ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రాంత పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, లోక్‌సత్తా పార్టీల అగ్రనాయకులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్ర పన్నారని, వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మండల కేంద్రంలోని హీరాపూర్‌కు చెందిన సూర్యవంశీ జ్ఞానేశ్వర్ రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఆయన కుటుంబ సభ్యులను మందకృష్ణ సోమవారం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రపతి శాసనసభకు పంపించిన తెలంగాణ బిల్లుపై చర్చలు జరిపి అభిప్రాయూలు సేకరించకుండా సీమాంధ్ర నాయకులు అడ్డుకున్నారని విమర్శించారు. శాసనసభ స్పీకర్ సమావేశాలను వారుుదా వేయడం వెనుక సీమాంధ్రుల హస్తం ఉందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, బలిదానాలు వృథాపోనివ్వకుండా ఈ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీలకతీతంగా బిల్లుపై చర్చ జరిగేలా పోరాడాలని కోరారు. రాజకీయూల్లో తక్కువ సంఖ్యలో ఉన్న అగ్రవర్ణ కులాలదే ఆధిపత్యం కొనసాగుతుండడంతో పేదలకు సంక్షేమ పథకాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన కోసం కేటారుుంచిన సంక్షేమ నిధులను రాజకీయ నాయకులు, వారి కుటుంబాల సభ్యులు దిగమింగుతున్నారని ఆరోపించారు. జనవరి 4వ తేదీన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యలో రాజకీయ పార్టీ స్థాపించి సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన కోసం, కుటుంబ రాజకీయూలు, కులాధిపత్యం, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు. సంఘం తూర్పు జిల్లా అధ్యక్షుడు రేగుంట సునీల్, జిల్లా కో ఆర్డినేటర్ కాంబ్లే బాలాజీ, మండల అధ్యక్షుడు సూర్యవంశీ మాధవ్, రజీహైమద్ పాల్గొన్నారు.
కుట్రలను తిప్పికొట్టాలి
Published Tue, Dec 24 2013 2:23 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement