ్యులు నేటినుంచే అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ’ ప్రధాన ఎజె ండాగా అసెంబ్లీ వేడెక్కనుంది. గత నెల 12న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లుపై చర్చ ప్రస్తావనకు వచ్చినా గందరగోళం నడుమ సభ వాయిదా పడింది. 19న వాయిదా పడిన సభ తిరిగి శుక్రవారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో అందరి దృష్టి అసెంబ్లీ సమావేశాలపైనే ఉంది. డ్రాఫ్టు బిల్లుపై అసెంబ్లీలో చర్చించే విషయంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలు నిట్టనిలువునా చీలిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేతలు ‘తెలంగాణం’ వినిపిస్తామని చెప్తున్నారు. - సంగారెడ్డి, సాక్షి ప్రతినిధి చర్చ ప్రారంభమైంది రాష్ట్ర పునర్విభజన బిల్లుపై మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే చర్చ ప్రారంభించారు. ప్రస్తుత సమావేశాల్లో చర్చను కొనసాగించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ స్ఫూర్తికి ఎవరూ విరుద్ధంగా వ్యవహరించొద్దు. ఇతర అంశాలను చర్చకు తెచ్చే ప్రయత్నం చేయొద్దు. సీమాంధ్ర ప్రాంత సభ్యులు అక్కడి ప్రజల మనోభావాలు చర్చల ద్వారా వెల్లడించాలి. - టి.హరీష్‌రావు(టీఆర్ఎస్), ఎమ్మెల్యే, సిద్దిపేట తెలంగాణ ఎవరూ ఆపలేరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరు. బిల్లు అసెంబ్లీ వరకు వచ్చిన తర్వాత చర్చను అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వం. రెండు రాష్ట్రాలు ఏర్పడితేనే సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని అసెంబ్లీలో చర్చ సందర్భంగా నొక్కి చెప్తా. ఇప్పటికే రెండు ప్రాంతాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. - మైనంపల్లి హన్మంతరావు (టీడీపీ), ఎమ్మెల్యే, మెదక్ ఐక్యతతో ముందుకు సాగుతాం ఆరు దశాబ్దాలుగా సాగుతున్న తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో డ్రాఫ్టు బిల్లు అసెంబ్లీకి చర్చకు వచ్చింది. రాష్ట్ర ఏర్పాటుతోనే తెలంగాణ ప్రాంతంలో అన్ని వర్గాలకు న్యాయం దక్కుతుంది. సీనియర్ సభ్యుడిగా అసెంబ్లీలో బిల్లు చర్చకు వచ్చేలా ఒత్తిడి చేస్తాం. ఈ దిశగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలనూ కలుపుకుపోతాం. - చెరుకు ముత్యంరెడ్డి (కాంగ్రెస్), ఎమ్మెల్యే, దుబ్బాక త్వరగా పూర్తయ్యేలా చూస్తాం అసెంబ్లీలో త్వరగా తెలంగాణ డ్రాఫ్టు బిల్లుపై చర్చ పూర్తయ్యేలా ఒత్తిడి తెస్తాం. చర్చ సందర్భంగా సమస్యలు తలెత్తకుండా చూస్తాం. బిల్లు ఆమోదం పొందేలా చూడటమే అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మా ముందున్న లక్ష్యం. అధిష్టానం సూచనల మేరకు బిల్లుపై చర్చ సజావుగా సాగుతుందని భావిస్తున్నా. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి ఎలాంటి అడ్డంకులూ ఉండబోవు. - టి.నందీశ్వర్ గౌడ్ (కాంగ్రెస్), ఎమ్మెల్యే, పటాన్చెరు చర్చించేలా చూస్తాం తెలంగాణ బిల్లుపై చర్చ మొదలయ్యే సమయంలో సహచర మంత్రి శ్రీధర్‌బాబు శాఖను మార్చడం అప్రజాస్వామి కం. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని నిరసిస్తూ గవర్నర్‌ను కలిసి మా అభిప్రాయాలు చెప్పాం. ఈ నెల 23లోపు డ్రాఫ్టు బిల్లుపై చర్చ ముగియాల్సి ఉన్నందున సమావేశాలు సజావుగా సాగేలా తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. - సునీతా లక్ష్మారెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తొలగింపుపై నిరసన తెలుపుతాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన డ్రాఫ్టు బిల్లుపై చర్చ జరిగేలా అసెంబ్లీలో పట్టుబడతాం. మంత్రి శ్రీధర్‌బాబు శాఖను మార్పిడి చేయడంపై నిరసన తెలుపుతాం. బిల్లు చర్చకు రావద్దనే దురుద్దేశంతోనే శ్రీధర్ బాబు శాఖ మార్పిడి జరిగినట్లు స్పష్టమవుతోంది. పార్లమెం టులో బిల్లు ఆమోదం పొందే వరకు పట్టు వదిలేది లేదు. - పి. కిష్టారెడ్డి (కాంగ్రెస్), ఎమ్మెల్యే, నారాయణఖేడ్ కుట్రలు చేస్తే అడ్డుకుంటాం అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చేలా చూస్తాం. సీమాంధ్ర ప్రాంత ప్రతినిధుల అభిప్రాయాలు వినిపించాలని కోరుతాం. అసెంబ్లీలో బిల్లుపై చర్చను అడ్డుకునే కుట్రలపై అప్రమత్తంగా ఉంటూ అడ్డుకుంటాం. అన్ని పార్టీల ప్రతినిధులను కలిసి చర్చ జరిగేలా చూడాలని నిర్ణయించాం. - టి. నర్సారెడ్డి(కాంగ్రెస్), ఎమ్మెల్యే, గజ్వేల్ -
ఒక్క‘టి’గా పోరాడుదాం
తెలంగాణ బిల్లు ఆమోదంపై టీ-నేతల నిర్ణయం జానారెడ్డి నివాసంలో కేసీఆర్, ఇతర నేతల భేటీ 2న అన్నిపార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై పార్లమెంట్ ఆమోదముద్ర పడేవరకు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులంతా పార్టీలకు అతీతంగా ఐక్యంగా పోరాటం చేయూలని ఇక్కడి నాయకులు నిర్ణయించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు నష్టం వాటిల్లే అనేక అంశాలున్నందున వాటికి అసెంబ్లీలో సవరణలను ప్రతిపాదించాలన్న అభిప్రాయానికి వచ్చారు. గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు, కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల భేటీ జరిగింది. తొలుత టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు సతీమణి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల వుధ్య పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లులోని అంశాల గురించి చర్చ వచ్చింది. ఈ బిల్లులోని పలు అంశాలు తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం కలి గించేలా ఉన్నాయని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేకపోతే భవిష్యత్తులో ఇబ్బందుల పాలవుతావుని కేసీఆర్ ఈ సందర్భంగా జానారెడ్డితో పేర్కొన్నారు. అయితే ఈ అంశాలపై వివరంగా చర్చిద్దాం రవ్ముని జానారెడ్డి తన నివాసానికి కేసీఆర్‌ను ఇతర టీఆర్ఎస్ నేతలను ఆహ్వానించారు. కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ నేతలు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, గంగుల కవులాకర్, పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి వుంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సారయ్య, ఎంపీలు పొన్నం ప్రభాకర్, వుధుయూ ష్కీ, ఎమ్మెల్యే భిక్షమయ్యుగౌడ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. బిల్లులో తెలంగాణకు నష్టం కలిగించే విధంగా ఉన్న అంశాలపై కేసీఆర్ ఈ సవూవేశంలో కాంగ్రెస్ నేతలకు వివరంగా చెప్పారు. పదవీ విరవుణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ల చెల్లింపు అంశం భవిష్యత్తులో తెలంగాణకు పెనుభారమవుతుందని చెప్పారు. సీవూంధ్రప్రాంతానికి చెందిన వేలాది వుంది ఉద్యోగులు వివిధ వూర్గాల్లో తెలంగాణకు వచ్చి ఇక్కడే పదవీ విరవుణ పొందారని, వారు ఇక్కడే రిటైరైనందున పెన్షన్లను తెలంగాణ రాష్ట్రమే ఇవ్వాలన్న నిబంధన వల్ల రాష్ట్రంపై ఆర్థికంగా భారం పడుతుందని తెలిపారు. ఉద్యోగుల కేటాయింపు విషయంలో జనాభాప్రాతిపదికన కాకుండా ఏప్రాంతం వారిని ఆప్రాంతానికి పం పించేలా ఉండాలన్నారు. నేటివిటీని అనుసరించి ఆయూ ప్రాంతాలకు ఉద్యోగులను కేటారుుంచాల్సి ఉంటుందని కేసీఆర్ చెప్పారు. హైకోర్టులో మనకు న్యాయం ఎలా? రాష్ట్ర విభజన తరువాత కొంతకాలం ఒకటే హైకోర్టు ఉంటుందని బిల్లులో పేర్కొనడంపై నేతల వుధ్య చర్చ జరిగింది. ‘ప్రస్తుతం హైకోర్టులో సీవూంధ్రప్రాంత ఆధిపత్యం ఎక్కువగా ఉంది. రాష్ట్ర విభజన తరువాత అనేక అంశాలపై న్యాయుపరమైన వివాదాలు తలెత్తుతారుు. ఇరు ప్రాంతాలకు సంబంధించి అనేక సవుస్యలపై హైకోర్టును ఆశ్రయించక తప్పదు. అక్కడ సీవూంధ్ర ఆధిపత్యం ఉన్నందున తెలంగాణకు న్యాయుం జరగడం కష్టం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీమాంధ్రకు కూడా హైకోర్టును ఏర్పాటు చేయూల్సిందే. లేదంటే ప్రతి విషయుంలోనూ న్యాయుస్థానం నుంచి స్టే ఉత్తర్వులతో ప్రభుత్వం ముందుకు వెళ్లడం కష్టం అవుతుంది’ అని నేతలు అభిప్రాయపడ్డారు. విద్యుత్తు విషయుంలోనూ తిప్పలు తప్పవని కేసీఆర్ కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. ‘సీమాంధ్ర నేతల పాలనలో తెలంగాణలో విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటులో అన్యాయుం జరిగింది. బొగ్గు నిక్షేపాలు తెలంగాణలో ఉన్నా ప్రాజెక్టులన్నీ సీవూంధ్రలో పెట్టారు. రాష్ట్రం రెండుగా విడిపోతున్నందున తెలంగాణ అవసరాలకు విద్యుత్తు కొనుగోలు చేయూలంటే ఇప్పుడున్న రేట్లతో చాలా కష్టం అవుతుంది. అందుకే తెలంగాణలో ఉన్న కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రాజెక్టుల విద్యుత్తులో అత్యధిక భాగం తెలంగాణకు వచ్చేలా చూడాలి. అప్పుల విషయుం లోనూ ఏరాష్ట్ర ప్రాజెక్టులకు ఖర్చుచేసిన నిధులు ఆరాష్ట్రమే తీర్చాల్సిందిగా బిల్లులో స్పష్టంగా ఉంచాలి. గోదావరిపై బోర్డు వేయుడాన్ని వ్యతిరేకించాలి’ అని సవూవేశంలో నిర్ణరుుంచారు. కృష్ణాబోర్డు కూడా తెలంగాణలో ఉండేలా చూడాలని భావిస్తున్నారు. తెలంగాణపై కేంద్రం చెప్పేదొకటి, చేస్తున్నదింకొకటిగా ఉంటోందని కేసీఆర్ కాంగ్రెస్ నేతలతో వ్యాఖ్యానించారు. ఈ విషయుంలో తెలంగాణకు అన్యాయుం జరగకుండా కాంగ్రెస్ నేతలు అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. రాజకీయ కోణం లేదు: హరీష్ మంత్రి జానారెడ్డి నివాసంలో పలువురు కాంగ్రెస్ నేతలతో కేసీఆర్, తమ పార్టీ నేతలు భేటీ కావడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకుడు టి.హరీష్‌రావు తెలిపారు. గురువారం రాత్రి పార్టీ నేతలు రాష్ట్రపతితో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ బిల్లులోని పలు అభ్యంతరాలు విషయంలో ఎలా వ్యవహరించాలి అన్న దానిపై చర్చించామన్నారు. అసెంబ్లీకి ముందే అఖిలపక్షం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును అసెంబ్లీలో యుథాతథంగా ఆమోదించి పంపిస్తే పార్లమెంటులో సవరణలకు ఆస్కారం తక్కువగా ఉంటుందని దీనివల్ల నష్టం వాటిల్లుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. బిల్లుపై అసెం బ్లీలో చర్చ సందర్భంగానే సవరణలను ప్రతిపాదించి పంపించాలని నిర్ణరుుంచారు. ఇందుకోసం తెలంగాణ ప్రాంతంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒకేతాటిపై నడవాలని కేసీఆర్ సూచించారు. ఇందుకు అసెంబ్లీ సవూవేశాలకు వుుందే అఖిలపక్షాన్ని ఏర్పాటుచేయూలని ఆయన జానారెడ్డికి చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలంతా ఒకే స్వరం వినిపించడం ద్వారానే బిల్లులోని లోపాలకు సవరణలు సాధ్యవువుతుందని కేసీఆర్ స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సవూవేశం ఏర్పాటుచేయునున్నారు. జనవరి రెండో తేదీన కానీ, వుూడో తేదీన కానీ ఈ సవూవేశం ఉండొచ్చని నేతలు తెలిపారు. సవూవేశానంతరం జానారెడ్డి మీడియూతో వూట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించేవరకూ ఈప్రాంత పార్టీల నేతలంతా ఏకతాటిపై నడుస్తావుని వివరించారు. పార్టీలు, విధానాలు వేరైనా అందరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రమేనని స్పష్టంచేశారు. -
వినతిపత్రంపై జానారెడ్డి నివాసంలో చర్చ
-
కుట్రలను తిప్పికొట్టాలి
ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రాంత పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, లోక్‌సత్తా పార్టీల అగ్రనాయకులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్ర పన్నారని, వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మండల కేంద్రంలోని హీరాపూర్‌కు చెందిన సూర్యవంశీ జ్ఞానేశ్వర్ రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఆయన కుటుంబ సభ్యులను మందకృష్ణ సోమవారం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి శాసనసభకు పంపించిన తెలంగాణ బిల్లుపై చర్చలు జరిపి అభిప్రాయూలు సేకరించకుండా సీమాంధ్ర నాయకులు అడ్డుకున్నారని విమర్శించారు. శాసనసభ స్పీకర్ సమావేశాలను వారుుదా వేయడం వెనుక సీమాంధ్రుల హస్తం ఉందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, బలిదానాలు వృథాపోనివ్వకుండా ఈ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీలకతీతంగా బిల్లుపై చర్చ జరిగేలా పోరాడాలని కోరారు. రాజకీయూల్లో తక్కువ సంఖ్యలో ఉన్న అగ్రవర్ణ కులాలదే ఆధిపత్యం కొనసాగుతుండడంతో పేదలకు సంక్షేమ పథకాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన కోసం కేటారుుంచిన సంక్షేమ నిధులను రాజకీయ నాయకులు, వారి కుటుంబాల సభ్యులు దిగమింగుతున్నారని ఆరోపించారు. జనవరి 4వ తేదీన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యలో రాజకీయ పార్టీ స్థాపించి సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన కోసం, కుటుంబ రాజకీయూలు, కులాధిపత్యం, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు. సంఘం తూర్పు జిల్లా అధ్యక్షుడు రేగుంట సునీల్, జిల్లా కో ఆర్డినేటర్ కాంబ్లే బాలాజీ, మండల అధ్యక్షుడు సూర్యవంశీ మాధవ్, రజీహైమద్ పాల్గొన్నారు. -
వినతిపత్రంపై రేపు జానారెడ్డి నివాసంలో చర్చ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. రాష్ట్ర విభజన అంశంపై జరుగుతున్న పరిణామాలను వారు రాష్ట్రపతికి వివరిస్తారు. రాష్ట్రపతిని కలవడానికి ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంత్రి జానారెడ్డి నివాసంలో ఉదయం 10 గంటలకు సమావేశమవుతారు. రాష్ట్రపతికి ఇచ్చే వినతి పత్రంపై వారు చర్చిస్తారు. -
ప్రణబ్ ముందు ఉభయ వాదాలు
రాష్ట్రపతిని పోటాపోటీగా కలుస్తున్న నేతలు సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిదికోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిసేందుకు కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ, సీమాంధ్ర నేతలు పోటాపోటీగా సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజన బిల్లులో అనేక లోపాలున్నాయుని, సీవూంధ్రకు తీరని అన్యాయుం జరగనున్నదని, దాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని ప్రణబ్‌ను కోరాలని సీవూంధ్ర నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే అపారుుంట్‌మెంట్ కోరావుని, ఆయున్నుంచి స్పందన రాగానే కలుస్తావుని చెబుతున్నారు. వుంత్రి కాసు కృష్ణారెడ్డి ఇప్పటికే రాష్ట్రపతిని కలసి రాష్ట్ర సమైక్యతకోసం వినతిపత్రం అందించారు. మరోవైపు టీ కాంగ్రెస్ నేతలు విభజన బిల్లుపై రాష్ట్రపతి 40 రోజుల గడువిచ్చినా అసెంబ్లీలో చర్చ కొనసాగకుండా సీవూంధ్ర నేతలు కావాలనే జాప్యం చేస్తున్నారంటూ ఆయన దృష్టికి తేవాలని నిర్ణరుుంచారు. ‘‘చర్చను ఆలస్యం చేసి చివర్లో వురింత గడువు కోరాలని, తద్వారా పార్లమెంటులో టీ-బిల్లు రాకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు. కాబట్టి చర్చకు అదనపు గడువు ఇవ్వరాదు’’ అని విన్నవించనున్నారు. శుక్రవారం రాష్ట్రపతిని కలసిన వుంత్రులు దానం నాగేందర్, వుుకేశ్గౌడ్ ఇదే అంశాల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రపతిని ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా కలిశారు. మరోవైపు వుంత్రి కె.జానారెడ్డి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరిన టీఆర్ఎస్: ముసాయిదా బిల్లుపై శాసనసభలో జరుగుతున్న పరిణామాలను రాష్ట్రపతిని కలిసి వివరించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ప్రతినిధులు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. అసెంబ్లీలో, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అంశాలను రాష్ట్రపతికి తెలియజేస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు. నేడు ప్రణబ్‌ను కలవనున్న సీమాంధ్ర టీడీపీ నేతలు: సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఆదివారం సాయంత్రం ప్రణబ్‌ను కలవనున్నారు. అసెంబ్లీకి వచ్చిన రాష్ట్ర విభజన బిల్లులో పలు లోపాలున్నందున వెంటనే వెనక్కు తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. -
నోటీస్‌పై సంతకం చేసిన తెలంగాణ నేతలు
-
తెలంగాణ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతాం: కేసీఆర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తామని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వెల్లడించారు. శుక్రవారం వరంగల్ జిల్లా హన్మకొండలోని పీజీఆర్ గార్డెన్స్‌లో జరిగిన కడియం శ్రీహరి కుమార్తె వివాహానికి కేసీఆర్ హాజరయ్యారు. అనంతరం కేసీఆర్ వరంగల్ జిల్లా నాయకులతో భేటీ ఆయ్యారు. ఈసందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ ప్రాంత ప్రజలు కన్న కల సాకారం కాబోతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం అన్ని వర్గాల కలసి ఉద్యమాన్ని చేశాయని ఆయన గుర్తు చేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని కేసీఆర్ తెలిపారు. -
సభను స్తంభింపజేద్దాం!
టీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల నిర్ణయం శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేదాకా సభను స్తంభింపజేయాలని ఆ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి నివాసంలో గురువారం మధ్యాహ్నం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మంత్రులు కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బసవరాజు సారయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, శాసనసభ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి, విప్‌లు ఆరెపల్లి మోహన్, ఈరవత్రి అనిల్, ఎమ్మెల్యేలు భిక్షమయ్య గౌడ్, చిరుమర్తి లింగయ్య, మిత్రసేన్, కుంజా సత్యవతి, ప్రతాపరెడ్డి, అబ్రహం, కె.శ్రీధర్, ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, కె.ఆర్.ఆమోస్, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బిల్లును అడ్డుకుంటామని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను నేతలు ప్రస్తావించగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ‘‘బిల్లును ఎవడు అడ్డుకుంటాడో చూద్దాం. బిల్లు వచ్చిన వెంటనే బీఏసీ నిర్వహించి సభలో ప్రవేశపెట్టకపోతే ఊరుకునేది లేదు’’ అని తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ నుంచి బిల్లు కేంద్రానికి వెళ్లేవరకు అందరం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సమావేశం కావాలని ప్రతిపాదించారు. ఇప్పటివరకు దూరంగా ఉంటున్న హైదరాబాద్ మంత్రులు, ప్రజాప్రతినిధులను కూడా కలుపుకుపోవాలని నిర్ణయించారు. వారిని సమావేశానికి తీసుకొచ్చే బాధ్యతను జిల్లా ఇన్చార్జి మంత్రి గీతారెడ్డికి అప్పగించారు. విభజన బిల్లు అందిందని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించిన వెంటనే ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అందుకు అవసరమైతే అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నేతలతో కలిసి అసెంబ్లీని స్తంభింపజేసేందుకూ వెనుకాడకూడదని పేర్కొన్నారు. తొలి ప్రాధాన్యం బిల్లుకే ఇవ్వాలి: గండ్ర సమావేశానంతరం మంత్రులు డీకే అరుణ, సునీత లక్ష్మారెడ్డి, బసవరాజు సారయ్యతో కలిసి చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిర్దేశిత ఆరు వారాల గడువు వరకు చూడకుండా తక్షణమే విభజన బిల్లును సభలో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి నుంచి వచ్చినందున తొలి ప్రాధాన్యతగా ఈ బిల్లును తీసుకురావాలని సమావేశంలో కోరామన్నారు. శుక్రవారం డీకే అరుణ నివాసంలో తెలంగాణ ప్రజాప్రతినిధులమంతా సమావేశమవుతామని చెప్పారు. టీ మంత్రులతో టీఆర్ఎస్, టీడీపీ ఎమ్మెల్యేల భేటీ అసెంబ్లీ ఆవరణలోని మంత్రులు కె.జానారెడ్డి, పి.సుదర్శన్ రెడ్డి ఛాంబర్లో విప్‌లు గండ్ర వెంకటరమణా రెడ్డి, ఈరవత్రి అనిల్, టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకులు ఈటెల రాజేందర్, టీడీపీ ఎమ్మెల్యేలు పి.రాములు, జైపాల్ యాదవ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా ఐక్యంగా ఉంటూ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుందా మని నిర్ణయించుకున్నారు. సభలో బిల్లు ఎప్పుడు చర్చకు వచ్చినా సీమాంధ్ర ఎమ్మెల్యేల దూకుడును అడ్డుకునే వ్యూహం, సమన్వయం తీరుపై చర్చించారు. -
రాయల తెలంగాణకు ఒప్పుకోం: విద్యాసాగర్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక వర్గం ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పన్నిన కుట్రలో భాగమే రాయల తెలంగాణ ప్రతిపాదన అని, దీన్ని తాము ఒప్పుకోబోమని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగరరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ కుటిల నీతికి ఇదో నిదర్శనమని మండిపడ్డారు. నాటి కేంద్రప్రభుత్వం-నిజాంనవాబు, రజాకార్లతో యథాతథ స్థితి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టే నేడు సోనియా, మజ్లిస్‌తో ఒప్పందానికి వచ్చారన్నారు. మేం కోరుతున్నది తెలంగాణ మాత్రమే: గండ్ర స్వయంపాలన కోసమే తామంతా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నామే తప్ప రాయల తెలంగాణ కాదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ప్రజలంతా తెలంగాణ కోరుతుంటే రాయల తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లుపై చర్చించేందుకు ఈనెల 9న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నామన్నారు. సభ్యుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మూడు రోజుల గడువు ఇచ్చే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. దురుద్దేశాలతోనే రాయల తెలంగాణ : ఈటెల గోదావరిఖని, న్యూస్‌లైన్: దురుద్దేశాలతోనే రాయల తెలంగాణను కాంగ్రెస్‌పార్టీ తెరమీదకు తెచ్చిందని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో సోమవారం టీబీజీకేఎస్ సభలో ఆయన మాట్లాడారు. బిల్లు పెట్టకుండా, కాలయాపన చేస్తుండడం వల్లే రాయల తెలంగాణ వంటి కొత్త సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. కేసీఆర్ వల్లే ‘రాయల’ ప్రతిపాదన: ఎంపీ రాథోడ్ మంచిర్యాల, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ వల్లే కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను విలీనం చేస్తామని ప్రకటించి జాప్యం చేయడవం వల్లనే కాంగ్రెస్ రాజకీయ లబ్దికోసం కోసం రాయల తెలంగాణ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు. రాయల పేరుతో కాంగ్రెస్ కుట్ర: ఎర్రబెల్లి పాలకుర్తి, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్ కుట్ర చేస్తోందని టీటీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. సోమవారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ అంశాన్ని చర్చకు తీసుకురావడంలో కుట్ర దాగి ఉందన్నారు. ‘రాయల’ ఆమోదిస్తే ఉద్యమం: టీజేఎఫ్ హైదరాబాద్,న్యూస్‌లైన్: రాయలతెలంగాణ ప్రతిపాదన చేస్తే మరో ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ స్పష్టం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ సోమవారం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీజేఎఫ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. పది జిల్లాల తెలంగాణ కావాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై 4న జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం అవుతున్నట్లు చెప్పారు. టీజీవోల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాయల తెలంగాణ అంటే మళ్లీ సమ్మె చేస్తామని హెచ్చరించారు. 5న విద్యాసంస్థల బంద్: శ్రీనివాస్ మాదిగ సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా ఉస్మానియా విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 5న తెలంగాణ విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్టు మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎంఎస్ఎఫ్) రాష్ట్ర కో ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. తెలంగాణ కోసం 6న టీసీఎంజీ చలోఢిల్లీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం నిర్ణయించింది. ఈనెల 6న ఢిల్లీ వెళ్లి వారం రోజులపాటు అక్కడే మకాం వేయాలని తీర్మానించింది. సోమవారం రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ నివాసంలో సారథ్య బృందం నాయకులు జి.నిరంజన్, బి.కమలాకరరావు, నర్సింహారెడ్డి, శ్యాంమోహన్, డాక్టర్ శంకర్, బొల్లు కిషన్ తదితరులు సమావేశమై యాత్ర గురించి చర్చించారు. -
సీట్ల పెంపుపై పార్టీల దృష్టి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన ఖాయమని తేలిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో భవిష్యత్తు రాజకీయ పరిస్థితులపై అన్ని పార్టీలు దృష్టిని సారించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక్కో లోక్‌సభాస్థానం పరిధిలో ఇప్పుడు 7 అసెంబ్లీ స్థానాలుండగా వాటిని 9కి పెంచాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. ప్రధానంగా తెలంగాణలో ఈ డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 153కు పెంచాలనే వాదనకు క్రమంగా బలం చేకూరుతోంది. లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒకో తీరుగా ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో వాటి సంఖ్యను పెంచాలని ఆయా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలుండే విధంగా తెలంగాణ విభజన బిల్లులోనే పొందుపర్చాలంటూ కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రజాప్రతినిధుల బృందంతో రెండు రోజుల్లో జీవోఎంను కలవాలని నిర్ణయించారు. ఇప్పుడు తెలంగాణలోని మిగిలిన పార్టీలతో పాటు టీఆర్ఎస్ కూడా దీనిపై దృష్టి సారించింది. ఒక్కో లోక్‌సభస్థానాన్ని ఒక జిల్లాగా చేయాలని గతంలో కోరిన టీఆర్ఎస్ ఇప్పుడు జిల్లాల సంఖ్యను 23గా చేయాలని డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ స్థానాలెందుకు పెంచాలి? తెలంగాణలో ఇప్పుడున్న 119 అసెంబ్లీ స్థానాల వల్ల రాజకీయ అనిశ్చితి పెరుగుతుందని నేతలు ప్రధానంగా ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేవలం 60 మంది ఎమ్మెల్యేల బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉండడంతో, 20 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ లేదా ఏదైనా వర్గం రాష్ట్ర రాజకీయ పరిస్థితులను శాసించే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల రాజకీయ బేరసారాలు, ప్రలోభాల వంటివాటితో అభివృద్ధికి విఘాతం కలుగుతుందని వీరు వాదిస్తున్నారు. దీనితో పాటు శాసనమండలిని కొనసాగించాలంటే ఆ రాష్ట్రంలో 120 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సీట్లను పెంచితే శాసనమండలిని కూడా కొనసాగించవచ్చని వీరంటున్నారు. అలాగే రాష్ట్రంలో ఆయా అసెంబ్లీ స్థానాల్లో ఓటర్ల సంఖ్యలో కూడా తీవ్ర వ్యత్యాసాలున్నాయి. తెలంగాణలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 1.42 లక్షల మంది ఓటర్లు ఉంటే మరో నియోజకవర్గంలో 4.42 లక్షల ఓటర్లున్నారు. ఈ వ్యత్యాసాలను సరిచేయడానికి అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచడమే మార్గమని వీరంటున్నారు. నియోజకవర్గాల్లో ఓటర్ల వ్యత్యాసం.. తెలంగాణలో సగటున 2.10 లక్షల ఓటర్ల సంఖ్యను ప్రాతిపదికగా పెట్టుకుని ఒక రెవెన్యూ మండలం ఒక నియోజకర్గంలోనే ఉండాలనే కొన్ని నిబంధనలను పెట్టుకుని పునర్విభజన చేశారు. అయితే ఈ పునర్విభజనలోనూ తీవ్రమైన వ్యత్యాసాలున్నాయి. రంగారెడ్డిజిల్లా పరిధిలోని ఎల్బీనగర్లో అత్యధికంగా 4,42,713 మంది ఓటర్లు ఉండగా ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో అతి తక్కువగా 1,42,223 మంది ఓటర్లు ఉన్నారు. ఆ మాటకొస్తే ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలోనూ ఓటర్లు రెండు లక్షలకన్నా తక్కువగానే ఉన్నారు. తెలంగాణ మొత్తంలో రెండు లక్షలపైచిలుకు ఓటర్లున్న నియోజకవర్గాలు 46 ఉన్నాయి. ఇందులో నిజామాబాద్ (3), కరీంనగర్ (6), మెదక్ (4), రంగారెడ్డి (1), హైదరాబాద్ (12) మహబూబ్‌నగర్ (2), నల్లగొండ (8), వరంగల్ (7), ఖమ్మం (2) ఉన్నాయి. మూడు లక్షలకుపైగా ఓటర్లున్న నియోజకవర్గాలు తెలంగాణలో మూడు ఉన్నాయి. అవి కూడా రంగారెడ్డి జిల్లాలో (మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్) మాత్రమే ఉన్నాయి. నాలుగు లక్షల పైచిలుకు ఓటర్లున్న నియోజకవర్గాలు మొత్తం నాలుగు ఉండగా, ఆ నాలుగు కూడా రంగారెడ్డి జిల్లాలోనే (కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి) ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌లోని నియోజకవర్గాలు కాకుండా మున్సిపాలిటీలు ఇతర పట్టణ ప్రాంతాల ప్రభావం ఉన్న స్థానాలు 54 ఉన్నాయి. మహబూబ్‌నగర్ (11), మెదక్ (7), నల్లగొండ (8), నిజామాబాద్ (3), రంగారెడ్డి (4), ఆదిలాబాద్ (5), ఖమ్మం (4), కరీంనగర్ (7), వరంగల్‌లో (5) నియోజకవర్గాలు పట్టణ ప్రాంతాలతో కలిసి ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాలు కలిపితే పట్టణ ఓటర్ల సంఖ్య ఎక్కువగా కలిగిన నియోజకవర్గాలు 69 ఉన్నాయి. ఎక్కువగా ఓటర్లున్న నియోజకవర్గాల్లో ఆ సంఖ్యను తగ్గించి, అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యను దాదాపు సమానంగా ఉండే విధంగా పునర్విభజన చేయాలని నాయకులు కోరుతున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరు అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో దేశం మొత్తం మీద ఒకే విధానం, సంఖ్య, ప్రామాణికత లేవు. కొన్ని లోక్‌సభ నియోజకవర్గస్థానాల పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలుంటే మరికొన్ని నియోజకవర్గాల్లో 10 దాకా ఉన్నాయి. అస్సాంలోని కొన్ని లోక్‌సభస్థానాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 9 అసెంబ్లీ స్థానాలున్నాయి. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 7, 8 ఉన్నాయి. మన రాష్ట్రంలో 7 ఉన్నాయి. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒకో విధానం ఉంది. -
'తెలంగాణాలో అసెంబ్లీ స్థానాలను 153కు పెంచమని అడుగుతాం'
-
తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 153కు పెంచాలని నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. జాతీయ విపత్తు నివారణ నిర్వహణ సంస్థ వైస్ చైర్మన్, శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణకు ఉన్న లోక్‌సభ స్థానాలను, అసెంబ్లీ స్థానాలను పెంచాలని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. సమావేశంలో నేతల అభిప్రాయాలను జిఓఎంకు ఇవ్వాలని నిర్ణయించారు. -
రాష్ట్రాన్ని ఆవహేళన చేయవద్దు:ఆళ్ల నాని
రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని స్పష్టం చేశారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని అవహేళన చేయవద్దని ఆయన తెలంగాణ వాదులకు విజ్ఞప్తి చేశారు. సమైక్య రాష్ట్రం కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రాణ త్యాగానికైనా సిద్ధంగానే ఉన్నాట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన నల్గొండ, ఖమ్మం జిల్లాలో బాధితులను పరామర్శించడానికి తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెళ్తే తెలంగాణ వాదులు, కాంగ్రెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆళ్లనాని ఈ సందర్భంగా ప్రశ్నించారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. అయితే తెలంగాణవాదులు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని బ్లాక్ డేగా వ్యవహరించడం పట్ల ఆళ్లనాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆళ్లనానిపై విధంగా స్పందించారు. -
విజయమ్మ పర్యటనను అడ్డుకోవడం అప్రజాస్వామికం
ఏలూరు (ఆర్ఆర్ పేట), న్యూస్‌లైన్ :తుపాను, వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేస్తున్న పర్యటనను తెలంగాణకు చెందిన నాయకులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, తాజా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానిఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక పక్క అన్నదమ్ముల్లా విడిపోదామంటూ, సీమాంధ్రులను సోదరుల్లా ఆదరిస్తామని ప్రకటనలు చేస్తున్న తెలంగాణ నాయకులు, రాష్ట్ర విభజన జరగకుండానే ఇటువంటి దుశ్చర్యలకు పా ల్పడటం దారుణమన్నారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణవాదుల ఆగడాలకు అంతు ఉండదని ఆందోళన వ్యక్తం చే శారు. తెలంగాణవాదులు రైతులను ఆదుకోకపోగా, ఆదుకోవడానికి వచ్చి న వారిని అడ్డుకోవడం చూస్తుంటే ఆ ప్రాంత ప్రజలపై వారికున్న మమకారం, చిత్తశుద్ధి అవగతం అవుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలంగాణ నాయకుల రాజకీయ దురుద్దేశా న్ని ప్రజలు గ్రహించాలన్నారు. రాజకీ యాల కోసం ప్రజలను బలి చేయడానికి ప్రయత్నిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఆందోళనను ఉధృతం చేస్తామని, తెలంగాణ నాయకులకు ఆ ప్రాంత ప్రజలే బుద్ధి చెప్పేలా చైతన్యవంతుల్ని చేస్తామన్నారు. మానవతా ధృక్పథంతో పర్యటనకు వెళ్లిన విజయ మ్మను అడ్డుకున్న వారిని అదుపు చేయాల్సిందిపోయి తమ పార్టీ నేతలను అరెస్ట్ చేయించడం రాష్ట్ర ప్రభుత్వ కుటిల నీతిని బయటపెడుతోందని దు య్యబట్టారు. విజయమ్మకు తెలంగాణ ప్రజలు పలికిన స్వాగతం, ఆమెపై వారు చూపిన ఆదరణను చూసి అక్కడి నాయకులకు అభద్రతాభావం పెరిగి పోయిందన్నారు. అందుకే వారు ప్రజ లను రెచ్చగొట్టడానికి విఫలయత్నం చే స్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ నాయకుల పర్యటనలు కొనసాగుతాయని, ఈసా రి వారిని అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. విజయమ్మను అడ్డుకోవడాన్ని ఆ ప్రాంత ప్రజలే తీవ్రంగా వ్యతిరేకించడం చూస్తుంటే ఆమెకు అక్కడి ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాజకీయాలు మా ని నష్టపోయిన వారిని ఆదుకోవడంపై తెలంగాణ నాయకులు దృష్టి సారించాలని బాలరాజు, నాని హితవు పలికారు. -
ముందే.. ముదిరింది
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ తలపెట్టిన తెలంగాణ విజయోత్సవ సభకు అచ్చొచ్చినట్టు లేదు. సభ ఏర్పాట్లను చర్చించేందుకు హైదరాబాద్‌లో మంత్రి పొన్నాల నివాసంలో మంగళవారం జరిగిన సమావేశం రచ్చరచ్చగా ముగిసింది. కేంద్ర మంత్రి బలరాం నాయక్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మధ్య ఘర్షణతో అట్టుడికింది. ఇద్దరు రాష్ట్ర మంత్రులు బస్వరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, చీఫ్ విప్ గండ్ర, ఎంపీ రాజయ్య, ఎమ్మెల్యేలు కవిత, శ్రీధర్, డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతోపాటు జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలందరూ ఈ సమావేశానికి తరలివెళ్లారు. సభ ఎక్కడ... ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో చివరి వరకు నేతలు మల్లగుల్లాలు పడ్డారు. ఎట్టకేలకు వచ్చే నెల తొమ్మిదో తేదీన వరంగల్‌లో విజయోత్సవ సభ నిర్వహించాలని నిర్ణయించారు. హన్మకొండలోని జేఎన్ఎస్ మైదానాన్ని వేదికగా ఎంచుకున్నారు. జన సమీకరణలో భాగంగా నవంబర్ రెండో తేదీన డీసీసీ భవన్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయూలని నిర్ణరుుంచారు. ఇంత కసరత్తు జరిగిన సమావేశం... చివరన రసాభాసగా ముగిసింది. తిరిగి వెళ్లిపోయే సమయంలో డీసీసీబీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, కేంద్ర మంత్రి బలరాం నాయక్‌తో గొడవకు దిగారు. మాటామాటా పెరిగి ఒకరికొకరు దుర్భాషలాడుకోవడం... చొక్కాలు పట్టుకునే వరకూ వెళ్లడంతో అక్కడున్న వారు కంగుతిన్నారు. అనూహ్యంగా భగ్గుమన్న ఈ వివాదం పార్టీ ముఖ్యుల మధ్య చర్చనీయాంశంగా మారింది. అసలు సభ విషయం పక్కనబెట్టి ఈ వివాదమే నేతలందరి నోటా ప్రధాన అంశంగా మారింది. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేసినప్పటికీ... ఈ వివాదం ఇప్పటికిప్పుడు చల్లారేలా లేదనే వాదనలు వినిపిస్తున్నారుు. అరుుతే సమావేశంలో అలాంటి గొడవేమీ జరగలేదని... అనవసరంగా రాద్ధాంతం చేశారని డీసీసీబీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ‘సాక్షి’తో అన్నారు. ‘ఆప్కాబ్ సమావేశానికి హాజరవాల్సి ఉండడంతో నేను ముందుగా అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది. మంత్రికి చెప్పి వెళ్లిపోదామనే ఉద్దేశంతో గదిలోకి వెళ్లాను. మా మధ్య గొడవేమీ జరగలేదు...’ అని చెప్పారు. ‘విజయోత్సవ సభ నిర్వహణ విషయంలోనే రభస జరిగింది. ముందుగా సభను నా అధర్వ్యంలో మహబూబాబాద్‌లో నిర్వహించాల న్నారు. తర్వాత వరంగల్‌లో అన్నారు. మహబూబాబాద్‌లో ఓకే అన్నాక... అక్కర్లేదు అని మాట మార్చా రు. రోజుకో తీరుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం.. స్పష్టత ఉండాలి... అని సమావేశంలో నేను నేతలను నిలదీశాను. సమావేశం నుంచి బయటకు వెళ్లేటప్పుడు అదే విషయంలో ఏకవచనంలో సంబోధిస్తూ.. రాఘవరెడ్డి ఏదో కామెంట్ చేశాడట. అది తెలిసి... నేను సీరియస్ అయ్యాను. ఇద్దరం ఎదురెదురుగా మాటలేమీ అనుకోలేదు. ఘర్షణేమీ జరగలేదు’ అని గద్వాలలో ఉన్న నాయక్ ఫోన్లో చెప్పారు. అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, చీఫ్ విప్ గండ్ర, ఎంపీ రాజయ్య, ఎమ్మెల్యేలు కవిత, శ్రీధర్, డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు దుగ్యాల శ్రీనివాసరావు, పొడెం వీరయ్య, ఆరోగ్యం, సీనియర్ నేతలు నాయిని రాజేందర్‌రెడ్డి, వరద రాజేశ్వరరావు, సమ్మారావు, రాధారపు ప్రతాప్, కె.దయాసాగర్, ఎర్రబెల్లి స్వర్ణ, పొన్నాల వైశాలి, డాక్టర్ హరిరమాదేవి ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరందరి సమక్షంలో జరిగిన ఈ వివాదం.. జిల్లా పార్టీలో రగులుతున్న అంతర్గత విభేదాలను బయటపెట్టింది. స్వయానా కేంద్ర మంత్రికి సంబంధించిన గొడవ కావడంతో పార్టీ అధిష్టానం ఈ ఘటనపై ఎలా స్పందిస్తుంది... క్రమశిక్షణ చర్యలేమైనా తీసుకుంటుందా... ఇద్దరు మంత్రులు సయోధ్య కుదిర్చి వివాదాన్ని చల్లారుస్తారా... అనే సందేహాలు అందరినోటా వెల్లువెత్తుతున్నారుు. మరోవైపు విజయోత్సవ సభకు ఈ సంఘటన ఆటంకంగా నిలుస్తుందా... నవంబరు 9న సభ జరుగుతుందా.. లేదా.. అనే మీమాంస పార్టీ నేతలను సైతం అయోమయానికి గురి చేస్తోంది. -
‘కృతజ్ఞతా సభ’పై భేటీ రసాభాస!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై నిర్ణయం తీసుకున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని అభినందించడానికి వరంగల్‌లో జరుప తలపెట్టిన కృతజ్ఞతా సభ ఏర్పాట్లపై మంత్రి పొన్నాల నివాసంలో మంగ ళవారం నిర్వహించిన వరంగల్ కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో కేంద్ర మంత్రి బలరాంనాయక్, వరంగల్ డీసీసీబీ అధ్యక్షుడు రాఘవరెడ్డి మధ్య దూషణలకు దారితీయడంతో చర్చ పూర్తి కాకుండానే సమావేశం అర్ధంతరంగా ముగిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వచ్చేనెల 6న సభ నిర్వహించాలని ముందు భావించినా దానిని 9న జరపాలని నిర్ణయించారు. సభ ఏర్పాట్లపై వరంగల్‌లో వచ్చే నెల 2న మరోసారి సమీక్షించుకోవాలని భావించారు. ఈ లోగా బలరాం నాయక్, రాఘవరెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి వ్యవహరిస్తున్నారని రాఘవరెడ్డి అన్నారు. దీంతో.. ‘నువ్వే జిల్లాను ముంచుతున్నావం’టూ మంత్రి మండిపడ్డారు. ‘డీసీసీబీ పదవిని డబ్బులిచ్చి దక్కించుకున్నందున నీ ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు’ అని మంత్రి అనడంతో రాఘవరెడ్డి కూడా గట్టిగానే స్పందించారు. ‘ నువ్వు కూడా ఆ టికెట్‌ను డబ్బులిచ్చే తెచ్చుకున్నావు కదా’అన్నారు. చివరకు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య, చీఫ్‌విప్ గండ్ర, ఎమ్మెల్యేలు శ్రీధర్, కవిత, మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్యలతో పాటు జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. -
చంద్రబాబు దీక్షతో.. టీడీపీ నేతల్లో కలవరం
వరంగల్, న్యూస్‌లైన్: టీడీపీ అధక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సోమవారం నుంచి చేపట్టనున్న ఆమరణ దీక్ష... జిల్లాలోని ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది. తెలంగాణ కోసం ఏనాడో లేఖ ఇచ్చామని చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు... విభజన తర్వాత మాటమార్చడం వారికి ఇప్పటికే ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను రోజువారీగా విశ్లేషించేందుకంటూ స్ట్రాటజీ కమిటీ వేయడం... తాను చేపట్టనున్న దీక్షకు తెలంగాణ నేతలు అధిక సంఖ్యలో రావాలని టీడీపీ అధ్యక్షుడు ఆదేశాలివ్వడం ఆ పార్టీకి చెందిన జిల్లా నేతలకు తలనొప్పిగా మారింది. ప్రధానంగా నిన్నమొన్నటి వరకు ఎడమొహం.. పెడమొహంగా ఉన్న టీటీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయూకర్ రావు, ప్రజాపద్దుల సంఘం మాజీ చైర్మన్ రేవూరి ప్రకాష్‌రెడ్డికి స్ట్రాటజీ కమిటీలో చోటు కల్పించి.. దేశ రాజధానికి తప్పకుండా రావాలని ఆదేశించడం వారికి మింగుడుపడడం లేదు. పోతే ఎలా... పోకపోతే ఎలా అని తమ తమ అనుచర వర్గాల ద్వారా వారు ఆరా తీస్తుండడమే ఇందుకు నిదర్శనం. ఢిల్లీకెళ్తే తెలంగాణలో తిరగడం కష్టమే... ఢిల్లీలో ఆమరణ దీక్ష చేసే అంశంపై చంద్రబాబు శనివారం సీమాంధ్ర, తెలంగాణ నేతలతో రాత్రి వరకూ సమావేశమయ్యారు. ఈ దీక్షతో తెలంగాణ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేక వస్తుందని ఎర్రబెల్లి, రేవూరి ఆయన వద్ద అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. విభజన జరుగుతున్న తీరు... ఇప్పుడు జరుగుతున్న సీమాంధ్ర ఉద్యమం... నష్టం వంటి వ్యవహారాలపైనే దీక్ష చేస్తున్నానని, మద్దతుగా తెలంగాణ నుంచే పార్టీ నేతలు ఎక్కువగా రావాలని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇరుప్రాంతాల్లో జరుగుతున్న రోజువారీ పరిస్థితులను తెలుసుకునేందుకే రెండు ప్రాంతాల నుంచి ఏడుగురి చొప్పున కమిటీని వేస్తున్నట్లు వారికి వివరించినట్లు సమాచారం. అరుుతే తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ... విభజనతో జరుగుతున్న నష్టంపైనే దీక్ష అని బాబు చెబుతున్న సమాధానం తికమకగా ఉండడంతో తెలంగాణ నేతలు తలపట్టుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్లి చంద్రబాబుతో దీక్షకు కూర్చుంటే... ఏ మొహంతో గ్రామాల్లోకి వెళ్తామని నేతలే ప్రశ్నించుకుంటున్నారు.విభజనపై వివరిస్తామని కొత్తగా చెబుతున్నా చివరకు తెలంగాణకు వ్యతిరేకమనే భావన వస్తుందని... ఈ పరిస్థితుల్లో అధినేతతో ఢిల్లీకి వెళ్తే... తిరిగి తెలంగాణ ప్రాంతంలో తిరగడం కష్టమేనని భాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇక చంద్రబాబు దీక్షకు మద్దతుగా నేడు ఢిల్లీకి వెళ్తామని... విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ప్రచారం చేస్తామని రేవూరి ప్రకాష్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. -
సీఎం కిరణ్‌కు చప్రాసీకున్న పరిజ్ఞానం లేదా ? : తెలంగాణ నేతలు
సాక్షి,నెట్వర్క్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తూ.. కరడుగట్టిన సమైక్యవాదిగా మాట్లాడడంపై తెలంగాణ ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయనకు ఒక్కరోజు కూడా పదవిలో కొనసాగే అర్హతలేదని.. వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. శనివారం వేర్వేరు ప్రాంతాల్లో వారు విలేకరులతో మాట్లాడుతూ కిరణ్ తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనపై సీఎం మాట్లాడిన తీరు చూస్తుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి చప్రాసీకి వున్న పరిజ్ఞానం లేదనిపించిందని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో ఎద్దేవా చేశారు. తెలంగాణపై విషం కక్కుతున్న నీవు మనిషిరూపంలో ఉన్న జంతువని ధ్వజమెత్తారు. క్యాంపు ఆఫీసు కేంద్రంగా సీమాంధ్ర ఉద్యమాన్ని నడుపుతున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ రెండు నెలల్లో అక్రమ సంపాదనకే అధిక ప్రాధాన్యమిస్తూ ఎన్ని అధికారిక ఫైళ్లు క్లియరెన్స్ చేశావో తెలియంది కాదన్నారు. అక్రమంగా రూ.300కోట్ల విలువ చేసే భూమిలో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మిస్తున్న బినామీ నీవు కాదా? అని నిలదీశారు. చీమూనెత్తురు ఉన్న ఏ ఒక్క తెలంగాణ మంత్రి కూడా క్యాబినెట్లో కొనసాగరని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం శిలాశాసనమేనని, దానిని ధిక్కరించే అధికారం ఎవరికీ లేదని మంత్రి డి.శ్రీధర్‌బాబు కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో వ్యాఖ్యానించారు. మ్యాచ్‌లో ఓడిపోయారని థర్డ్ అంపైర్ ప్రకటించిన తర్వాత కూడా క్రీజ్‌లో నిలబడితే ఎలాగుంటుందో ప్రస్తుతం సీమాంధ్రులు చేస్తున్న ఉద్యమం కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడిన తీరుపై తాము కూడా ఆలోచించాల్సి వస్తుందని ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణపైఅధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని శాసనసభ సాక్షిగా చెప్పిన సీఎం.. నేడు మాటమార్చడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాని చెప్పారు. ఇందిర, నెహ్రూల ఆలోచనా విధానాలపై మాట్లాడిన కిరణ్‌కు ఆ తర్వాత దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయో తెలియదా అని ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితులలో ఉన్న ప్రభుత్వంపై టీఆర్ఎస్, టీడీపీలు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడితే పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉన్న వారిగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఆయన కుర్చీని పదిలంగా ఉంచామని, ఆ సమయంలో తెలంగాణ ప్రజల నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా పార్టీ కోసం భరించామని వివరించారు. సీమాంధ్రలో ఉద్యమం తగ్గుముఖం పడుతున్న సమయంలో తాను సమైక్యవాదినంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అక్కడి ప్రజలను రెచ్చగొట్టడమేనని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండలో వ్యాఖ్యానించారు. ప్రపంచంలో నైలూ నదిని ఎనిమిది దేశాలు పంచుకుంటున్నాయని గుర్తుచేశారు. పాకిస్థాన్, ఇండియాతో పాటు నేపాల్, బంగ్లాదేశ్‌లు కూడా నదులను పంచుకుంటున్న చరిత్ర సీఎంకు తెలియదా అని ప్రశ్నించారు. కృష్ణానదిని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోదావరి నదిని మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లు రాష్ట్రాలు పంచుకుంటున్నది అందరం చూస్తున్నదేనని వివరించారు. కిరణ్‌ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ శనివారం లేఖ రాశారు. కాంగ్రెస్‌లో క్రమశిక్షణ ఉన్నట్లయితే సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న కిరణ్‌కు సీఎం పదవిని నుంచి తొలగించాలని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వినోద్‌కుమార్ కరీంనగర్లో డిమాండ్ చేశారు. తెలంగాణపై కిరణ్‌కుమార్ రెడ్డి కల్లు తాగిన కోతిలా వ్యవహరిస్తున్నాడని ఎంపీ సిరిసిల్ల రాజయ్య వరంగల్‌లో ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధిష్టానంపై కిరణ్ ధిక్కార స్వరం వినిపిస్తూ ఒక ఫ్యాక్షనిస్టులా మాట్లాడుతున్నారని ఎంపీ మందా జగన్నాథం హైదరాబాద్‌లో ఆరోపించారు. ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఆయనకు లేవన్నారు. సీఎం వైఖరితో ఇరు ప్రాంతాల్లో వైషమ్యాలు పెరుగుతున్నాయని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందబాష్కర్ నల్లగొండ జిల్లా చిట్యాలలో చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 6వ తేదీకల్లా తెలంగాణ నోట్ సిద్ఢమవుతుందని ఆయన తెలిపారు. -
సిగపట్లు వీడి చర్చలకు సిద్ధం
రాష్ట్ర విభజనపై తెలంగాణ, సీమాంధ్ర నేతలు ఒకరినొకరు విమర్శించుకోవడం మాని చర్చలకు సిద్ధపడ్డారు. ఇది శుభపరిణామం. ఒకరినొకరు తిట్టుకుంటే విద్వేషాలు పెరిగడమేగానీ ఫలితం ఏమీ ఉండదు. ఇప్పటికే గత నాలుగేళ్లుగా జరుగుతున్న ఉద్యమాల ఫలితంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అభివృద్ధి కుంటుపడింది. 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రక్రియ మొదలవుతుందని కాంగ్రెస్ ప్రకటించడంతో తెలంగాణవాదులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. తమ చిరకాల వాంఛ నెరవేరుతుందని భావించారు. అప్పటి నుంచి వారు అనేక విధాల ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అదుగో ఇదుగో అంటూ కాంగ్రెస్ పార్టీ నాన్చుతూ వచ్చింది. రెండో ఎస్ఆర్సి - పార్టీల అభిప్రాయాలు - ఏకాభిప్రాయం - చర్చల ప్రక్రియ - తెలంగాణకు కాల నిర్ణయం లేదు - వారం అంటే ఏడు రోజులు కాదు - నెల అంటే 30 రోజులు కాదు - సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోంది - అది కీలక సమస్య - సంప్రదింపులు - ప్రాంతాల మనోభావాలు - చిన్న రాష్ట్రాల సమస్య తలెత్తే ప్రమాదం ..... అని అనేక సాకులు చెప్పు కుంటూ కాలం వెళ్లబుచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో కాంగ్రెస్‌లో కదలిక వచ్చింది. ఎన్ని ఆందోళనలు జరిగినా పట్టీ పట్టనట్లు వ్యవహరించిన కాంగ్రెస్ ఆదరాబాదరాగా యుపిఏ నేతలను సమావేశ పరిచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం పొందింది. ఆ తరువాత సిడబ్ల్యూసిని సమావేశపరిచింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు - పది జిల్లాలతో ప్రత్యేక తెలంగాణగా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించేశారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ - పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని ప్రకటించారు. రాష్ట్రంలో పరిస్థితి కాస్త మెరుగుపడిందనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ ఒక్కసారిగా బాంబు పేల్చింది. వారికి కావలసింది రాష్ట్ర ప్రయోజనం కాదని, సీట్లు, ఓట్లు అన్న విషయం స్పష్టమైపోయింది. నదీజలాలు, ఆస్తులు, అప్పులు, సీమాంధ్రకు రాజధాని .....వంటి కీలక అంశాలకు సంబంధించి స్పష్టతలేకుండా తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్లు రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ఓ ప్రకటన చేసేశారు. విభజన ప్రకటనతో సీమాంధ్ర ఒక్కసారిగా భగ్గుమంది. రాజకీయాలకు అతీతంగా, నాయకులతో సంబంధంలేకుండా ప్రజలే ఉద్యమించారు. కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను, ఎంపిలను, ఎమ్మెల్యేలను నిలదీశారు. రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో పక్క ఉద్యోగులు కూడా సమైక్యాంధ్ర కోసం సమ్మె చేయడం ప్రారంభించారు. రోజురోజుకు ప్రజల నుంచి ప్రజాప్రతినిధులపై ఒత్తిడి ఎక్కువైపోయింది. మరో పక్క ఇంతకాలం ఉద్యమం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పొందే సమయంలో సీమాంధ్రులు ఉద్యమించడం పట్ల తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇరు ప్రాంతాల నేతలు, ఉద్యోగులు, ప్రజలు ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శించుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర విభజన ప్రకటన వల్ల తలెత్తిన సమస్యలపై చర్చించేందుకు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఈ నెల 19న సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి ఇరు ప్రాంతాల నుంచి పదిమంది చొప్పున నేతలు హాజరు కానున్నారు. సమావేశంలో అన్ని విషయాలను చర్చించి మంచి ఆలోచనలు వస్తే వాటిని అమలు చేసుకుందామన్న నిర్ణయానికి వచ్చారు. రెండు ప్రాంతాల నేతలు కలిసి కూర్చొని చర్చించుకుందామన్న మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డిలు చేసిన ప్రతిపాదనకు మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర విభజన విషయంలో రెండు ప్రాంతాలకు సంబంధించిన కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
హైదరాబాద్‌లో సీమాంద్ర ప్రాంత కేంద్ర మంత్రుల భేటీ
-
మేం తలచుకుంటే తెలంగాణలో అడుగుపెట్టలేరు: రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నేతల సహకారం వల్లే ఏపీఎన్జీవోల సంఘం హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహిం చగలిగిందని, అదే తెలంగాణవాదులు తలచుకుంటే ఇక్కడ అడుగుకూడా పెట్టేవారుకాదని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మంగళవారమిక్కడ మీడియాతో వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తే.. ఆ తరువాత ఉమ్మడి రాజధానిలో సీమాంధ్రులకు సహకరిస్తామని చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం వస్తే సీఎం సహా ఎవరైనా హైకమాండ్ చెప్పినట్లు వినాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. -
బాలరాజుకు పలువురి పరామర్శ
సాక్షి, హైదరాబాద్ : ఏపీఎన్జీఓల దాడీలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీఎస్ జేఏసీ కన్వీనర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. డ్యూటీ డాక్టర్ ద్వారా వివరాలు తెలుసుకొని, బాలరాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి సహా ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, రాపోలు ఆనంద భాస్కర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ప్రజా గాయకుడు గద్దర్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబూరావు యాదవ్ తదితరులు బాలరాజును పరామర్శించారు. దాడి సంఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, ఉన్నత స్థాయి విచారణకు కృషి చేస్తానని మంత్రి అరుణ చెప్పారు. ఆస్పత్రి నుంచి బయటికి వచ్చిన మంత్రి జానారెడ్డిని జేఏసీ నేతలు నిలదీశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని వారికి జానారెడ్డి హామీ ఇచ్చారు. కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా ఉన్నందున సంయమనం పాటించాలని సూచించారు. టీఎస్ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ దాడులకు పాల్పడితే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా, ఆదిత్య ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న విద్యార్థి ప్రశాంత్‌ను కూడా పలువురు నేతలు పరామర్శించారు. పోలీసుల తోపులాటలో నిజాం కాలేజీ హాస్టల్ బాల్కనీ నుంచి కిందపడడంతో ప్రశాంత్ చేయి విరిగిన విషయం తెలిసిందే. -
యూటీ ప్రతిపాదన ఉత్తిదే: దిగ్విజయ్‌సింగ్
టీ-కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్ స్పష్టీకరణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయమే ఫైనల్ హైదరాబాద్ రాజధానిగానే తెలంగాణ ఏర్పాటు అటార్నీ జనరల్ అనారోగ్యం వల్లే ఈ ఆలస్యం ఆయన రాగానే ‘ప్రక్రియ’ మొదలవుతుంది టీ-కాంగ్రెస్ నేతలకు చెప్పిన పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ దిగ్విజయ్‌తో జానా, పొన్నాల, షబ్బీర్ భేటీ నీటి పంపకాలపై విద్యాసాగర్ నివేదిక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరిన దిలీప్‌కుమార్ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో.. రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తిదేనని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ పార్టీ తెలంగాణ నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేస్తామంటూ పార్టీ అత్యున్నత స్థాయిలో నిర్ణయం చేశాక దానిలో మార్పులు, చేర్పులుచేయటం ఆషామాషీ కాదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ‘విభజన విషయంలో అన్నీ ఆలోచించాకే వర్కింగ్ కమిటీ స్పష్టమైన నిర్ణయం ప్రకటించింది. దాన్ని అమలు చేయాలన్నదే ఇప్పుడు మా ముందున్న లక్ష్యం. ఈ క్రమంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించి వారి అభ్యంతరాలను పరిశీలించటం మాకు ముఖ్యమే. ఇందులో భాగంగా హైదరాబాద్‌ను యూటీ చేయాలని చాలామంది నేతలు మా ముందు ప్రతిపాదనలు తెచ్చారు. వారు చెప్పినంత మాత్రాన హైదరాబాద్‌ను యూటీ చేయలేం. వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పడుతుంది. ఆ దిశగానే కసరత్తు జరుగుతోంది’ అని దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నట్లు టీ-కాంగ్రెస్ నేతలు తెలిపారు. ‘హైదరాబాద్ యూటీ అంటే మరోమారు సీడబ్ల్యూసీ చర్చించాలి. యూపీఏ పక్షాలను ఒప్పించాలి. దానికి ప్రతిపక్షాలు సైతం అంగీకరించాలి. ఇదంతా సాధ్యమయ్యేది కాదు. అలా చేస్తే కాంగ్రెస్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి యూటీ విషయంలో జరుగుతున్నదంతా ప్రచారమే. దానిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని దిగ్విజయ్ చెప్పినట్లు వివరించారు. తెలంగాణ ప్రాంత రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీలు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు షబ్బీర్‌అలీ, కపిలవాయి దిలీప్‌కుమార్, సాగునీటి రంగ నిపుణుడు విద్యాసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే దయాసాగర్‌లు గురువారం ఉదయం ఢిల్లీలో దిగ్విజయ్‌ను కలిశారు. సుమారు అరగంట పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ యూటీ విషయమై జరుగుతున్న చర్చపై నేతలు ఆరా తీశారు. యూటీ ప్రతిపాదనకు ఇరు ప్రాంతాల నేతలు వ్యతిరేకమని, తెలంగాణ ప్రజలు దీనికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని స్పష్టంచేశారు. దీనిపై దిగ్విజయ్ స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని, మీడియానే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొన్నట్లు సమాచారం. అటార్నీ జనరల్ రాగానే ప్రక్రియ మొదలు.. రాష్ట్ర విభజన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని టీ-కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌ను కోరారు. ప్రక్రియ ఆలస్యం జరుగుతున్నకొద్దీ అనేక అపోహలు తలెత్తుతున్నాయని చెప్పారు. దీనికి దిగ్విజయ్ స్పందిస్తూ ‘కొన్ని రోజులుగా కేంద్ర హోంమంత్రి షిండే అస్వస్థతతో ఉన్నారు. ఆయన కోలుకుని ప్రక్రియ మొదలుపెట్టే సమయానికి అటార్నీ జనరల్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన సోమవారం మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. ఆయన రాగానే కేబినెట్ నోట్‌పై న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటాం. ఏయే అంశాలు పొందుపర్చాలో చర్చించి రెండు వారాల్లో నోట్‌ను రాష్ట్రపతికి పంపేలా కృషి చేస్తాం’ అని చెప్పినట్లు తెలిసింది. నీటి వివాదాలు భ్రమే... నీటి వివాదాలకు సంబంధించి సీమాంధ్ర నేతలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర జల సంఘం మాజీ సభ్యుడు విద్యాసాగర్‌రావు ఈ సందర్భంగా దిగ్విజయ్‌తో పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదీ జలాల పరిధిలో ఉన్న ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల వివరాలతో కూడిన నివేదికను దిగ్విజయ్‌కు సమర్పించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు స్పష్టంగా ఉన్నాయని, విభజన జరిగినా అవే కేటాయింపులు కొనసాగుతాయని చెప్పారు. రాజోలిబండ, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలో మాత్రం నీటి పంపకాలు యధావిధిగా సాగేందుకు తుంగభద్ర బోర్డు తరహాలో ఓ బోర్డు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని పేర్కొన్నట్లు తెలిసింది. ఇదిలావుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రాంతానికే పరిమితమన్నట్లు వ్యవహరిస్తున్నారని.. ఆయనను బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ ఎమ్మెల్సీ, తెలంగాణ ఆర్ఎల్డీ నాయకుడు దిలీప్‌కుమార్ వినతిపత్రం అందజేశారు. యూటీ ప్రసక్తే లేదన్నారు: జానారెడ్డి, పొన్నాల ‘హైదరాబాద్ యూటీ అన్న ప్రసక్తే లేదు. వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు పది జిల్లాల తెలంగాణే ఏర్పడుతుంది. యూటీ అంటే అది ఇంకో ఆందోళనకు దారితీస్తుందని చెప్పాం’ అని దిగ్విజయ్‌తో భేటీ అనంతరం మంత్రి జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య మీడియాతో పేర్కొన్నారు. యూటీపై అనవసర అపోహలు వద్దని, ఆ ప్రతిపాదన లేదని దిగ్విజయ్ చెప్పారని ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ తెలిపారు. -
ప్రజాభీష్టానికి తలొంచాల్సిందే
ఎమ్మిగనూరు టౌన్, న్యూస్‌లైన్: నాయకులెవరైనా ఓట్లేసి గెలిపించుకున్న ప్రజల మనోభీష్టానికి తలొంచాల్సిందేనని జేఏసీ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.వెంగళ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన స్థానిక సోమప్ప సర్కిల్లో నిర్వహించిన సకల జనుల గళ ఘోషకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రికి అమ్మ లక్షణాలు లేవని.. ఉంటే అన్నదమ్ముల్లా కలసిమెలసి జీవిస్తున్న ప్రజలను విభజించే ఆలోచన వచ్చేది కాదన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి విభజించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు తమ పదవులను కాపాడుకోవడానికే అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారని.. ప్రజల మనోభావాలను వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సీమాంధ్రలో ప్రజల న్యాయకత్వంలోనే ఉద్యమం కొనసాగుతుందన్నారు. దీన్ని అపహాస్యం చేసే ప్రజాప్రతినిధులను అదే ప్రజలు గుడ్డలు ఊడదీసి కొడతారన్నారు. పట్టం కట్టే ప్రజలకు పడతోయడం కూడా తెలుసనే విషయం నేతలంతా గ్రహించాలన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో అభివృద్ధి అసాధ్యమనే విషయం ఇదివరలో జరిగిన పలు రాష్ట్రాల విభజనతో నిరూపితమైందన్నారు. పెట్టుబడుదారులు, వ్యాపారవేత్తలు రాయల తెలంగాణ, ప్రత్యేక రాయలసీమ కావాలని డిమాండ్ చేయడంలో అర్థం లేదన్నారు. తెలంగాణ నాయకులు తమ యాస వేరు కాబట్టి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. భాష, యాసకో రాష్ట్రాన్ని విభజిస్తూ పోతే నాలుగు యాసలు మాట్లాడే కర్నూలును ఎన్ని ముక్కలు చేస్తారని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యోగ, ఉపాధ్యాయలు సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా, బస్మా అంటూ బెదిరిస్తోందని, ఇలాంటి వాటికి వెనకడుగు వేస్తే ప్రకస్తే లేదన్నారు. ఉద్యోగులు జీతాలు పెంచాలని, హెల్త్ కార్డులు కావాలని, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్లపై పోరాడటం లేదని.. సమైక్యాంధ్ర ప్రకటన వెలువడే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఉద్యమాలకు పుట్టినిల్లయిన రాయలసీమ చరిత్ర ప్రపంచానికి తెలియనిది కాదన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులకు సిగ్గుంటే స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు చేసి ఎన్జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాల్లో పాల్గొనాలన్నారు. సమైక్యాంధ్ర సాధనలో భాగంగా సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో చేపట్టనున్న సమైక్యపోరుకు ఉద్యోగులు, ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ఏపీ ఎన్జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ఈశ్వరయ్య, మద్దిలేటి, కరీంసాహెబ్, కృష్ణ, రామచంద్ర, దుర్బాక లక్ష్మీనారాయణ, సూరిబాబు, ఎం.డి.శ్రీనివాసులు, నీలకంఠ, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు యు.యు.ఉరుకుందు, నారాయణ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాళ్లు ప్రమీలాకుమార్, రమణారెడ్డి, రిటైర్డ్ ఎస్ఐ సోమన్న, శ్రీచైతన్య స్కూల్ నిర్వాహకులు కాశీం తదితరులు పాల్గొన్నారు. -
మంత్రుల బృందంతో కమిటి ఏర్పాటు చేస్తామని ప్రధాని అన్నారు
-
ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించిన మేకపాటి
-
ఢిల్లీలో సీమాంధ్ర నేతల ప్రెస్‌మీట్
-
జయశంకర్‌కు తెలంగాణ వాదుల నివాళి
హైదరాబాద్ : టిఆర్ఎస్ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్ 79 వ జయంతి సందర్భంగా తెలంగాణ వాదులు ఆయనకు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణవాదులు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శాంతి కపోతాన్ని ఎగురవేశారు. తెలంగాణ పొలిటికల్ జెఏసి నేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, శ్రీనివాసగౌడ్, దేవిప్రసాద్‌తో పాటు వివిధ తెలంగాణ సఃఘాలకు చెందిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాన ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్రను, ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నవ తెంగాన రాష్ట్రం ఏర్పాటయ్యే వరకూ పోరాటం కొనసాగిస్తామని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రతిపాదించినట్టు 10 ఏళ్లు మైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అవసరంలేదని తాత్కాలిక రాజధానిగా హైదరాబాద్ ను ప్రకటించాలని మల్లేపట్టి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక సీమాంధ్రులకు ఎటువంటి భయాందోళన అవసరంల లేదని, కొందరు పెట్టుబడి దారులు సీమాంధ్ర ప్రజలు ఉద్యోగులతో కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారని వారి కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని శ్రీనివాసగౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లో సమైక్యవాదులు ఆందోళనలు చేస్తే సహించమని భవిష్యత్ లో తెలంగాన ఏర్పాడ్డాక అలాంటి వారు ఇబ్బందులు పడక తప్పదని ఆయన హెచ్చరించారు. -
జైపాల్ రెడ్డితో దిగ్విజయ్‌సింగ్ భేటీ
-
ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది : దిగ్విజయ్ సింగ్
-
సోనియాతో దిగ్విజయ్ సింగ్ భేటీ