మంద కృష్ణ బీజేపీ ముసుగులో మాట్లాడారు
ఏఐసీసీ కార్యదర్శి సంపత్
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదిగలకు రిజర్వేషన్ల విషయంలో కుట్ర జరుగుతోందని, రాజ్యాంగ బద్ధమైన మాదిగల హ క్కులను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ అన్నారు. మాదిగల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ముందడుగు పడిందని, ఈ విషయాన్ని మందకృష్ణ మాదిగనే చెప్పారని గుర్తు చేశారు.
రాష్ట్రంలోని బీఆర్‌ఎస్, కేంద్రంలోని బీజేపీలు పదేళ్ల పాటు తెలంగాణ మాదిగలకు అన్యాయం చేశాయని, అప్పుడు తనతో పాటు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మాదిగల పక్షాన గొంతు వినిపించామని పేర్కొన్నా రు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారగొండ వెంకటేశ్, అధికార ప్రతినిధి జ్ఞానసుందర్‌లతో కలసి మీడి యాతో మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ కోసం వేసిన అన్ని కమిషన్లు కాంగ్రెస్ హయాంలోనివేనని చెప్పారు. కానీ, మంద కృష్ణ మాదిగ మాత్రం ద్రోహులతో కలసి మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని, ఆయన బీజేపీ ముసుగులో ఉండి మాట్లాడుతున్నారని ఆరోపించారు. మాదిగల ప్రయోజనాలను మోదీ కాళ్లముందు తాకట్టు పెట్టారని విమర్శించారు. బీజేపీ అగ్రకుల పార్టీ అయితే కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాల పార్టీల అని సంపత్ అన్నారు.
నాకు టికెట్ ఇవ్వకపోయినా బాధ లేదు
నాగర్‌కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా బాధ లేదని సంపత్ చెప్పారు. తనకు కాంగ్రెస్ పార్టీయే గాడ్‌ఫా దర్ అని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా సామాజిక స్పృహతో పనిచేస్తున్నారని అన్నారు. కానీ, మాదిగ జాతికి అన్యాయం జరిగితే జాతి ప్రయోజనాల కోసం ఎప్పుడైనా అధిష్టానానికి లేఖ రాస్తానని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment