సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 విషయంలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తన డ్రామాను బుధవారం రక్తికట్టించింది. ఓటింగ్ జరపాలని సీమాంధ్ర నేతలు... ఓటింగ్ అక్కరలేదని తెలంగాణ నేతలు పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించారు. ఓటింగ్ జరపాలని, చర్చకు గడువు పొడిగించాలని స్పీకర్‌ను డిమాండ్ చేస్తూ పార్టీ సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు శాసనసభా మందిరంలో బైఠాయిస్తే... ఓటింగ్ పెట్టకుండా వెంట నే తిప్పి పంపాలంటూ తెలంగాణ ప్రాంత పార్టీ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపారు. బుధవారం సభ వాయిదా పడిన వెంటనే అధినేత చంద్రబాబు రెండు ప్రాంతాల ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అది పూర్తికాగానే ఎమ్మెల్యేలు ప్రాంతాల వారీగా ఆందోళనకు దిగడం గమనార్హం. టీడీపీ డ్రామా పర్వం కొనసాగిందిలా...
- రాష్ట్ర విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో కేంద్రం తీరుకు నిరసనగా గురువారం బంద్ పాటించాలని సీమాంధ్ర టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, సీఎం రమేష్ కోరారు.
- సభ వాయిదాపడక ముందు పార్టీ ఎమ్మెల్యేలు ప్రాంతాల వారీగా చీలిపోయి ఒకే సమయంలో ఎవరి వాదనకు అనుగుణంగా వారు స్పీకర్ ఛాంబర్‌లో వేరువేరుగా ధర్నా నిర్వహించారు. సభ వాయిదా పడిన వెంటనే పార్టీ ఎమ్మెల్యేలు మరోసారి చంద్రబాబుతో సమావేశమయ్యారు.
- బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని అన్ని పార్టీలకు చెందిన సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు సభలోనే బైఠాయించాల్సిందిగా చంద్రబాబు సూచిం చారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తాము నిరసన తెలుపుతున్నామని పోలీసులు అరెస్టు చేసేవరకూ గంటకో మారు వచ్చి మీడియాకు వెల్లడించాల్సిందిగా ఆదేశించారు.
- అధినేత సూచనను ఎమ్మెల్యేలు తూ.చ. తప్పకుండా పాటించారు. దేవినేని ఉమా మహేశ్వరరావు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, గాలి ముద్దుకృష్ణమనాయుడు తదితరులు టీవీ ఛానళ్లలో వార్తలు ప్రసారమయ్యే - సమయానికి వచ్చి మాట్లాడి మళ్లీ సభామందిరంలోకి వెళ్లారు. బిల్లును సమగ్రంగా చర్చించేందుకు ఫిబ్రవరి 28 వరకూ గడువు పెంచాలని, బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
- మరోవైపు బిల్లుపై ఓటింగ్ నిర్వహించవద్దని, యధావిధిగా రాష్ట్రపతికి తిప్పి పంపాలని కోరుతూ తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సిం హులు నేతృత్వంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద సుమారు గంటపాటు నిరసన తెలిపారు.
- బిల్లుపై సీఎం ఇచ్చిన నోటీసును స్పీకర్ తిరస్కరిం చాలని ఎర్రబెల్లి, మోత్కుపల్లి డిమాండ్ చేశారు. అలాగే గడువు పెంచొద్దని కోరుతూ తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు రాష్ట్రపతికి లేఖ రాశారు.
టీడీపీ డబుల్ డ్రామా!
Published Thu, Jan 30 2014 4:28 AM | Last Updated on Sat, Jun 2 2018 3:39 PM
Advertisement